మెయన్ ఫీచర్

‘దర్యాప్తు సంస్థల’లో నిజాయతీ ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చరిత్రలో మొదటిసారిగా కేంద్రంలో హోమ్, ఆర్థిక వంటి కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిం చిన సీనియర్ రాజకీయవేత్త పి.చిదంబరంను అవినీతి ఆరోపణలతో సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగిస్తున్నది. అధికారపక్షంపై నిశితమైన విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అరెస్ట్ కావడం సహజంగానే భాజపా వర్గాలలో సంబ రాలకు కారణం అవుతున్నది. దీంతో అధికార పార్టీ వారు ‘చట్టం ముందు ఎంతటి వారైనా ఒకటే’ అన్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. 2014లో- అవినీతి వ్యతిరేక పోరాటం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదేళ్ల పదవీకాలంలో ఆ దిశగా చెప్పుకోదగిన పురోగతి సాగించలేక పోయారు. యూపీఏ ప్రభుత్వంలో జరిగినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పలు భారీ అవినీతి కుంభకోణాలను సహితం నిరూ పించలేక పోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడవేస్తున్న, ప్రముఖుల మెడపై వేలా డుతున్న కేసులన్నీ కూడా భాజపా నేత డాక్టర్ సుబ్రమణ్యస్వామి సొంతంగా చొరవతో దీర్ఘకాలం పోరాడిన కేసులే కావడం గమనార్హం.
చిదంబరం తన అరెస్ట్‌కు ముందు చేసిన ప్రకటనలో అవినీతి వ్యతిరేక పోరాటానికి సంబంధించి ఒక కీలక అంశం తలెత్తుతుంది. ‘నాపై ఇప్పటి వరకు కనీసం ఛార్జ్‌షీట్ లేదు. ఎటువంటి ఆధారాలు లేవు...’ అంటూ చెప్పుకొంటూ తనను ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు బా ధితుడిగా చిత్రీకరించుకొంటూ ప్రజా సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. మనదేశంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే నేతలు అందరు తాము ‘బాధితులం’ అంటూ జనం సానుభూతి పొందే ప్రయ త్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు చాలా అరుదుగా మాత్రమే నిరూపితమై, శిక్షలకు దారి తీస్తుంటాయి.
నేరారోపణలు ఎదుర్కొనే వారెవ్వరూ తమ నేరాలను ఒప్పుకోరు. దర్యాప్తు సంస్థలు తగు సాక్ష్యాధారాలు సేకరిస్తే గాని వారు దోషులుగా తేలే అవకాశం ఉండదు. ఇప్పుడు చిదంబరం విషయంలో సహితం సిబిఐ, ఈడీ ఇటువంటి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరుగుతున్న కేసుల వలే చిదం బరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం విషయంలో కూడా ఆర్థిక లావాదేవీలన్నీ బినామీ కంపెనీల ద్వారానే జరిగాయి. అటువంటి ఆరోపణలను నిర్ధారించడానికి మన చట్టాలు అంత అనుకూలంగా లేన్నట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక కంపెనీలో నగదు జమ బదిలీ చేసిన విదేశీ ‘బినామీ’ కంపెనీ పూర్వాపరాలను నిర్ధారించే అవకాశం లేకుండా గతంలో వాజపేయి ప్రభుత్వంలో ఒక సవరణ తీసుకొచ్చారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అవినీతి చర్యలలో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా విదేశాల కేంద్రంగా గల బినామీ కంపెనీల ద్వారా జరుగుతున్నాయి. అందుకనే అటువంటి లావాదేవీలను నిర్ధారించడం చట్టపరంగా సమస్యగా మారుతున్నది.
కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేవలం సిబిఐ, ఈడీలు చిదంబరం విషయంలో ఇంత క్రియాశీలకంగా వ్యవహరిస్తామని భావించలేము. ముఖ్యంగా హోం శాఖ మంత్రి అమిత్ షా హస్తం ఇందులో ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏదిఏమైనా పెద్ద ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వస్తే తప్పనిసరిగా విచారణ జరుపవలసిందే. నిందితులని తేలితే తగు శిక్ష విధించవలసిందే. కాగా, దర్యాప్తు సంస్థలు కేవలం ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శిస్తున్న నేతల పట్ల చూపుతున్న ఆసక్తిని మిగిలిన వారిపై ఆరోపణలు వస్తే ఎందుకు చూపడం లేదు? ముఖ్యంగా తీవ్రమైన ఆ రోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అధికారపక్షంలో చేరగానే ఈ సంస్థలు ఎందుకు వౌనం వహిస్తున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే.
