మెయన్ ఫీచర్

పాక్‌తో తాడో పేడో తేల్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్‌లోని యూరీ ప్రాంతంలోని భారత సైనిక స్థావరాలపై జేష మహమ్మద్ ఉగ్రవాదులు దాడిచేసి 18 మంది భారత సైనికులను చంపేయడమే కాకుండా మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. పఠాన్‌కోటపై దాడి జరిగినప్పుడే ఇండియా కఠినంగా వ్యవహరించని ఫలితమే యూరీ స్థావరంపై దాడి అని చెప్పాలి. ఒక్క సిపిఎం తప్ప తక్కిన ప్రతిపక్షాలన్నీ నరేంద్రమోదీ ఏ చర్య తీసుకున్నా తాము బలపరుస్తామని ప్రకటించాయి. కాశ్మీర్‌కు చెందిన షబ్‌నమ్‌లోనీ అనే ఒక సుప్రీంకోర్టు లాయర్ మాట్లాడుతూ ఇది కశ్మీరు సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల జరిగింది అని వ్యాఖ్యానించింది. మరి ముంబయిలో, హైదరాబా దు, వారణాసిలో జరిగిన ఉగ్రవాద దాడులను కశ్మీరు సమస్యకు ఏమిటి సంబం ధం? ఢాకా, అమెరికా,ప్రాన్స్, లండన్, ర ష్యాలపై జరిగిన ఉగ్రవాద దాడులకు కారణం కూడా కశ్మీరు సమస్యేనా? జనరల్ ముషారఫ్ మాట్లాడుతూ కశ్మీరు సమస్య మాకు అనుగుణంగా పరిష్కారమైనప్పటికీ కాఫిర్లపై మరో వేయి సంవత్సరాలైనా సరే యుద్ధం చేయాల్సిందేనని ప్రకటించాడు. హిందువులు, కుర్ధులు యూదులు క్రైస్తవులకు భూమిపై జీవించే అధికారం లేదు అన్నాడు ఒసామాబిన్ లాడెన్-అబూబకర్ బగ్దాదీ.
ఇండియా పాకిస్తాన్‌ల మధ్య గల సైనిక పాటవం ఎంత? ఇండియాకు పాకిస్తాన్‌కు కూడ అణ్వాయుధాలున్నాయి. అణ్వాయుధ వాహక జలాంతర్గాములు ఇండియాకు మాత్రమే ఉన్నాయి. 13 సబ్ మెరీన్‌లు ఇండియాకు ఉండగా 8 మాత్రమే పాకిస్తాన్‌కు ఉన్నాయి. ఇండియాకు 9 డిస్ట్రాయర్లు, పాక్-6, ఇండియాకు 184 యుద్ధ నౌకలు, పాక్‌కు-74 ఇండియా 1090 యుద్ధ విమానాలు పాక్‌కు 490, ఇండియా 5970 యుద్ధ ట్యాంకులు, పాక్‌కు 4000 ఉన్నాయి. ఇండియా రక్షణ బడ్జెట్ 43 బిలియన్ డాలర్లు. పాక్ 8.8 బిలియన్లు. ఇవన్నీ అనధికార సంఖ్యలు. కాకపోతే పాకిస్తాన్‌లో అంతా జిహాదీ పేరుతో ఏకమైనారు. ఇండియాలో ముస్లీంలీగ్, మజ్లీస్ సిపిఎం వంటి పార్టీలు భాజపాకు మద్దతునివ్వడంలేదు. కేరళలో ముఖ్యమంత్రి పిన్నారాయ్ విజయన్ తెలంగాణలో కెసిఆర్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ బిహారులో లాలూ ప్రసాద్ యాదవ్‌లు న రేంద్ర మోదీని విమర్శిస్తున్నారు. ఐతే యూరీపైగ్రవాద దాడిని చైనాతో సహా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా వంటి దేశాలన్నీ ఖండించడం ఒక ఆశాకిరణం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన మాట ఇది. యుద్ధాయ కృతనిశ్చయః- ఈ మాటకు అర్థం ఓ పార్థా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు. వ్యామోహాలు విషాదాలు వదిలిపెట్టు. అని కృష్ణుడు బోధించాడు. నిజానికి యుద్ధం ఎవరికీ అభీష్టం కాదు. కాని గత్యంతరం లేని పరిస్థితిలోనే కొన్ని యుద్ధాలు వస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెం డవ ప్రపంచ యుద్ధం చరిత్రను అధ్యయనం చేయండి.
