మెయన్ ఫీచర్

వివాదంగా మారుతున్న గవర్నర్ల వ్యవస!్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగినంత కాలం గవర్నర్ల వ్యవస్థ గురించి చెప్పుకోదగిన వివాదాలు చెలరేగలేదు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే తమిళనాడులో మంత్రివర్గం లేకుండానే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజగోపాలా చారిని శాసనమండలి సభ్యుడైనా నాటి గవర్నర్ శ్రీప్రకాశ నియమించడం, ప్రపంచంలోనే తొలిసారి ప్రజాస్వామా యికంగా ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కేరళలో రద్దు చేసిన కేరళలో కొన్ని వివాదాలు ఏర్పడినా నాడు బాధితులుగా ఉన్నది కమ్యూనిస్టులు కావడంతో మిగిలిన అంతగా రభస జరగలేదు.
అయితే కాంగ్రెస్ అధిపత్యానికి గండి పడి, కేంద్రంలో, రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడటం ప్రారంభం అవుతున్నప్పటి నుండి గవర్నర్ల వ్యవస్థ తరచూ వివాదాలకు గురవుతూనే ఉంది. జనతా ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా ఉన్న చరణ్ సింగ్ ఒకేసారి తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వాలను గవర్నర్ల నుండి నివేదికలు తెప్పించుకొని రద్దు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. దానితో ఆ తర్వాత కేంద్రములో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే రీతిలో ప్రతిపక్షాల ప్రభుత్వాలను రద్దు చేస్తూ వచ్చింది.
ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో రాజ్‌భవన్‌లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారాయని ఆరోపణలు చెలరేగాయి. నేడు కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న భాజపా సహితం అటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని, కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే, ఎస్.ఆర్.బొమ్మయి ప్రభుత్వాలను రద్దు చేయడం తెలిసిందే. ఆ తర్వాత కర్ణాటకలోని బొమ్మయి ప్రభుత్వ రద్దుపై తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల విచక్షణాధికారానికి కొన్ని హద్దులు ఏర్పాటు చేస్తూ విభజన రేఖను గీసింది.
అయినా గవర్నర్లు తరచూ కేంద్రం చెప్పు చేతలలో వ్యవహరిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అందుకనే తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలి అంటూ నినదించారు. ఈ సందర్భంగా జనతా ప్రభుత్వం ఏర్పర్చిన సర్కారీ కమీషన్ నిర్దుష్టమైన సిఫార్సులు చేసింది. అయినా గవర్నర్ల వ్యవహారంలో చెప్పదగిన మార్పు రావడం లేదు.
తాజాగా, భాజపా సహితం గవర్నర్లను అడ్డుపెట్టుకొని తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే, విస్తరించుకోవాలనో చేస్తున్న ప్రయత్నాలు వెగటు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో వారి పాత్ర వివాదాస్పదం అవుతున్నది. మొన్ననే మహారాష్టల్రో తెల్లవారు జామున రాష్టప్రతి పాలనను తొలగిస్తూ రాష్టప్రతితో సంతకం చేయించి, దేవేంద్ర ఫడ్నవిస్ ను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి భాజపా నవవులపాలయినది.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి బహుశా నిద్రమత్తులో ఫడ్నవిస్ ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి, వెంటనే ప్రమాణస్వీకారం చేయించినట్లున్నారు. కనీసం బలనిరూపణ చేయించు కోమని సూచిస్తూ, అందుకు గడువు విధించిన దాఖలాలు కూడా లేవు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత అంత అమాయకంగా వ్యవహరించారంటే విస్మయం కలిగిస్తుంది.
