మెయిన్ ఫీచర్

సాహసమే ఆమె పంథా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు సైన్యంలో తమను తాము నిరూపించుకునే అవకాశాలను దాదాపు పదేళ్ల న్యాయపోరాటం తర్వాత దక్కించుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు మహిళలకు పర్మినెంట్ కమిషన్ పొందే అవకాశం కల్పించాలని చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మహిళా అధికారులకు అనుకూలంగా ఈ తీర్పు రావడం వెనుక ఒక ప్రతిభావంతురాలి కృషి ఉంది. ఆమే ఐశ్వర్యా భాటి. న్యాయవిద్యలో బంగారు పతక గ్రహీత కూడా.. న్యాయస్థానంలో మరో లాయర్ మీనాక్షి లేఖితో కలిసి ఆమె ఈ కేసును వాదించారు. తాజాగా వచ్చిన తీర్పుతో మహిళలు ఆయా విభాగాల్లో కమాండ్ హోదా పొందేందుకు పోటీపడే అవకాశం కూడా లభించింది. దాదాపు 2003 నుంచి మొదలైన ఈ న్యాయపోరాటంలో మహిళలు ఎక్కడా తగ్గలేదు. ఫలితంగా వారు సైన్యంలో శాశ్వత ఉద్యోగాలు పొందేందుకు అవకాశం లభించింది. ఒకప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 14 సంవత్సరాలు ఉద్యోగం చేసి సైన్యం నుంచి బయటకు వచ్చాక మరో ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ తాజాగా వచ్చిన తీరు అమలైతే పర్మినెంట్ కమిషన్ మానసికంగా, శారీరకంగా సిద్ధమై అవకాశాలను అందిపుచ్చుకుని శాశ్వత ఉద్యోగం పొందవచ్చు. మహిళా అధికారుల తరఫున ఆమె వాదనలో దిట్ట..
సంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన ఐశ్వర్యకు వివాహం తర్వాత కూడా అత్తింటి నుంచి ప్రోత్సాహం లభించింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. ఇరవై సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఆమె ‘ఆధార్ చట్టబద్ధత’, వాయుసేనలో మహిళలకు సమానహక్కులు వంటి ప్రతిష్టాత్మక కేసులను వాదించింది.
లక్ష్యశుద్ధి ఉంటేనే.. గమ్యాన్ని చేరుకోగలం.. ఎగరడానికి రెక్కలు ఒక్కటే సరిపోవు.. తగిన సాహసం కూడా ఉండాలి.. అని ప్రముఖ న్యాయవాది ఐశ్వర్యా భాటి సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చెప్పిన మాటలు. ఆమె పేరు సుప్రీం కోర్టులో తరచూ మార్మోగిపోతుంటుంది. న్యాయవాద వృత్తిలో మహిళలు పెద్దగా రాణించలేరని ఎవరైనా అనుకుంటే గనుక ఈమె వాదించేటప్పుడు చూస్తే ఆ అపోహలు పటాపంచలైపోతాయి. భాటి మాటల్లోనే ఆత్మవిశ్వాసం తొణికసలాడుతుంది. నిర్మాణాత్మకంగా ఆమె వాదనలకు ఎవరైనా ఫిదా అయిపోతారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ జాదవ్ కేసు వాదించే ప్యానల్‌లో కూడా భాటి సభ్యురాలు. సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన కేసులోనూ దళాల తరఫున ఆమే వాదించారు.
తాజాగా మహిళా ఎన్‌ఎస్‌సీ అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వాలంటే దిల్లీ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై మహిళా అధికారులకు అనుకూలంగా వాదించారు. ఈ కేసులో మహిళా అధికారులకు అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువరించింది. దీంతో సైనిక దళాల్లో నిర్దేశించిన విభాగాల్లో ‘కమాండ్ హోదా’ పోస్టుల్లో నియామకానికి వీలు కల్పించడం వల్ల పురుష అధికారుల తరహాలో మహిళా అధికారులూ కంపెనీ, బెటాలియన్ వంటి విభాగాలకు నాయకత్వం వహించడానికి వీలవుతుంది.
ఐశ్వర్య చిన్న వయస్సుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. జోథ్‌పూర్‌లో ఓ న్యాయవాదుల కుటుంబంలో జన్మించింది ఐశ్వర్య. తండ్రి సుప్రీంకోర్టులో న్యాయవాది. ఆమె సోదరుడు పుష్పీందర్ సింగ్ రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. దీంతో ఐశ్వర్య కూడా న్యాయవిద్య వైపే మళ్లారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో క్యాంపస్ లా సెంటర్ నిర్వహించిన ‘ఆల్ ఇండియా మూట్ కోర్ట్’ పోటీలో ‘బెస్ట్ స్టూడెంట్ అడ్వకేట్’గా నిలిచింది ఐశ్వర్య. జై నారాని వ్యాస్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యలో బంగారు పతకం సాధించింది. 1999లో ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించింది.
గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు ఈమెను సీనియర్ అడ్వకేట్‌గా ప్రమోట్ చేసింది. రాజస్థాన్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఈమే కావడం విశేషం. అప్పటికే 2017 నుంచి ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా రెండు పర్యాయాలు పనిచేసింది. ‘న్యాయవాద వృత్తిలో విజయాన్ని ఎప్పుడూ డబ్బుతో కొలవకూడదు. ప్రజల జీవితాల్లో వారు తెచ్చిన మార్పుతో కొలవాలి’ అని చెబుతోంది ఐశ్వర్య. *