మెయన్ ఫీచర్

ఆర్థిక ప్రగతికి ఆలంబనలు వారి ఆలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుబ్రమణియన్ స్వామి బి.జె.పి. రాజ్యసభ సభ్యులు. ఉన్నతస్థాయి ఆపై ఉత్తమస్థాయి రాజకీయ నాయకులు. వారు 50 ఏళ్ల ప్రజాజీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారి గురించి ఆలోచన చేద్దాం.
భారతదేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను సమకూర్చిన అతి కొద్దిమంది రాజకీయవేత్తలలో సుబ్రమణియన్ స్వామి ఒకరు. 33 ఏళ్లకే ఆర్థికశాస్త్రంలో నిష్ణాతులైన మేధావి వారు. మనదేశంలో సుబ్రమణియన్ స్వామిలా అవినీతికి వ్యతిరేకం గా పోరాడి విజయం సాధించిన రాజకీయ నాయకులు మరొకరు లేరు. సుబ్రమణియన్ స్వామిలా ఏ పదవీ లేకుండా దేశానికి మేలు చేసిన రాజకీయ నాయకులూ మరొకరు లేరు.
మన దేశపు అత్యుత్తమ ప్రధాని పి.వి. నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల బ్లూ ప్రింట్ స్వామిదే. నెహ్రూ, ఇందిరా గాంధీల ఆర్థికవిధానాలు దేశప్రయోజనాలకు పనికి రావని ముందుగానే తెలుసుకుని దేశ అర్థికప్రగతి కోసం తమ దార్శనికతతో ప్రత్యామ్నాయ విధానాల బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకున్నారు స్వామి. ఆ విషయం పి.వి.కి తెలుసు. తాము ప్రధాని అయిన వెంటనే స్వామిని పిలిచి ఆర్థికమంత్రి పదవి ఇస్తాను కాంగ్రెస్‌లో చేరమన్నారు పి.వి. నరసింహారావు. స్వామి కాంగ్రెస్‌లో చేరలేదు. పి.వి.కి స్వామి మేధ గురించి తెలుసు. ఎంతో అడిగారు. స్వామి మంత్రి పదవి తీసుకోలేదు. పదవిని వద్దనుకుని దేశప్రయోజనాల కోసం తాము సిద్ధం చేసుకున్న అర్థిక విధానాల బ్లూప్రింట్‌ను పి.వి.కి ఇచ్చేశారు స్వామి. ఆ బ్లూప్రింట్‌ను పి.వి. తమ మేధతో మెరుగుపరిచి అమలుపరిచారు. పి.వి. నరసింహారావు పారేనది వంటి వారు.. అని స్వామి బహిరంగంగానే చెబుతారు.
స్వామికి పి.వి. అంటే ఎంతో గౌరవం. దేశప్రధానుల్లో పి.వి. వంటి వారు లేరు.. అని మాటిమాటికీ చెబుతూంటారు స్వామి. ఒక్క ఆర్థిక పరంగానే కాదు రక్షణ, వ్యాపార, నిర్వహణ, రాజకీయ, విదేశీ విధానాల పరంగా కూడా పి.వి. ఎంత గొప్పవారో, పి.వి. ఈ దేశానికి ఏం మేలు చేశారో బాగా అర్థం చేసుకున్న వ్యక్తి స్వామి. అందుకే పి.వి. నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని పిలుపునిచ్చారు, ఇస్తూనే ఉన్నారు. భారతరత్న పురస్కారం వాజ్‌పేయి కన్నా నరసింహారావుకు ఇవ్వడమే సరైనది.. అని బహిరంగంగానే చెబుతారు స్వామి. స్వామికి కేబినెట్ హోదా ఇచ్చి వారి ద్వారా ఆర్థికరంగంలో దేశానికి అవసరమైన వాటిని చేయించుకున్నారు పి.వి. నరసింహారావు. స్వామి ఆర్థిక దార్శనికత వల్ల దేశానికి జరిగిన మేలు ఇవాళ ఒక చారిత్రక సత్యం.
