మెయిన్ ఫీచర్

కావ్యకన్యకల విన్నపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగదేలయన్నదేశంబుతెలుగేను
దెలుగువల్లభుండదెలుగుకండ
యెల్లనృపులుగొలువనెరుగవేబాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స.
ఆముక్తమాల్యద. ఆ.1. ప. 1
1. వేంకటేశ్వరస్తుతి. చిదంబరకవి.
(క్రీ. శ. 1586- 1614)
200శ్లోకాలు. లఘుకావ్యం.
నాపేరువేంకటేశ్వరస్తుతి. నేనొకరెండువందల శ్లోకాల లఘుకావ్యకన్యకను. క్రీ.శ.1586- 1614.మధ్యజీవించిన చిదంబరకవి నన్ను కన్నతండ్రి. నేను తమిళదేశంలో పుట్టాను కాబట్టి నన్ను తమిళపిల్లనని అనుకోకండి. నిజానికి మా అమ్మ తమిళ ఇంటివారి ఆడబడుచే. ఆమె తమిళదేశంలోని ఉత్తర ఆర్కాడుజిల్లా లోని విరించిపురం. అయినా నేను తెలుగుపిల్లనే. ఎందుకంటే మాతాత అంటే మా నాన్న తండ్రి అనంతనారాయణుడు. తమిళదేశానికి వలసవచ్చాడు. జీవిత చరమాంకంలో మానాన్న తిరుపతి వచ్చి నిన్ను దర్శించి నీకు పరమభక్తుడై అక్కడే చిరకాలం జీవించి నన్ను కన్నాడు (వ్రాసాడు.).
అందుకే నాకంటే ముందుపుట్టిన అక్కలు రాఘవ పాండవీయం, చిదంబరవిలాసం, శే్లషచింతామణి, శబ్దార్థచింతామణి, భాగవత చంపువు, పంచకళ్యాణ చంపువు, లోకప్రసిద్ధులై తంజావూరు తాళపత్ర గ్రంథాల యాన్ని పుట్టిల్లుగా చేసుకొని జీవిస్తున్నారు. కాని నేనే అనామకనై ఎక్కడున్నానో కూడా ఎవరికీ తెలియక నీ కటాక్షంకోసం నిరీక్షిస్తూ వేచియున్న తెలుగింటిఆడబడుచును. నిజంగా నీవు నన్నొకకంట కనిపెట్టి చూస్తే నేను నీ కంటకనబడకుంటానా?
2. వేంకటేశచంపువుధర్మరాజు.
(క్రీ. శ. 1650- 1700) అలభ్యం.
వేంకటేశస్తుతి తరువాత నీ కటాక్షం కోసం ఎదురుచూస్తున్న చంపూకావ్యకన్యకను.నా తండ్రి ధర్మరాజు. చిదంబరకవి వలె ఆయన తెలుగువాడై తమిళదేశానికి వలసవచ్చినవాడా కాదా అన్నది కూడా నాకు తెలియదు. కానీ వేంకటేశ్వరస్తుతివలె నేనూ కూడా తమిళదేశంలోని తంజావూరులో పుట్టిన చంపూకావ్య కన్యామణినే. భక్తితో నీకళ్యాణేతి వృత్తానే్న చంపూకావ్యపద్ధతిలో తెలుగుకవి అయినా విశేషంగా సంస్కృత భట్టబాణుని అనుసరిస్తూ సంస్కృత కావ్యాన్ని రచించిన కవి ధర్మరాజుకన్న అలభ్య కావ్య కన్యను. మరి ఆమెనువలె ననె్నప్పుడు నీదరికి చేర్చుకొంటావు?
3.శ్రీవేంకటాచలమాహాత్మం.
దామరచినవేంకటరాయడు.
