మెయన్ ఫీచర్

కాంగ్రెస్ చేతిలో ఆప్, భాజపా భవిష్యత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిబ్రవరి 8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం దేశం దృష్టిని ఆకట్టుకొంటున్నాయి. ఈ ఎన్నికలు ఒక విధంగా భారత్ రాజకీయ సమీకరణాలపై నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ దారులుగా మూడు పోటీ పార్టీలు ఉన్నప్పటికీ అధికారంపై అసలు పోటీ దారులు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అధికారం కోసం ఆరాటపడుతున్న భాజపా ల మధ్యనే అని చెప్పవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అన్న విషయాన్ని మాత్రం కాంగ్రెస్ నిర్ధేశించే అవకాశం ఉంది.
గత ఆరేళలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భాజపా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ కోసం ఎత్తుగడలు వేస్తున్నది. పార్లమెంట్‌లో వరుసగా రెండు సార్లు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా, మూడొం తుల రాష్ట్రాలలో ఆ పార్టీకి అధికారం దక్కనీయకుండా ఒక విధంగా ఈ విషయంలో భాజపా విజయం సాధించింది. మూడింట రెండు వంతుల రాష్ట్రాలకు పైగా ఆ పార్టీకి అధికారాన్ని దూరం చేయగలిగింది.
అయితే ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను ఎంత ఎక్కువగా పెంచుకొంటే అంతగా తమకు మంచిదని భాజపా ఆరాటపడుతుంది. పరోక్షంగా కాంగ్రెస్ బలమైన పోటీ ఇచ్చేటట్లు చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అయితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం 2015లో వలే కాంగ్రెస్ ఎంత దారుణంగా ఓట్లు తెచ్చుకొంటే తనకు తిరిగి అధికారం దక్కడం అంత సులభం అనే అభిప్రాయంలో ఉన్నారు.
అదేవిధంగా మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ సహితం ఎన్నికలపై ప్రభవం చూపనున్నది. గత మూడు ఎన్నికలలో ఓట్ల తీరును చూస్తే కాంగ్రెస్, బీఎస్పీ ఓట్లు పడిపోతే భాజపా విజయావకాశాలు సహితం సన్న గిల్లుతున్నాయి. ఆప్ కు భరోసా ఏర్పడుతున్నది. 2008, 2013, 2015 ఎన్నికలలో భాజపా ఓట్లు 32 నుండి 36 శాతం మధ్యలో స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. 2013లో ఎన్నికల రంగంలోకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ఓట్లు మాత్రం కాంగ్రెస్, బీఎస్పీ ఓట్లను బట్టి ఉంటున్నాయి.
ఆ రెండు పార్టీల ఓట్లను చీల్చుకొని ఆప్ బలోపేతం అవుతూ రావడంతో, భాజపా వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడితే ఆప్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అట్లా కాకుండా, బీజేప వ్యతిరేక ఓట్లు సమీకృతమైతే ఆప్ ప్రయోజనం పొందుతున్నది. 2015లో మొత్తం 70 సీట్లు ఉండగా 67 సీట్లను గెల్చుకున్న కేజ్రీవాల్ తిరిగి ఆ మేరకు విజయం సాధించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు.
భాజపాకు గత ఎన్నికలలో మూడు సీట్లను మాత్రమే గెల్చుకోగా, వరుసగా 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఒక్క సీట్ కూడా రాలేదు. 2014, 2019 లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్ సభ సీట్లను గెల్చుకున్న భాజపా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం చెప్పు కోదగిన ప్రభావం చూపలేక పోతున్నది. 2008లో 36.34 శాతం ఓట్లతో 23 సెట్లను భాజపా గెల్చుకోంది. అప్పుడు ఆప్ పార్టీయే లేదు.
2013 ఎన్నికలలో 33.07 శాతం ఓట్లతో 31 సీట్లను గెళ్హచుకోంది. కానీ 2015 ఎన్నికలలో కేవలం 0.87 శాతం ఓట్లు మాత్రమే తగ్గినా సీట్లు మాత్రం 28 తగ్గాయి. దానితో కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2008లో 40.31 శాతం ఓట్లతో షీలా దీక్షిత్ నాయ కత్వంలో కాంగ్రెస్ 43 సీట్లు గెల్చుకొని అధికారమలోకి వచ్చింది. కానీ 2013 ఎన్నికలలో 24.55 శాతం ఓట్లతో కేవలం 8 సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైనది. 2015లో 9.8 సీట్లతో ఒక్క సీట్లు కూడా గెల్చుకో4లేదు.