అమెరికాలో అధ్యాపకులుగా ఉన్న స్వామి ఒక సందర్భం లో జయప్రకాష్ నారాయణ్‌ను కలిశారు. జయప్రకాష్ నారాయణ్ స్వామికి ప్రేరణ. అటు తరువాత తమ అధ్యాపక వృత్తిని వదులుకుని మనదేశానికి వచ్చారు. 1969లో సర్వోదయ ఉద్యమంలో చేరడం ద్వారా స్వామి ప్రజాజీవితం మొదలయింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ వల్ల దేశానికి పెద్ద దెబ్బే తగులుతుందని మొదట్లోనే గ్రహించిన ముఖ్యమైన కొందరిలో స్వామి ఒకరు. 1972లో భారతీయ జన్ సంఘ్‌లో చేరారు స్వామి. 1974లో ఆ పార్టీ తరపున తొలిసారి లోక్‌సభ సభ్యులయ్యారు. 1975లో ఎమర్జన్సీ సమయంలో ప్రతిపక్షం వారందరినీ ఖైదు చెయ్యగలిగినా ఇందిరాగాంధీ స్వామిని ఖైదు చెయ్యలేకపోయారు. ఆ ఎమర్జన్సీ సమయంలో మన ప్రధాని నరేంద్రమోదీ స్వామికి సహాయకులుగా ఉండేవారు. స్వామీ, మోదీ మారువేషాల్లో తిరుగుతూ పనులు చేసుకునే వారు. ఆ ఎమర్జన్సీ సమయంలో ఆర్.ఎస్.ఎస్. బయటి ప్రపంచానికి చేరాల్సిన వాస్తవాల్ని స్వామి ద్వారా తెలియ జేస్తూండేది. స్వామిని తమ గురువుగా చెప్పుకున్నారు మన ప్రధాని మోది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నఫ్పుడు జయలలిత కూడా స్వామిని ఖైదు చెయ్యాలని ఎంతో ప్రయత్నించారు. ఆమె వల్లా కాలేదు. తమిళనాడులో ప్రస్తుతం బి.జె.పి. పరోక్షపాలన సాగిస్తోందని కొందరు అనుకుంటున్నారంటే దాని కారణం స్వామి. వారు పెట్టిన కేస్ వల్లే జయలలిత సన్నిహితులకు శిక్షపడి అధికారానికి దూరమయ్యారు. జయలలిత ఉండి ఉంటే ఆమెకూ శిక్షపడేది.
అంతర్జాతీయంగా పలుకుబడి ఉన్న మన దేశపు రాజకీయ వేత్త స్వామి. స్వామి చైనా భాషలో మూడు నెలల్లో పాండిత్యాన్ని సంపాదించారు. నెహ్రూ హయాంలో లేదా నెహ్రూవల్ల మన మానససరోవరం చైనా వశమై పోయింది. ఇవాళ మనం మానస సరోవరం వెళ్లగలుగుతున్నామంటే అది స్వామివల్లే. ప్రభుత్వాలకు అతీతంగా స్వామి చేసిన ప్రయత్న ఫలితమే ఇవాళ భారతీయులకు సాధ్యపడిన మానస సరోవర యాత్ర. జనతాప్రభుత్వం కూలిపోయాక, మళ్లీ ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక చైనాప్రభుత్వంతో ఒక పని నిమిత్తం ఇందిర చైనీస్ భాష తెలిసిన స్వామిని చైనా వెళ్లమని కోరారు. దేశానికి సంబంధించిన పని కాబట్టి స్వామి చైనా వెళ్లి ఆ పనిని విజయవంతంగా పూర్తిచేశారు. ఆ సందర్భంలో చైనా చేతుల్లో ఉన్న మానస సరోవరాన్ని సందర్శించు కునే వెసులుబాటును భార తీయులకు సాధించి పెట్టారు స్వామి. ప్రభుత్వాలు చెయ్యా ల్సిన ఈ పనిని ఒక