మెయన్ ఫీచర్

ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా అందు బాటులోకి వస్తున్న సోషల్ మీడియా సమాచార వ్యాప్తిలో ఎంత కీలకంగా మారుతున్నదో, అంతగా దుర్వినియోగం అవుతున్నది. అసత్యాలను, అపోహలను, అతిశయాలను విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకు వెళ్లడం కోసం సోషల్ మీడియాను బలమైన సాధనంగా వాడుకోవడం నేడు అంతటా పరిపాటిగా మారింది.
అయితే ఈ అత్యాధునిక సాంకేతిక సాధనాన్ని ప్రభుత్వాలే పెద్ద ఎత్తున దుర్వినియోగ పరుస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా, ఎన్నికల అక్రమాలకు, పౌరులపై నిఘాకు ప్రభుత్వాలు సోషల్ మీడియాను వాడుకోవడం ద్వారా డిజిటల్ నిరంకుశత్వం వైపు అడుగులు వేస్తున్నాయి.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సహితం ఇటువంటి నిరంకుశ ధోరణులు అనుసరిస్తుండటం గమనార్హం. ఇటువంటి ధోరణుల కారణంగా ప్రపంచ ఇంటర్‌నెట్ స్వాతంత్య్రం వరుసగా తొమ్మిదవ సంవత్సరం క్షీణిస్తున్నదని అమెరికా కేంద్రంగా గల ఫ్రీడమ్ హౌస్ ప్రచురించిన తాజా వార్షిక ...నెట్ పై స్వాతంత్య్రం 2019: సోషల్ మీడియా సంక్షౌభం...నివేదిక వెల్లడి చేసింది.
విదేశీ జోక్యంతో పాటుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చెలరేగుతున్న మరో రుగ్మత ప్రజా నాయకులు, వారికి ఆన్‌లైన్ లో మద్దతుగా నిలుస్తున్న జీతంపై పనిచేసే సహాయకులు రాజకీయాలను వక్రీకరించడం. గత సంవత్సర కాలంగా ఎన్నికలు జరిగిన 30 దేశాలను అధ్యయనం చేయగా, వాటిల్లో 26 దేశాలలో ఆన్‌లైన్ జోక్యం విశేష ప్రభావం చూపినట్లు వెల్లడైనది.
తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యూహంగా నేడు రాజకీయ నాయకులు గుర్తిస్తున్నారు. అధికారంలోకి రావాలనే నిరాశాపూరిత ప్రయత్నాలలో కొన్ని దేశాలలో అధికారంలో ఉన్నవారు వెబ్‌సైట్ లను బ్లాక్ చేస్తున్నారు. ఇంటర్ నెట్ పనిచేయకుండా చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సెన్సార్ షిప్ లేకుండా ప్రచారం బాగా పనిచేస్తున్నట్లు చాలా ప్రభుత్వాలు భా విస్తున్నాయి... అని ఫ్రీడమ్ హౌస్ అధ్యక్షుడు మైక్ అబ్రమోవిట్జ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నిరంకుశ, ప్రజాస్వామ్య పాలకులు బాలెట్ బాక్స్ లను జయించడం కోసం, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన నియమ నిబంధనలను అధిగమించడం కోసం మానవ స్వభావాలను, కంప్యూటర్ గణాంకాలను వశపరచు కోవడం కోసం ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు.
ఎదురు కాగల ప్రమాదాలను గుర్తించడంకోసం, కొన్ని సందర్భాలలో ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాలలో ప్రభుత్వాలు విచక్షణారహితంగా పౌరుల ఆన్ లైన్ ప్రవర్తనలను పర్యవేక్షిస్తున్నాయి. ఫ్రీడమ్ హౌస్ విశే్లషించిన 65 దేశాలలో కనీసం 40 దేశాలలో సోషల్ మీడియా పర్యవేక్షణ కార్యక్రమాలకు సంబంధించి సాక్ష్యాలను సేకరించింది.
ఒకప్పుడు కేవలం ప్రపంచంలోని అతి శక్తివంతమైన నిఘా ఏజెన్సీలకు మాత్రమే పరిమితమైన భారీ డేటా గూఢచర్యం సాధనాలు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయి... అని ఫ్రీడమ్ హౌస్ సాంకేతిక పరిశోధన డైరెక్టర్ అడ్రియన్ షాబాజ్ చెప్పారు.
నియంత్రణలేని సోషల్ మీడియా గూఢచర్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రాథమిక స్వాతంత్య్రాలకు చెప్పుకోదగిన రక్షణలు గల దేశాలలో సహితం ఇప్పటికే ఇటువంటి ఉల్లంఘనలు జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలిపారు.
అత్యాధునిక పర్యవేక్షణ సాధనాలు విస్తరిస్తుండటం తో ప్రజలు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలేక పోతున్నారని, ఆన్‌లైన్‌లో పౌరుడిగా క్రియాశీలకంగా ఉండలేక పోతున్నారని స్పష్టం అవుతున్నది. ఈ నివేదికలో సమీక్ష జరిపిన 65 దేశాలలో 47 దేశాలలో రాజకీయ, సామాజిక లేదా మతపరమైన ప్రసంగాలు చేసినందుకు అరెస్టులు జరిగాయని వెల్లడైనది. 31 దేశాలలో ఆన్‌లైన్ కార్యకలాపాలు సాగించినందుకు హింసను ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి.