ఉదాహరణకు అస్సాం మంత్రి హిమంత బిస్వాస్ శర్మ, పశ్చిమ బెంగాల్ నేత ముకుల్ రాయ్, తెలుగు దేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిపై ఇదివరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరిపి, ప్రశ్నల వర్షం కురిపించాయి. కానీ వారు భాజపాలో చేరగానే వారి వైపు కనె్నత్తి కూడా చూడటం లేదు. అదే విధంగా భాజపాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన పలువురు నేతలు ఎన్నికల ముందు ఆదాయం పన్ను, సిబిఐ వంటి సంస్థల దాడులు జరగగానే పార్టీ మారడం, ఆ తర్వాత వారి గురించి పట్టించుకొనక పోవడం జరిగింది. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తుంటే వాటి పట్ల ప్రజలలో విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా, మోదీ ప్రభుత్వం పట్ల కుండా అసహనానికి దారితీస్తుందని గమనించాలి.
1977లో కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం- జనతా ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా వ్యవహరించిన చరణ్ సింగ్ ఇదే విధంగా నాటి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పట్ల అసహనంతో వ్యవహ రించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తొమ్మిది రా ష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దు చేసి, తాజా ఎన్నికలు జరిపించారు. స్వయంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కేసులు నమోదు చేయడం కాకుండా, ఆమెను అరెస్ట్ చేశారు. ఈ విధంగా చేయడం కారణంగా తనను వేధిస్తున్నారంటూ ప్రజలలో సానుభూతి పొందే అవ కాశం ఇందిరా గాంధీకి కలిగించారు. ఒక విధంగా జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు, అర్ధాంతరంగా జనతా ప్రయోగం విఫలం కావడానికి, అనూహ్యంగా తిరిగి ఆమె ముడేళ్ళల్లోనే అధికారంలోకి రావడానికి దారితీసిన్నట్లు చెప్పవచ్చు.
కాగా, ఒక విధంగా చిదంబరం అరెస్ట్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చిన్నట్లు అయింది. ఈ అరెస్ట్ లు ఇంతటితో ఆగకపోవచ్చని, ఆ పార్టీకి చెందిన మరి కొందరు కీలక నేతలకు కూడా వ్యాప్తి చెందవచ్చని ఆందోళన చెందు తున్నారు. అందుకనే సోనియా గాంధీ నుండి కాంగ్రెస్ నాయకులు అందరూ చిదంబరానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. అరెస్టులు జరిగినపుడు కాంగ్రెస్ నేతలు నానా హడావుడి చేస్తున్నారని అంటూ వారిని చూసి భాజపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారికి సంఘీభావం తెలపడం భారత రాజకీయాలలో ఆనవా యితీగా వస్తున్నదే. ముఖ్యంగా వారు అగ్రకులాలకు చెందిన వారైతే వారిపట్ల ఎంతో సానుభూతి చూపుతుంటారు. కానీ దళిత, గిరిజన వర్గాల పట్ల అటు వంటి సానుభూతి వ్యక్తం కలవక పోవడం గమనార్హం. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజె, అమిత్ షా కుమారుడిపై ఆరోపణలు వచ్చినప్పుడు వారందరిని భాజపా వెనకవేసుకు వచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయంపై అనుమానాలు కలిగించే కొన్ని పత్రాలు బయటపడినా సమర్ధించుకున్నారు. కనీసం తీవ్ర ఆరోపణలపై అంతర్గత విచారణకు కూడా సిద్దపడ లేదు.
అవినీతి ఆరోపణలతో రాజకీయ జీవితమే కోల్పోవడమే కాకుండా, సొంత పార్టీ నేతలు కూడా ముఖం చాటేయడంతో తీవ్రమైన మానసిక వేదనకు గురై, అకాల మరణం పొందిన నేత ఈ దేశంలో బంగారు లక్ష్మణ్ మాత్రమే అని చెప్పవచ్చు. స్వయంగా న్యాయ మూర్తి - ఇందులో కేసు ఏముందని కోర్టు హాల్ లోనే విస్మయం వ్యక్తం చేశారు. తాను నిర్దోషినని నిర్దిష్టమైన ఆధారాలు సమర్పించినప్పటికీ బంగారు లక్ష్మణ్ అనూహ్యంగా శిక్షకు గురయ్యారు. ఆ తర్వాత హై కోర్ట్‌కు వెళితే బెయిల్ ఇవ్వడానికి ఆరు నెలల కాలం న్యాయ మూర్తి తీసుకున్నారు. గతంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు బలనిరూపణ సమయంలో కొందరు ఎంపీలను కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చినప్పుడు కేవలం గిరిజన నేత శిబూ సొరేన్ ఒక్కరు మాత్రమే న్యా యస్థానంలో దోషిగా తేలారు. ఈ దేశంలో దళిత, గి రిజన వర్గాలకు చెందిన నేతల పట్ల కొనసాగుతున్న రా జకీయ వివక్షకు ఇటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి.

-చలసాని నరేంద్ర 98495 69050