దార్శని కునిగా స్వామి చేశారు. స్వామి సాధించిన ఒక సాంస్కృతిక విజయం ఇవాళ భారతీయు లకు దక్కుతున్న కైలాసగిరి సందర్శన భా గ్యం. ప్రతి భారతీయుడూ ఈ విషయం లో స్వామికి ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ఒకసారి ఆలోచించండి. దేశప్రజలకు సాంస్కృతికంగా కావాల్సినదాన్ని ఎవరూ ఊహిం చని విధంగా, ఎవరూ అడగకుండానే అనితర సాధ్యమైన రీతిలో సమకూర్చి పెట్టారు స్వామి. ఇటీవలి అయోధ్య రామమందిరం వ్యాజ్యంలోనూ స్వామి ప్రవేశించి ఒక ఆస్తి వ్యాజ్యంగా మాత్రమే ఉన్న దాన్ని ప్రజల విశ్వాసం, సాంస్కృ తిక అంశం అన్న కోణాలు కూడా ఉన్న వ్యవహారంగా వివరించి వాదనలు చేసి కోర్ట్ ఇచ్చిన తీర్పు అన్న విజయానికి దోహదం చేశారు. ఈ అయోధ్య తీర్పు ఇలాగే ఉంటుందని ఎప్పటినుంచో బహిరంగంగా చెబు తూండేవారు స్వామి.
సోనియాగాంధీని మన దేశ ప్రధాన మంత్రి కాకుండా ఆపింది సుబ్రమణియన్ స్వామి. అవును. రాజ్యాంగపరంగా ఒక సాంకేతికమైన కారణంతో సోనియాను దేశ ప్రధాని కాకుండా ఆపగలిగారాయన. ఆ కారణంతో అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం సోనియాను రాజ్యాంగ పరంగా ప్రధానిని చెయ్యలేనన్నారు. స్వామికి ఉన్న ఎరుక వల్లా, ఆ ఎరుకను సరైన సమయానికి ఉపయోగించడం వల్లా సోనియా దేశప్రధాని కాలేక పోయారు.
దేశంలో వేళ్లూనుకుని ఉన్న కాంగ్రెస్‌ను పెకిలించింది స్వామి. అవినీతి, ఆపై ఇతర కుంభకోణాల విషయంలో స్వామి కాంగ్రెస్ పై ఎంతో విస్తృతంగా పోరాడారు. అందువల్ల కాంగ్రెస్ భూస్థాపితమయింది. 2014లో భారతీయ జనతా పార్టీ విజయానికి పునాది స్వామి వేశారు. మోది ఆ విజయాన్ని నిర్మించారు. స్వామి పదేళలు ప్రయత్నించి కాంగ్రెస్ ను కూల్చారు. ఆపై మోది బి.జె.పి. గెలుపును సాకారం చేశారు. బి.జె.పి. ప్రభుత్వం అన్న నాణానికి ఒకవైపున సుబ్రమణియన్ స్వామి ఉన్నారు. ఒకవైపు నరేంద్రమోది ఉన్నారు. 2005లోనే నరేంద్రమోది దేశప్రధాని కావాలని పిలుపునిచ్చారు స్వామి. నరేంద్రమోదీ దేశ ప్రధాని అవాలని ఆలోచనచెయ్యడం స్వామి రాజకీయ దార్శనికత.
తమ ఒక్కరి ప్రయత్నంతో స్వామి దేశానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని చేకూర్చి పెట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై పోరాడుతున్నఫ్పుడు స్వామికి రక్షణ లేదు. అయినా వారు భయపడలేదు. ‘నాకేం అవదు’ అనేవారు. ఇవాళ రాహుల్, సోనియాలు బెయిల్‌పై బయట తిరుగుతున్న వారుగా అయింది స్వామి వాళ్లపై పెట్టిన కేస్ వల్లే.