ఫడ్నవిస్ నేడు చెబుతున్నట్లు ఎన్సీపీ సభ్యులు అందరి మద్దతు ఉంటుందని అజిత్ పవార్ చెప్పడంతో నమ్మినా, అర్ధరాత్రి ఇటువంటి రాచకార్యానికి పాల్పడి ఐదేళ్ల పరిపాలనలో తెచ్చుకున్న మంచిపేరుపై పెద్ద నల్లటి మచ్చ వేసుకున్నట్లు వ్యవహరించారు. ఈ వ్యవహారంలో రాష్టప్రతి భవన్ ను సహితం వివాదాస్పదంగా మార్చారు.
మరోవంక పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ తరచూ రాష్ట్రంలో అధికారమలో ఉన్న పక్షంపై రాజకీయ ప్రకటనలు జారీ చేస్తూ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అందుకనే ఆయనను భాజపా అధికార ప్రతినిధి అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె రాజకీయ ధోరణులు ఆమెకు ఉంటాయి. వాటి మంచి చెడులను ప్రతిపక్షంగా భాజపా ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతుంది. మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాతీర్పు కోరుతుంది. కానీ అటువంటి అంశాలలో గవర్నర్ జోక్యం ప్రశ్నార్ధకరం అవుతుంది.
ఒక వంక అధికార పక్షం గవర్నర్ పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులు సహితం మన ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగరిపే విధంగానే ఉంటున్నాయి. సమస్యలను సౌమ్యంగా సరిదిద్దుకోవడం వీధి పోరాటాలతో ప్రసిద్ధి చెందిన మమతాకు అలవాటు లేదని అందరికి తెలిసిందే. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరాలు ఉంటె రాష్టప్రతికి నివేదించుకోవచ్చు. ఇతరత్రా అందుబాటులో ఉండే రాజ్యాంగపర మార్గాలు ఎంచుకోవచ్చు. లేదా రాజకీయ పోరాటం చేయవచ్చు. కానీ ఆయన శాసనసభకు వస్తుంటే ప్రధాన ద్వారాన్ని మూసివేయడం వంటి చర్యలు హుందాగా ఉండవు. చిల్లరి చేష్టలుగానే భావించవలసి ఉంటుంది.
పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితుల పట్ల ప్రతిపక్షంగా భాజపా ఆందోళన చేయవచ్చు. కానీ గవర్నర్ మీడియాలో ప్రకటనలు చేయడం అభ్యంతరకరమే. రాష్ట్రంలో పరిస్థితులు అంతగా దిగజారుతుంటే కేంద్ర హోమ్ మంత్రికి, ప్రధాన మంత్రికి, రాష్టప్రతికి నివేదికలు పంపవచ్చు. అంతేగాని ఒక రాజకీయ నేత వలే వ్యవహరించడం అభ్యంతరకరమే కాగలదు. మమతాబెనర్జీతో ప్రధాని నరేంద్ర మోదికి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన జోక్యం చేసుకొని ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేయవచ్చు. కానీ రాజ్‌భవన్ రాజకీయ ప్రచారానికి కేంద్రంగా మారడం తగదు.
అసలు శాంతిభద్రతల సమస్యల విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ తర్వాత దేశంలో అధ్వాన్నంగా ఉన్నది ఉత్తర ప్రదేశ్‌లోనే. కానీ అక్కడ గవర్నర్ ఎప్పుడైనా ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం హిత వచనాలు చెప్పినా మీడియాలో ఎప్పుడైనా చూశామా? గతంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి గవర్నర్ రామ్‌నాయక్ తరచూ అటువంటి ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ అక్కడ భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్‌భవన్ వౌనముద్ర వహిస్తున్నది.
కర్ణాటకలో సహితం గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కాగానే బి.ఎస్. ఎడ్డ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించడం వివాదాస్పదంగా మారింది. సుప్రీం కోర్ట్ మొట్టికాయలు వేసింది. మహారాష్టల్రో సహితం సుప్రీం కోర్ట్ జోక్యంతోనే అర్ధరాత్రి జరిగిన నాటకానికి తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు అంశం వాస్తవంగా గవర్నర్ పరిధిలోనిదే. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండదు. అటువంటి పరిస్థితులను ఎందుకు కల్పించాలో ఆలోచించుకోవాలి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా దేశంలో మరెవ్వరు ఈ పదవిలో లేనంత సుదీర్ఘకాలం కొనసాగిన ఇ.ఎస్.ఎల్.నరసింహన్ వ్యవహారం సహితం వివాదాస్పదంగా మారింది. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వారి వలే కాకుండా, రాజకీయ నేతగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.
