మెయిన్ ఫీచర్
అంకితభావం సమాజ నిర్మాణానికి సోపానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘పరిపూర్ణ అంకితభావం, పవిత్రత, అతి సునిశితమైన బుద్ధి, సర్వాన్ని జయించగల సంకల్పం’’ ఇవన్నీ స్ర్తిలో ఉన్నప్పుడు సమాజంలో స్ర్తికి ఉన్న స్థానం సముచితస్థానం అవుతుంది. అటువంటి మహిళలే రాబోయే తరానికి వెలుగులు నింపే దివ్వెలవుతారన్నది నగ్నసత్యం. ఈ కోవలోకి వచ్చిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు.....ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటువంటి తరుణంలో ఏ సమయంలోనైనా తనకున్న ప్రజ్ఞకు ఆజ్యం పోయగల అవకాశాలు ఎదురైతే వాటిని సద్వినియోగం చేసుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. కొన్ని వందల సంవత్సరాల నుండి అంటే ప్రపంచీకరణ అయిన నాటి ఉండి మహిళ తన ఉనికిని చాటుకునేలా సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఇచ్చే వివిధ సంస్థల్లో కాని, వృత్తుల్లో కాని తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూనే ఉంది. అసలు దీనికి మొదలు ఎప్పటి నుండి ప్రారంభం అయింది దీని ప్రభావం మానవసమాజంపై ఏ విధంగా ఉంటుందనేది అందరూ ఆలోచించాల్సిన విషయం.
మనిషిలోని పరిణత, ఆసక్తి ఎప్పుడూ తన ఎదుగుదలను కోరుకుంటూ వాటిని సాధించుకునే వరకూ పరుగులు పెడుతూనే ఉంటాయి. అయితే ఈ పరిణామక్రమంలో గత 60 సంవత్సరాలుగా మహిళ ఇంట్లో తన పాత్ర పోషిస్తూనే ఒక క్రమపద్ధతిలో బయట వ్యవహారాలను చక్కపెట్టుకుంటూ వచ్చేది. తరాలు మారుతున్నాయి వారి ఆలోచనల్లో, నడవడిలో, ప్రవర్తనలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అదే ఇప్పుడు స్ర్తిని కేవలం వంటింటి కుందేలుగా కాకుండా సమాజంలో సముచితస్థానం పొందడానికి ముందుకు తీసుకెళ్తోంది. తనలోని చాకచక్యాన్ని చూపేందుకు వీలు కలిగిన అన్ని మార్గాలను అనే్వషిస్తూ పురుషుడితో సమానంగా దూసుకెళ్తోంది. దానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇంటిని, పిల్లలను కూడా పట్టించుకోనంత బిజీగా మన మాతృమూర్తులు తయారయ్యారంటే దీనికి కారణం వారిలోని భావావేశాలకు సమాజంలో గుర్తింపు లభించడమే. దానికి ఉదాహరణే ‘నిర్భయ’, ‘దిశ’ వంటి చట్టాలు వచ్చేవరకూ జరిగిన పోరాటాలు.
ఇంతకు ముందు ప్రపంచస్థాయిలో స్ర్తికి తన హక్కులను పొందాలన్న ఆరాటం, పోరాటం ఎక్కువ అయిన నేపథ్యంలో కేవలం పురుషులే పోషించే కొన్ని పాత్రలను, బాధ్యతలను స్ర్తిలు పోషించడం మార్పుకు గొప్ప శ్రీకారంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇంటిని చూసుకోవడం, పిల్లల్ని సాకడం మాత్రమే ఆడవారికున్న ఏకైక వృత్తిగా భావించే వారు. కానీ ఇప్పుడు సాంకేతికత పెరగడంతో రోబోటిక్ సైన్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అనుసరించడం మొదలయ్యాక వారి బాధ్యతలు యాధావిథిగా కొనసాగిస్తూనే సమాజంలో మరింత ముందుకు పరుగెడుతున్నారు. ఎప్పుడైతే ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం మొదలు పెట్టిందో మహిళ తనకున్న శక్తుల్ని, యుక్తుల్ని ఉపయోగిస్తూ తన యొక్క ఉనికిని చాటుకుంది. అయితే స్ర్తి వ్యక్తిత్వం చాలా ప్రాధాన్యతని కూడుకున్న అంశంగా చెప్పాలి. ఆ వ్యక్తిత్వమే తన ప్రవర్తనను నిర్దేశిస్తుంది. ఒక బాధ్యతను భుజాన వేసుకున్నప్పుడు అది పూర్తయ్యే వరకూ వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అలాగే ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించే ఆత్మస్థయిర్యాన్ని కలిగి ఉంటుంది. దానికి ఉదాహరణే గర్భం దాల్చి తనలోని రక్తాన్ని ఆహారంగా మార్చి ఒక బిడ్డకు జన్మనివ్వడం. అందుకే స్ర్తిని గౌరవించాలి, పూజించాలి అని చెప్పారు. దైవస్వరూపంగా భావిస్తూ మాతృమూర్తి అని పిలవడం జరుగుతోంది.
స్ర్తికున్న గొప్ప లక్షణం సహనం కలిగి ఉండటం. ఆ సహనాన్ని చూపించే ప్రక్రియలో పురుషుడి ఆలోచనల కన్నా స్ర్తి మేథస్సు ఎంతో గొప్పదని ఎన్నో శాస్త్ర పరిశోధనలు తేల్చి చెప్పాయి. స్ర్తి, పురుషులిద్దరూ నేటితరంలో బాధ్యతలను పంచుకునేందుకు సంసిద్ధులవుతున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో వారి ప్రవర్తన కొన్ని సందర్భాల్లో అపజయాలను తీసుకొస్తుంది. అటువంటి సమయంలో పురుషుడి కన్నా స్ర్తి చాలా ధైర్యంగా సమస్యను ఎదుర్కొని పోరాడేందుకు సిద్ధపడుతుంది. అందుకే ఎంతటి పెద్దగాలి వచ్చినా చెట్టు ఊగిసలాడుతుందే తప్ప పడిపోదు. స్ర్తికున్న మనోధైర్యం కూడా అటువంటిదే. అందుకే మంచి సమాజ నిర్మాణంలో స్ర్తి పురుషులిద్దరూ సమానమైన పాత్రను పోషించాలి.
సమాజ నిర్మాణంలో స్ర్తి తనకున్న నాయకత్వ లక్షణాలను బహిర్గతం చేయడమన్నది చాలా అవసరం. అందుకే కేవలం ఇంటిని చక్కదిద్దడమే కాకుండా ప్రపంచ నిర్మాణంలో కూడా స్ర్తి తన ప్రత్యేకతను, ప్రాధాన్యతను ప్రదర్శించినప్పుడే ఉన్నత భావాలున్న సమసమాజ నిర్మాణం ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది.