మెయన్ ఫీచర్

రక్తం రుచి మరగిన ‘వామపక్ష’ ఉన్మాదులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్యలు, హింసాత్మక కార్యక్రమాలను ఒక రాజకీయ సాధనంగా వాడుకోవడం కమ్యూనిజం సిద్ధాంతంలో అంతర్భాగం. రాజకీయ లక్ష్యాల సాధనకు హింసాత్మక మార్గాలను అవలంబించడంలో కమ్యూనిస్టులు ఏనాడూ సంకోచించలేదు. ‘ఆయా సమయాల్లో నెలకొని ఉన్న సామాజిక పరిస్థితులను బలప్రయోగం ద్వారానే పక్కకి నెట్టివేయడం వల్ల తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవచ్చున’ని కమ్యూనిస్టు పార్టీ 1848లో విడుదల చేసిన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. హింసాత్మక పద్ధతులకు తమ సిద్ధాంతంలోనూ, కార్యక్రమాల అమలులోనూ ఆ పార్టీ అధికారిక స్థాయిని ఇచ్చింది. ప్రపంచం లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన ప్రతి దేశంలో లక్షల సంఖ్యలో సామూహిక హత్యలు జరిగాయి. 20వ శతాబ్దంలో కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు విశృంఖల నరసంహార కార్యక్రమాలను కొనసాగించారు. కమ్యూనిస్టు వ్యతిరేక సిద్ధాంతాలను, పార్టీలను అణచివేయడానికి హింసను వారు ఆయుధంగా వాడుకున్నారు.
పేదలు, కార్మికుల పేరు చెప్పి పలు దేశాల్లో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు 20వ శతాబ్దంలో దాదాపు 10 కోట్ల మంది పేదలను, అమాయక ప్రజలను చంపి నరమేధం సృష్టించాయి. వీటిలో అత్యధిక శాతం సోవియట్ రష్యా, చైనా, కంబోడియాల్లో జరిగాయి. స్టాలిన్, మావో వంటి వామపక్ష నేతలు మారణహోమాన్ని జరిపారు. ఉత్తర కొరియా, వియత్నాం, తూర్పు ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లోనూ నరమేధం కొనసాగింది. అమెరికాలోని హవాయ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన రుడాల్ఫ్ జోసఫ్ రుమిల్ కమ్యూనిస్టుల మారణహోమంపై విశేష పరిశోధనలు జరిపి, వారి దుర్మార్గాలను ఎండగట్టారు. ‘ప్రక్షాళన పేరిట స్టాలిన్, సాంస్కృతిక విప్లవం పేరిట మావో కమ్యూనిస్టు చరిత్రను నిలువెల్లా రక్తంతో తడిపేశారు. మూడు దశాబ్దాలపాటు కేథలిక్కులు-ప్రొటెస్టెంట్లు మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన మారణ హోమం కంటే కమ్యూనిస్టులు జరిపిన నరమేధం ఎన్నో రెట్లు ఎక్కువ. తీవ్రవాదానికి మారుపేరుగా మార్క్సిజం మారిపోయింది. మనుషులను సామూహికంగా హత్య చేయడానికి జైళ్ళు ఏర్పడ్డాయి. కృత్రిమంగా కరువు కాటకాలు సృష్టించి లక్షల మందిని చంపివేశారు. దారిద్య్రం, దోపిడీ, అసమానతలు, సామ్రా జ్యవాదానికి వ్యతిరేకం పోరాటం అంటూ కోట్లాది అమాయక ప్రజలను కమ్యూనిస్టులు చంపివేశారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ పార్టీ పాలన మాత్రమే ఉండాలని కమ్యూనిస్టుల అభిప్రాయం. ఇందుకోసం ఎంతమందినైనా చంపడానికి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు వెనుకాడరు. రష్యాలో బోల్సెనిక్‌లతో ప్రారంభమైన కమ్యూనిస్టు దమన నీతి వివిధ రూపాల్లో ప్రపంచమంతా ఊరేగుతూ అమాయక ప్రజలను చంపుతూ వచ్చింది. దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మన దేశంలోని పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలో కనపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 1977లో తాము అధికారంలోకి రావడానికి ముందునుంచే హింసను మార్క్సిస్టులు రాజకీయ సాధనంగా వాడుకోవడం మొదలుపెట్టారు.
