మెయన్ ఫీచర్

బహుళపక్ష రాజకీయాలకు సానుకూల తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ఓటర్లు ప్రపంచంలోనే పరిణతి చెం దిన వారు మాత్రమే కాకుండా, వివేకవంతంగా తీర్పు చెప్పడంలో ఎంతో నేర్పరులు. తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్ని కలు, ఉపఎన్నికల ఫలితాలు ఈ అంశాన్ని మరో మారు వెల్లడి చేశాయి. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనంతరం భాజపా ఏకపక్ష ధోరణులకు తిరుగులేదని, దేశంలో మరే రాజకీయ పక్షం ఆ పార్టీ ధాటికి తట్టుకోలేదనే అభిప్రాయం కలిగింది. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు, ఇతర ప్రలోభాలకు లోబడి ప్రతిపక్షాలకు చెందిన కీలక నాయకులు అధికార పక్షం లోకి ఫిరాయిస్తూ ఉండడంతో ఒక వంక కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారగా, మరోవంక ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడం కష్టం అనే అభిప్రాయం నెలకొంది. అయితే, ఐదు నెలల లోపుగానే ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ఒక విధంగా భాజపా దూకుడుకు కళ్లెం వేశారు. ప్రజాభిమానం పొందడానికి రాజకీయ పోరాటం చేయాలి గాని, ఫిరాయింపులను ప్రోత్సహించడం కాదనే స్పష్టమైన గుణపాఠాన్ని భాజ పాకు ఇచ్చారు. అందుకనే ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఫిరాయింపుదారులు దారుణంగా ఓటమి చెందారు. ఈ పరిణామం దశాబ్దాలుగా భాజపాకు కష్టపడి పనిచేస్తున్న నేతలలో ఆనందం కలిగించింది.
కాంగ్రెస్‌లో జాతీయ నాయకత్వం నిర్వీర్యం అవుతున్నా రాష్ట్రాలలో బలమైన నాయకత్వం నిలదొక్కుకునే అవకాశాలను ఈ ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయి. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, కర్ణాటకలో సిద్దరామయ్య, డీకే శివకుమార్, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ వంటి వారు కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తుండటం గమనార్హం. తాజాగా, హర్యానాలో భూపేంద్ర హుడా ఆ పార్టీకి జీవం పోశారు. మహారాష్టల్రో భాజపా, శివసేన కూటమిగా పోటీ చేసినా 2014 నాటి ఫలితాలను అందుకోలేక పోవడం, మరోవంక ఈ ఎన్నికల అనంతరం రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అని ప్రకటించిన ఎన్సీపీ నిలదొక్కుకోవడం ఒక విధంగా ఆశ్చర్యకర పరిణామమే. తనపై, తన సన్నిహితులపై ఆర్థిక నేరాలు మోపే ప్రయత్నం చేసినా, ప్రజాబలంతో ఎదుర్కొనే ప్రయత్నం చేయడం శరద్ పవార్‌కు కలసి వచ్చింది. ఈ ఎన్నికలలో మహారాష్ట్రంలో నిజమైన విజేత ఆయనే అని చెప్పవచ్చు. తన పార్టీకి రాజకీయంగా జీవం కల్పించడమే కాకుండా, కుమ్ములాటలతో కుంచించుకు పోతున్న కాంగ్రెస్‌కు ప్రాణం పోశారు. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఒక కాంగ్రెసేతర కూటమి పూర్తి ఆధిక్యత పొంది, ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం పొందింది. మరోవంక, పదేళలు తప్ప మహారాష్టల్రో అధికారంలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ తొలిసారి నాలుగో స్థానానికి కుంచించుకు పోయింది. శివసేనకు ప్రభుత్వంలో కీలక పాత్ర కల్పించక తప్పని పరిష్టితి ఏర్పడింది.
హర్యానాలో భాజపా సంపూర్ణ ఆధిక్యత సాధించలేక పోవడం ఆ పార్టీ నాయకత్వానికి కనువిప్పు కలిగించాలి. హర్యానాలో సైనిక కుటుంబాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. భాజపా ప్రచారం అంతా దేశ భద్రత, ఆర్టికల్ 370 రద్దుపైనే జరిగింది. అయితే ప్రజలు, ప్రతిపక్షాలు లేవనెత్తిన- మహిళల్లో అభద్రత, దళితులపై దాడులు, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం వంటి సమస్యలకు ఓటర్లు తగు విధంగా స్పందించినట్లు వెల్లడి అవుతోంది. ఈ రెండు రాష్ట్రాలలో గత ఐదేళలు పాలనలో తమ ప్రభుత్వాలు సాధించిన విజయాల గురించి, రాబోయే ఐదేళ్లల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము అమలు పరచబోయే కార్యక్రమాల గురించి భాజపా నేతలు ఎవరూ ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావించనే లేదు. ఎక్కువగా ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ, ఈ చర్యను వ్యతిరేకించాలంటూ కాంగ్రెస్‌ను సవాల్ చేస్తూ వచ్చారు. తమ ఎన్నికల ప్రణాళికల విడుదల సందర్భంలో కూడా స్థానిక అంశాలను కాకుండా ఆర్టికల్ 370 పైననే ఎక్కువగా ప్రస్తావించారు.
370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళికతో ముందుకు వెడుతున్నామని అంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర మంత్రులెవరూ శ్రీనగర్ వెళ్లి ఈ అంశాన్ని ప్ర స్తావించే సాహసం చేయకుండా మహారాష్ట్ర, హ ర్యానాలలో ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావించడాన్ని అక్కడి ప్రజలను ఆకట్టుకోలేదని భావించవలసి వసు తన్నది. మహారాష్ట్రా, హర్యానా దేశంలోనే ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందున్న రాష్ట్రాలు. అయితే భాజపా పాలనలో ఈ విషయాలలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుననేని ప్రయత్నం చేసినా స్థానికంగా ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాల గురించి పట్టించుకొంటున్నట్లు కనబడటం లేదు.
