మెయిన్ ఫీచర్

ఆత్మ దుఃఖాతీతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
‘‘ఏష సర్వేషు భూతేషు గూఢో‚‚ త్మా న ప్రకాశతే దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః’’ (అన్ని ప్రాణులలో గుహ్యముగానున్న ఈ ఆత్మ ప్రకటితముకాదు. ఏకాగ్రతగల జ్ఞానులు మాత్రమే సూక్ష్మబుద్ధితో అంతర్ముఖులై హృదయములోనున్న ఆత్మను దర్శించుకొనగలరు- క.ఉ.3-12). జ్ఞాన సాధనతో అద్వితీయమైన ఆత్మసాక్షాత్కారము చేసికొనిన పురుషులు పాపపుణ్యములను అంతముచేసికొని, మృత్యువును అధిగమించి పునర్జన్మను పొందరు.
224. విశోక ఆనన్దఘనో విపశ్చి
త్స్వయం కుతశ్చిన్న బిభేతి కశ్చిత్‌
నాన్యో‚ స్తి పన్థా భవబన్ధముక్తేర్వినా
స్వతత్త్వావగమం ముముక్షోః॥
ఆత్మ దుఃఖాతీతము. ఆనంద ఘన స్వరూపము. అందువలన నిత్యమూ ఆనందమునే అనుభవించును. ఆత్మజ్ఞాని పరబ్రహ్మముతో ఐక్యము పొందిన కారణముగా ఎవరికినీ భయపడడు. ‘‘ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి’’అని శ్రుతి తార్కాణము. (పరమాత్మ)ను తెలిసికొనిన విద్వాంసుడు వేనికీ భయపడడు (తై.ఉ.2-9). బ్రహ్మవేత్త సర్వజ్ఞుడు. ‘‘స యో హ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి’’అని శ్రుతి ప్రకటిస్తున్నది (పరబ్రహ్మమును తెలిసికొనిన బ్రహ్మవేత్త బ్రహ్మమే అగును- ము.ఉ.3-2-9). అందువలన, సంసార బంధవిముక్తిని ఆశించే ముముక్షువునకు తన యథార్థస్వరూపమైన ఆత్మను తెలిసికొనుట తప్ప వేరొక మార్గము లేదు.
225. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణమ్‌
యేనాద్వితీయమానన్దం బ్రహ్మ సమ్పద్యతే బుధః
నేను బ్రహ్మము తప్ప అన్యము కాదు అనే నిరంతర అద్వైత భావనయే సంసారబంధముక్తికి ఏకైక కారణము. ‘‘అహంబ్రహ్మాస్మి’’అనే ఉపనిషద్బోధనను (బృ.ఉ.1-4-10) ఆకళించుకొనిన విద్వాంసుడు అద్వితీయము, ఆనంద స్వరూపమైన పరబ్రహ్మమును పొందును. ‘‘బ్రహ్మవిదాప్నోతి పరమ్’’అని శ్రుతి నిర్ధారిస్తున్నది (బ్రహ్మవేత్త కైవల్యసిద్ధిని పొందును- తై.ఉ.2-1).
226. బ్రహ్మభూతస్తు సంసృత్యై విద్వాన్నావర్తతే పునః
విజ్ఞాతవ్యమతః సమ్యగ్ బ్రహ్మాభిన్నత్వ మాత్మనః॥
బ్రహ్మవేత్తయైన విద్వాంసుడు సంసారవలయములో ఇక ఎన్నడూ పడడు. శాశ్వత బంధవిముక్తి పొందిన కారణముగా మరల ఈ లోకమునకు రాడు. అందువలన, ఆత్మబ్రహ్మ స్వరూపము తద్భిన్నము కాదనే పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉండవలెను.
‘‘విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యమ్’’ అని శ్రుతి నిర్ధారిస్తున్నది (బ్రహ్మజ్ఞాని నామరూపములనుండి విముక్తిపొంది పరాత్పరుడైన దివ్యపురుషునితో ఏకవౌను- ము.ఉ.3-2-8). ఆత్మజ్ఞానికి మరల పునర్జన్మ లేదని స్మృతి కూడా స్పష్టము చేస్తున్నది. ‘‘గచ్ఛంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా.’’ 5.17), అనియు ‘‘న స భూయో‚ భిజాయతే’’ (పరమాత్మ తత్త్వమును తెలిసికొనినవాడు మరల జన్మను పొందడు (్భ.గీ.13-23).
227. సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మవిశుద్ధం పరం స్వతఃసిద్ధమ్‌
నిత్యానన్దైకరసం ప్రత్యగభిన్నం నిరన్తరం జయతి॥
త్రికాలాతీతము, స్వయంజ్యోతిస్స్వ రూపము, సర్వవ్యాపీ, కల్మష రహితము, అత్యంత పవిత్రము, స్వయంసిద్ధము, నిత్యానంద ఏకరస ఘనస్వరూపము, అంతర్బాహ్య భేదరహితము మరియు సమస్తమును నియంత్రించే పరబ్రహ్మము, ప్రత్యగాత్మకు అభిన్నము.
228.
సదిదం పరమోద్వైతం స్వస్మాదన్యస్య వస్తునో‚ భావత్‌
న హ్యన్యదస్తి కించిత్ సమ్యక్పరతత్త్వ బోధసుదశాయామ్‌॥
పరబ్రహ్మము నాశరహితము, దానికి సర్వదా అస్తిత్వము ఉన్నది. తద్భిన్నమైన నాశరహిత పదార్థము వేరొకటి లేనందున అది అద్వితీయము. అందువలన, శ్రేష్ణతమమైన అద్వైతమని అదియే చెప్పబడినది. బ్రహ్మభూతుడై సమ్యగ్విచారణ చేయగా, పరమోత్కృష్ట తత్త్వజ్ఞానము కలిగిన దశలో (ఆత్మసాక్షాత్కారమైన దశలో) అపరోక్షానుభూతి తప్ప ప్రపంచానుభవము ఉండదు.
229.
యదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతమ జ్ఞానాత్‌
తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేషభావనాదోషమ్‌॥
అజ్ఞానము కారణముగానే నానా రూపాదులతో ఈ సమస్త కార్యప్రపంచము మనకు గోచరిస్తున్నది. కాని విశ్వమంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మపదార్థమొక్కటే. పరమాత్మ సత్సంకల్పముతోనే జగత్తు సృష్టించబడినది. అందువలన, అది దోషరహితము. ‘ఖల్విదం బ్రహ్మ’ (ఇందున్న సమస్తమూ బ్రహ్మమే-్ఛ.ఉ.3-4-1).

ఇంకా ఉంది