మెయన్ ఫీచర్
పౌర స్పందన కొరవడిన ప్రభుత్వ బడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇంత అస్తవ్యస్తంగా ఉన్న విద్యారంగం బాగుపడాలంటే, కొఠారీ తోపాటు హైదరాబాద్, అలహాబాద్ హైకోర్టులు ఆదేశించినట్టు అధికారుల, ప్రజా నాయకుల, ఉపాధ్యాయుల పిల్లలందర్ని నైబర్‌హుడ్ పాఠశాలల్లోనే చదివించాలి. మాధ్యమం (మాతృభాషనే శాస్ర్తియమైనది) ఏదైనా అందరికి కామన్ విద్యా బోధన జరగాలి. ఈలెక్కన కెసిఆర్ తను చదువుకున్న దుబ్బాక పాఠశాలకు ఏకంగా దాదపు రూ.11 కోట్లను మంజూరు చేశారు. రాష్ట్రంలోని మిగతా పాఠశాలలకు, ఇంతే మొత్తంలో మంజూరు చేయకున్నా పర్వాలేదు కాని-తన మనుమల్ని ఆదే పాఠశాలలో చదివిస్తే (ఆంగ్ల మాధ్యమంలోనైనా) ప్రభుత్వ విద్యకు పట్టుకున్న చీడ క్షణాల్లో వదులుతుంది. ప్రభుత్వ విద్య మహోజ్వలంగా వెలుగొందుతుంది.
రేషను దుకాణాల్లో సరకులు ఇవ్వకపోయినా, ఆసరా డబ్బులు రాకపోయినా, ఓటరు లిస్టులో పేర్లు గల్లంతైనా ఊరుకోం. ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు విరుచుకు పడతాయి. ఓ పబ్లిక్ రంగ సంస్థనో, కార్పొరేషన్‌లో దొంగసాకులు చూపి మూసివేసినా, ఎత్తివేసినా సంబంధిత సంస్థల కార్మికుల సమస్యగానే పరిగణిస్తాంగాని స్పందించం. ప్రభుత్వ సంస్థలుగా పేరొందిన దవాఖానలు, ప్రభుత్వ పాఠశాలలు కుంటినడకన నడుస్తున్నా, అసలు నడవకున్నా ప్రజలకు, ప్రజానాయకులకు పట్టింపు ఉండదు. ఇక ప్రభుత్వ కార్యాలయాల సంగతి అడగొద్దు. సిటిజన్ చార్టర్ ఉండదు. ఉన్నా దాని ప్రకారం పనులు జరగవు. ప్రతీ కార్యాలయంలో సమాచార హక్కు అధికారి, ఉప అధికారి పేర్లు గోడలపై వుంటాయి. కాని ఈ వ్యక్తులెప్పుడూ అందుబాటులో ఉండరు. ఉన్నా స్పందించరు. లంచాలు గుంజాలని అధికారులు, సిబ్బంది చూస్తే, చేతులు దులుపుకోవాలని జనాలు చూడడం విడ్డూరం.
విద్యారంగం విషయానికి వస్తే అన్ని ఆవాస ప్రాంతాల్లో పాఠశాలలుంటాయి. అధునాతన కంప్యూటర్లు, బోధన సామ గ్రి ఉంటుంది. ఉచిత పుస్తకాలు, డ్రెస్సులు, మధ్యాహ్న భోజ నం (పెడితే మంచి పౌష్టికాహారం) వుంటుంది. కాచి, వడపోసి, ఎంపిక చేసిన ఉపాధ్యాయులుంటారు. ఉన్నత పాఠశాలల్లోనైతే విషయాల వారీగా నిపుణులుంటారు. వీరి ఎంపిక విధానం చూస్తే వీరెంత నిష్ణాతులో అని అనుకుంటాం. కాని వారిపై వారికే విశ్వాసముండదు. తెలుగు మాధ్యమంలో కాకున్నా, వారు పనిచేసే ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లోనైనా వారి పిలల్లని చదివించని అధైర్యులు. ఆటల ఉపాధ్యాయుడుంటాడు. ఇదే ఆవాస ప్రాంతంలో 1-2 అంగన్ వాడి పాఠశాలలుంటాయి. ఓ ఆయా ఉంటుంది. కావలసినంత భోజన సామగ్రితోపాటు నోరూరించే పౌష్టికాహారం సరఫరా అవుతుంది. హాజరు పట్టిలో 30 మంది పిల్లకాయలుంటే హాజరయ్యేది ఆయాకు తెలిసిన ఒకరిద్దరు కుటుంబాల పిల్లలే. ఈ పిల్లలకు కూడా వీరు బోధించేది తక్కువ-ఐసిడిఎస్ కార్యాలయం చుట్టూ, ఉద్యమాల చుట్టూ తిరిగేది ఎక్కువ. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిస్థితి కూడా ఇదే. ఒకప్పటి వయోజన స్కూళ్లు, ఇప్పుడు ఓపెన్ స్కూళ్లుగా మారినా-ఎప్పుడు తెరుచుకోవు. అయినా సక్రమంగా జరుగుతున్నట్టు కింది నుంచి పైదాగా రిపోర్టులు.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు హైకోర్టుకు లేఖ రాయగా హైకోర్టు స్పందించిన తీరు తెలిసిందే. కాని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏంటో చూస్తూనే ఉన్నాం. చివరికి అలహాబాద్ హైకోర్టు కూడా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం అటు కేంద్ర ప్రభుత్వానికి గాని, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గాని చెవికెక్కలేదంటే, ప్రభుత్వాలు ఎంతగా మొద్దు నిద్ర నటిస్తున్నాయో అర్థవౌతున్నది. పోని, ప్రతిపక్షాలకు మేలుకొలుపు కలిగిందా అంటే అదీ లేదు. అందరిది అదే ప్రైవేటు బాటై మంత్రులతో సహా ప్రజానాయకులందరికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రైవేటు విద్యాలయాలతో సంబంధాలుండడమే ఈ దీనావస్థకు కారణమన్న కానె్ఫడరేషన్ ఆఫ్ వలంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజ్జార్ హుస్సేన్ మాటలు అక్షర సత్యాలు.
