మెయన్ ఫీచర్

ఝార్ఖండ్ ఎన్నికలు భాజపాకు కనువిప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019 సాధారణ ఎన్నికలలో అనూహ్యమైన విజయం సాధించిన భాజపా వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొనవలసి వస్తున్నది. 2017 నుండి గత రెండేళ్లలో వరుసగా ఆరు రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితి ఎదురైంది. వీటన్నింటికీ పరాకాష్టగా తాజాగా జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గత ఐదేళ్లలో తొలిసారిగా కనీసం అతి పెద్ద రాజకీయ పక్షంగా కూడా రాలేకపోవడమే కాకుండా ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో ఓటమి చెందడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ అనూహ్యరీతిలో సొంత పార్టీ బలంపై ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత మే, 2014 నుండి నవంబర్, 2018 వరకు 22 రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 14 రాష్ట్రాలలో భాజపా అధికారమలోకి రాగలిగింది. బీహార్, ఢిల్లీలలో తప్ప మరెక్కడా ఘోరంగా పరాజయం ఎదురు కాలేదు. ఈ ఘన విజయాలకు నరేంద్ర మోదీకు గల ప్రజాదరణతో పాటు పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత రాష్ట్రాలలో వీరిద్దరి ఎత్తుగడలు ఫలించడం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్‌లతో పాటు తాజాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అధికారం కోల్పోయింది. 72 శాతంగా దేశంలో రాష్ట్రాలలో అధికారమలో ఉన్న భాజపా పరపతి ఇప్పుడు 35 శాతానికి పడిపోయింది. అయినా ఈ విషయంపై ఆ పార్టీలో తీవ్రమైన ఆంతరంగిక ఆత్మపరిశీలన జరుగుతున్నట్లు కనిపించదు. తాజా మహారాష్ట్ర ఎన్నికల నుండి తగు గుణపాఠం నేర్చుకున్నట్లయితే ఝార్ఖండ్‌లో ఇటువంటి పరిస్థితి ఎదురయి ఉండెడిది కాదు. వాస్తవానికి ఝార్ఖండ్‌లో ఒక గిరిజనేతరుడు రఘుబర్ దాస్‌ను ముఖ్యమంత్రిగా చేసి భాజపా ఒక సాహస ప్రయోగం చేసినదనే చెప్పాలి. ఆ రాష్ట్రంలో గిరిజనుల జనాభా 26 శాతమే అయినప్పటికీ మొత్తం 81గాగల నియోజకవర్గాలలో సగం, అంటే 40 చోట్ల గిరిజనులే జయాపజ యాలను నిర్ధేశించే పరిస్తితులలో ఉన్నారు. ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా అవినీతి మరకలు అంటని ముఖ్యమంత్రి ఈయనే. మంచి పరిపాలన నడిచేందుకు కూడా ప్రయత్నించారు. ఎన్నో పాలనా సంస్కరణలు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అటవీ భూముల కౌలు విషయంలో తీసుకు వచ్చిన ప్రగతిశీలక సంస్కరణలను ప్రతిపక్షాలు గిరిజనుల ప్రయోజనాలకు భిన్నమైనవి అని ప్రచారం చేస్తుంటే ముఖ్యమంత్రికి మద్దతుగా భాజపా నిలబడినట్లు కనబడటం లేదు. ఆయన ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకం అని కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా చేసిన ప్రచారం తగు ప్రభావం చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అట్లాగే కొన్ని పాఠశాలలను మూసివేయడం, మరో కొన్నింటిని విలీనం చేయడం ద్వారా విద్యారంగంలో సంస్కరణలు చేపట్టారు. ఇవి సహితం ప్రతికూల ప్రచారానికి లోనయ్యాయి. మరోవంక, ఆయన మాట తీరు కొన్ని ఇబ్బందులకు గురిచేసిన్నట్లున్నది. అటువంటి లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం భాజపా అగ్రనాయకత్వం చేసిన్నట్లు కనబడదు.
