మెయన్ ఫీచర్
బెలూచిస్థాన్‌లో పాక్ నరమేధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మొన్న కాలిఫోర్నియాలో ఒక సంఘటన జరిగింది. అక్కడి పాఠ్య ప్రణాళిక నుండి భారత్‌ను తొలగించి ఆగ్నేయ ఆసియాను ప్రవేశపెట్టారు. దీనికి అక్కడి భారతీయులు నిరసన తెలియజేశారు. నిజానికి అమెరికాకు భారత్ మిత్రదేశం. ఐనా అమెరికా గతంలో పాకిస్తాన్‌కు, చైనాకు ఇచ్చిన గౌరవం భారత్‌కు ఇవ్వలేదు. ఎందువల్ల? జాన్సన్ కాలం నుంచి జార్జిబుష్ హయాం వరకు, అమెరికా తన ఆయుధ సంపత్తికి పాకిస్తాన్‌ను మార్కెట్‌గా ఉపయోగించుకుంది. నిజానికి ఉగ్రవాదులపై ప్రయోగించడానికే ఆయుధాలను సరఫరా చేస్తున్నామని అమెరికా చెబుతున్నప్పటికీ, పాక్ మాత్రం వాటిని భారత్, బెలూచిస్తాన్ తిరుగుబాటు దార్లపైనే ప్రయోగిస్తున్నది. ఈ సంగతి అమెరికాకు తెలుసు. కానీ తన ఆయుధ వ్యాపారం కోసం తెలియనట్టు నటిస్తున్నది.
పాకిస్తాన్ పరిస్థితి అనుకున్నంత సుఖంగా లేదు. అంతర్గత అల్లర్లతో పాటు, సింధ్ ప్రాంతంలో ‘‘జై సింధే’’ ఉద్యమం మొదలయింది. అంటే సింధ్ ప్రావెన్స్ స్వాతంత్య్రాన్ని కోరుతున్నది. బెలూచిస్తాన్ మొదటినుంచీ స్వతంత్ర దేశమే. 1947 తరువాత ఇండియా మూడు ముక్కలైనప్పుడు పాకిస్తాన్, బెలూచిస్తాన్‌ను కబళించింది. అప్పటినుంచి అక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 2016, మార్చి 25న భారత్‌కు చెందిన ఒక వ్యాపారిని గూఢచారి అనే పేరుతో పట్టుకొని హింసించి అతనితో ఒక ‘‘డాక్టర్డ్ వీడియో’’ విడుదల చేయించారు. ఇలా ఎందుకు జరిగిందంటే హెడ్లీ అనే ఉగ్రవాది తాను పాకిస్తాన్ ప్రేరణతో ఎలా భారత్‌పై దాడి చేశాడో మార్చి మూడో వారంలో వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించి ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచాడు. పఠాన్‌కోట దాడ లు, ముంబయి దాడులు ఇతర ఉగ్రవాద దాడులు అన్నింటికీ వ్యూహరచన పాకిస్తాన్‌లోనే జరిగిందని హెడ్లీ వెల్లడించాడు. దెబ్బకు దెబ్బ ఇప్పుడు పాకిస్తాన్, బెలూచిస్తాన్‌లో ఒక వ్యాపారిని పట్టుకొని అతనిని భారత్ గూఢచారి అని చెబుతున్నది.
1971లో తూర్పు పాకిస్తాన్‌లో (నేటి బంగ్లాదేశ్) ఏం జరిగిందో ఇప్పుడు బెలూచిస్థాన్‌లో అదే జరుగుతున్నది. హెలికాప్టర్లలో బెలూచీ పౌరులను పట్టుకొని పోయి చంపి పైనుంచి శవాలను కింద పడేస్తున్న సన్నివేశాలను చూస్తున్నాము. స్వాతంత్య్రం కోరుతున్న బెలూచీ పౌరులకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు మద్దతు పలుకుతున్నాయా? భారత్‌లోని పౌరహక్కుల సంఘాలు, మానవహక్కుల సంఘా లు పాక్ దుశ్చర్యలపై ఎందుకు నిరసన తెలపడంలేదు? కేవలం వేముల రోహిత్, మెమెన్, మక్దుల్ భట్, అఫ్జల్ గురులకే వీరి నిరసనలు పరిమితమా? బెలూచీ, సింధ్‌ల స్వాతంత్య్ర పోరాటానికి నరేంద్ర మోదీ మద్దతివ్వాలి. దీనివల్ల ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ క్రమంగా విఘటితమవుతుంది. పాకిస్తాన్‌లో అవిద్య