బెంగాల్‌లోని బర్ద్‌వాన్ జిల్లాలో ‘సైన్’ కుటుంబంలో ఇద్దరు సోదరులుండేవారు. వీరిద్దరూ ఆ ప్రాంతంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు. 1970 మార్చిలో కమ్యూనిస్టు కార్యకర్తలు సైన్ సోదరులపై దాడి చేసి కిరాతకంగా చంపివేశారు. కమ్యూనిస్టులు ఎంతటి నీచ స్థాయికి దిగజారారంటే- ఆ ఇద్దరు సోదరులను హత్య చేశాక, ఆ రక్తాన్ని అన్నంలో కలిపి వారి తల్లిచేత బలవంతంగా తినిపించారు. ఆ విషయం తెలిశాక ఆ కన్నతల్లి పిచ్చిదైపోయింది. అలా కమ్యూనిస్టుల నరమేధం పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 30 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగింది. సైన్ సోదరులను హత్యచేసిన వారికి తదుపరి కాలంలో కమ్యూనిస్టుపార్టీ మంత్రి పదవులు, ఎంపి పదవులు ఇచ్చి సత్కరించింది. 1979 జనవరిలో సరస్వతీ పూజ జరుగుతున్న రోజు.. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ పాలకుల దమననీతిని తట్టుకోలేక కట్టుబట్టలతో ప్రాణాలతో భారత్‌లోకి తలదాచుకోవడానికి వచ్చిన హిందూ శరణార్థులను జ్యోతిబసు ప్రభుత్వం వెంటాడి వేటాడి మరీ చం పింది. ఇందులో అత్యధిక సంఖ్యాకులు దళితులు. బంగ్లాదేశ్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడడంతో దాదాపు 60 వేల మంది హిందువులు శరణార్థులుగా మారి పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్ ప్రాంతంలో తలదాచుకున్నారు. మార్క్సిస్టు పాలకులు, కార్యకర్తలు కలిసి ముందుగా దారులు మూసేశారు. బాష్పవాయుగోళాలు, బుల్లెట్లతో దాడి చేశారు. శరణార్థి శబిరాలను తగులబెట్టారు. కనపడ్డ వారినల్లా పిల్లాపెద్దా, ఆడామగా అని చూడకుండా చంపేసి సముద్రంలో పారేశారు. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ లెక్కతెలియలేదు. కరడుగట్టిన తీవ్రవాది యాకూబ్ మీనన్ హక్కుల గురించి మాట్లాడే కమ్యూనిస్టులకు హిందూ శరణార్థుల హక్కుల గురించి ఎందుకు గుర్తురాలేదన్నది బేతాళ ప్రశ్న.