మహారాష్టల్రో ఎన్నికల ముందు ప్రతిపక్ష ఎమ్యె ల్యేలలో మూడొంతులమందిని పైగా ఫిరా యింపు లకు ఆకర్షించారు. హర్యానాలో ప్రముఖ క్రీడాకారులను చేర్చు కొని ఎన్నికలలో నిలబెట్టారు. ఇటు వంటి చర్యలు పార్టీ నేతలలో తిరుగుబాటుకు దారితీశాయి. దీన్ని ప్రజలు సహితం హర్షించలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తిరుగుబాటు దారులు తమ అంచనాలను తారుమారు చేసిన్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దవేంద్ర ఫడ్నవిస్ సహితం అంగీకరించారు.
కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఈ ఎన్నికలను అసలు పట్టించుకొనక పోవడం, విస్తృతంగా ప్రచారం చేయక పోవడంతో స్థానిక నాయకత్వం బలపడే అవకాశం కల్పించినట్లు స్పష్టమైనది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్న నాయకత్వమే ప్రజల మద్దతు పొందలేక పోవడం, బలమైన అభ్యర్థులను నిలబెట్టడానికి అడ్డు పడుతూ ఉండడంతో కాంగ్రెస్ అవకాశాలకు అడ్డుగా నిలిచిన్నట్లు కూడా భావించవలసి వస్తున్నది. ప్రాంతీయ పార్టీలు దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోరని, భాజపా దేశ వ్యాప్తంగా విస్తరిస్తూ ఉండడంతో వాటికి భవిష్యత్ లేదని కమలం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి గండి పడింది. హర్యానా, మహారాష్ట్రాలలో సహితం ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయి. ప్రభుత్వాల ఏర్పాటులో అవి కీలకం కానున్నాయి. జాతీయ పార్టీలు ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరిస్తూ ఉండడంతో, నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో ప్రాంతీయ పోటీల ఉనికి కీలకంగా మారుతూ వస్తున్నది.
ఢిల్లీ నుండి బలవంతంగా రుద్దే నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెసుకు మాత్రమే పరిమితమైన ఆ జాడ్యం ఇప్పుడు భాజపాను సహితం కాటేయడం ప్రారంభించినట్లు సంకేతం వెలువడుతున్నది. కుటుంబాల ఆస్తులుగా రాజ కీయ పార్టీలు నెలకొనడం ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదో, అంతర్గత ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి ఒకరిద్దరు మాత్రమే పార్టీలపై స్వైరవిహారం కావించడం సహితం ప్రమాదకరమని గ్రహించవలసి ఉంది. ఇప్పటికి దేశంలో భాజపా తిరుగులేని శక్తీ అని ఈ ఎన్నికలు మరో మారు స్పష్టం చేస్తూ ఈ బలాన్ని ఆస రాగా తీసుకొని ఏకపక్షంగా వ్యవహరిస్తే, సుపరిపాలనను అందించలేకపోతే,జవాబుదారీతనంగా వ్యవహ రింప లేకపోతే ప్రజలు తగు గుణపాఠం నేర్పడానికి వెను కడుగు వేయరని స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు చెప్ప వచ్చు. ఫిరాయింపులతో, ధనబలంతో, అధికార బలంతో ప్రజాభిమానాన్ని కొనసాగించుకోలేమని గ్రహించాలి.
భావోద్వేగాలతో ఎక్కువకాలం ప్రజల మన్ననలు పొందలేమని, సుపరిపాలన అవసరమని కూడా అర్థం చేసుకోవాలి. ఓట్లను దృష్టిలో ఉంచుకొని కొన్ని వర్గాలను మాత్రమే దగ్గరకు తీసుకొనే సంకుచిత ధోరణులను విడనాడి నిస్పక్షపాతంగా పాలన అందించడం పట్ల దృష్టి సారించాలి. పట్టణ ప్రాంతాలలో తిరుగులేని శక్తిగా నిలబడిన భాజపా గ్రామీణ ప్రాంతాలలో మాత్రం కొంత ప్రతికూలతను ఎదుర్కోవడాన్ని గమనించవలసి ఉంది.
ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కొద్దీ నెలల్లో జరు గనున్న ఝార్ఖండ్, అస్సాం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటక ఉప ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రాలలో ప్రస్తుతం అధికా రంలో ఉన్న తమ ప్రభుత్వాలను కాపాడుకోవడంతో పాటు, ఢిల్లీలో అధికారంలోకి రావడానికి భాజపా భిన్న మైన వ్యూహాలను అనుసరించాల్సిఉంది. ఈ ఫలితాలు ఇతర రాజకీయ పక్షాలకు సహితం కనువిప్పు కలిగించాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతీయత స్వరూపం. రాజకీయ జీవనంలో సహితం రాజకీయ పక్షాలు ఈ వారసత్వాన్ని హుందాగా, స్పష్టమైన రాజకీయ విధానాలతో ప్రజల మెప్పు పొందే విధంగా ఫలవంతం చేసే ప్రయత్నం చేయా లి. కుటుంబాలు, వ్యక్తులు కేంద్రంగా నడుస్తున్న రాజకీయాలకు స్వస్తి పలకాలి. సమష్టి నాయకత్వం మాత్రమే సరైన నాయకత్వాన్ని, సుపరిపాలనను అందించగలదని అర్థం చేసుకోవాలి.

-చలసాని నరేంద్ర 98495 69050