ఇప్పుడు రాబోయే యుద్ధం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా! 2016 సెప్టెంబరు 18వ తేదీ తెల్లవారు జామున యూరీ సెక్టారు కాశ్మీరులో సైనికులు నిద్రిస్తున్న సమయం లో తెల్లవారుజామున జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు భారత సైనికులు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున దాడిచేసి, పదిహేడు మందిని హతమార్చి మరొక ఇరవై మందిని తీవ్రంగా గాయపరిచారు. ఇది పిరికిపందల చర్య అని నరేంద్ర మోదీ ప్రకటించారు. పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించండి. పాక్‌ను భారత్‌లో అంతర్భాగం చేయండి అని అనంతపురం ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి కోరారు. మేము ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం అని భారత సైనిక దళాలు ప్రకటించాయి.
పాక్ అణ్వస్త్ర సామర్ధ్యం గల దేశం. పిచ్చివాడి చేతిలోని రాయి అనే సామెత మనకు బాగాతెలిసిందే. అందుకని ఈ ఉగ్రవాద దేశంగా మారిన పాకిస్తాన్ ఎంతకైనా తెగబడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఐదవ వంతు కూడా పాకిస్తాన్ లేదు. ఇండియా వద్ద అణ్వస్త్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇండియా వద్ద స్టాండింగ్ ఆర్మీ 11.5 లక్షలకు పైగా ఉంది. దేశ జనాభా 130 కోట్లు. పాక్ జనాభా 10 కోట్లు. పాక్‌లో అల్లర్లు ఆందోళనలు పెరిగి పోయాయి. బెలూచిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్‌లలో స్వతంత్ర పోరాటాలు ఊపందుకున్నాయి. పాక్ ఆర్థికంగా మాదక ద్రవ్యాల అమ్మకం మీద తన ఆదాయం పెంచుకుంటున్నది. దొంగ కరెన్సీని ఇండియాలో ప్రవేశపెట్టి భారత ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రస్థానంగా మారింది. జైషే మహమ్మద్ లష్కర్ ఏ తొయ్యబా తాలిబాన్, ఐసిస్ వంటి దాదాపు నలభై ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుండి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. జిహాదీ యూనివర్సిటీ ఉంది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే. హిందూ దేశాన్ని వాహెబ్ జిహాదియత్ దేశంగా మార్చడానికి యత్నం. ఆ మూలకారణం తెలికుండా సూడో సెక్యూలరిస్టులు ఓట్ల రాజకీయం కోసం నాటకాలు ఆడటం ప్రమాదకరం. 1947లో ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా బ్రిటీషు వారిని బెదిరించి మహాత్మాగాంధీని లొంగదీసుకొని పాకిస్తాన్ అవతరించింది.
కశ్మీరు సమస్య కేవలం ఒక సాకు మాత్రమే. సెక్యులరిజం ప్రకారం ఇండియాలో హిందూ మెజారిటీ ప్రాంతాలు ముస్లిం మెజారిటీ ప్రాంతాలు కొన్ని ఉండవచ్చు కదా. హైదరాబాదులోని పాతబస్తీ ముస్లిం మెజారిటీ ప్రాంతం. కశ్మీరు ముస్లిం మెజారిటీ ప్రాంతం. కేరళలోని మల్లాపురం ముస్లిం మెజారిటీ జిల్లా. మరి వీటిని ప్రత్యే క దేశాలుగా ప్రకటిస్తారా? పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి ముందు దేశంలోని అంతర్గత శత్రువులపై నరేంద్ర మోదీ యు ద్ధం ప్రకటించాల్సి ఉంది. కన్హయ్యకుమార్, మణిశంకర్ అయ్యర్, అరుంధతీ రాయ్, రాజీవ్ దేశాయ్ సంజయ్ బారువా, షబనా ఆజ్మీ, సుప్రియా చతుర్వేది, షబ్‌నమ్‌లోని, అజాంఖాన్, ములాయంగ్‌సింగ్ యాదవ్ నివేదితా నాయర్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి వారి ఈ దుర్మార్గాలు కనబడటం లేదా? ఇత్తెహాదుల్ మజ్లిస్, ముస్లీంలీగ్ వంటి సంస్థలను నిషేధించకుండా యుద్ధానికికెళ్లి సాధించేదేమిటి?
చైనానుండి పాకిస్తాన్‌కు ప్రత్యక్షంకా బిలియన్ల ఆర్థిక సహాయం అందుతున్నది. అమెరికా ఒకవైపు ఉగ్రవాద వ్యతిరేక ప్రకటనలు చేస్తూనే మరొకవైపు పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం ఆపలేదు. అంటే యుద్ధం అంటే తుపాకులతో మాత్రమే చేసేది అని ఎంతమాత్రం అర్థం కాదు. పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలంటే ముందుగా అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షలు విధించాలి. ప్రపంచంలో ఏ దేశం కూడా పాక్‌తో వ్యాపారాలు నిర్వహించకుండా చూడాలి. చమురు సరఫరాలు నిలిపివేయాలి. పాక్‌లోని ఇండియన్ ఎంబసీని వెంటనే మూసివేసి భారత్‌లోని పాక్ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించాలి. ఇండియాలో ఉండడానికి ఇష్టపడని వారిని పాకిస్తాన్ పంపే ఏర్పాట్లు వెంటనే చేయాలి. బాలీవుడ్‌లో పెద్ద సం ఖ్యలో పాకిస్తాన్ అభిమానులున్నారు.