సుబ్రమణియన్ స్వామి తమకు ఉన్న హార్వర్డ్ (Harvard) చదువుతో, ఆలోచనా విధానంతో అమెరికాను నుంచి ధనం రాబట్టి మన దేశ ప్రయోజనాల కోసం ఆ ధనాన్ని వినియో గించారు. సద్దాం హుస్సేన్ హయాంలో ఇరాక్‌పై అమెరికా యుద్ధం మొదలు పెట్టిన సమయంలో మన దేశ ప్రధాని చంద్రశేఖర్. చంద్ర శేఖర్ మంత్రివర్గంలో స్వామి Law and justice మంత్రిగా ఉండేవారు. తమ యుద్ధ విమానాల్ని నిలుపుకోవ డానికీ ఇతర అవసరాల కూ భారత భూభాగం కావాల్సి వచ్చింది అమెరికాకు. అమెరికా ప్రతినిధి చంద్రశేఖర్ ను కలవాలని వర్తమానం పంపగా చంద్రశేఖర్ ఆ విషయంపై తగిన నిర్ణయం తీసుకోమని స్వామిని నియోగిం చారు. స్వామి ఆ అమెరికా ప్రతినిధులతో కావాల్సినంత ఆడుకు న్నారు. ఆ తరువాత వాళ్లతో సమావేశమై ఆ యుద్ధం వల్ల అమెరికా పొందనున్న లబ్ధిని సవివరంగా చెబితే వాళ్లకు దిమ్మ తిరిగిపోయింది. చివరగా భారతభూమిపై ఆ సమయంలో అమెరికాకు కావాల్సిన పని జరగాలంటే 2 బిలియన్ అమెరికన్ డాలర్‌లు అడిగారు స్వామి. అమెరికా ప్రతినిధులు బిత్తరపోయారు. వాదోపవాదాలు అయినాక గత్యంతరం లేక స్వామి కోరిన ధనాన్ని మనదేశానికి అందజేసింది అమెరికా. ఆ సమయంలో స్వామితో ‘మిమ్మల్ని హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో చదవనివ్వడం తప్పయిపో యింది’ అని అన్నారు అమెరికన్ ప్రతినిధులు. ఆ 2 బిలియన్ అమెరికా డాలర్ల ధనం అవసరకాలంలో.. కాదు, కాదు ఆపత్కాలంలో మన దేశ అవసరాలకు ఉపయోగపడింది. చంద్రశేఖర్ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో సుబ్రమణియన్ స్వామి దేశంలో కొన్ని విప్లవాత్మకమైన సంస్కరణల్ని అమలు చెయ్యాలను కున్నారు. కానీ రాజీవ్‌గాంధీ నిర్ణయంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ దశలో పాత్రికేయులు వీర్ సంఘ్వీ ఒక పత్రిక ముఖచిత్రంపై సుబ్రమణియన్ స్వామిని కాబోయే దేశప్రధాని అని ప్రకటించారు.
సుబ్రమణియన్ స్వామి ప్రయత్నాల ఫలితం మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఇవాళ్టి గతి. కొనే్నళ్ల క్రితం చెన్నైలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చిదంబరంకు ఈ గతి పట్టనున్నదని సుబ్రమణియన్ స్వామి బహిరంగంగా చెప్పారు. సాధారణంగా తమ ప్రసంగాల్లో సుబ్రమణియన్ స్వామి చాలా విషయాలు తెలియజేస్తూంటారు. వారు చెప్పేవి వార్తా మాధ్యమాల కథనాలు కావు. వారు సేకరించే వాస్తవాలు. దేశ ఆర్థిక పరిస్థితికి చేటు చేసిన కుతంత్రాల వివరాలు. కొందరు చేసిన ఆర్థిక నేరాల చిట్టాలు. స్వామి చెప్పే విషయాలు ఈ దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన నిజాలు.
