మెయన్ ఫీచర్

అయోధ్యపై సయోధ్యకు ఆఖరి అవకాశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘకాలం న్యాయ వివాదాలలో చిక్కుకొని, ప్ర జల మధ్య ఎంతో అసహనానికి దారితీసి, దే శంలో మతపర ఉద్రిక్తలకు కారణమైన అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంపై చివరకు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. సుమారు 135 సంవత్సరాలుగా నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికే ప్రయత్నం చేయడం కీలక పరిణామం కానున్నది. అయితే, ప్రజల మనోభావాలు, విశ్వాసాలకు సంబం ధించిన ఇటువంటి సున్నితమైన, కీలక మైన అంశంపై న్యాయస్థానాల తీర్పుతో పరిష్కారం లభిస్తుందని ఆశించలేం. అందుకనే విచారణ ప్రారంభించేముందు హిందువులు, ముస్లింల మధ్య సయోధ్యకు చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ముగ్గురు సభ్యులతో మధ్యవర్తుల కమిటీని నియమించారు. ఈ కమిటీ ఉభయ పక్షాలతో సుదీర్ఘ సంప్ర దింపులు జరిపిన అనంతరం చేతులు ఎత్తివే యడంతో ఇప్పుడు సుప్రీం కోర్టు ద్వారా పరిష్కారం కోసం ఎదురు చూడవలసి వస్తున్నది. ఇరు పక్షాల వాదనలు ముగించి, తుది తీర్పు కోసం సుప్రీం కోర్టు సిద్ధపడుతున్న సమయంలో వైరి వర్గాల నుండే సయో ధ్యకు సంకేతాలు వెలువడటం విశేషమైన పరిణామమని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడే లోపుగానే అటువంటి సయోధ్య కుదిరిన పక్షంలో ప్రజల మధ్య శాశ్వతమైన మైత్రికి మార్గం ఏర్పడుతుంది. అందుకనే సయోధ్యకు ఇది చివరి అవకాశమని గుర్తెరగాలి. మరోవంక, అయోధ్య ఉద్యమానికి కీలకమైన అండ దండలు అందిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సైతం సుప్రీం కోర్టు తీర్పుకు అందరు కట్టుబడి ఉండాలని పిలుపివ్వడం గమనార్హం.
వాస్తవానికి ప్రథమ స్వతంత్ర సమరంగా పేర్కొనే 1857 నాటి పోరాటంలో హిందువులు, ముస్లింలు కలసి బ్రిటిష్ పాలకులపై తిరగబడటం తెలిసిందే. అప్పటి నుండే బ్రిటిష్ పాలకులు జాగ్రత్త పడి హిందువులు, ముస్లింల మధ్య వైరుధ్యాలను పెంచే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఆ ప్రయత్నాలకు పరాకాష్ఠగా స్వతంత్రం ఇచ్చివేసి, దేశం వదిలి వెళ్లిపోక తప్పని పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశ విభజనకు బ్రిటిష్ పాలకులు నడుం కట్టారు. ఆదర్శమూర్తిగా భావించే శ్రీరాముడు జన్మించిన ప్రదేశంగా భావిస్తున్న అయోధ్యలో నెలకొన్న రామా లయాన్ని 16వ శతాబ్దంలో బాబర్ ధ్వంసం చేసి మసీదును నిర్మించాడని హిందువుల విశ్వాసం. ఈ విషయమై తొలుత 1885 స్థానిక మహంత్ స్థానిక కోర్టు లో దావా వేసాడు. అక్కడ రామాలయం ధ్వంసం చేసి మసీదును కట్టారని ఆరోపించారు. 1949 అలాహాబాద్ హైకోర్టు- హిందువులను అక్కడ శ్రీరాముడి విగ్రహం పెట్టి, తమ పర్యవేక్షణలో సంవత్సరానికి ఒకసారి ప్రార్ధనలు చేయడానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుండి అక్కడ శ్రీరాముడికి పూజలు న్యాయస్థానం పర్యవేక్షణలో సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి. ముస్లింల విశ్వాసం ప్రకారం నమాజ్ చేయడానికి స్థలం విషయమై ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. హిందువులకు మాత్రం తమ దేవాలయాలకు సంబంధించి స్థల ప్రాధాన్యత ఉంటుంది.
