మెయన్ ఫీచర్

భూగోళం కిటకిట.. సౌకర్యాలకు కటకట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడి దాహం తీరలేదు.. అనే్వషణ కొనసాగుతోంది.. ఆవిష్కరణలు అనునిత్యం జరుగుతునే ఉన్నాయి.. అంతరిక్షంలో సైతం కాలుమోపడమే కాదు.. అక్కడ కూడా జీవితాన్ని ప్రారంభించే దిశగా వేస్తున్న అడుగులు వడివడిగానే పడుతున్నాయి.. ఇప్పటికే అమెరికా ఓ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనిషి కూడా తన సంసారాన్ని అంతరిక్షంలో కొనసాగించే రోజు ఎంతో దూరంలో లేదు. నవగ్రహాల్లో మనిషి తన ఉనికి చాటుకుంటున్నా ఇంకా ఆ దాహం తీరదు. దానికి కారణం మనిషి పుట్టుక ఒక నిరంతర ప్రక్రియ కావడమే. ప్రతి రోజూ లక్షల్లో జనం పుడుతున్నారు, ప్రతి రోజూ లక్షల్లో జనం మరణిస్తున్నారు. మనిషి జీవనకాలం పెంచే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. అంటే ఎప్పటికీ మరణం లేని మనిషిని చూడాలనే కాంక్ష కూడా పెరుగుతోంది.
అనునిత్యం జనాభా పెరుగుతున్నా, మరోవైపు- ‘మరణించేవారు లేని ఈ లోకం’ గురించి మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందని ఆలోచిస్తే భయం కలగడం తథ్యం. మనిషి అవసరాల కోసం ప్రకృతి వనరులు అన్నీ బలి అవుతున్నాయి. పంచభూతాలు దుర్వినియోగం అవుతున్నాయి. సహజ వనరులు తగ్గిపోతున్నాయి. కృత్రిమ వనరులపై ఆధారపడడం పెరిగిపోతుంది. ఇదే జరిగితే ఈ లోకం ఏం కావాలి? 1750లో 12.5 కోట్లు ఉన్న భారతదేశం జనాభా నేడు 128 కోట్లకు చేరుకుంది. ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం భారత జనాభా ఇంకా 116.90 కోట్లు. అంటే- మన భారతీయులు అంతా ఒకరిపై ఒకరు నిల్చుంటే నేరుగా మనం చంద్రుడ్ని చేరుకోవచ్చు. అంతే కాదు 30 మార్లు చంద్రుడ్ని దర్శించవచ్చని గణిత శాస్తజ్ఞ్రులు సరదాగా చెప్పినా, ఈ సీరియస్ విషయం ఎవరికీ ఎందుకు పట్టడం లేదు..?
ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద సవాళ్లు ఏమిటని ఐక్యరాజ్య సమితి ఇటీవల ఓ సర్వే నిర్వహించగా, అందులో వెల్లడైన అంశాలు పరిశీలిస్తే ఆహారం, నివాసం, కాలుష్యం, వౌలిక సదుపాయాలు, యుద్ధవాతావరణం అని తేలింది. ఈ ఐదు అంశాలు మానవ జీవన గమనాన్ని శాసించేవే. నేడు సాంకేతిక సమాచార పరిజ్ఞానం పుణ్యమాని ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని చెప్పుకోవడం కంటే కుగ్రామం ప్రపంచం అంత విశాలంగా మారిపోయిందని అంటే బావుంటుందేమో.
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భవిష్యత్ సవాళ్లను అర్ధం చేసుకోకపోవడం, ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు, పారదర్శకత లోపించడం, మూఢ నమ్మకాలు, అవిద్య, మహిళా సాధికారత లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో భారతదేశంలో జనాభా నియంత్రణపై అంతగా పట్టింపు లేకుండాపోయింది. ప్రభుత్వం 1976లోనే ‘్భరత్ పాపులేషన్ కంట్రోల్ పాలసీ’- జనాభా నియంత్రణ పథకాన్ని అమలులోకి తెచ్చింది. దీనివల్ల జనాభాను మన ఆర్థిక రంగానికి అనుగుణంగా నియంత్రించాలని చూసింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, జనజీవన శైలిని, ప్రమాణాలను వృద్ధి పరిచే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి ఈ భూమి మీద 700 కోట్ల జనాభాకు సరిపడా పౌష్టికాహారం అందుబాటులో లేదు. కనీసం వంద కోట్ల మందికి సాధారణ ఆహారం కూడా దొరకడం లేదు.
