మెయన్ ఫీచర్

ముంబయి ఉగ్రదాడిలో అంతుబట్టని కుట్ర కోణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవంబర్ 26, 2008 తేదీని భార తీయులెవ్వరూ మరచిపోలేరు. భారత దేశ చరిత్రలో ఇదొక దుర్దినం అని చెప్పవచ్చు. పాకిస్తాన్ నుండి లష్కర్-ఇ-తోయిబా ఉగ్ర వాదులు 10 మంది ముంబయిలోకి ప్రవేశించి, వివిధ ప్రదేశాల నుండి నిర్దాక్షిణ్యంగా సుమారు 160 మంది పౌరులు, భద్రతా సిబ్బంది, పోలీస్ సిబ్బందిని హతమార్చారు. ఈ దాడితో తమకు సంబంధం లేదన్నట్లు పాకిస్తాన్ వ్యవహరించినా తుకారాం ఓంబ్లే అనే పోలీస్ ప్రదర్శించిన అసమాన త్యాగం ఫలితంగా భారత్ అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోగలిగింది. అతని ఒప్పుకోలు ఫలి తంగానే దర్యాప్తునకు, ఆ తర్వాత జరిగిన నేర విచారణకు పునాది ఏర్పడి పుణెలోని ఎరవాడ జైల్లో అతని ఉరికి దారితీసింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత దేశంలో సజీవంగా పట్టుబడడం ఇదే మొదటిసారి కావడంతో ఇక్కడ ఉగ్రవాదం వ్యాప్తిలో పాకిస్తాన్ ప్రత్యక్ష హస్తం ఉన్నదని ప్రపంచానికి తెలియచెప్పినట్లు అయింది. అయితే తాము స్థానికంగా కొందరు అందించిన సహకారంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు ఉగ్రవాదులు న్యాయమూర్తి ముందు స్పష్టం చేశారు. అయినా ఆ స్థానికులు ఎవరో ఇప్పటి వరకు బైటపెట్టే ప్రయత్నం జరగడం లేదు. అప్పటి యుపిఎ ప్రభుత్వంలోని కొందరు పెద్దలే పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో చేతులు కలిపి ఈ ఘాతుకానికి ఆజ్యం పోశారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా, ఆ దిశలో తగిన దర్యాప్తు జరగపే లేదు. ఐఎస్‌ఐ కుట్ర ఫలితంగానే ముంబయ ఉగ్రదాడి జరిగిందని ఆ సమయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోభద్రతా వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ ప్రభుత్వ అధికారి ఆర్‌విఎస్ మణి ఆరోపించారు. గతవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన- ముంబయలో ఉగ్రదాడి జరిగిన వెంటనే ఎన్‌ఎస్‌జీ దళాలను ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ నుండి ఆలస్యంగా పంపారని తీవ్రమైన ఆరోపణ చేశారు. ఢిల్లీ నుండి ఎన్‌ఎస్‌జి దళాలు ఆ రాత్రి 12 గంటలకల్లా ముంబయికి చేరి ఉంటే కనీసం వంద మంది ప్రాణాలను కాపాడి ఉండేవారమని పరిశోధన, విశే్లషణ విభాగం (రా)లో పనిచేసిన మాజీ అధికారి వి. బాలచంద్రన్ స్పష్టం చేశారు.
ఉగ్రదాడి తర్వాత, ముంబయ పోలీసు విభాగంలో లోపాలను శోధించడానికి రామ్ ప్రధాన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాలచంద్రన్ ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ‘హిందూ ఉగ్రవాద అపోహ - హోమ్ మంత్రిత్వ శాఖలోని అంతరంగికుని కథనం’ గ్రంథ రచయిత అయిన ఆర్‌విఎస్ మణి ఉగ్రదాడి జరిగిన రాత్రి 10 గంటలకు ఎస్పీజీని ముంబయకి పంపాలని నిర్ణయించామని, 12 గంటలకల్లా వారు ఢిల్లీ విమా నాశ్రయంపై చేరుకున్నరని తెలిపారు. అయితే ఆనాటి హోం మంత్రి శివరాజ్ పాటిల్ వైఖరి కారణంగా మరుసటి రోజు ఉదయం వరకు వారు ముంబయలో కార్యరంగంలోకి దిగలేక పోయారని దిగ్భ్రాంతి కరమైన అంశం వెల్లడించారు. ముంబయకి వారు బయలుదేరబోతున్న సమయంలో హోం మంత్రి కూడా వారితో కలసి వస్తారని కబురు రావడంతో, వారు ఢిల్లీ విమానాశ్రయంలోనే రెండు గంటలు వేచి ఉండవలసి వచ్చింది.
పోలీసు దళం ఎక్కడైనా యుద్ధానికి వెడుతుంటే మంత్రులు వెంట వస్తారా..? అని మణి విస్మయం వ్యక్తం చేశారు. తీరా ముంబయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా అక్కడ మంత్రికి ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పవలసిన వారు రాలేదనే సాకుతో అరగంటకు పైగా విమానం లోనుంచి వారిని బైటకు రానీయలేదని పేర్కొన్నారు. ఎస్పీజీ దళాలు వచ్చేవరకు ముంబయలో అందుబాటులో ఉన్న పలు కేంద్ర దళాలను రంగంలోకి దింపాలని, వారు పరిస్థితి విషమించకుండా కట్టడి చేస్తారని తాను సూచించినా అప్పటి రాజకీయ నాయకత్వం ఒప్పుకోలేదని తెలిపారు. అందుబాటులో ఉన్న దళాలను రంగంలోకి దింపితే ఉగ్రవాదుల కదలికలను కట్టడి చేసే వీలుండేదని ఆయన చెప్పారు.
వాహనాలు వెంటనే ఆందుబాటులో లేని ప్రాంతాల నుండి ఉగ్రవాదులు నాలుగు టాక్సీలలో వచ్చారని, దారిలో వారినెవరూ ఆపలేదని, వారు తాజ్‌హోటల్‌కు చేరినప్పుడు అక్కడే రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి వారికి స్వాగతం చెప్పడానికా ?అన్నట్లు ఉన్నారని అంటూ 160 మందిని చంపివేసినా ఆమెకు చిన్న గాయం కూడా కాలేదని మణి విస్మయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల ప్రవేశాన్ని తాజ్ హోటల్‌లోని ఒక్క సీసీ కెమెరాలో కూడా నమోదు చేయక పోవడం గమనార్హం. అదృష్టవశాత్తు ఉగ్రవాది కసబ్ పట్టుబడ్డారని, లేనిపక్షంతో ఇదంతా- ‘హిందూ ఉగ్రవాదుల కుట్ర’ అని ప్రచారం చేసేవారని మణి ఎద్దేవా చేశారు. పాక్ ఉగ్రవాదుల కదలికలను సముద్రమార్గంలో నావికాదళం కనిపెట్టిన్నట్లు అప్పటి హోం మంత్రి చిదంబరం 2008 డిసెంబర్ 10న లోక్‌సభలో చెప్పారని గుర్తు చేస్తూ, ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించకుండా నావికాదళాన్ని కట్టడి చేసింది రాజకీయ నాయకత్వం కాదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు తాజ్‌హోటల్‌కు వెళ్లి జరిపిన ఘాతుకాన్ని పరి శీలించినట్లయితే వారికి కొందరు స్థానికులు సహ కరించినట్లు స్పష్టం అవుతుంది. అయితే పోలీసులు, ప్రభుత్వం ఈ అంశాన్ని పదే పదే తిరస్కరిస్తూ వచ్చింది. తమ కమిటీ విచారణలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు బాలచంద్రన్ తెలిపారు.
దావూద్ ఇబ్రహీం ముఠాకు సంబంధించిన స్థానిక స్మగ్లర్లకు ఇందులో పాత్ర ఉండవచ్చని ఈ కమిటీకి కొన్ని ఆధారాలు లభించినా ఆ అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. మంచిమార్ నగర్ లోని కొన్ని గుడిసెలలో వారికి ఆశ్రమం ఇచ్చి ఉంటారని చెబుతున్నారు. దాడికి కొన్ని రోజుల ముందే ఉగ్రవాదులు వచ్చి ఉంటారని, రెక్కీ నిర్వహించిన తర్వాతనే ఘాతుకానికి పాల్పడ్డరని కూడా కనుగొన్నారు. ఈ విషయాన్ని పలువురు తనకు చెప్పిన్నట్లు బాలచంద్రన్ చెప్పారు. ఈ కోణాన్ని పరిశీలించమని తాము ప్రభుత్వానికి, పోలీసులకు సూచించినా వారెవరూ ఆ విషయం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ కమిటీ తన నివేదికను అప్పటి హోం మంత్రి పి చిదంబరానికి అందించినా దానిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. పైగా, ఉగ్రదాడి వెనుకగల కుట్ర గురించిన అంశాల జోలికి తమను పోవద్దని కట్టడి చేశారని, పోలీస్ వ్యవస్థలో లోపాలను మాత్రమే పరిమితం కమ్మన్నారని బాలచంద్రన్ తెలిపారు. దాంతో తగిన నిఘా ఉందా? పోలీసులు తీసుకున్న చర్య సరిపోతుందా?మరింకా తీసుకోవలసిన చర్యలు ఏమిటి? అనే విషయాలనే పరిశీలించినట్లు చెప్పారు.
మరోవంక ఈ కమిటీ దర్యాప్తు విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి అనుసరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనీసం నిఘా వర్గాల సమాచారం కూడా పంచుకోవడానికి ఇష్టపడలేదు. ఈ కమిటీకి కనీసం సీసీటీవీ ఫుటేజీలను కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేక పోవడంతో ఎన్‌ఎస్‌జీ జోలికి పోవద్దని తాము అనుకున్నట్లు బాలచంద్రన్ తెలిపారు. ఇటివంటి దారు ణమైన దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్‌పై దౌత్యపర మైన వత్తిడి తీసుకు రావడం పట్ల కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపలేదని విమర్శలు చెలరేగుతున్నాయి. పాక్ దుశ్చర్యకు ప్రతీకారంగా యుపిఎ ప్రభుత్వం ఏదో గొప్ప చర్య తీసుకోబోతున్నట్లు ఢిల్లీ నుండి ఎన్నో కథనాలు అప్పట్లో వెలువడ్డాయి. వాస్తవానికి యుద్ధానికి వెళ్ళడానికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని అప్పట్లో వాయుసేన అధిపతిగా ఉన్న ఫలి హామీ మేజర్ 2016లో ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. సరిహద్దులలో నెలకొన్న జిహాదీ శిబిరాలపై దాడులు జరుపుతామనే మాట వినబడినా అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయ వచ్చని అప్పటి ప్రభుత్వం వెనుకడుగు వేసిన్నట్లు కూడా ఆయన చెప్పారు.

-చలసాని నరేంద్ర