నిజానికి విద్యారంగంపై పెడుతున్న ఖర్చు తక్కువే అయినా, తలసరి ఖర్చు చూస్తే మతిపోతుంది. 50 మంది విద్యార్థులున్న పాఠశాలలో సరాసరి ముగ్గురు ఉపాధ్యాయుల్ని లెక్కేసుకున్నా, వీరి నెలసరి జీతం మొత్తం లక్ష రూపాయలు అనుకున్నా తలసరి విద్యార్థి ఖర్చు రూ.2 వేలు. పుస్తకాలు, డ్రెస్సులు, మధ్యాహ్న భోజనం, మిగతా వౌలిక సదుపాయాలు, పైనున్న విద్యాశాఖ యంత్రాంగం ఖర్చులు కలుపుకుంటే ఇది పదింతలు పెరుగుతుంది. ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారమే తలసరి విద్యార్థి ఖర్చు రూ.37,538లు. ఇక విద్యార్థుల సంఖ్యలేని 398 పాఠశాలల, 60 మందికన్నా విద్యార్థులు తక్కువగా ఉన్న 12,178 పా ఠశాలల్లో ఈ ఖర్చు ఊహించనంతగా ఉంటుంది. అనగా ప్రతి విద్యార్థిపై 40-50 వేల ఖర్చు చేస్తున్న పాఠశాలలున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లలో చేసిన సర్వేలు కూడా ఇదే తెలిపాయి.
ఈ లెక్కన ప్రైవేటు విద్యా సంస్థల్లో హైదరాబాద్, విశాఖ తదితర నగరాలతో సహా ప్రతి విద్యార్థిపై తల్లిదండ్రులు పెట్టే ఖర్చు చాలా తక్కువనే. ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సరాసరి జీతం రూ.10వేలకు మించదు. ఇందులో అశిక్షితులు అత్యథికమైతే, శిక్షణ గలవారు చాలా తక్కువ. అయినా వీరంతా నిష్ణాతులు కాగా, ఇక్కడి విద్యకు ఘాటెక్కువ. ఇందులోని రహస్యాలు ప్రభుత్వానికి తెలుసు, ఉపాధ్యాయులకు తెలుసు, అధికార్లకు తెలుసు. తెలియందల్లా గొర్రెలాంటి ప్రజలకే. ఇక విద్యాసంబంధ మేధావులది వ్యాపార సంబంధ ధోరణే. విద్యారంగం రాష్ట్రం జాబితాలో వుంటే మంచిదా, ఉమ్మడి జాబితాలో ఉంటే మంచిదా పట్టించుకోరు. జనమంతా ఆంగ్ల మాధ్యమం అంటున్నారని (భ్రమింపజేసేది ఈ వర్గమే) ఆంగ్ల మాధ్యమం కావాలంటారు. కొందరైతే 10 మంది విద్యార్థులున్నా, పాఠశాలలకు కూడా ఎన్+1 సూత్రాన్ని వర్తింపజేస్తారు. పరిష్కారం చెప్పరు. మరికొందరు ఇవేవి పట్టించుకోకుండా వౌలిక సదుపాయాలు కల్పించాలంటూ నినదిస్తారు. విద్యాహక్కు చట్టం గాని, ఇందులోని లోపాలు కాని పట్టనివారు అనేకులు. విద్యాపరంగా వీరంతా సమాజానికి అటించిన అంటురోగం-ఆంగ్ల మాధ్యమాన్ని, పాఠశాలలకు తోకల్ని, ఐఐటి ఫౌండేషన్లని, ఎంసెట్ ఉరితాళ్లని! ఇంట్లోని పెంపుడు జంతువులకు ఇచ్చే స్వేచ్ఛను కూడా స్వంత పిల్లలకు ఇవ్వకుండా, స్థానికంగా ఉన్న పాఠశాలల్ని కాదని టెక్కులకు లోనై సూదూర ప్రాంతాల్లోని పాఠశాలల్లో లక్షల రూపాయల్ని పోసి పిల్లల్ని బందీ చేయడం జరుగుతున్నది.