మరోవంక ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు చేసి, వారు జైళ్లకు వెళ్ళేటట్లు పోరాడిన సరయు రేయ్ కు కనీసం సీట్ కూడా ఇవ్వకుండా, ముఖ్యమంత్రి పైననే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితులను తెచ్చుకోవడం, తమ ముఖ్యమంత్రినే గెలిపించుకోలేక పోవడం గమనిస్తే సంస్థాగత వ్యవహారాలలో భాజపా చాల బలహీనంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన్నట్లు అయింది. కేవలం కొన్ని అదనపు సీట్లు కోరిన కారణం చేత నమ్మకమైన మిత్రపక్షమైన ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తెగతెంపులు చేసుకొని, స్వతంత్రంగా పోటీ చేసేవరకు దారితీయడం భాజపా కు తీవ్రమైన నష్టం తీసుకువచ్చిన్నట్లు స్పష్టం అవుతున్నది. గణనీయంగా సీట్లు కోల్పోయినా భాజపా ఓట్ల శాతం మాత్రం స్వల్పంగా పెరిగింది. మరో వంక పొత్తును దూరం చేసుకున్న ఆ జె.ఎస్.యు.కు సహితం 8 శాతంకు పైగా ఓట్లు వచ్చాయి. అంటే పొత్తు కొనసాగితే విజయానికి దగ్గరలో ఉండేవారు. ఉన్న పొత్తును వదులుకొని, ఇతర పార్టీలకు చెందిన కళంకితులకు సీట్లు ఇవ్వ డం ద్వారా తన మద్దతు దారులకు భాజపా ప్రతికూల సంకేతాలు పంపింది. ఈ విధంగా భారీగా ఫిరాయింపులు ప్రోత్సహించి, వారికి సీట్లు ఇస్తే దాదాపు అందరిని ఓడించి మహారాష్ట్ర ప్రజలు నేర్పిన గుణపాఠం నుండి ఎటువంటి సంకేతాలను పార్టీ నాయకత్వం నేర్చుకున్నట్లు లేదు. తిరిగి ఆవే తప్పులను ఝార్ఖండ్‌లో చేసింది. ఇప్పుడు ఝార్ఖండ్ ఫలితాలను చూస్తే మహారాష్ట్రాలో శివసేనతో పొత్తులేని పక్షంలో గణనీయంగా సీట్లు పడిపోయి ఉండేవని భావించవలసి వస్తున్నది. మొదటగా.. మోదీ, అమిత్ షాల స్వస్థలమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా వెల్లడైనది. అందుకు ఆరితీసిన కారణాల గురించి నిజాయతీతో సమాలోచనలు చేసి, దిద్దుబాటు చర్యలు మిగిలిన రాష్ట్రాలలో చేపట్టలేదని వెల్లడి అవుతున్నది.
ఇప్పటివరకు భావాత్మకమైన అంశాలను ఎన్నికల ముందు ప్రస్తావించి చెప్పుకోదగిన ప్రయోజనాలు పొందుతూ వస్తున్నారు. అయితే వాటి ప్రభావం చాలా పరిమితంగా ఉన్నట్లు ఇప్పుడు గ్రహించాలి. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇస్తుంటే తమకు ఓటు వేయమని ప్రధాని, హోమ్ మంత్రి మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ప్రజలను కోరారు. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. దానితో ఝార్ఖండ్‌లో ఈ విషయంకన్నా అయోధ్యలో రామమందిర్ నిర్మాణా నికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో భవ్యమైన రామమందిర్ నిర్మించబోతున్నట్లు చెప్పారు. అయినా ఫలితం రాలేదు. భాజపా సైద్ధాంతిక అస్త్రాలైన ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ, రామమందిర్ వంటి ప్రభావం ఓటర్లపైన పరిమితంగానే ఉన్నట్లు భావించవలసి వస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల లో ప్రతిపక్షాలు ప్రధానంగా స్థానిక సమస్యలను, ఆయా రాష్ట్రాలలో భాజపా ప్రభుత్వాల పనితీరును ప్రస్తావిస్తూ ఉంటె, బాజాపా మాత్రం భావోద్వేగ అంశాలను ప్రస్తావిస్తూ ఉండటం కారణంగా రాజకీయంగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇక తమ పాలనను చూపి ప్రజల వద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించాలి.