ఉంది, దారిద్య్రం ఉంది. అక్కడి పాలకులకు స్వేచ్ఛ లేదు. వారు ఐఎస్‌ఐ తీవ్రవాదుల చేతిలో కీలుబొమ్మలు. సైనిక నియంతలే పాక్‌ను పాలిస్తుంటారు. కాగా కాశ్మీరును, బెలూచిస్థాన్ స్వాతంత్రోద్యమంతో పోల్చ డం ఎంతవరకు సబబు? కాశ్మీర్‌లో హిం దూ పండిట్లు తరిమివేతకు గురికావడం వల్లనే, ముస్లిం మెజారిటీ ప్రాంతమైంది. మరి బెలూచిస్థాన్ 1947కు ముందు నుంచే ఒక స్వతంత్ర రాజ్యం. అందుకే అక్కడ ఇప్పటి వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఒకవేళ యుద్ధం వస్తే పాక్ అదృశ్యమైనట్టే, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లు కోలుకోలేని దెబ్బతింటాయి. అందువల్ల ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. నరేంద్రమోదీ కరాచీకి సుహృద్భావ పర్యటనకు వెళ్లి రావడం, పాక్ సైన్యం జీర్ణించుకోలేకపోతున్నది. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే అది ఇండోపాక్ సరిహద్దుల్లో రాదు. బెలూచిస్థాన్ సరిహద్దులో వస్తుంది. పంజాబసింధు గుజరాతమరాఠా అని మనం ప్రతిరోజూ జాతీయ గీతం పాడుతున్నాం. ఈ సింధ్ పాకిస్తాన్‌లోనే ఉంది. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం అందరికీ సుపరిచితమే. అంటే మన ఎక్కడ స్నానం చేసినా ఈ అన్ని నదులలోనూ స్నానం చేశామని ఏకాత్మతా భావన. ఈ జాబితాలో సింధూ నది ఉన్నది. సింధూ నదీ తీర ప్రజలను విదేశీయులు హిందువులు అని పిలిచారు, అని ఒక నిర్వచనం. సింధూ నాగరిగత అత్యంత ప్రాచీన హిందూ నాగరికత. హరప్పా, మొహంజోదారోలు ఇప్పుడు పాకిస్తాన్‌లోను, గుజరాత్‌లోనూ ఉన్నాయి. ఈ మూడూ పురావస్తు శాఖ వారు వెలికి తీసిన ప్రాచీన నాగరికతలు. మరి సింధ్ ఇండియాలో లేకుండానే పంజాబసింధు అంటూ జాతీయగీతం పాడుకుంటున్నాము. మహాభారతం చదివిన వారికి సైంధవుని పేరు బాగా తెలిసే ఉంటుంది. ఇతగాడు సింధూ ప్రాంతం వాడే. కౌరవుల పక్షాల పోరాడి అభిమన్యుని మరణానికి కారకుడైనాడు. అంటే సింధూ ఆనాటి భారతవర్షంలో సింధూదేశ అంతర్భాగంగా ఉండేదని అర్థం. పంజాబులోని సగం పాకిస్తాన్‌లో కలిసిపోయింది. దీనినే పశ్చిమ పంజాబ్ అంటారు. ఇదంతా జవహర్‌లాల్ నెహ్రూ- మహమ్మదలీ జిన్నా పుణ్యఫలం. ‘జై సింధూ’ ఉద్యమాన్ని బలపరచవలసిన బాధ్యత భారతీయుల మీద ఉంది. స్వతంత్ర కాశ్మీర్ ఉద్యమ సమర్ధకులకు కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు ‘జై సింధూ’ ఉద్యమమే సమాధానం కావాలి.
రాజకీయ నిరుద్యోగులు తమ అస్తిత్వం కోసం దేశంలో అల్లర్లను రెచ్చగొడుతుంటారు. బుందేల్‌ఖండ్‌లోను, మరట్వాడాలో రైతుల ఆత్మహత్యల పేరుతో వేర్పాటు ఉద్యమాలు మొదలైనాయి. స్వతంత్ర మరట్వాడా, స్వతంత్ర బుందేల్‌ఖండ్ ఉద్యమాలు ఊపందుకోబోతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. అంటే మోదీ ప్రభుత్వం రాబోయే కాలంలో ఇటు అంతర్గత శత్రువులతో పాటు బాహ్య శత్రువులను ఎదుర్కొనవలసి ఉంది. ఇందుకు మార్క్సిస్టులు, అసదుద్దీన్‌లు మోదీకి మద్దతివ్వరు.