(క్రీ. శ. 1850- 1900)
శ్రీవేంకటాచలమాహాత్మంవేంకటేశస్తుతి తరువాత శ్రీనివాసా! నీ దరిచేరేందుకు అందరికన్న మిన్ననై నిలిచియున్నవేంకటాచలమాహాత్మ్యమనే రాజకావ్య కన్యనునేనే. నాతండ్రి కవి దామరచినవేంకటరాయడు జగ్గంపేట సంస్థానాధీశులైన దామరవంశీకులకు పూర్వీకులు. సంస్కృతాంధ్రాలలో నా తండ్రి మహా పండితుడు. నా దురదృష్టమేమో గాని రాచకన్యనై నందుకు నేటివరకు అసూర్యంపశ్యగానే కాదు అసలు నేనెక్కడున్నానో లోకంతోబాటు నాకు కూడా తెలియనంతగా (అలభ్యంగా) ఉండిపోయాను. బ్రహ్మాండ నాయకుడవైన నీవు తలచుకుంటే నీ కొలువులో నున్న కవిపండితచారుల ద్వారా కనుగొని నన్ను చేపట్టలేవా.
4.వేంకటగిరిప్రభుద్వ్యర్థికావ్యం.
మండపాక పార్వతీశ్వరకవి
(క్రీ. శ. 1833- 1897)అముద్రితం.
గరుడాచలవాసా! ఆంధ్రదేశానికి ఆరంభంలో నున్న విశాఖజిల్లా బొబ్బిలిలో ఉన్న తెలుగుపిల్లను . బొబ్బిలి సంస్థానకవి, సంస్కృతాంధ్రాలలో దిట్ట, శతాధికాగ్రంథకర్త, చిత్రకవితాబహుశతకకర్త అయిన మండపాకపార్వతీశకవికిముద్దుబిడ్డను. వేంకటగిరి ప్రభుద్వ్యర్థి కావ్యకన్యను. ప్రభూ! సకల లోకాధీ శుడవైన నిన్ను వేంకటగిరి సంస్థానప్రభువు తో అధ్యవసాయం చేసి ద్వ్యర్థికావ్యంగా వ్రాసినందుకా? నాతండ్రిపై కినిసి శతాబ్దంపైబడినా నాపై శీతకన్ను వేసావు? ఏకప్రాసతో శివకేశాభేదం లేక వ్రాసిన పదునైదు శతకకాలలో నినే్న భక్తితో వేంకటశైల నాయక శతకంగా స్తుతించలేదా?మరిచావా?ఇకనైనా అలకవీడి లఘుకావ్యకన్యనైన నన్ను గ్రంథాలయాల చీకటిండ్లలో నుండి (అముద్రితంగా) విముక్తురాలిని చేసి చేపట్టుము.
5.శ్రీవేంకటేశ్వరశతకం వేదాంతనరసింహ
(క్రీ.. శ. 1840-1880.) అముద్రితం .
శ్రీశేషశైలవిహారా! వేంకటేశ్వరశతకమనే నేను అచ్చం గోదావరీ(తూర్పు)తీరంలోని ( పిఠాపురం వద్ద చిత్రాడ గ్రామం)వెనె్నల్లో ఆడుకొన్న పక్కా తెలుగింటి ఆడపిల్లను. నా తండ్రి మాఊర్లోనే స్వయంగా వెలసిన నిన్ను భక్తితో కొలుచుకొంటూ రచించిన శతకకన్యను. మా అక్కలు మొదటి ముగ్గురు కంటేనే నసలు ఆచూకీయే తెలియనిదాన్ని కాకపోయినా చెన్నై ప్రాచ్య లిఖితపుస్తకాభండాగారపుచీకటిండ్లలోమ్రగ్గుతున్నదాన్ని. మరి ఈ తెలుగింటిపిల్లకు కాస్తంత చేయూత నిచ్చిచేపట్టలేవా!
6. శ్రీవేంకటేశసహస్రం.
తట్టా వీరరాఘవాచార్య. ( 1850-1900) . అముద్రితం.