ఇక బీఎస్పీ విషయానికి వస్తే 2008లో 14.05 శాతం ఓట్లతో రెండు సీట్లు గెల్చుకోగా, 2013లో 5.35 శాతం, 2015లో 1.3 శాతం ఓట్లతో ఒక్క సీట్ కూడా గెల్చు కోలేదు. ఆ రెండు పార్టీలు చతికలబడంతో 2015లో ఆప్ ఏకంగా 67 సీట్లు గెల్చుకో గలిగింది. ఆ రెండు పార్టీల ఓట్లు ఆప్ కు మరలడంతో భాజపా అధికారానికి దూరం కావలసి వస్తున్నది.
2019 లోక్ సభ ఎన్నికలలో 300కు పైగా సీట్లు గెల్చుకొని తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్‌లలో జరిగిన ఎన్నికలలో మసకబారింది. మరోవంక సిఏఎకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలు మూడోవంతుకు పడిపోయాయి.
ఢిల్లీని గెల్చుకోలేని పక్షంలో కేంద్రంలో చక్రం తిప్పు తున్న మోదీ, అమిత్‌షాలు రాబోయే రోజులలో రాజకీయంగా ప్రతికూలతను ఎదుర్కోవలసి వస్తుంది. వారి భావోద్వేగ రాజకీయాలకు ప్రజలు విసుగు చెందారని సందేశం వెడుతుంది. అందుకనే ఈ ఎన్నికలలో గెలుపొందడం భాజపాకు అత్యవసరం. అదే విధంగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా మిగిలిన రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న కేజ్రీవాల్ రాజకీయ మనుగడకు సహితం ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.
భాజపా, కాంగ్రెస్‌లకు స్థానికంగా చెప్పుకోదగిన నాయ కులు లేకపోవడం, కేజ్రీవాల్‌కు ధీటుగా ముఖ్యమంత్రి అభ్యర్థులు లేకపోవడం ప్రధానమైన అంశం. గత ఎన్నికలలో కిరణ్‌బేడీని ‘దిగుమతి’ చేసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది.
ఈ ఎన్నికలలో భాజపా, కేజ్రీవాల్ సహితం భిన్నమైన ధోరణులు అవలంభిస్తున్నారు. మోడీకి తానే తగిన ప్రత్యర్థిని అని చెప్పుకోవడం కోసం మొదట్లో ఆయన నిత్యం ప్రధానిపై విరుచుకు పడేవారు. అయితే గత కొంత కాలంగా తన ధోరణిని మార్చుకొన్నారు. ‘సామరస్య’ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ప్రజల వౌలిక సదుపాయాల పట్ల దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర అభివృధ్ధి కోసం కేంద్రంతో సయోధ్యకు సిద్ధం అనే సంకేతం ఇస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, విద్యుత్ రంగాలలో తన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఇస్తున్న ప్రభావంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
మరోవంక, భాజపా సహితం ఇతర రాష్ట్రాలలో వలే భారీ బహిరంగ సభలు, హైటెక్ ప్రచారం, భారీ హోర్డింగ్ లు, పెద్ద ఎత్తున వనరులను సమీకరించడం పట్ల కాకుండా కేజ్రీవాల్ తరహాలో మొహల్లా సమావేశాలు, ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుసుకోవడం, చిన్న చిన్న ఊరేగింపులు జరపడం చేస్తున్నారు. ఆగష్టు 5న బూత్ స్థాయి కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ వ్యూహాన్ని వెల్లడించారు.
‘్భరీ బహిరంగ సభలతో మనం ఈ ఎన్నికలలో పోరాడటం లేదు. ప్రతి ఇంటికి వెళ్లడం, మొహల్లా సమావేశాలను జరపడం ద్వారా ఈ ఎన్నికలలో పోరాడుతున్నాం’ అని ప్రకటించారు. తానే స్వయంగా 50 నుండి 2000 మంది వరకు గల చిన్న చిన్న సమావేశాలలో ప్రసంగించడం ద్వారా ఎన్నికల వ్యూహం అమలు ప్రారంభించారు.
పార్టీ జిల్లా, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎమ్యెల్యే లు, ఎంపీలు, మాజీ ఎమ్యెల్యేలు, మాజీ ఎంపీలతో సహా పార్టీ నాయకులు ఇంటిని తిరుగుతూ పార్టీ గుర్తు ‘కమలం’ను, ప్రధాని మోదీ చిత్రాలను చూపుతూ, గత ఐదేళ్లలో పార్టీ చేసిన కృషిని వివరించాలని అమిత్ షా అదిశానిర్ధేశం చేశారు. ఏది ఏమైనా మన ఎన్నికల ప్రచార ఎత్తుగడల తీరుతెన్నులను మార్చుతున్న ఈ ఎన్నికల ఫలితాలు విశేషమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి.

- చలసాని నరేంద్ర