ఇతర మతస్థుల పూజలు జరిగే చోట ముస్లింలు నమాజ్‌కు ఇష్ట పడరు. దాంతో 1949 నుండి వివాదాస్పద స్థలంలో నమాజ్ జరగడం లేదు. ఈ విషయమై హిందువులు ముస్లింలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఉంటే ఎప్పుడో సమస్య పరిష్కారమై పోయేది. కానీ అటువంటి ప్రయత్నాలు జరుగలేదు. పైగా, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రధాన రాజకీయ పక్షాలు చేశాయి. 1985లో షబానా కేసులో సుప్రీం కోర్టుతీర్పుకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురైనన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో ఆ ఆగ్రహం తొలగించాడానికి శ్రీరాముడి విగ్రహానికి రోజువారీ పూజలకు అనుమతి ఇచ్చారు. 1988లో రామాలయం నిర్మణానికి శిలాశాసనం జరపడానికి రాజీవ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1989లో ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య నుండి రామరాజ్యం నినాదంతో రాజీవ్ గాంధీ ప్రసాదించారు. ఈ విషయమై కోర్టులో వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవంక వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు జరగక పోవడంతో అసహనం ప్రబలి 1991లో వివాదాస్పద బాబరీ కట్టడాన్ని హిందూమత ఆందో ళనకారులు ధ్వంసం చేశారు. తాత్కాలిక రామాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అక్కడ పూజలు జరుగుతున్నాయి. 2010లో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేసి ముస్లింలకు, రామాలయానికి రెండు భాగాలు ఇస్తూ అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు ఇరు వర్గాలు వెళ్లాయి. ఇప్పుడు ఈ వివాదంపై సుప్రీం తీర్పు ఇవ్వడానికి సిద్దపడుతున్నది.
పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో హిందూ, ముస్లింల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు మొదటిసారిగా ప్రభుత్వం వైపు నుండి జరిగాయి. న్యాయస్థానంలోనే తేల్చుకునేందుకు ఉభయ వర్గాల వారు అంగీక రించడంతో, వివాదాస్పద భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తీర్పు చెప్పమని న్యాయస్థానాన్ని అర్థించింది. అయితే అందుకు మొదట్లో ఒప్పుకున్న ఒక వర్గం రాజకీయ కారణాలతో వెనుకడుగు వేయడంతో ప్రభుత్వం ఆ కేసును వెనుకకు తీసుకోవలసి వచ్చింది. 1988లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్ ప్రభుత్వానికి అటువంటి అవకాశం కలిగింది. హిందూ, ముస్లింలతో మంచి సంబంధాలు ఉండడంతో, ఆయన నిజాయతీతో ప్రయత్నిస్తే అప్పట్లోనే సయోధ్య కుదిరి ఉండేది. అందుకు ఇరువర్గాలు సహితం సుముఖత వ్యక్తం చేశాయ. అయితే సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారు. 1999లో అధికా రంలోకి వచ్చిన వాజపేయి పరిష్కారం కోసం జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. అయితే పరిష్కారం కుదిరితే వాజపేయికి పేరొచ్చి, బలం పెంచుకొంటారనే భయంతో ఆయన మంత్రివర్గ సహచరులే తెరవెనుక కుతంత్రాలకు పాల్పడడంతో ఎటువంటి ప్రయోజనం కలుగనే లేదు. కరసేవక్‌లపై పోలీస్ కాల్పులు జరిపి, దారుణంగా హత్యాకాండ జరిపించిన ములాయాం సింగ్ యాదవ్ వంటి వారు కూడా వాజపేయి హయాంలో వలే హిందూ సాధువులలో చీలిక తెచ్చే ప్రయత్నం జరపక పోవడం గమనార్హం.
ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా అధికారికంగా అయోధ్యలో తిరిగి మసీదు నిర్మించాలని గాని, రామా లయం నిర్మించవద్దని గాని చెప్పడం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యక్షంగా ఈ వివాదంలోకి దిగలేదు. హిందూ, ముస్లింల మధ్య అగాధాన్ని పెంచడం ద్వారా తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాలు నెరవే ర్చుకోవడం కోసం దాదాపు ప్రతి రాజకీయ పక్షం ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అందుకనే దేశంలో తరచూ మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. అయోధ్య అంశాన్ని హిందూ, ముస్లింలు పరస్పరం అవగాహనతో పరిష్క రించుకోకునే అవకాశం లేకుండా రాజకీయ విద్వేషాలు సృష్టించే విధంగా మారడానికి ఎల్‌కే అద్వానీ 1991లో జరిపిన రథయాత్ర కారణం అని చెప్పవచ్చు. దేశ ప్రజలు రాజకీయాలకు అతీతంగా శిలాశాసనంలో పాల్గొన్నారు. అందుకోసం ప్రజలలో చైతన్యం తీసుకు రావడానికి హిందూ సంస్థల నాయకులు దశాబ్దకాలం పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉద్యమంలో ఎక్కడా రాజకీయ నాయకులు పాల్గొనలేదు. అయోధ్య ఉద్యమం తుది దశకు చేరుకొంటున్న సమయంలో రథయాత్ర జరపడం ద్వారా తాను ఒక ప్రజానాయకుడిగా ఆవిర్భవించే ప్రయత్నం అద్వానీ చేశారు. ఈ ప్రయత్నంతో మొత్తం అయోధ్య ఉద్యమాన్ని భారతీయ జనతాపార్టీ హైజాక్ చేసింది. దాంతో ఇది రాజకీయ వివాదంగా మారి మరింత జటిలమైనది.
ఇప్పుడు సుప్రీం కోఠ్టు ముందున్న వివాదం భూ యజ మాన్యానికి సంబంధించినదే అయినప్పటికీ, ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంది. రాజ్యాంగంలోని 142వ అధికరణను ఉపయోగించుకొని సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు అయినా ఇవ్వవచ్చు. అయితే రెండు వైపులా అత్యధికులు సంతోషంగా ఒప్పుకొంటే గాని ఎటువంటి ఒప్పందం అయినా ఆమోదయోగ్యం అయ్యే అవకాశం ఉండదు. అందుకోసం రెండు వైపులా కొంతమేరకు తమ పట్టుదలలు వదులుకోవలసిందే.
సుప్రీం తీర్పుకు ముందుగా తెరపైకి వస్తున్న రాజీ సూచనలు 80వ దశకంలోనే వచ్చాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరిస్తే కాశీ, మధురలలో సమస్యలు లేవనెత్తవద్దని హిందువులను ఒప్పిస్తామని పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు. సంకుచిత రాజకీయాలు ప్రవేశించడంతో పరిష్కారం కుదరకుండా పరిస్థితులు జటిలంగా మారాయి. ఇప్పుడు తీర్పు ఇచ్చే ముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎంతో హుందాగా వ్యవహరిస్తూ, రాజీమార్గం ద్వారా పరిష్కారం కోసం అనేక అవకాశాలు ఇవ్వడం ముదావహం. ఇప్పటికైనా వివేకవంతులు ఈ అవకాశాన్ని ఉప యోగించుకొనే ప్రయత్నం చేయాలి. తద్వారా దేశంలో హిందూ, ముస్లింల మధ్య అపోహలు తొలగి, సామ రస్యంతో వ్యవహరింపగల వాతావరణం ఏర్పాటుకు దోహ దపడాలి. నూతన చరిత్రకు నాంది పలకాలి.

-చలసాని నరేంద్ర 98495 69050