నేను గుంటూరుజిల్లా, రేపల్లె తాలూకా ముక్తిపురి గ్రామ తెలుగింటి ఆడబడుచును. నా తండ్రి(కవి)తట్టా వీరరాఘవాచార్య. సంస్కృతభాషలో మహా పండి తుడు. ఆలూరి నృసింహశతకం, చక్రశతకం, రఘుపతి శతకం, కాళీయమర్దన శతకం, దశావతార శ్లోక దశ శతకం, మున్నగు ఎన్నో సంస్కృతకావ్యాలను విరచించిన (ఇవి ముద్రితాలు)మహాకవికూడా. తిరుమలవాసా!ఆ విధంగా నిన్ను పరమభక్తితో పరిపరివిధాల కీర్తించినా తనివితీరక మరల వేయి శ్లోకాలతో నా తండ్రివీరరాఘవాచార్య నినే్న సన్ను తిస్తూ సృజించగా మహాస్తోత్రరాజంగా విరాజిల్లిన వేంకటేశ సహస్రకావ్యకన్యను. నేను కూడా మా అక్కలు వలే గ్రంథాలయాల చీకటి అరలలో మ్రగ్గుతు న్నాను. నినే్న స్తుతించే నాకే ఈ చీకటివాసంగతి పడితే నా అక్కలు చంపూ సావిత్రి ప్రబంధం, చంపూ దాశరథీ ప్రబంధం, చంపూభార్గవ ప్రబంధం, అన్యాప దేశశతకం(వీరరాఘవాచార్యకృతులు)కావ్యకన్యలువెలుగుచూడ(ముద్రింపబడ)పడే దుర్గతి గురించి వేరే చెప్పాలా? మేమందరం నిన్ను ప్రశంసిస్తున్నవారమే కదా. మమ్ము చేపట్టకుంటే నీకేమికీర్తిదాయకం?
7. పద్మావతీపరిణయం. ముద్రితం. పెరుమాళ్ళరాజుబొమ్మరాజు క్రీ.శ.1840-1895.
నేను కూడా ఒక రాజకన్యనే. నా తండ్రి బొమ్మరాజు. కార్వేటి సంస్థానాధీశుడైన కుమార వేంకట పెరుమాళ్ళ రాజాబహద్దరు వారి కుమారుడు. శ్రీనివాసా! పద్మావతీదేవితో నీకు జరిగిన కళ్యాణ వైభవాన్ని’’పద్మావతీపరిణయ’’ మన్నపేరున ఒక గొప్పకావ్యాన్నిచంపూరీతిలోవ్రాసాడు. క్రీ. శ. 1890లో కార్వేటి నగరాధీశులచే స్థాపింపబడిన శ్రీభారతీ లీలాసదనమనే ముద్రాక్షరశాలలో తొలిసారిగా నేను (వెలుగు) ముద్రణ చూచాను. అయినా గత నూటముప్పదియేండ్ల కాలంగా మరల నాపై వెలుగు ప్రసరించనందున తెలుగు సాహిత్య లోకం దాదాపు నన్ను మరచిపోయింది. తక్కిన వారికంటే నేను కొంత ముద్రణభాగ్యం పొందిన దాననైనా ఏమి లాభం?అందరిలాగానే నేనూ నీ పునర్దర్శన భాగ్యాన్నినోచుకోక కుమిలి పోతున్నా. అంతేకాదు. నేను నీకెంతదగ్గరలోనే ( కార్వేటినగరం తిరుపతికి చాలాదగ్గరలోనే ఉంది) ఉన్నాను?. మరిఏండ్ల తరబడి నీకు దగ్గరలోనే ఉండి నిత్య కళ్యాభిరాముడవైననీ పద్మావతీకళ్యాణగాధను తనివి తీరా వర్ణించినఈ పద్మావతీ పరిణయ చంపూకావ్య కన్యనైన నన్ను చేపట్టజాగే? స్వామీ! నీ పునర్దర్శనభాగ్యం లేక ఇంకా ఎంతకాలం గడపను?
8.వేంకటేశ్వరాష్టకం.
చివుకులవేంకటసుబ్రహ్మణ్యశాస్ర్తి
క్రీ. శ.1846-1897.
తిరుమలేశా! నేను అచ్చం కోనసీమపిల్లను. తూర్పు గోదావరిజిల్లా కొత్తపేటప్రాంతంలోని గోపాలపురం గ్రామంలో ఆడిపాడినదాన్ని. నా తండ్రి చివుకుల సుబ్రహ్మణ్యశాస్ర్తి నీకు పరమభక్తుడు. ఆయన ‘‘నౌపురి’’ గ్రామంలో స్వయంగా నీవే వెలసిన నిన్ను భక్తితో స్తుతించిన అష్టకంగా జనించిన కావ్యకన్యా కుమారిని. ఎప్పుడో క్రీ. శ. 1890లో రాజమహేంద్రవరంలోని వివేకవర్ధినీ ముద్రాక్షర శాలలో నేను కన్నులు తెరిచాను(ముద్రణ జరిగింది). ఏమి ప్రయోజనం? దాదాపు నూటముప్పైఏండ్లు గడిచిపోయాయి. ఒక్కసారికూడా మరల నీ దర్శనభాగ్యం (పునర్ముద్ర) కలుగనేలేదు.
