మెయిన్ ఫీచర్

నిలిచి ఉండేది వాస్తవమే (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి, దేవుడు లేడు. ఆయన ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. వారిది చాలా విచిత్రమైన వ్యాపారం. మతం అన్ని వ్యాపారాలకన్నా అతి విచిత్రమైన వ్యాపారం. అక్కడ మతాచార్యుడు, బిషప్, కార్డినల్, పోప్, మెస్సయ్యల్లాంటి పరంపరానుగత మధ్యవర్తులుంటారే కానీ, వారిపై ఎలాంటి ఉన్నతాధికారి ఉండడు.
కానీ, దేవుని ఏకైక కుమారుడైన జీసస్ తన అధికార శక్తిని ఆ దేవుడి నుంచి తీసుకున్నాడు. జీసస్ నుంచి అతని ఏకైక దోషరహిత వాస్తవ ప్రతినిధి అయిన పోప్ ఆ అధికారాన్ని తీసుకున్నాడు. అలా ఆ అధికారం మధ్యవర్తుల పరంపరలోని అతి తక్కువ స్థాయి పూజారి వరకు కొనసాగుతూనే ఉంటుంది. అయినా అక్కడ దేవుడుండడు. అదే మీ భయం.
‘‘దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి?’’ అని మీరు అడిగారు. ఎందుకంటే, మీరు ఒంటరిగా జీవించలేరు. అలాగే సుఖాలు, సంతోషాలు, బాధలు, ఆనందాలతో కూడిన జీవితాన్ని ఎదుర్కొనే శక్తి మీకు లేదు. ఎవరితోడు, నీడ, రక్షణ లేకుండా వాటిని స్వయంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా లేరు. మీలో ఉన్న భయం కారణంగానే దేవుణ్ణి అడిగారు. వాడు లేకపోయినా, మీకు కావలసినది చేసేందుకు తెలివైన మోసగాళ్ళు కచ్చితంగా అన్నిచోట్ల ఉన్నారు.
కాబట్టి, దేవుణ్ణి వదిలెయ్యండి. అది మిమ్మల్ని నిర్భయులుగా చేసేందుకు సహాయపడుతుంది. భయపడడం మానవ సహజమనే వాస్తవాన్ని అంగీకరిస్తూ, దాని లోతుల్లోకి వెళ్ళి, దానిని అనుభవించండి. అంతేకానీ, దానినుంచి తప్పించుకునే అవసరం లేదు. మీరు మీ భయం లోతుల్లోకి ఎంత ఎక్కువగా వెళ్తే, అక్కడ మీ భయం అంత తక్కువగా ఉంటుంది.
ఎప్పుడైతే మీరు భయం అట్టడుగును తాకుతారో అక్కడ భయపడేందుకు ఏమీలేదని తెలుస్తుంది. వెంటనే మీరు నవ్వుకుంటారు. అలా మీలో ఉన్న భయం పోయిన వెంటనే అక్కడ అమాయకత్వం చోటుచేసుకుంటుంది. అదే ధార్మికుని సారాంశం. అది చాలామేలుచేస్తుంది. ఎందుకంటే, దానికి చాలా అద్భుతమైన శక్తి ఉంది. అమాయకత్వం నుంచి ఏదైనా జరగవచ్చేమో కానీ, మీరు క్రైస్తవులుగా, మహమ్మదీయులుగా, హిందువులుగా ఉండలేరు.
అమాయకత్వంతో మీరు సాధారణ మనిషిగా మారి, ఆ నిరాడంబరత్వాన్ని పూర్తిగా అంగీకరించి, దానిని ఆనందంగా అనుభవిస్తూ, మొత్తం అస్తిత్వానికి కృతజ్ఞతలు చెప్తారే కానీ, దేవుడికి చెప్పరు. ఎందుకంటే, దేవుడి భావన మీకు ఇతరులు ఇచ్చినది.
అస్తిత్వం ఒక భావన కాదు. అది మీ చుట్టూ ఉంటుంది. మీలో ఉంటుంది. మీరు లేకపోయినా ఉంటుంది. పూర్తి అమాయకత్వంతో ఉన్నప్పుడే మీరు లోతైన కృతజ్ఞతాభావంతో ఉంటారు. అంటే మీరు ఏదో అడుగుతున్నారని కాదు, మీకు దక్కిన దానికి మీరు కృతజ్ఞతలు చెప్తున్నారు. దానిని నేను ప్రార్థన అనను, అనలేను. ఎందుకంటే, ప్రార్థనలో మీరు ఎప్పుడూ ఏదో ప్రసాదాన్ని ఆశిస్తారు. నిజానికి, అస్తిత్వం మీకు చాలా ప్రసాదించింది. అందుకు మీరు అర్హులా? ఆ అర్హతను మీరు సంపాదించారా?
అస్తిత్వం మీకు కావలసినవన్నీ ఎప్పుడూ ఇస్తూనే ఉంది. అయినా మీరు ఇంకా ఏదోకావాలని అడగడం చాలా అసహ్యంగా ఉంది. అస్తిత్వంనుంచి మీరు చాలా తీసుకున్నారు. దానికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి.
అలా చేస్తే అస్తిత్వం మీకు ఇంకా చాలా ఇస్తుంది. మీరు మళ్ళీ దానికి చాలా కృతజ్ఞతలు చెప్తారు. అప్పుడు అస్తిత్వం మీకు మళ్ళీ చాలా ఇస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ దానికి అనేక కృతజ్ఞతలు చెప్తారు. దానికి అంతముండదు. ఎందుకంటే, అది ఒక అంతులేని చక్ర ప్రక్రియ. కాబట్టి, గుర్తుంచుకోండి.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.