1947లో భారత విభజనకు సహకారం అందించిన మార్క్సిస్టులు 1971 స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటును బలపరచలేదు. ఇప్పుడు స్వతంత్ర బెలూచిస్థాన్‌ను కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అది చైనాకు ఇష్టం లేదు కనుక! బెలూచిస్థాన్‌లో స్వాతం్ర త్య పోరాటాలు ఊపందుకుంటున్న కొద్దీ పాకిస్తాన్ సైన్యం వెర్రెక్కిపోతున్నది. బెలూచిస్థాన్‌లో పోరాటాలను ఇండియా ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తున్నది. గత మార్చి 30న భారత హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజూ మాట్లాడుతూ బెలూచిస్థాన్ విషయంలో భారత్‌పై అభాండాలు వేయడం ద్వారా పాకిస్తాన్ తన నరమేధాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నదని వ్యాఖ్యానించారు. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ యాదవ్‌పై పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూ కట్టుకథలు అల్లి యూ ట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తున్నదని అన్నారు. మార్చి 30న ఒక ఇంగ్లీషు టివి ఛానల్‌లో శేషాద్రిచారి మాట్లాడుతూ. ‘‘ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది వెనకటి ప్రభుత్వం కాదు. వెర్రి మొర్రి వేషాలు వేస్తే పాకిస్తాన్‌కు బుద్ధి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. సింధ్, బెలూచిస్థాన్‌ల వేర్పాటు గతిలోనే పాకిస్తాన్ అనే దేశం సహజ గతిలో అదృశ్యమవుతుంది’’ అని హెచ్చరించారు. ఈయన గతంలో న్యూఢిల్లీలోని ఒక ఆంగ్ల దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. జై సింధేకి సంబంధించి మనకు మహాభారతంలో అరణ్యపర్వం, భీష్మపర్వం వంటి అనేక చోట్ల వివరాలు లభిస్తున్నాయి. సింధు రాజు సైంధవుడు. ఇతడు ధృతరాష్ట్రుడికి అల్లుడు. దుస్సల భర్త. ద్రౌపదిని ఎత్తుకొని పారిపోతూ అర్జునుని చేతిలో పరాజితుడవుతాడు. శివుని గూర్చి ఘోర తపస్సు చేసి వరబలంతో ఒక్క రోజు మాత్రం పాండు సైన్యాన్ని ఎదుర్కొనగలగుతాడు. సైంథవము అంటే గుర్రము. అంటే యుద్ధ అశ్వాలకు సింధూ దేశం ప్రసిద్ధి అని ప్రాచీన యుద్ధ తంత్రంలో చెప్పుకునేవారు. తర్వాతి కాలంలో పారసీక దేశం నుండి గుర్రాలు దిగుమతి చేసుకున్నారు. ప్రాచీన కాలంలో సింధు, సరస్వతీ నదులు ప్రసక్తి ఋగ్వేదంలో కనిపిస్తుంది.
విచిత్రమేమంటే బెలూచిస్థాన్‌లోని షియాలను కూడా పాకిస్తానీ సున్నీ సైనికులు బతకనివ్వడం లేదు. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ రషీద్ ఖురేషీ ఒక ఇంగ్లీషు టివి ఛానల్‌లో మాట్లాడుతూ, కులభూషణ్ యాదవ్‌ను వదిలేది లేదని చెప్పారు. లోగడ వీరు ఇలాగే సౌరవ్ కాలియా అనే భారతీయుడిని పట్టుకొని చంపి శవాన్ని అడవి మృగాలకు ఆహారంగా వేశారు. ఐతే అప్పుడు ఢిల్లీలో మన్మోహన్ గారి మూగ ప్రభుత్వం ఉంది. దేశ రక్షణ పట్టలేదు. ఇది 1953 వియన్నా ఒడంబడికకు విరుద్ధమని రషీద్ ఖురేషీకి తెలుసు. ఐనా ‘‘హిందువు’’ దొరికితే చాలు ‘‘కాఫిర్’’ అనే పేరుతో హింసిస్తున్నారు.
అమెరికాలోని పౌరహక్కుల సంఘాల సభ్యులు, బెలూచిస్థాన్‌లో మానవహక్కులు హరింపబడుతున్నట్టు లోగడ ప్రశ్నించారు. ఈ అంశంపై ఒక ఆంగ్ల గ్రంథం కూడా వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోదీ చొరవ తీసుకొని బెలూచిస్థాన్‌ను, సింధ్‌లను పాక్ కబంధ కౌగిలి నుండి విడిపించవలసిన తరుణం ఆసన్నమైంది. అణు భద్రతపై ఐదు రోజులపాటు అమెరికాలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి భారత్, చైనా,రష్యా వంటి అన్ని దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మార్చి 2న వైట్‌హౌజ్‌లో బరాక్ ఒబామా ఇచ్చిన విందు సందర్భంగా ‘మంచి టెర్రరిజం-చెడ్డ టెర్రరిజం’ అని రెండు ఉండవు అని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒబాతో ఉగ్రవాద నిర్మూలన గూర్చి చర్చించారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కలిసి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలను ఏరివేస్తే, అటు బెలూచిస్థాన్, సింధ్‌లు స్వతంత్ర దేశాలవుతాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు భారత రక్షణ ఏర్పడుతుంది. ఇందుకు ఇదే తగిన సమయం. జేషే మహమ్మద్, లష్కరే తొయ్యబా, ఐసిస్, అల్‌ఖైదా, తాలిబన్, సిమి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ...ఇలా పేర్లు వేరైనా అందరి ఎజెండా ఉగ్రవాదమే.
చిత్రం బెలూచిస్థాన్‌లో ఇటువంటి ప్రదర్శనలు సర్వ సాధారణం