బాలవధువునై (చిన్నఅష్టకమ్) నన్ను చేపట్టు తావని ఎంతకాలం నిరీక్షించను? స్వామీ!. శరీరా కృతిలో (ఇతివృత్తంతు కావ్యస్య శరీరమ్) ఆలస్యంగానైనా వాగ్రస వైఖరిలోగరీయసినే. వృత్యను ప్రాసాలంకృతమై ప్రియమైన నా ఈ ఒక్క మధుర వాక్కు నాలకించు ప్రభూ!
శ్లో.సురాపగాఝరీలసచ్ఛిరోజవాగ్వధూ
వరస్వరీణ్ముఖామృతాంధసాంశిరఃకిరీటరత్నరు
గ్విరాజదంఘ్రినీరజంకరీడ్వరప్రదాయకం
కనిష్ఠ నౌపురీశ్వరంభజామివేంకటేశ్వరమ్.
From Contribution of Andhra to samkrit literature By. B.Raama Raaju

నా మధురాధరవాక్కులు రుచించినవా?ఇంకా జాప్యమే? నీ దరిచేర్చుకో.
9. శ్రీనివాసశతకం- మండ లక్ష్మీకామేశ్వ్రరశాస్ర్తి
క్రీ.శ.1857- 1920. ముద్రితం.
నా తండ్రి లక్ష్మీకామేశ్వరశాస్ర్తి సంస్కృతాంధ్రాల లో మహాపండితుడు. ఆయన కల్కి విజయము, సర్వమత సంగ్రహము, నీలగిరివర్ణనము, శివభక్తి నాటక విలాసము, దారిద్య్ర హర శివ శతకము, రామచంద్రశతకము, జార్జి సార్వభౌమ ప్రశస్తి, ఇలా ఎన్నో తెలుగు కావ్యకన్యలను కన్నా తిరుమలేశా! నిన్ను స్తుతిస్తూ శ్రీనివాసశతకంగా నన్ను కన్నా తరవాతే ధన్యుడనయ్యానని సంతృప్తి చెందిన మహా కవి. మా తాత మండ కామేశ్వరశాస్ర్తి విజయనగర సంస్థానాధిపతి అయిన ఆనందగజపతి( క్రీ. శ. 1879 -1897) ఆస్థానకవి అయితే నాతండ్రి విజయరామ గజపతికి (క్రీ.శ. 1897- 1922) ఆస్థానకవి. ఇంతటి ఆభిజాత్యముండి ఏమి లాభం?. శతాబ్దకాలం పైన గడిచినా అక్షరరూపంగా (ముద్రింపబడ) సాలం కృతనై నీ పాదాల చెంతకు చేరలేక పోయాను. ఇంకెంతకాలం నిరీక్షించను? ప్రభూ!
10.శ్రీవేంకటేశ్వరస్తోత్రమ్. వట్టిపల్లినరకంఠీరవశాస్ర్తి
క్రీ. శ. 1875- 1925. ముద్రితం.
నేను కూడా పై వేంకటేశ్వరాష్టకం వలె లఘు స్తోత్ర కావ్యకన్యను. నా తండ్రి వట్టిపల్లి నరకంఠీరవ శాస్ర్తి సాక్షాత్తు నీవే వెలసియున్న తిరుపతిలోని సంస్కృత కళాశాలలో ఆచార్యుడుగా పనిచేసిన ఒక గొప్ప సంస్కృత విద్వాంసుడు. నీపాదాలచెంతనే జీవిత కాలమంతా గడిపిన నా తండ్రి నీ యెడల పరమ భక్తితో శ్రీవేంకటేశ్వరస్తోత్రరూపంగా నాకు జన్మ నిచ్చాడు. నీ ప్రీతికై నీ సహోదరి యైన కాళహస్తీలోని జ్ఞానప్రసూనాంబను స్తుతిస్తూ నవరత్న మాలికా స్తోత్రాన్ని కూడా వ్రాసాడు. కానీ ఏమిప్రయోజనం?. ఎప్పుడో నాకు తెలిసీ తెలియని కాలంలో నేను నీపాదాలచెంతకు చేరానంటారు గాని (ముద్రణ జరిగింది) నేటివరకు నీవు నీపాదాలచెంతకు చేర్చుకొనేలేదు. (పునర్ముద్రణ జరుగనే లేదు). సుబం దుని వచనగ్రంథాన్ని రెండువందల ఆర్యావృత్తాలలో అభినవవాసవదత్త కావ్యంగా తీర్చిదిద్దిన కవి పండి తుని కూతురు ఈ వేంకటేశ్వరత్రస్తోత్ర కావ్యకన్యనైన నేను నీ ఆభిజాత్యానికి తగినదాన్ని కాకపోయానా?
