మెయన్ ఫీచర్

డిజిటల్ మానవులొస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, పరేడ్‌గ్రౌండ్‌లో ఇటీవల జరిగిన ‘కైట్ ఫెస్టివల్’ (పతంగుల పండగ)లో రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఓ విదేశీ నిపుణుడు పతంగిని ఎగురవేశాడు. అంటే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో దీనివల్ల అర్థమవుతోంది. అలాగే ఇటీవల అమెరికాలోని లాస్‌వేగాస్‌లో వినియోగదారుల (కన్స్యూమర్) ఎలక్ట్రానిక్స్ ప్రదర్శన జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన ప్రణవ్‌మిస్ర్తి కృత్రిమ మేధ ఆధారంగా డిజిటల్ మనిషి (నియాన్... మర మనిషి) నమూనాను ప్రదర్శించారు.
గతంలో హాంకాంగ్‌లో రూపుదిద్దుకున్న ‘సోఫియా’కన్నా ఈ డిజిటల్ మనిషి మరింత మెరుగైనదిగా భావిస్తున్నారు. శ్యాంసంగ్ ల్యాబ్స్‌లో రూపొందించిన ఈ ‘నియాన్’ సరికొత్త విప్లవం, కృత్రిమమేధకు పరాకాష్ట. ఇది నిబిడాశ్చర్యం కలిగించే ఆవిష్కరణ. దీన్ని భారతీయుడు రూపకల్పన చేయడం గొప్ప మధురానుభూతి.
ఈ నియాన్స్ సంభాషించుకుంటాయని, స్పందనలు (ఎమోషన్స్) తెలియజేస్తాయని వాటి సృష్టికర్తలు అంటున్నారు. అంతేగాక ప్రతి మనిషికి ఒక్కో వ్యక్తిత్వం ఉన్నట్టుగా ఒక్కో నియాన్‌కు ఒక్కో వ్యక్తిత్వం ఉంటుందని చెబుతున్నారు. అవి తమ జ్ఞాపకాలను సైతం పదిలపరుచుకునే సామర్థ్యం గలవని అంటున్నారు. అంటే అచ్చం మనుషుల్లానే ఈ నియాన్లు (డిజిటల్ మానవులు) అన్నమాట. ఇవి న్యూరల్ నెట్‌వర్క్, కంప్యూటేషనల్ రియాల్టీ సాంకేతికత ఆధారంగా రూపొందించినట్టు వాటి సృష్టికర్తలు వివరించారు.
శ్యాంసంగ్ ల్యాబ్స్ ప్రెసిడెంట్, సిఈఓగా ప్రణవ్‌మిస్ర్తి పనిచేస్తున్నారు. ‘‘సిక్స్త్‌సెక్స్’’ ప్రాజెక్టులో కూడా ఆయన పనిచేశారు. ఆ రకంగా ఈ కంప్యూటర్ శాస్తవ్రేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు. 1981లో జన్మించిన ఈ మిలీనియల్ గొప్ప ఆవిష్కర్తగా పేరొందారు. ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈ నియాన్. తన బృందంతో కలిసి ఆయన డిజిటల్ మానవులను (ఆర్ట్ఫిషియల్ హ్యూమన్స్-నియాన్స్) రూపొందించాడు. అయితే లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రదర్శనలో వీటిని ప్రదర్శించలేదు. తెరపై వాటి హల్‌చల్‌ను చూపించారు. అయినప్పటికీ దాన్ని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున గుమికూడారు. ఇవి ప్రపంచంలోనే తొలి ‘‘కృత్రిమ మానవుల’’ని నిపుణులంటున్నారు. వాటిని తెరపై చూసేందుకు ప్రజలు విరగబడ్డారు. గుజరాత్‌లో పలాన్‌పూర్‌కు చెందిన ప్రణవ్ మిస్ర్తి సరికొత్త చరిత్రను సృష్టించి నిపుణులను సైతం ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఐఐటి ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించిన ప్రణవ్ సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) మనలా ఉండాలన్న తీవ్రమైన తపనతో ఈ నూతన ఆవిష్కరణను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. తాను రూపొందించిన నియాన్లు కేవలం ‘సహాయకుల్లా’గాక అవి తమ అనుభవాలను, స్పందనలను పంచుకునేలా ఉంటాయని ఆయన చెబుతున్నారు. రియాల్టీ, రియల్, రెస్పాన్సివ్‌నెస్ (మూడు ఆంగ్ల ‘ఆర్’ అక్షరాలు) సాంకేతికత ఆధారంగా నియాన్స్‌ను తయారుచేసినట్టు ఆ శాస్తవ్రేత్త వెల్లడించారు. ‘స్పెక్ట్రా’ అనే మరో సరికొత్త టెక్నాలజీని సైతం దీనికి జతచేయనున్నట్టు అప్పుడు మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని ఆయన అంటున్నారు. సమిష్టి నెట్‌వర్క్ ఆధారంగా కాకుండా ‘‘వ్యక్తిగత’’ (ఇండిపెండెంట్) నెట్‌వర్క్‌తో వీటిని రూపకల్పన చేశానని ఆయన చెప్పారు.
