మెయన్ ఫీచర్

ద్వంద్వ వైఖరులు...పెడ ధోరణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో పెద్దనోట్ల రద్దు, అనంతరం జరిగిన కొన్ని పరిణామాలు వివిధ రాజకీయ పక్షాల ద్వంద్వ వైఖరులను వెల్లడి చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై సహేతుక విమర్శలు చేయకుండా ఒకప్పుడు ఒకలా, ఇప్పుడు మరొకలా స్పందించి తమ పెడ ధోరణిని బయటపెట్టుకున్నాయి. సంయమనం లేని ప్రకటనలతో ఆయా పక్షాలు వేసిన పిల్లిమొగ్గలు అందరూ గమనిస్తూనే ఉన్నారు.
బెంగాల్‌లోని మాల్దా జిల్లా నకిలీ నోట్ల ఉత్పత్తి కేంద్రం. మాదక ద్రవ్యాల వ్యాపారం ఇక్కడి నుంచే సాగుతుంది. తీవ్రవాద కేంద్రాలూ ఉన్నాయి. ఈ విషయం అప్పటి జ్యోతిబాసుకు ఇప్పటి మమత బెనర్జీలకు బాగా తెలుసు. ఐనా అక్కడి వలస ఓట్ల కక్కుర్తితో ఎవరూ చర్యలు తీసుకోవడానికి ఇష్టపడలేదు. బెంగాల్‌లోని ఈ భూభాగాలను బంగ్లాదేశ్‌లో కలపాలని తీవ్రవాద వర్గాలు ఆందోళన చేస్తుంటాయి. కాంగ్రెసు, టిఎంసి వామపక్షాలకు ఇవేవీ తెలియవు అనుకోవటం పొరపాటు. ఐనా వీరు పదవీ కాంక్షతో ఎందుకు దేశద్రోహానికి సిద్ధపడ్డారు? 2016 డిసెంబరు 2వ తేదీనాడు కేంద్ర బలగాలు బెంగాల్‌లోని ప్రధాన టోల్ ప్లాజాల వద్ద నిఘా నిర్వహించాయి. దానితో బెంగాల్ టైగర్ మమతాబెనర్జీ ఇంటికి కూడా పోకుండా సెక్రటేరియట్‌లోనే ఉండిపోయి తన నిరసనను వ్యక్తపరిచారు. ఇది తన అధికారులపై ‘మిలటరీ చర్య’ అని విమర్శించారు. నిజం ఏమిటంటే ఇలాంటి విన్యాసాలు లోగడ ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలలోను జరిగాయి. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లోక్‌సభలో ఈ విషయం వివరించారు. అంతేకాదు ఈ సమాచారం చాలాముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించామని సంబంధిత పత్రాలు చూపించారు. ఇదంతా దేనిని తెలియజేస్తున్నది? పెద్ద నోట్ల రద్దువల్ల అరవింద్ కేజ్రీవాలా, మమతా బెనర్జీ, ములాయంసింగ్ యాదవ్, లల్లూప్రసాద్, మాయావతి, సిద్ధరామయ్య వంటి నేతలు గిలగిలలాడుతున్నారు. కొన్ని టి.వి.్ఛనల్స్ అయితే ప్రజలలో భయభ్రాంతిని సృష్టించినాయి. నోట్లు మాత్రమే కాదు మీ బంగారం కూడా మోడీ ఎత్తుకొనిపోతున్నాడని పెద్దఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. గుజరాత్ వారంతా దొంగలు అని ఒక కాంగ్రెసు నాయకుడు ఒక ఛానల్‌లో వ్యాఖ్యానించారు. ఆర్థిక అసమానతలు తొలగించాలని కోరే వామపక్షాలు కూడా ఈ ‘సువర్ణ’ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా రెచ్చగొడుతున్నారు. ‘మా మంగళసూత్రాలు కూడా ఎత్తుకుపోతారా?’ అని స్ర్తిలు ప్రశ్నిస్తున్నారు.