11. శ్రీవేంకటేశ్వరశతకం. తిరువేంకటతాతదేశికులు
క్రీ.శ. 1892 -1950 - ముద్రితం.
నేను నూటపండ్రెండుశ్లోకాలశతకకావ్యకన్యను. నా తండ్రి తిరువేంకటతాతదేశికులు నెల్లూరులోని తక్కెళ్ళపాడులో పుట్టిచీరాలలో పెరిగినపక్కా తెలుగు వాడు. సంస్కృతభాషలో దిట్ట. మహామంత్రశాస్తవ్రేత్త. వివిధదేవతలను స్తుతిస్తూ రెండుభాగాలుగా స్తుతి మాలికలను, మూడూ, నాలుగు భాగాలుగా శ్రీసుధా వల్లీశతకం, శ్రీశతకోప శతకం, వకుళభూషణ మాలికా శతకం, శ్రీమన్నృసింహనఖశతకాలను వ్రాసినా తనివి తీరని నాతండ్రి నిన్ను దర్శించి నూటపండ్రెండు శ్లోకాలలో సన్నుతిస్తూ శ్రీవేంకటేశశతకాన్నిరచించి నాకు జన్మనిచ్చాడు. నా దురదృష్టమేమోగాని నా సోదరీమణులు చాలమంది వెలుగు చూసారు. (ముద్రణ జరిగాయి) గాని నేనేనేటివరకు వెలుగు చూడని దానను. శేషశయనా! నిన్న, నీ గుణగణాలను కీర్తించినందుకా? గ్రంథాలయాల చీకటికొట్లలో మ్రగ్గుతూ నేను పడియుండాలి. పుండరీకాక్షా! నీవు నీ పండితచారుల చేత చీరాల మరియు తక్కెళ్లపాడు గ్రామ ప్రాంతాలలో అనే్వషింపచేస్తే నాతండ్రి వారసుల వద్ద నేను లభింపకపోను. నన్ను చేపట్టేందుకు నీవు ఈ చిన్న ప్రయత్నం చేయలేవా?.
వేంకటాచలవాసా! నీవు కోరుకోవాలేగాని మాలా నీ దర్శనాన్నికొందరు, మరికొందరు పునర్దర్శనాన్ని కోరుతూ ఎందరెందరో కావ్యకన్యలు అజ్ఞాతంగా పడియుండి వేచియున్నారు. పదహారువేలమంది గోపికలను ప్రేమతో చేపట్టిన నీకు నేడు నీ మ్రోల నిలిచిన ఈ పదకొండుమందికావ్యకన్యలనుచేపట్టుట ఒక భారమా? కీ.శే. శ్రీవేటూరి ప్రభాకరశాస్ర్తిగారు 1981లో,శ్రీతిరుమలతిరుపతిదేవస్థానంవారుముద్రించిన శ్రీవేంకటేశ్వర లఘుకృతులు అన్నగ్రంథానికి వ్రాసిన పీఠికలో ప్రశస్తమైన ప్రాచీనకవుల కావ్యాలనెల్ల ఒక సంపుటంగా ముద్రిస్తామని మాట ఇచ్చారు. వారిమాట ఏడుకొండలవాసా! నీ మాటకాదా?. కృపతో మమ్ము దరిచేర్చి అందరినోట నీ గుణగానాన్ని చేసే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదింపవా!

- డా.పాలకోడేటి జగన్నాథరావు , 9490620512