వేదికపై ప్రసంగాలు మాత్రమే కాకుండా స్వామి నలుగురి మధ్యా కుర్చీలో కాళలు ముడుచుకుని కూర్చుని సహజంగా కబుర్లాడడం మనం వారి సభల్లో చూడచ్చు. మామూలుగా ఉంటారు. బేషజాలు లేని వ్యక్తి. సరళంగా ఉంటారు. చిరున వ్వుతో, సునిశిత హాస్యంతో, సమయ స్ఫూర్తితో మాట్లాడతారు. వారికున్న విషయజ్ఞానం ఆశ్చర్యకరమైనది. స్వామి మాట్లాడుతున్నప్పుడు వినడం ఒక గొప్ప అనుభవం. ఒక విద్యావంతుడి నోటి వెంట వచ్చే సత్యవిషయ వివరణకు పరాకాష్ఠగా ఉంటుంది వారి ప్రసంగం. తయారు చేసుకు వచ్చి చూసి చదవరు. వానగా వారి నోటి నుంచి విషయాలూ, వివరాలూ వస్తూనే ఉంటాయి. క్షణాల్లో కోటాను కోట్ల సంఖ్యల్ని లెక్కగడుతూ చెప్పుకుపోతారు. కొందరు చేసిన ఆర్థిక నేరాల విలువ స్వామి చెప్పాక విన్న మన కడుపు తరుక్కుపోతుంది. దేశద్రోహం అంటే ఏమిటో తెలిసివస్తుంది. తమ మేధతో, చదువుతో అలాంటి కొందరు దేశద్రోహుల్ని పసిగట్టి వాళ్లను ప్రజలకు పట్టిచ్చారు స్వామి.
సామాజిక మాధ్యమాల ప్రభావం ఏ మేరకు ప్రజలపై ఉంటుందో ఎంతో ముందుగానే గ్రహించగలిగారు స్వామి. ఈ సామాజిక మాధ్యమాల్ని సరిగ్గా, చాకచక్యంగా ఉపయో గించుకున్న తొట్టతొలి దశ రాజకీయనాయకులు స్వామి. ట్విట్టర్‌లో 8 మిలియన్ మంది స్వామిని అనుసరిస్తున్నారు.
సుబ్రమణియన్ స్వామి ఇటీవల తిరుమల ఆలయంపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి? అని ప్రశ్నించి ప్రజల ఆలోచనల్ని కదిలించారు. అంతకుముందు తమిళ్‌నాడు చిదంబరంలోని ప్రముఖ నటరాజస్వామి ఆలయం నిర్వహణను ప్రభుత్వం చేతుల నుంచి విడిపించి ఆ బాధ్యతను ఆలయ పూజారులే చేసుకునేట్టుగా సుప్రీం కోర్ట్ నుంచి ఆదేశాల్ని సంపాదించారు. ఇది సుబ్రమణియన్ స్వామి సాధించిన మరో సాంస్కృతిక విజయం. భవిష్యత్తులో హిందూ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం చేతుల నుంచి విముక్తమై ఆపై అన్ని హిందూ దేవాలయాలు కూడా స్వయంప్రతిపత్తి కలిగినవి అవడానికి ఇది తొలి అడుగు కానున్నదని దేశవ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్నారు.
భారతీయత నిండిన అంతర్జాతీయ స్థాయి విద్యావేత్త స్వామి. పదునైన వివేకం (incisive wit) ఉన్న మేధావి స్వామి. ఆర్థిక విజ్ఞానం, చట్టం, చరిత్ర, దేశప్రయోజనాలు, భారతీయత, మన సంస్కృతి, ప్రపంచపు సామాజిక, సాంఘీక, రాజకీయ పరిస్థితులు వీటిపై లోతైన, ఉన్నతమైన అవగాహన ఉన్నవారు సుబ్రమణియన్ స్వామి.
సుబ్రమణియన్ స్వామి అన్న ఒక్క వ్యక్తి తమ చదువుతో, మేధతో, అలోచనా సరళితో ఈ దేశానికి చేసిన మేలు కోట్లాది రూపాయల్లో ఉంది. కొన్ని లక్షల కోట్ల అవినీతిని అరికట్ట గలిగారు. దేశాన్ని ఆర్థికనేరాలతో చిన్నాభిన్నం చేసిన పార్టీని చిన్నాభిన్నం చేశారు. కొందరు ఇంకా దేశసంపదను కొల్లగొట టకుండా నిరోధించారు స్వామి. కొందరి అవినీతి స్వప్నాల్ని తమ పరిశీలనాశక్తితో, మేధతో ఫలించకుండా చేశారు.