యునిసెఫ్‌లో ఒక ఉన్నత స్థాయి మహిళా అధికారి ఉండేది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను 24 దక్షిణ పరగణాల జిల్లాలో మార్క్సిస్టులు స్వాహా చేశారన్న విషయం ఆమె దృష్టికి వచ్చింది. ఆ మహిళా అధికారి వాహనాన్ని సిపిఎం కార్యకర్తలు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇతర మహిళలను రక్షించబోయిన డ్రైవర్‌ను చంపివేశారు. మహిళా అధికారులను మానభంగం చేసి చంపివేసి వస్త్రాలు తీసివేసి నడిరోడ్డుపై పడవేసి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు దృష్టికి తీసుకువెళ్ళినపుడు- ‘ఒఖష్ద జశషజజూళశఆఒ జ్యూ ద్ఘఔఔళశ, జ్యూశ’ఆ ఆ్దళక?’’ అని కొట్టిపారేశాడు. 1982 ఏప్రిల్‌లో ఆనంద్‌మార్గ్ సన్యాసుల సామూహిక సజీవ దహనం, 2000 జులైలో నసూర్ ప్రాంతంలో 11 మంది భూమిలేని నిరుపేద ముస్లింలను సామూహికంగా హత్య చేయడం, 14 మార్చి 2007న నందీగ్రామ్‌లో రైతుల మూకుమ్మడి హత్యలు మార్క్సిస్టుల రక్తచరిత్రలో మర్చిపోలేని అధ్యాయాలు. 1977 నుంచి 2009 వరకూ కమ్యూనిస్టుల పాలనలో బెంగాల్‌లో దాదాపు 50 వేల మంది అమాయక ప్రజలు నిర్ధాక్షిణ్యంగా చంపబడ్డారు.
కేరళలోనూ కమ్యూనిస్టులు హింసాత్మక పద్ధతుల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎంతోమంది ప్రాణాలు హరించారు. 1957లో కేరళ ఏర్పడ్డాక అధికారం కోసం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు పోటీపడేవారు. కమ్యూనిస్టుల నేతృత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లు ఏర్పడి వంతుల వారీగా అధికారంలోకి వస్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తూనే, మరొకపక్క సామాజిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాయకులపై కూడా కమ్యూనిస్టులు దాడులు ప్రారంభించారు. హిందూత్వం ఆధారంగా కేరళలో ఎదుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌పై 1948లో తిరువనంతపురంలో కమ్యూనిస్టులు దాడి చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గోళ్వాల్కర్ (గురూజీ) ఉపన్యసిస్తున్న సభపై కమ్యూనిస్టులు దాడి చేశారు. రెండవసారి అలపుజ గ్రామంలో గురూజీ పాల్గొన్న మరొక సభపై 1952లో దాడి చేశారు.
1964లో దేశంలో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. సిపిఐ, సిపియంలు ఏర్పడ్డాక నెమ్మదిగా కేరళలో సిపియం ప్రాబల్యం పెరిగింది. తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం మార్క్సిస్టులు తమ సహచర కమ్యూనిస్టులను కూడా వదలలేదు. సిపిఐ కార్యకర్తలపై కూడా భౌతిక దాడులు జరిపారు. 1969 జనవరిలో మార్క్సిస్టులు ఓ కళాశాలలో ప్రసంగించడానకి వచ్చిన స్వామి చిన్మయానందపై దాడికి ఎగబడ్డారు. అక్కడ్నుంచి ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, సిపియం పోలిట్‌బ్యూరో సభ్యుడు కొడియేరి బాలకృష్ణన్‌ల ఆధ్వర్యంలో మార్క్సిస్టుల దమననీతి నిరాటంకంగా కొనసాగుతున్నది. తమ దారికి అడ్డువచ్చిన వారిని చంపివేయడం ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్న మార్క్సిస్టులు ఇటీవలి కాలంలో తమ దాడుల్ని మరింత తీవ్రతరం చేశారు. 1969లో మొదటిసారిగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, మిఠాయి వ్యాపారి నడిక్కల్ రామకృష్ణన్‌ను తలిశెరి గ్రామంలో హత్య చేయడం వీరి అకృత్యాలు ప్రారంభమయ్యాయి.