అయితే ఈ నియాన్స్ సంపూర్ణతను సాధించేందుకు మరో పాతిక సంవత్సరాల సమయం పట్టవచ్చునని కూడా ఆయన అంటున్నారు. రోబోలు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి వాటిలా రూపొందించడంలో అర్థంలేదు గనుక సరికొత్త పోకడతో నియాన్ ఆవిష్కరణ జరిగిందంటున్నారు. మనం నివసిస్తున్న ప్రపంచాన్ని మార్చాలన్న ‘‘ఓ కల’’ నుంచి ఈ ఆవిష్కరణ ఆవిష్కృతమైందంటున్నారాయన.
ఇక యంత్రాలే (మిషనే్ల) మానవులు
మనుషులు యాంత్రికంగా చేసే పనులన్నీ భవిష్యత్‌లో కృత్రిమ మేధగల యంత్రాలే చేస్తాయని ప్రణవ్‌తో సహా మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పుడు మనుషులు చేసే ఉద్యోగాలు భవిష్యత్‌లో ఉండకపోవచ్చునన్నది ముక్తకంఠంతో అందరూ అంటున్నారు. కృత్రిమ మేధ కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని అందుకు వైవిధ్యభరిత, కొత్త నైపుణ్యాలు మానవులకు అవసరమవుతాయని వారందరి భావన. ఈ సాంకేతికత ఆర్థిక పెరుగుదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఆ రకంగా భారత్‌కు భవిష్యత్‌లో అత్యద్భుత అవకాశాలున్నాయని, గొప్ప ఆర్థిక ఎదుగుదల ఉండగలదని కంప్యూటర్ శాస్తవ్రేత్తలు అంటున్నారు. ప్రణవ్ వారిలో అగ్రభాగాన కనిపిస్తారు.
డిజిటల్ హ్యూమన్స్ (సాంకేతిక ‘‘రక్తమాంసాలు’’ గల మానవులు) మానవుల్లో కలిసి పనిచేస్తాయని, టి.వీల్లో వార్తలు చదవడం, బ్యాంకులు, ఆసుపత్రులు, హోటళ్ళవద్ద స్వాగతం పలకడం లాంటి ఎన్నో పనులను ఈ డిజిటల్ హ్యూమన్స్ చేసే రోజు ఎంతో దూరం లేదన్నది అందరికి అర్థమవుతున్న విషయం. యంత్రాలకు మానవుని ‘మెదడు’ను అనుసంధానం చేసే పని అప్పుడే ప్రారంభమైంది. ప్రమాదాల్లో తొలగించిన కాళ్లుచేతుల స్థానంలో కృత్రిమ కాళ్లు-చేతులు మనుషులకు అమర్చి పనిచేయించడంలో శాస్తజ్ఞ్రులు ఇప్పటికే విజయం సాధించారు.
ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా రూపొందించేందుకు ఆవిష్కర్తలు, పెద్ద టెక్ కంపెనీలు, విధానకర్తలు నిరంతరం సంప్రదింపులు జరపాల్సిన అవసరముందని ప్రణవ్ అభిప్రాయపడుతున్నారు. కృత్రిమ మేధ మరింత అభివృద్ధిచెంది అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్న ఈ సందర్భంలో ఈ సంప్రదింపులు మానవాళికి సత్ఫలితాలనిస్తాయని కూడా ఆయన అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను నూతన శిఖరాలకు తీసుకెళ్ళే సామర్థ్యం ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఉందని, రానున్న రోజులన్నీ కృత్రిమ మేధవేనని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. సరికొత్త కంప్యూటింగ్ ప్లాట్‌ఫాంలతో అనేక రంగాలు ప్రభావితం కానున్నాయి. సరికొత్త ‘విప్లవం’ ఆ రంగాల్లో చోటుచేసుకోనున్నది. ఈ ‘డిస్టర్బింగ్ టెక్నాలజీ’’ నూతన సరిహద్దులకు మానవులను తీసుకెళ్ళనున్నది.
రోబోలు, నియాన్స్...డిజిటల్ మానవులు మన మధ్యకు రానున్న ఈ నేపథ్యంలో మన ప్రాపంచిక దృక్పథం, దృష్టికోణం ఎలా ఉండాలి?... అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై దృష్టిపెట్టకుండా మార్క్సిస్టులు- మావోయిస్టులు దండకారణ్యంవైపు... గెరిల్లా దళాల వైపు, సుత్తి-కొడవలి వైపు ప్రజల్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. మావోలు చెప్పే మాటలకు, ప్రణవ్‌మిస్ర్తి చెప్పే మాటలకు ఎక్కడైనా పొంతన కుదురుతున్నదా?...మావోల సిద్ధాంతం, వారి దృక్కోణం, వారి గతి తార్కిక భౌతికవాదానికి ప్రాసంగికత కనిపిస్తోందా?... రేపు జరగనున్న మార్పులను పసిగట్టి ప్రజల్ని మేల్కొల్పే వాడే నిజమైన విప్లవకారుడవుతాడు తప్ప, శతాబ్దంన్నర క్రితపు మాటలకు నగిశీలు చెక్కుతూ కూర్చోవడం విప్లవం అవదు...అలాంటివారు విప్లవకారులనిపించుకోరు...
అసలు విప్లవ నిర్వచనం మారిందన్న స్పృహ సైతం లేకుండా దండకారణ్యంలో సాయుధ దాడుల ద్వారా ప్రపంచాన్ని సంపూర్ణంగా మారుస్తామని అమాయక ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల పేర హంతమొందిస్తూ కాలం గడపడమంత అజ్ఞానం ఇంకేమైనా ఉంటుందా? మనుషుల్లో అక్షరాస్యత, కంప్యూటర్ అక్షరాస్యత (లిటరసీ)ను పెంచకుండా, ఆధునిక... వర్తమాన జ్ఞానంవైపు ప్రజల్ని కదిలించకుండా కాలం చెల్లిన, కలికానికైన పనికిరాని సిద్ధాంతాల్ని పట్టుకుని అవే విముక్తిమార్గాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ఎంతవరకు ఆహ్వానించదగ్గది?... అసత్యాలతో, అర్థసత్యాలతో, అబద్ధాలతో పౌరసత్వ సవరణ చట్టాన్ని ‘గుడ్డిగా’ వ్యతిరేకించడంలో, మూక మనస్తత్వాన్ని వ్యాపింపజేయడంలో ఏమాత్రమైన మాన్యత ఉందా?... డిజిటల్ మానవులు మనమధ్యకు రాకముందే చైతన్యం తెచ్చుకోవాలి, సరిగ్గా స్పందించడం నేర్చుకోవాలి. డిజిటల్ మానవుల ముందు ‘‘మనం’’ ‘అవమానం’ పాలవకూడదు కదా?... మార్క్స్‌ను నమ్ముకున్న వాళ్ళందరూ ముందుగానే మేల్కోవలసిన అవసరం ఎంతో కనిపిస్తోంది!

వుప్పల నరసింహం 9985781799