దక్షిణాదిన తూర్పు రాష్ట్రాలలో బలపడటం కోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా భాజపా ఉత్తరాది పార్టీగానే కొనసాగుతున్నది. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్‌లలో అధికారం కోల్పోవడంతో ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌లలో అధికారం కాపాడుకోవడం తప్పనిసరి. అందుకు ఇప్పటి నుండి వ్యూహాత్మకంగా వ్యవహరించవలసి ఉంది. పార్టీ ఫిరాయిముల బాల లపై కాకుండా పార్టీని సొంతంగా పటిష్ఠపరచుకోవడంపై ఆధార పడటం అత్యవసరం. నిన్నటి వరకు అవినీతిపరులుగా నిందించిన వారిని ఒకసారి పార్టీలో చేర్చుకోగానే నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పడాన్ని ప్రజలు సహిం చలేకపోతున్నారని గ్రహించాలి. మరోవంక మిత్రపక్షాలతో సంబంధాలు సజావుగా లేకపోవడం, వారితో పొత్తు కన్నా ఇతర పక్షాలలోని కళంకితులను పార్టీలోకి చేర్చుకొని వారి సామర్థంపై ఎక్కువగా ఆధారపడటం ద్వారా భాజపాలో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి నిరుత్సహకార సంకేతాలు పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అటువంటి పరిస్థితులే కనిపిస్తు న్నాయి. ప్రజలతో సంబంధం ఉన్న నాయకులను కాకూండా పార్టీ అగ్రనాయకత్వానికి నమ్మకస్తులైన వారికి రాష్ట్రాల్లో నాయకత్వం అప్పజెబుతూ ఉండడం ద్వారా మోదీ, అమిత్ షాలపై ఆధార పడటం తప్ప సొంతంగా పార్టీకి నాలుగు ఓట్లు తీసుకు రాలేక పోతున్నారు.
భాజపాకు రాష్ట్రాలలో బలమైన నాయకత్వం ఉన్నా జాతీయ స్థాయి నాయక త్వం బలహీనంగా ఉండెడిది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతు న్నది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనమైనది. కనీసం ఎన్నికల ప్రచారం కూడా చేయలేకపోతున్నది. అయితే ఒక్కో రాష్ట్రంలో స్థానికంగా బలమైన నాయకులు ఆవిర్భవిస్తున్నారు. వారు జాతీయ నాయక త్వాన్ని నిర్ధేశిస్తున్నారు. పంజాబ్‌లో కెప్టెన్ అమరిందర్ సింగ్, రాజస్థాన్‌లో అశోక్ గెలట్, సచిన్ పైలట్, మధ్య ప్రదేశ్‌లో కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటకలో సిద్దరామయ్య.. అందుకు ఉదాహరణ.. వాస్తవానికి శివసేనతో పొత్తు కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సుతారమూ ఇష్టం లేదు. కానీ ఆ పార్టీ ఎమ్యెల్యేలు 46 మందిలో 38 మంది పొత్తుకోసం పట్టుబట్టడం తో అధినాయకత్వానికి దిగిరాక తప్పడం లేదు. మరోవంక ఇప్పుడు జాతీయ స్థాయిలో మోదీ, అమిత్ షా రూపంలో బలమైన నాయకత్వం ఉన్న భాజపాలో ముగ్గురు, నలుగురు తప్ప రాష్ట్ర స్థాయిలో ప్రజానాయకులు ఎక్కువగా లేరు. వారిద్దరూ వచ్చి తమను అధికారంలోకి తీసుకొస్తారని అంటూ తెలుగు రాష్ట్రాలతో సహా ప్రతి చోట స్థానిక నాయకులు ప్రచారం చేసుకోవడం గమనార్హం. గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు కచ్ ప్రాం తంలో భూకంపం గురించి నరేంద్రమోదీ ప్రజలలో భరోసా కలిగించారు. అదేవిధంగా ఇప్పుడు ఝార్ఖండ్‌లో పరాజయంను పార్టీ పూర్ణనిర్మానానికి ఒక అవకాశంగా భాజపా నాయకత్వం భావిస్తుందని ఆశిద్దాం.

- చలసాని నరేంద్ర