మణిపూర్, గోవాలలో ప్రభుత్వాల ఏర్పాటు సందర్భంగా కూడా రాజ్‌భవన్ నిర్వహించిన పాత్ర వివాదాస్పదంగా మారింది.
ఇక పాండిచేర్రి, ఢిల్లీలలో లెఫ్టినెంట్ గవర్నర్లు అక్కడి ముఖ్యమంత్రులను ఆడుకున్న తీరు తెలిసిందే. సుప్రీం కోర్ట్ ముక్కుతాడు వేయడంతో ఢిల్లీ లెఫ్ట్టినెంట్ గవర్నర్ కొంచెం మెత్తబడినట్లు కనిపిస్తున్నా పాండిచ్చేరిలో కిరణ్ బేడీ మాత్రం సర్వాధికారాలు తనవే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఏదిఏమైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించడం, వారి పట్ల తమ బాధ్యతలు నెరవేర్చేందుకు వారు ప్రయత్నం చేస్తుంటే సహకరించడం లెఫ్టినెంట్ గవర్నర్ల విద్యుక్త్ధర్మం. అక్రమాలు, అవినీతి చర్యలు జరుగుతుంటే అడ్డుపడుతుంటే వేరే విషయం. ఢిల్లీలో వలే సీసీ కెమెరాల ఏర్పాటు వంటి విషయాలలో సహితం అడ్డు పడటం దేనిని సూచిస్తుంది?
గవర్నర్ల చర్యను ప్రశ్నించవచ్చు గాని వారు తీసుకు కున్న చర్య రాజ్యాంగస్ఫూర్తి భిన్నంగా ఉన్నట్లు రుజువైనా వారిపై ఎటువంటి చర్య తీసుకోవడానికి వీలు లేదు. అందుకనే తమ చర్యలను సుప్రీం కోర్ట్‌లు తప్పు పట్టినా, భిన్నమైన ఆదేశాలను సుప్రీం కోర్ట్ ఇస్తున్నా గవర్నర్లు ఎవ్వరిలో చలనం ఉండటం లేదు. గతంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో అనుసరించిన పద్ధతిపై ప్రశ్నించినందుకు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసారు.
కానీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ తప్పు పట్టినా ఒక్క గవర్నర్ కూడా తమ పదవికి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. అంటే ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వారు వ్యవహరించినట్లు భావించవలసి ఉంటుంది. ఏది ఏమైనా గవర్నర్లు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాల మేరకు నడచుకోవలసిందే. అభ్యంతరాలు ఉంటే కేంద్రానికి నివేదికలు పంపుకోవచ్చు. కానీ రాజకీయ నేతలవలె వ్యవహరించడం అభ్యంతరకరమే. అయితే రాజ్‌భవన్‌లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడం, ఎన్నికలలో ఓటమి చెందిన వారికో లేదా పదవుల సర్దుబాటులో భాగంగానే ఈ పదవులు పొందుతూ ఉండడంతో వారి దృష్టి అంతా రాజకీయ పాత్రవైపే ఉంటున్నది. రాజ్యాంగం పట్ల కాకుండా తమ పార్టీ అధినాయకత్వం పట్ల నిబద్దత ప్రదర్శించుకోవడం పరిపాటిగా మారుతున్నది. అందుకనే గవర్నర్ల నియామకంలోనే సమూల సంస్కరణలు తీసుకు రావలసి ఉంది.

- చలసాని నరేంద్ర