మెయిన్ ఫీచర్

ఉన్నది ఒకటే, కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
అవ్యక్తమే తత్త్రిగుణై ర్నిరుక్తం
తత్కారణం నామ శరీరమాత్మనః
సుషుప్తిరేతస్య విభక్త్యవస్థా
ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తిః॥
సమస్త ఇంద్రియ కార్యకలాపము జాగ్రదవస్థలో జరుగును. స్వప్నావస్థలో బుద్ధిమాత్రమే పనిచేయగా, తక్కిన ఇంద్రియముల వృత్తి అనగా వ్యవహారము నిల్చిపోవును. త్రిగుణముల కలయికతో ఏర్పడి అనాదినుండి కొనసాగుతున్న అవిద్యా స్వరూపమే అవ్యక్తము. దీని లక్షణములు ఏవిధముగాను వ్యక్తము చేయబడనివి. ఈ అవ్యక్తమే కారణ శరీరమని నిర్దేశింపబడుతున్నది. సుషుప్త్యవస్థలో బుద్ధితోపాటు సర్వేంద్రియములు శాంతించి, ఏ కార్యమందు నిమగ్నముకావో అదియే కారణ శరీరముయొక్క ప్రత్యేక స్వరూపము. సుషుప్త్యవస్థలో ప్రానకార్యము కొనసాగుతునే ఉండును. కాని అంతఃకరణ తన వ్యాపారాన్ని నిర్వర్తించదు. జీవాత్మ స్వతఃసిద్ధంగా శరీరధారణ చేసిన సమయంలో ఏ అజ్ఞానస్థితిలో ఉండేదో అదే స్థితిలో, పరమాత్మలో ఏకమైన స్థితిలో కొనసాగుతున్న కారణంగా శరీరం అజ్ఞానంతో అవృతమై ఉండును. సుషిప్తినుండి మరల జాగ్రదవస్థకు వచ్చేవరకు, అవిద్యా ప్రభావితమైన బుద్ధ్వాదులు ఆ సమయంలో పనిచేయని కారణంగా, ప్రాపంచిక దృష్టి ఉండదు. అదే విధంగా, శరీరావసరాలు తీర్చుకొనుటకు ఎట్టి ప్రయత్నము జరుగదు.
సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మలో ప్రత్యగాత్మ లయమైన కారణంగా శారీరుడు పరమానందం అనుభవిస్తూ సుఖనిద్రలో మునిగి ఉండిపోవును. జాగ్రత్స్వప్నావస్థలకు భిన్నంగా సుషుప్త్యవస్థలో ఒక విశిష్టస్థితిలో శరీర వ్యాపారము జరుగును. ప్రగాఢ నిద్రలో ఏమీతెలిసికొనలేని అవ్యక్త స్థితిలో వ్యక్తి స్పృహలేక ఉండును. అందువలన, సుషుప్తి సమయంలో జీవాత్మ పరమాత్మలో ఐక్యమై పరమానందాన్ని అనుభవించే స్థితిలోకి పోతున్నదేమోనని అనుమానించి, తాత్త్వికులు ఈ అవ్యక్తరూపమైన శరీరావస్థకు హేతువు కారణ శరీరం అని సూచించి దానికి ఒక ప్రత్యేక స్థానం కల్పించారు.
123. సర్వప్రకార ప్రమితి ప్రశాన్తి ర్బీజాత్మనా‚ వస్థితి రేవ బుద్ధేః
సుషుప్తి రత్రాస్య కిల ప్రతీతిః కించిన్న వేద్మేతి జగత్ప్రసిద్ధేః॥
సుషుప్త్యవస్థలో సమస్త జ్ఞాన సంబంధ ఇంద్రియ వ్యవహారము ప్రశాంతమైపోవును. ఆ సమయములో శరీరము ఏ స్థితిలో బీజ స్వరూపములో ఉండేదో అదే అవ్యక్తస్థితికి జీవాత్మ మరలిపోవును. ఈ స్థితిలో బాహ్య విషయములు కాని అంతర్విషయములు కాని గ్రహించబడవు. అందువలన, ‘‘నాకు ఏమియూ ఎఱుక లేదు’’అని మాత్రమే గాఢ నిద్రనుంచి మేల్కొని వ్యక్తి ప్రకటించటము జరుగుతుంది.
ఈ జగత్ప్రసిద్ధి పొందిన ప్రతీతి ఏదో ఇచ్చట స్పష్టముచేయకపోయినా శ్రుతి దానిని ఈవిధముగా ప్రకటిస్తున్నది- ‘‘తద్యథా ప్రియయా ప్రియా సమ్పరిష్వక్తో న బాహ్యం కించన వేదనాన్తరమేవాయం పురుః ప్రజ్ఞేనాత్మనా సమ్పరిష్వక్తో న బాహ్యం కించన వేద నాన్తరం’’ (తనకు మిక్కిలి ప్రియమైన స్ర్తి ఆలింగనముతో ఐక్యమైన ప్రియుడు వెలుపల జరుగుతున్న విషయములను కాని లోపల విషయములను కాని ఎట్లు తెలిసికొనడో, అట్లే పరమాత్మతో ఐక్యమైన ప్రాజ్ఞుడగు వ్యక్తి, సుషుప్త్యవస్థలో బాహ్యప్రపంచములోను, లోపల జరుగుతున్న ఏ విషయమునూ తెలిసికొనలేదు- బృ.ఉ.4-3-21).
అనాత్మపదార్థముల నిరూపణము
124. దేహేన్ద్రియ ప్రాణమనో‚ హమాదయః
సర్వే వికారా విషయాః సుఖాదయః
వ్యోమాది భూతాన్యఖిలం చ విశ్వ
మవ్యక్తపర్యన్త మిదం హ్యనాత్మా॥
శిష్యుడు ‘కో‚ సావనాత్మా’అని ముందు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆత్మేతర వస్తువులు ఇచ్చట నిర్దేశింపబడినాయి. ఈ దేహము, ఇంద్రియ సముదాయము, పంచప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇత్యాది వికారములు, ఆకాశము, భూమి ఇత్యాది భౌతిక పదార్థములు, శబ్దాది విషయములు, సుఖ దుఃఖములు, మోదప్రమోదాదులు, సమస్త కార్యరూపమైన దృశ్యప్రపంచము, జగదాధారమైన అవ్యక్తరూపము వరకు సర్వమూ అనాత్మయే.