సోషల్ మీడియాను కాపాడటంలో మన సామర్థ్యంపై ఇంటర్‌నెట్ స్వాతంత్య్రం భవిష్యత్ ఆధారపడి ఉంటుందని షాబాజ్ తెలిపారు. ఇంటర్‌నెట్‌లో చాలావరకు అమెరికాకు సంబంధించిన వేదికలు ఉంటూ ఉండడంతో డిజిటల్ యుగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఆ దేశం నాయకత్వ పాత్ర వహించాలని సూచించారు. ఇంటర్ నెట్ దౌర్జన్యానికి, అణచివేతకు ఒక ఆటబొమ్మ కాకుండా కాపాడటానికి ఇదొక్కటే మార్గం అని స్పష్టం చేశారు.
ఈ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ నెట్ ఉపయోగిస్తున్న 87 శాతం ప్రజలు ఉన్న 65 దేశాలలో ఇంటర్ నెట్ స్వాతంత్య్రాన్ని సమీక్షించారు. జూన్, 2018 నుండి మే, 2019 వరకు జరిగిన పరిణామాలతో పాటు, తాజాగా జరిగిన కొన్ని సంఘటనలను సహితం పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ 65 దేశాలలో 33 దేశాలలో ఇంటర్‌నెట్ స్వాతంత్య్రం క్షీణిస్తున్నట్లు గమనించారు. ఎక్కువగా సుడాన్, ఖజకిస్తాన్ లలో అత్యధికంగా క్షీణించగా; బ్రెజిల్, బంగ్లాదేశ్, జింబాబ్వేలలో కూడా గమనించారు. అయితే ఇథియోపియాతో పాటు 16 దేశాలలో పరిస్థితులు మెరుగుపడినట్లు గమనించారు.
అమెరికాలో ఇంటర్‌నెట్ స్వాతంత్య్రం క్షీణించడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో చట్టం అమలు, వలసలకు సంబంధించిన ఏజెన్సీలు ఎక్కువగా సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నాయని, వారెంట్‌లు లేకుండా ప్రయాణికుల ఎలక్ట్రానిక్ పరికరాలను పారదర్శకత లేకుండా తనిఖీ చేస్తున్నారని పేర్కొన్నారు.
అనేక సందర్భాలలో, శాంతియుత ప్రదర్శకులు, వార్తలు సేకరించేవారు వంటి రాజ్యాంగపరంగా రక్షణలు కల్పించిన వారిని లక్ష్యంగా చేస్తున్నారు. ప్రధానమైన రాజకీయ సంఘటనలలో ఎక్కువగా స్వదేశీ నేతలే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
వరుసగా నాలుగో సంవత్సరం, ప్రపంచంలో ఇంటర్ నెట్ స్వాతంత్య్రాన్ని ఎక్కువగా హరిస్తున్న దేశంగా చైనా నిలిచింది. టియానానె్మన్ స్క్వేర్ ఊచకోత 30వ సంవత్సరం, హ్యాంగ్‌కాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా సమాచార నియంత్రణలను మరింత కఠినతరం కావించడంతో సెన్సార్ షిప్ అనూహ్యమైన స్థాయికి చేరుకొంది.
డిజిటల్ వేదికలు ప్రజాస్వామ్యంలో నూతన పోరాట వేదికలుగా మారాయి. కనీసం 24 దేశాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ ఆన్ లైన్ వేదికలను దుర్వియోగపరుస్తూ పక్షపాత ప్రచారంపై పాల్పడ్డారు. డిజిటల్ ఎన్నికల జోక్యంగా మారుతున్నది.
తరచూ ప్రభుత్వ అనుకూల మీడియా వాఖ్యలతో, వ్యాపార దిగ్గజాలతో కలసి పాక్షికంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఆన్‌లైన్ వేదికల నుండి కుట్ర పూరిత కథనాలను, రెచ్చగొట్టే అభిప్రాయాలను, తప్పుదోవ పట్టించే అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాప్తి చేస్తున్నారు.
ప్రభుత్వాలు తమ మధ్య ఉన్న భారీ డేటాను సోషల్ మీడియా పర్యవేక్షణకు ఉపయోగిస్తున్నాయి. కనీసం 40 దేశాలలో, అత్యాధునిక సోషల్ మీడియా పర్యవేక్షణ కార్యక్రమాలను అధికారులు అమలులోకి తెచ్చారు. ఆ అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా త్వరితగతిన సోషల్ మీడియా వాడేవారు సంబంధాలను, వారి పోస్టింగ్‌ల అర్థాలను, అవెక్కడికి చేరుతున్నాయి పసిగట్టగలరు.
మూకుమ్మడిగా మూసివేయడాన్ని అధికారులు సాధారణ విధానంగా అమలు చేస్తున్నారు. కనీసం 20 దేశాలలో సోషల్ మీడియా, కమ్యూనికేషన్ పరికరాలను మూసివేశారు. 17 దేశాలలో టెలీకమ్యూనికేషన్ నెట్ వర్క్ లను రద్దు చేశారు. సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించేందుకు చాలా ప్రభుత్వాలు నకిలీ అకౌంట్‌లను సృష్టిస్తున్నాయి.
ఆన్‌లైన్ అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం రాజకీయ నాయకులు ఉద్యోగు లను నియమిస్తున్నారు. తద్వారా ప్రత్యర్థులపై దాడులకు 38 దేశాలలో పాల్పడినట్లు ఈ నివేదిక తెలిపింది.

- చలసాని నరేంద్ర