ఈ బలహీనతల్ని ఆసరాగా చేసుకునే కొన్ని యాజమాన్యాలు తమ పాఠశాలలు అంతర్జాతీయ బోర్డులైన ఐబి, ఐజిఎస్‌ఇ, రుడోల్ఫ్ స్టినెర్ లాంటి తదితర దేశాల బోర్డులకు అనుబంధం అని ప్రచారం చేస్తే లక్షలాది రూపాయల్ని కుమ్మరించి చేర్పిస్తున్నారు. నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. పైగా ఈ పాశ్చాత్య బోర్డులకు అనుగుణంగా ఇక్కడి మండు వేసవిలో కూడా పాఠశాలల్ని నడిపి, అక్కడి వేసవి సెలవుల్లో (జూన్-ఆగస్టు)ల్లో ఇక్కడ సెలవులు ఇవ్వడం జరుగుతున్నది. చివరికి తెలంగాణ ప్రభుత్వం ఈ విధానానికి మొగ్గు చూపడం శోచనీయం. పోనీ, మన బోర్డులకు అనుబంధంగా ఏ దేశమైనా ఒక్క పాఠశాలను నడపడం లేదనేది మరెవ్వరికీ పట్టడం లేదు. మన బతుకంతా అనుకరణనే!
ఇక పుస్తకాల బరువుతో పాటు, అందులోని విషయ భారాన్ని కూడా తగ్గించాలని 1993లోనే యశ్‌పాల్ కమిటి సిఫారసు చేస్తే ప్రభుత్వాలకు పట్టకపోగా, తల్లిదండ్రుల పుస్తకాల సంఖ్యకు, మందానికి మురిసిపోతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచైతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పుస్తకాల్ని ఆప్స్‌లో, ఇంటర్‌నెట్‌లో పెట్టామని, పిల్లలకుపుస్తకాల భారాన్ని తగ్గించామని చెబుతున్నా, ఇది ఆచరణలో ఎంతమేరకు సాధ్యమో తెలియడం లేదు. పుస్తకాలతో పాటు టాబ్లెట్లను కూడా బలవంతంగా కొనాల్సి వస్తుంది.
ఇంత అస్తవ్యస్తంగా ఉన్న విద్యారంగం బాగుపడాలంటే, కొఠారీ తోపాటు హైదరాబాద్, అలహాబాద్ హైకోర్టులు ఆదేశించినట్టు అధికారుల, ప్రజా నాయకుల, ఉపాధ్యాయుల పిల్లలందర్ని నైబర్‌హుడ్ పాఠశాలల్లనే చదివించాలి. మాధ్యమం (మాతృభాషనే శాస్ర్తియమైనది) ఏదైనా అందరికి కామన్ విద్యా బోధన జరగాలి. ఈలెక్కన కెసిఆర్ తను చదువుకున్న దుబ్బాక పాఠశాలకు ఏకంగా దాదపు రూ.11 కోట్లను మంజూరు చేశారు. రాష్ట్రంలోని మిగతా పాఠశాలలకు, ఇంతే మొత్తంలో మంజూరు చేయకున్నా పర్వాలేదు కాని-తన మనుమల్ని ఆదే పాఠశాలలో చదివిస్తే (ఆంగ్ల మాధ్యమంలోనైనా) ప్రభుత్వ విద్యకు పట్టుకున్న చీడ క్షణాల్లో వదులుతుంది. ప్రభుత్వ విద్య మహోజ్వలంగా వెలుగొందుతుంది. ఒక్క దెబ్బకే ప్రైవేట్ పాఠశాలలు మూతపడతాయి. వీటికి తోడుగా భాలల భారాన్ని తగ్గించి (గతంలో ఆరో తరగతి నుంచి త్రిభాషా సూత్రం అమల్లో ఉండేది), ఉపాధ్యాయుల నియామకాల్ని శాస్ర్తియంగా (్ఢఎస్‌సీలు టెట్‌లు లేకుండా) అమలు చేస్తే ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాసంవత్సరం కొనసాగుతుంది. పిల్లలకు మానసిక ఒత్తిడి, ప్రయాణ భారాలు తగ్గుతాయి. ఆడుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రజల డబ్బు ఆదా అవుతుంది. ప్రభుత్వం పెట్టే ఖర్చు సార్ధకవౌతుంది. ఇది జరగాలంటే, కావలసింది పౌర స్పందననే!
(అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగ స్ఫూర్తితో-ఆయన స్మృతి పథంలో)