లోక్‌సభలో ఆదాయం పన్ను చట్టానికి సవరణలు జరిగాయి. (30-11-16). అందుకు ప్రధాన కారణం ఏమిటంటే పెద్దనోట్ల రద్దు తర్వాత కోట్ల ధనం బంగారం కొనుగోళ్లవైపు వెళ్లాయి. వాటికి రసీదులు చూపాలని ఈ కొత్త చట్టం కోరుతున్నది. అంతేకాని ముత్తవ్వలు ఇచ్చిన ఆనువంశిక ద్రవ్యానికి లెక్క చూపనక్కరలేదు. అదే విషయం అరుణ్‌జైట్లీ చెప్పారు.
దేశంలో దొంగ నోట్ల నిలువలు, బంగారం గదులు ఎక్కడ ఉన్నాయో నిఘా విభాగాలు వారికి తెలుసు. పోయిస్ గార్డెన్‌లో గదుల నిండా బంగారం దిమ్మెలు, వజ్రాల బస్తాలు ఉన్నాయని స్థానికులు చెప్పేమాట. కొందరి వ్యవసాయ క్షేత్రాలల్లో భూసొరంగాలలో డ్రమ్ములకు డ్రమ్ములు పన్ను కట్టని డబ్బు కట్టలున్నాయని నిఘా విభాగం పసికట్టింది. ఐటి శాఖవారు ఇలాంటి అంశాలపై దృష్టిపెడతారేమో కాని యాదమ్మ మెడలోని మంగళసూత్రాలకు లెక్క అడగరు. ఐనా కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీల నేతలు ఎందుకింత దుష్ప్రచారం చేస్తున్నారు? ఐనా తాళిని ఎగతాళి చేసే నాస్తిక పార్టీలకు ఈ మంగళసూత్రాలపై ఇంత గౌరవం ఎందుకు పుట్టింది? 1955లో నార్ల వెంకటేశ్వర రావు ‘కమ్యూనిస్టుల రాజ్యంవస్తే మెడలో తాళికి బదులు సుత్తికొడవలి బొమ్మలు వ్రేలాడదీస్తారు’ అని తన పత్రికలో వ్రాసారు.
పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన చర్య. దీనివల్ల ఆర్థిక ప్రక్షాళన జరుగుతుంది. పుట్టల నుండి కట్టలుకట్టలు వెలికివస్తాయి. నోట్ల రద్దుతో ప్రజలు పాత బాకీలన్నీ గబగబా పాతనోట్లతో తీర్చేశారు. దేశంలోని 478 పట్టణాలల్లో 268 శాతం అధికంగా పన్నులు వసూలు అయినాయి.