125. మాయా మాయాకార్యం సర్వం
మహదాది దేహపర్యన్తమ్‌
ఆసదిద మనాత్మతత్త్వం విద్ధి త్వం
మరుమరీచికాకల్పమ్‌॥
మూల ప్రకృతియే మాయ. అది మహత్తత్త్వము మొదలు దేహపర్యంతము కార్యప్రపంచములో వ్యాప్తిచెంది ఉన్నది. అందువలన, జగత్తులో కన్పిస్తున్నదంతయు భ్రమనుకల్గించే అసత్ పదార్థము; వాస్తవికత లేనిది. ఎడారిలో వాస్తవముగా నీరులేనిచోట నీరున్నట్లు భ్రాంతిని మృగతృష్ణ ఎట్లుకల్పిస్తున్నదో, అట్లే జగత్తు మిథ్యారూపమని నీవు తెలిసికొనుము.
ఈశ్వరుడు (కార్యబ్రహ్మ) నిష్క్రియియైన పరమాత్మ మాయా స్వరూపము. దేహధారులందరి ఉద్భవము పరమేశ్వరుని సంకల్పమునకు అనుగుణంగా సంభవిస్తున్నది. ప్రాణికోటి సమస్తము ఈశ్వరాంశముతో సృష్టించబడినది. ‘‘సో‚ కామయత బహుస్యాం ప్రజాయే యేతి’’అని శ్రుతి పల్కుతున్నది. (పరమాత్మ తానే బహువిధములుగా సంభవించెదనని సంకల్పించెను-తై.ఉ.2-6-1). ఛాందోగ్య శ్రుతియు ‘‘అనేన జీవేనాత్మనా ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి’’అని నిర్థారిస్తున్నది (్ఛ.ఉ.6-3-2).
126. అథ తే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః
యద్విజ్ఞాయ నరో బద్ధాన్ముక్తః కైవల్యమశ్నుతే॥
ఇప్పుడు నీకు పరమాత్మ స్వరూపమును నేను విపులముగా తెలియపరుస్తున్నాను. ఈ బోధన విని మానవుడు ఎట్లు సంసార బంధమునుండి విముక్తుడై, కైవల్యసిద్ధిని పొందునో తెలిసికొనుము.
127. అస్తి కశ్చిత్ స్వయం నిత్యమహంప్రత్యయలంబనః
అవస్థాత్రయసాక్షీ సన్ పంచకోశ విలక్షణః॥
అవస్థాత్రయములకు సాక్షిగా, నేను అనే పదముతో ప్రకటితవౌతూ, ఒకడు పంచకోశములకు భిన్నముగా, నిత్యము ఈ శరీరములో ఉంటున్నాడు.

- ఇంకావుంది...