మెయిన్ ఫీచర్

మనస్సాక్షినే నమ్మాలి ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా దృష్టిలో అది ఆత్మహత్య కాదు. అతడు తన జీవితాన్ని రెండువైపుల చాలా తీవ్రంగా వెలిగించి సంపూర్ణంగా జీవించాడు.
‘‘మీరేమో మనం ఎలాంటి వారమైనా మనని మనం అంగీకరించాలంటారు. అంతర్గత ఆనందాన్ని కోల్పోతున్నట్లు తెలుసుకున్న నేను ఈ జీవితాన్ని అంగీకరించలేకపోతున్నాను.
ఇప్పుడేం చెయ్యాలి?’’అని నువ్వు నన్ను అడిగావు.
మీరు వంద సంవత్సరాలు జీవించినా, మీ జీవితం ఎండిపోయిన ఎముకల గూడులా నిర్జీవంగానే ఉంది. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ‘‘మిమ్మల్ని మీరు అంగీకరించాలి’’అని నేనంటున్నానంటే అర్థం ‘‘మీ జీవన విధానాన్ని మీరు అంగీకరించమని కాదు. దానిని విడిచిపెట్టి, మిమ్మల్నిమీరు అంగీకరించాలని నా భావన’’. కానీ, మీరు మీ తీరులోనే దానిని అర్థంచేసుకున్నారు. నేనెప్పుడూ మీరు అర్థం చేసుకున్నది చెప్పలేదు. అందుకే అన్నీ అలా జరుగుతున్నాయి.
సమాజం మీపై బలవంతంగా రుద్దినవాటిని తిరస్కరించమంటున్నానే కానీ, వాటిని అంగీకరించమని నేనెప్పుడూ చెప్పలేదు. అనంతం ఆవలి తీరాలనుంచి మీతోపాటు తెచ్చుకున్న మీ అంతర్గత కేంద్రం చెప్పే దానిని మాత్రమే అంగీకరించమని నేనెప్పుడూ చెప్తున్నాను.
అలాచేస్తే, మీరేదో కోల్పోయారనే భావన మీకెప్పుడూ రాదు. కాబట్టి, ఎలాంటి నిబంధనలు లేకుండా మిమ్మల్నిమీరు అంగీకరించిన మరుక్షణం మీలో నిక్షిప్తమై ఉన్న శక్తులు ప్రవహించడం ప్రారంభిస్తాయి, ఆనందం సొంతమైన మీ జీవితం పరవశంతో పయనిస్తుంది.
కోమా (అపస్మారక స్థితి)లోకి వెళ్ళిన జేమ్స్ చనిపోయాడనుకుని సమాధికి అన్నీ సిద్ధంచేశారు. ఇంతలో స్పృహలోకి వచ్చిన జేమ్స్ లేచి ‘‘ఇదేమిటి, ఇక్కడున్నానేమిటి’’ అన్నాడు.
‘‘అదేమిటి, మీరు చనిపోయి స్వర్గానికి వెళ్ళలేదా’’అంది జేమ్స్ భార్య మేరీ.
‘‘వెళ్ళి తిరిగొచ్చాను’’ అన్నాడు జేమ్స్.
‘‘అక్కడెలా ఉంది?’’ ఆత్రంగా అడిగింది మేరీ.
‘‘ఏముంది? అక్కడ ‘‘రంభ లేదు’’ అన్నాడు జేమ్స్ విచారంగా.
‘‘అయితే వెనక్కిరావాలని మీకెలాతెలిసింది?’’ అంది మేరీ.
‘‘ఏముంది! బాగా ఆకలేసింది. అప్పుడు తెలిసింది నేనున్నది స్వర్గం కాదని, నేను చావలేదని. వెంటనే మెలకువ వచ్చింది’’ అన్నాడు జేమ్స్.
కాబట్టి, మీరింకా చావలేదని కచ్చితంగా తెలుసుకోవాలి.
పేదవాడి ప్రేమలో పడిన కోటీశ్వరుడి కూతురు వాడిని తన తల్లిదండ్రులకు పరిచయం చేసేందుకు ఇంటికి విందుకు ఆహ్వానించింది. అక్కడి భోగభాగ్యాలు చూసి మతిపోయిన ఆ పేదవాడు చాలా నిగ్రహంతో మసలుకుంటున్నాడు. విందు సిద్ధమైంది. ఆ భోజన పదార్థాలు చూడగానే నిగ్రహాన్ని కోల్పోయిన ఆ పేదవాడు ఆపుకోలేక గట్టిగా అపానవాయువు వదిలాడు. ‘టైగర్’ ఏమిటి ఆ వెధవ పని? అన్నాడు కోటీశ్వరుడు ఆ పేదవాడి కాళ్ళ దగ్గరే కూర్చున్న కుక్కతో. తనకేమీ తెలియదన్నట్లుగా చూసింది ఆ కుక్క. తాను బయటపడలేదని తమాయించుకున్న ఆ పేదవాడు కొన్ని నిమిషాల తరువాత మళ్ళీ గట్టిగా అదే పని చేశాడు. ‘టైగర్, బుద్ధిలేదా నీకు’ అంటూ గట్టిగా అరిచాడు కోటీశ్వరుడు. అయినా కొన్ని నిముషాల తరువాత ఆ పేదవాడు మళ్ళీ గట్టిగా అదే పని చేయడంతో ఒళ్ళు మండిన ఆ కోటీశ్వరుడు కంచంమీద నుంచి లేస్తూ ‘‘ఈ వెధవ ఇక్కడే నీపై ఏరిగేలా ఉన్నాడు. ఫో లోపలికి’’ అన్నాడు కుక్కతో.
ఇంతవరకు మీరు జీవిస్తున్న జైలు నుంచి బయటపడేందుకు మీకింకా సమయముంది. కేవలం జూదగాడికున్న కాస్తంత ధైర్యం మీకుంటే చాలు.
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.
- ఇంకాఉంది