శ్రీమతి ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు చేసినప్పుడు వామపక్షాలు హర్షించాయి. కారణం అది వారి ప్రేరణతోనే జరిగిన పని. బ్యాంకులను జాతీయం చేసినప్పుడు బ్రహ్మరథం పట్టారు. ఇవ్వాళ మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తే మాత్రం నానా అల్లరి చేస్తున్నారు. కామ్రేడ్ నారాయణ అయితే మరో అడుగుముందుకు వెళ్లి ‘‘మోదీని నూటొక్కసార్లు కాల్చిపారేయండి’’ అన్నాడు. (28 నవంబరు 2016) రాజమండ్రిలో. ఇది వారి ఉగ్రమనస్తత్వాన్ని, సైద్ధాంతిక రాహిత్యాన్ని, దేశభక్తి హీనతను తెలుపుతున్నది. మొరార్జీదేశాయ్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు జరిగాయి. అప్పుడుకూడా నోట్ల రద్దు జరిగింది. ఐనా జనం గగ్గోలు పెట్టలేదు. యుపిఎ పాలనాకాలంలో 109 శాతం పెద్దనోట్లు ముమ్మరంగా సమాజంలోకి ‘పంప్’ చేశారు. ఇది దుర్మార్గం అని ఆనాడు ఆనంద్‌శర్మలు అభిషేక్ సింఘ్విలు అనలేదు ఎందుకని? కపిల్ సైబల్, దిగ్విజయ్‌సింగ్, సంజయ్‌దత్, మణిశంకర అయ్యర్‌వద్ద నల్లధనం లేదా? వీరినెవరూ విమర్శించటం లేదు. ఎందుకు? 1962లో అమృతపాద డాంగే లండన్‌లో రహస్య ఎకౌంటు తెరిచినమాట నిజమా? కాదా? కామ్రేడ్ నారాయణకు చరిత్ర తెలియదు. 1960వ దశకంలో రోజాదేశపాండే బొంబాయి ఎన్నికలకోసం తన నియోజకవర్గంలో ఖర్చుచేసిన మొత్తం ఎంత?? ఆచార్య కృపలానీని ఓడించటంకోసం వి.కె.కృష్ణమీనన్ ఖర్చుచేసిన డబ్బు ఎంత?? వీటికి ఎవరు లెక్కలు చెపుతారు? 1955లో వావిలాల గోపాలకృష్ణయ్య రూపాయి కూడా ఖర్చులేకుండా ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన మాట నిజమే. కాని ఆనాడు బెల్లంకొండ వీరయ్య, మాదాల నారాయణస్వామి, చండ్ర రాజేశ్వరరావు, కనపర్తి నాగయ్యలు ఖర్చుచేసిన మొత్తాలు ఎన్ని? 1950 దశకంలో ఇవన్నీ నా కళ్లముందు జరిగిన ఎన్నికలే కాబట్టి ప్రత్యక్షంగా చూచినవి చెపుతున్నాను. నల్లకుబేరులను పట్టుకోండి అంటూ దశాబ్దాలుగా ఉపన్యాసాలు ఇచ్చినవారే తీరా సంస్కరణలు మొదలుపెట్టేసరికి ‘సామాన్యుడు ఇబ్బందిపడుతున్నాడు’ అని సాకుచూపి నల్లధనాన్ని బలపరచటం తగునా?
దొంగనోట్ల చలామణి 1950వ దశకంలోనే వ్యవస్థీకృతమైంది. అప్పుడు రెండు రూపాయల నోటును ఇద్దరు ప్రముఖులు ముద్రించారని చెప్పుకున్నారు. ‘కోయంబత్తూరు నోట్లు’ అనే పేరు ఒక తెలుగు జాతీయంగా మారింది. అప్పట్లో రాజకీయ పక్షాలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు
గోల్డ్‌కంట్రోల్ యాక్ట్ ఇవ్వాళ కొత్తగా పుట్టుకువచ్చిందేమీ కాదు. చట్టం 59-ఎ-బిలు ఎప్పటినుంచో అమలులోఉన్నాయి. ఇప్పుడు పెద్దనోట్ల రద్దు తర్వాత నవంబర్ 8 తేదీ నుండి జరిగిన కొనుగోళ్లమీద నిఘా విధించటం సమంజసమే. అందుకు రసీదు-ఆదాయం (సోర్సు) చూపవలసి ఉంటుంది. తరతరాలుగా వస్తున్న పాత సత్యధనం ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఇక వివాహ సందర్భాల్లో వెండి చెంబు, కంచం, బంగారు నగలు పెట్టడం ఆచారం. ఇప్పుడు పురుషులు 100 గ్రాములు, అవివాహితలు 250 గ్రాములు, వివాహితలు 500 గ్రాములు బంగారం మాత్రమే కలిగి ఉండాలని వివరణ ఇచ్చారు. నవంబరు 8వ తేదీ తర్వాత దేశంలో చాలా పెళ్లిళ్లు జరిగాయి. వాటికి ఈ నిబంధన ఎలా వర్తింపజేయగలరు? నిజమైన దొంగలు ఎవరు అనేది భారతదేశంలో ప్రతి సామాన్య పౌరునికీ తెలుసు. 8 నవంబరు 2016 తర్వాత భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఎందుకంటే బీనామీ లావాదేవీలతో భారీగా పొలం/ ప్లాట్లు/ అపార్ట్‌మెంటు/ విలువైన ఎలక్ట్రానిక్ సామాన్ల భారీ కొనుగోళ్లు, కార్ల అమ్మకాలు జరిగితే చట్టరీత్యా వాటిని వెలుగులోకి తీసుకొని రావచ్చు. నవంబరు 8 తర్వాత ప్రయాణీకులు ఏయే విదేశాలకు వెళ్లారు? అక్కడవారి కార్యకలాపాలేమిటి? పరిశీలించారా?? దేవాలయం, చర్చి, మసీదు, గురుద్వారా అనాధ శరణాలయాల వంటి వాటికి నోట్ల రద్దు తర్వాత లక్షలలో కోట్లలో ఆకస్మికంగా వచ్చిన విరాళాలు పరిశోధించారా?