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ 1977లో ముగిశాక సిపియం హత్యా రాజకీయాలు మరొక మలుపు తిరిగాయి. ఎమర్జెన్సీని మార్క్సిస్టు నాయకత్వం నిస్సిగ్గుగా సమర్ధించడం ఆ పార్టీ కింది స్థాయి నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. ‘కరి మింగిన వెలగపండు’ లాంటి మార్క్సిస్టు సిద్ధాంతం పట్ల విసిగిపోయిన కేరళ ప్రజలు నెమ్మది నెమ్మదిగా ఆ పార్టీనుంచి దూరం అవుతూ వచ్చారు. దీంతో మార్క్సిస్టుల దాడి పరిధి కూడా పెరిగింది. కాంగ్రెస్, అటు తర్వాత ఆర్‌ఎస్‌ఎస్, ఆ పిమ్మట తమ పార్టీని వదిలిపోయిన వారిపై హత్య రాజకీయాలు జరుపుతూ వచ్చింది. కన్నూరు జిల్లా తలశెరిలో ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యశిక్షక్ చంద్రన్‌ను మార్క్సిస్టులు చంపివేశారు. అప్పటివరకూ స్థానిక సిపియం శాఖలో చురుకుగా ఉన్న చంద్రన్ తల్లిదండ్రులు సిపియం విధానాల పట్ల విసిగిపోయి ఆ పార్టీకి దూరం అయ్యారు. వీరికి బుద్ధి చెప్పేందుకు కుమారుడు చంద్రన్‌ను మార్క్సిస్టులు చంపివేశారు. తమను కాదన్న సాటి కార్యకర్తలను వీరు వదలలేదు. తల్లిదండ్రులను శిక్షించడం పేరిట కొడుకును చంపేశారు.
ఒక్క కన్నూరు జిల్లాలోనే దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలను మార్క్సిస్టులు చంపివేశారు. సిపిఐ ప్రముఖ నాయకులు పి.దామోదర్,. మిగిలిన రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలను కూడా హత్య చేశారు. గ్రామంలోకి ఒకసారి అడుగుపెట్టిన ఇతర పార్టీల నాయకులు తిరిగి ప్రాణాలతో బయటికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిట్‌బ్యూరో సభ్యుడు కొడియేరి బాలకృష్ణన్ బహిరంగంగా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎపి అబ్దుల్లా కుట్టీ ఒకప్పుడు సిపియంలో పనిచేసినప్పుడు కలిగిన అనుభవాలను ఉటంకిస్తూ- ‘ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ 2008లో ఒక కార్యకర్తల సభలో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థుల శవాలను లోతైన గోతులలో ఎక్కువ మోతాదులో మట్టివేసి కప్పేయండి. వారు హత్యకు గురైనట్టు ప్రపంచానికి తెలియకూడద’ని అన్నారని చెప్పారు.
గతంలో బలహీన వర్గాలకు చెందిన తియా వర్గం వారు మార్క్సిస్టులకు అండగా నిలిచేవారు. ఇప్పుడు వారిలో అధిక శాతం మంది సిపియంను వదిలి ఆర్‌ఎస్‌ఎస్ పట్ల మొగ్గు చూపుతున్నారు. తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని మార్క్సిస్టులు దాడులను తీవ్రతరం చేశారు. ఇందుకోసం కిరాయి గుండాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులను ప్రోత్సహించి జాతీయ వాదులను హత్యలు చేయిస్తున్నారు.
కేరళలో ఇప్పటివరకూ దాదాపు 350 మంది ఆర్‌ఎస్‌ఎస్, ఏబివిపి కార్యకర్తలను హత్యచేశారు. వీరుకాక కాంగ్రెస్, సిపిఐ, ఇతర పార్టీల నాయకులను చంపివేశారు. తన రాజకకీయ ప్రత్యర్థులెక్కడా జీవించి ఉండకూడదన్న ఉద్దేశంతో కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇతర పార్టీలు, సిద్ధాంతాల పట్ల ద్వేషాన్ని పెంచుకున్న పినరాయ్ విజయన్ తన మాటే చెల్లుబాటు కావాలన్నట్లు నియంతలా ప్రవర్తిస్తున్నారు. విజయన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రక్తచరిత్రలు రాయడం మాయని మచ్చ. ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల సంఘాల నాయకులు వీటిని నిర్ద్వంద్వంగా ఖండించాల్సిన సమయం ఇది.

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113