మన దేశాన్ని విదేశీవ్యక్తి పరిపాలించే దుస్థితి, దుర్గతి పట్టకుండా దేశపు పరువు మర్యాదల్ని కాపాడారు స్వామి. ఇందుకు దేశమంతా వారికి కృతజ్ఞత తెలపాలి. దురదృష్టవ శాత్తు ఆ విషయం చాలా ఏళ్లకు గాని బయటకు తెలియ రాలేదు. ఆ విషయం అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం, మరి కొద్దిమంది మధ్యలోనే ఉండిపోయింది. గుర్తింపు కోసమో, ధనాదాయం కోసమో కాకుండా దేశం కోసం ఇలాంటి కొన్ని అద్భుతాల్ని చేశారు స్వామి. డబ్బో , పదవో ఆశించి మాత్రమే పనిచేసేవాళ్ల మధ్యలో ఇలా సుబ్రమణియన్ స్వామిలాంటి వాళ్లు ఇంకా ఎవరున్నారు? ఎవరూ లేరు.
దేశభద్రత పై పరిశీలనలు, అవసరమైన సూచనలు చేశారు స్వామి. దేశప్రయోజనాల కోసం తాము చెయ్యదలుచుకున్న పనుల జాబితాను మన ప్రధానికి ఇచ్చారు స్వామి. మన దేశ, విదేశీ విధానంలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాల్ని కొనే్నళ్ల క్రితం ఈ ప్రభుత్వం రాకమునుపే వారు బహిరంగంగా తెలియజేశారు. ప్రస్తుతం మనదేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలలో స్వామి ఆలోచనలు, సూచనలు ఉన్నాయి. ఇప్పుడు వారు బహిరంగంగా చెబుతు న్నవి రానున్న రోజుల్లో దేశంలో పరిణామాలుగా చోటు చేసుకోనున్నాయి.
స్వామి బ్లూప్రింట్‌తో పి.వి. నరసింహారావు అమలు పరచిన ఆర్థిక సంస్కరణలు అర్థం కావడానికి మేధావులకు సైతం ఎన్నో ఏళలు పట్టింది. తమ చదువుతో, మేధతో ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి అవసరమయ్యే పరిష్కారాలతో కావాల్సిన సంస్కరణలతో మళ్లీ స్వామి ముందుకు వచ్చారు. ఈ సారి ఒక పుస్తకం వ్రాశారు గఉడఉ అన్న పేరుతో. ఈ పుస్తకం అచ్చయిన మూడు నెలలకే 60వేల ప్రతులు అమ్ముడు పోయింది. కంచి మహనీయులు శ్రీ చంద్రశేఖర సరస్వతుల వారికి సుబ్రమణియన్ స్వామిపై ప్రత్యేకమైన అనుబంధముం డేది. వీరిద్దరి మధ్య దేశ ప్రయోజనార్థం అంతరంగ సమావేశాలు జరిగేవి. చంద్రశేఖరుల వారు దేశానికి ఉపయో గపడే కొన్ని సూచనలను స్వామి మూలంగా ప్రభుత్వాలకు అందజేసే వారు. తద్వారా దేశానికి కొన్ని సత్ఫలితాలు వచ్చాయి. వి.పి. సింఘ్ ప్రధాని అవడం అంత శ్రేయస్కరం కాదు ప్రత్యా మ్నాయ ఆలోచన చెయ్యాలని ముందుగానే స్వామి ద్వారా అద్వానీకి తెలియపరిచారు చంద్రశేఖరులు. కాని వి.