మహిళలు, బంగారం వ్యాపారస్థుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం, సిబిటిబి ఇచ్చిన వివరణ కొంత ఊరట కలిగించింది. వారసత్వ బంగారం వెల్లడించిన ఆస్తులతో కొన్న బంగారం, ఎట్టి ఇబ్బందులకు లోనుకాదు. ఇది కొత్త నిబంధన కూడా కాదు. ఐటి చట్టం 115 బి ప్రకారం నల్లధనం బయటపడితే 60 శాతం పన్నుతోబాటు 25 శాతం సర్‌ఛార్జి విధింపబడుతుంది. లెక్కలోకి రాని ఆదాయంపై 10 శాతం పెనాల్టీకూడా ఉంటుంది. దాడులు, జప్తుచేసిన ఆదాయంపై మూడు రెట్ల పెనాల్టీ ఉండేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
ఎవరు ఎన్ని చట్టాలు తెచ్చినా వ్యక్తిలో వౌలిక మానసిక పరిణామం రాకుండా దేశం అభివృద్ధి చెందజాలదు. ప్రతిచోటా అప్పుడే రెండువేల నోట్ల ‘దందా’ మొదలయ్యాయంటే... భారత జాతిలో నైతిక విలువలు క్షీణించాయని అర్థం!
మోదీ సంస్కరణలను రాహుల్‌గాంధీ ములాయం, మమతలు వ్యతిరేకించటం సహజం. ఎందుకంటే వారే ప్రత్యక్ష బాధితులు. కాని వామపక్షాలు కూడా నోట్ల రద్దు, గోల్డ్ కంట్రోల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దస్ కాపిటల్‌లో ఈ సంస్కరణలకు విరుద్ధంగా ఏవైనా సూక్తులు ఉన్నాయేమో మార్క్సిస్టు భాష్యకారులు చెప్పాలి.
‘మోదీ మూర్ఖుడు. ఆయన అధికారంలోకి రాకూడదు’ అని 2014లో అమర్త్యసేన్ అనే బెంగాల్ మార్క్సిస్టు విమర్శించాడు. ఈయన లండన్‌లో స్థిరపడ్డాడు. నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడు. ఇప్పుడు (2-12-2016) పెద్ద నోట్ల రద్దు మూర్ఖపు పని’ అని మళ్లీ విమర్శించాడు!! ఈయన పెద్ద ఆర్థికశాస్తవ్రేత్త!! మరి 65 లక్షల కోట్ల దొంగ డబ్బు విదేశీ బ్యాంకులకు లోగడ 60 ఏళ్లుగా తరలిస్తున్నప్పుడు అమర్త్యసేన్‌గారు ఎందుకు నోరు విప్పలేదు??

- ముదిగొండ శివప్రసాద్