తెలంగాణలో 1948 సెప్టెంబరు 17న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటివరకు ప్రజలు దీన్‌దార్ అంజుమన్, ఇత్తెహాదుల్ మజ్లిస్ సాయుధ కమ్యూనిస్టులు, దేశముఖ్‌లు, జాగీర్దార్లు, పటేల్ పట్వారీలు ఇలా ఎవరికి తోచినట్లుగా వారు దోపిడీ సాగించారు. అలాంటివారి మద్దతుతో ప్రస్తుత ప్రభుత్వం తన అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నది. అంటే పాకిస్తాన్‌పై యుద్ధం జరపడానికి ముందు నరేంద్రమోదీ అంతర్గత శత్రువులపై దృష్టి సారించాలి. లేకుంటే సైనికులు ప్రాణాలు అర్పించి అందించిన విజయాలు నిష్ఫలమవుతాయి. 1971లో 90వేల మంది పాక్ సైనికులు భారత సైన్యాలకు చిక్కారు. వారినందరినీ ఇందిరాగాంధీ బేషరతుగా విడుదల చేసింది.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వచ్చిన గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్రమోదీ నుండి మరో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ శౌర్యాన్ని ఆశిస్తున్నది. హురియత్, జిలానీలను వెం టనే అదుపు చేయాలి. అరవింద్ కేజ్రీవాల్, అశుతోష్, సోమనాథ్ భారతి వంటివారిపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎంటో తేలాలి. ఐక్యరాజ్య సమితిలో 2015 సెప్టెంబరులో నవాజ్ షరీఫ్ కశ్మీరుపై చాలా ఉత్తేజకర ప్రసంగం చేశారు. ఐతే ఆయనకు ఒక్క దేశం కూడా మద్దతునివ్వలేదు. ఈ 193 దేశాలల్లో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. కారణం కశ్మీరులో ఉన్నది ఆజాదీ నినాదం కాదు. జిహాదీ నినాదం. వాహెబ్ జిహాదియత్ కోసం పోరాటం సాగుతోంది.
బెలూచిస్తాన్‌కు స్వతంత్రం దేశంగా ఐరాస వెంటనే గుర్తించాలి. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. అవసరమైతే సైనిక ఎమర్జెన్సీ విధించాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఇది తరుణంకాదు. 2019 వరకు యుపి, గుజరాత్ ఎన్నికలు వాయిదా వేయాలి. పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా చేయడంపై చైనాకు కఠిన హెచ్చరిక జారీ చెయ్యాలి. చైనాతో మనకు జరుగుతున్న వ్యాపారం కన్నా చైనా మనతో జరుపుతున్న వ్యాపారం నాలుగురెట్లు ఎక్కువ. అందువల్ల భారత్‌తో మైత్రి కావాలో, పాకిస్తాన్‌తో మైత్రి కావాలో చైనా తేల్చుకోవాల్సిన తరుణం వచ్చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చైనా తన అనుకూల వర్గాలను పోషిస్తున్నది. భారత్ చుట్టూ పంచాగ్ని మధ్యలో ఉన్నది. ఇదీ ముప్పయి సంవత్సరాల సోనియా, వౌనస్వామి గార్ల నిర్వా కం. రక్షణ రంగాన్ని గాలికి వదిలేసి, స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచిపెట్టుకోవడంపై గత పాలకులు దృష్టి కేంద్రీకరించాలి.
బెలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడం ద్వారా పాక్ రెండు ముక్కలవుతుంది. ముందుగా భారత్ నుంచి మానవహక్కుల సంఘాలను, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ను బలూచిస్తాన్‌కు పంపాలి. కశ్మీరులో ఆజాదీ పోరాటం జరుగుతున్నదని వామపక్షీయులు వక్రభాష్యం చెబుతున్నారు. ఇది ఆజాదీ ఆరాటం కాదు, యుగయుగాల జిహాదీ పోరాటం. ఊరీగాంగ్ సెక్టార్లపై దాడి జరుగుతున్న రోజునే మణిశంకర్ అయ్యర్ హైదరాబద్‌లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపమని పిలుపునివ్వడం గమనించారా? ఏది ఏమైనా పాక్‌తో చర్చల కాలం ముగిసింది. ఏం చేయాలో చెప్పం. చేసి చూపిస్తాం అన్నారు రక్షణ మంత్రి మనోహర్ పారికర్. పాక్ రాయబారిని పిలిపించి హెచ్చరించడం బహుశా దౌత్యవ్యవహారాల గద్దింపులు కావచ్చు.

-ముదిగొండ శివప్రసాద్