పి. సింఘ్ ప్రధాని అవడం జరిగిపోయింది. అటు తరువాత దేశంలో అల్లర్లు రేగాయి. దేశభద్రత విషయంలో తప్పిదాలు జరిగాయి. చంద్రశేఖరుల వారు స్వామి ద్వారా పి..వి. నరసింహారావుకు కొన్ని సూచనలు పంపేవారు. ఒక విద్యావేత్త ప్రధాని కనుక, పి.వి. ఏం చెయ్యనున్నారో తెలుసుకోగల మేధ ఉన్నవారు కనుక, తమ దగ్గర దేశానికి పనికొచ్చే ఆర్థిక ప్రణాళికలున్నాయి కనుక పి.వి. ఇచ్చిన ఆర్థికమంత్రి పదవి తీసుకుందామనుకుని ‘నేను కంచి స్వామిని అడుగుతాను వారు తీసుకోమంటే సరే లేదా నాకు మంత్రి పదవి వదు’ అని పి.వి.కి. చెప్పి, స్వామి చంద్రశేఖరు ల వారికి విషయం తెలియజేశారు. స్వామిని మంత్రి పదవి తీసుకోవద్దన్నారు చంద్రశేఖర సరస్వతి. వారి మాటపై సుబ్రమణియన్ స్వామి దేశ ఆర్థికమంత్రి పదవిని వదులుకున్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఎగబడుతూ, తెగబడి నేరాలు చేసే వాళ్లుండడం మనకు తెలుసు. ఇలా మఠాధిపతుల మాటపై కేంద్రప్రభుత్వ మంత్రిపదవి వద్దనుకున్న స్వామి లాంటి వాళ్లు కూడా మనదేశంలో ఉన్నారు. అందుకు గర్విద్దాం.
మన చరిత్రపై, సంస్కృతిపై స్వామికి లోతైన, సరైన అవగాహన ఉంది. ఈ దేశం నుంచీ, ప్రజలనుంచీ ఏ లబ్ధీ పొందలేదు స్వామి. పదవుల కోసమూ, ఆ పదవుల వల్ల వచ్చే లాభాల కోసమూ వెంపర్లాడలేదు స్వామి. తమ చదువు తోనూ, ఆలోచనా విధానంతోనూ, మేధతోనూ దేశప్రయోజ నాల కోసం పనిచేశారు, ఎనభై ఏళ్ల వయసులోనూ పనిచేస్తు న్నారు సుబ్రమణియన్ స్వామి. ఈ వయసులోనూ తమ జ్ఞానాన్ని , పరిశీలననూ, సమస్యలకు పరిష్కారాల్నీ ఈ దేశ ప్రజల కోసం అందిస్తూనే ఉన్నారు స్వామి.
తమ చదువుతో, మేధతో దేశానికి ఏం కావాలో అది అందించారు స్వామి. అవినీతికి, పదవులకు, స్వలాభానికి అతీతంగా ఇతర రాజకీయనాయకులకు భిన్నంగా స్వామి దేశంలో పనిచేస్తున్నారు, దేశంకోసం పనిచేస్తున్నారు. ఈ మట్టిపై మమకారం ఉన్న మన మనీషి సుబ్రమణియన్ స్వామి.. ఆర్థికపరంగా సుబ్రమణియన్ స్వామి ఆలోచనలు ప్రతిభావంతమైనవి. మేధ ఆధారితమైనవి. ప్రగతిశీలమైనవి. ప్రస్తుతం నెలకొని ఉన్న మాంద్యం నుంచి దేశ ఆర్థికస్థితిని విశేషంగా మెరుగుపరచగలిగినవి. 1991లోలాగా స్వామి ఆలోచనలతోనే మళ్లీ దేశానికి ఆర్థిక ప్రగతి వస్తుందేమో?
ఎరుక, సరైన ఆలోచన, పరిశీలన, పరిష్కారం చూపగలిగే మేధ, ప్రయత్నం, ఫలితం, దార్శనికత, భారతీయత, అంత ర్జాతీయత వెరసి సుబ్రమణియన్ స్వామి.

- రోచిష్మాన్ 9444012279 rochishmon@gmail.com