ప్రపంచంలో వంద కోట్ల జనాభా దాటిన దేశాలు చైనా, భారత్ కాగా, 50 కోట్ల జనాభా దాటిన దేశాలు 23 ఉన్నాయి. 10కోట్లు దాటినవి 80 దేశాలు కాగా, కోటి జనాభా దాటినవి 153, లక్ష జనాభా దాటినవి 187 ఉన్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న దేశాలు 34 వరకూ ఉన్నాయి. వాటికన్ సిటీ జనాభా 800 మంది మాత్రమే. పిట్ కెయిర్న్ దీవి జనాభా కేవలం 50 మంది మాత్రమే. ప్రపంచంలోనే అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశాల్లో భారతదేశం మినహాయింపు పొందలేదు. పేదిరికం బాగా ఉన్న దేశాల్లో జాంబియా, నైజీరియా, మాలి, టాంజానియా, బరిండి, నైజర్, మడగాస్కర్, రువాండా, జింబాబ్వే, గాంబియా, బంగ్లాదేశ్, నికారుగ్వా, ఆ తర్వాతి స్థానం మనదే. అక్షరాస్యత పరంగా చూసుకుంటే ప్రపంచంలో భారతదేశం 142వ స్థానంలో ఉంది. కడు పేదరికంలో ఉన్న నైజీరియా, జాంబియాలు సైతం భారత్ కంటే అక్షరాస్యతలో ఉన్నతంగానే ఉన్నాయి. జననాల రేటు ప్రతి వెయ్యి మందికి 20 వరకూ ఉండగా, భారత్‌లో అది 22.01గా ఉంది, జర్మనీలో 8.28 కాగా, నైజర్, మలి, ఉగండ, ఆఫ్గన్, సియెర్రా, సోమాలియా, అంగోలాలో ఎక్కువగా ఉంది. జనసాంద్రతలో భారత్ 31వ స్థానంలో ఉండగా, చైనా అగ్రస్థానంలో ఉంది. 1907 నాటి లెక్కలు తీసుకున్నా చైనా అగ్రస్థానంలోనే ఉంది. బ్రిటిష్ ఇండియా, రష్యా సామ్రాజ్యం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, జర్మనీ, ఫ్రాన్స్, యుకె, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదే నేటి లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక జనాభాతో చైనా అగ్రస్థానంలో ఉండగా, భారత్ , యుఎస్, ఇండోనేషియా,బ్రెజిల్, పాక్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యా, జపాన్, మెక్సికో, ఫిలిప్పీన్స్, వియత్నాం, జర్మనీ, ఇథియోపియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జనస్థిరీకరణ, నియంత్రణ, ప్రస్తుత ఆర్థిక రంగానికి అనుసంధానం చేస్తే జన జీవనజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుంది. భూమాతపై భారం తగ్గుతుంది. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం జనాభా పెరుగుదలను తగ్గించకుంటే- ప్రకృతే ఆ పనిని సమూలంగా చేపడుతుంది. భూకంపాలు, సునామీలు, వరదలు వంటి బీభత్సాలతో అధిక భారాన్ని భూమాతే తగ్గించుకుంటుంది. కనుక జనాభా నియంత్రణ అందరి కర్తవ్యమని గుర్తించాల్సిన రోజు దగ్గరపడింది.
జనాభా పెరిగితే ఏమవుతుంది..? ఆహారం దొరకదు.. అంతే కదా అనుకోవడానికి వీలు లేదు. ఉన్న భూభాగం వేగంగా పెరుగుతున్న జనాభాకు సరిపోదు, ఆహారం దొరకదు, నివాసం ఉండదు, కనీస వౌలిక సదుపాయాలు లభించవు, ఉద్యోగం, ఉపాధి కష్టమవుతుంది, పోషణ భారం అవుతుంది. సరిపడా తాగునీరు, సాగునీరు లభ్యం కాదు. జీవనం కష్టంగా మారుతుంది. అది సమాజానికి పెనుభారం అవుతుంది. టెక్నాలజీ పుణ్యమాని మనుషులు జాగురుకతతో చేయాల్సిన పనులను మరింత జాగ్రత్తగా 10 నుండి 20 మంది చేసే పనిని అలవోకగా చేసే రోబోలు వచ్చేస్తున్నాయి. మనిషి రోబోలకు పర్యవేక్షకులుగా మారితే మనిషి చేయాల్సిన మేధోసంపన్నమైన కార్యక్రమాలను రోబోలే చక్కదిద్దే రోజు మున్ముందు ఉండబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి మారాల్సిన రోజు దగ్గరపడింది.
అందుకే జనాభా అధ్యయనంపై అందరి దృష్టి పడింది. సామాజిక శాస్త్రంలో జీవశాస్త్రంలో జనాభా అనే పదానికి అర్థం ఒక జాతికి చెందిన సంఖ్య చెప్పడానికి వాడుతున్నారు. ‘పాపులేషన్’ అంటే సముదాయం అని అర్థం. జనాభా అంటే ప్రస్తుతం మానవజాతి జనసంఖ్యగా చూస్తున్నాం. నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒక జాతికి చెందిన జీవుల సమూహానే్న జనాభాగా గుర్తించి అధ్యయనం చేయడాన్ని ‘జనాభా జీవావరణ శాస్త్రం’గా చెబుతున్నాం. జనాభాను నిర్ధారించేందుకు జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవన విధానం, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబ నియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
జనాభాలో ప్రజల నడవడికను అనేక కోణాల నుండి చూస్తూ అధ్యయనం చేయడం ద్వారా సామాజిక శాస్త్రాన్ని, ఆర్థిక శా స్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని విశే్లషించగలుగుతాం. కొన్ని ప్రాంతాల్లో సంతానోత్పత్తిలో వచ్చే తేడాలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలతో జనాభా అకస్మాత్తుగా తగ్గవచ్చు. గతంలో అంటువ్యాధులతో లక్షలాది మంది కొద్దికాలంలోనే చనిపోవడం చూసేవాళ్లం. ప్లేగు, కలరా వంటి వ్యాధులతో ఒక్కో నివాస ప్రాంతాల్లోని ప్రజలంతా చనిపోయిన సందర్భాలున్నాయి. దాంతో ఆ ప్రాంతానికి సమీపంలోని వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం జరిగేది. ఇంకో పక్క భారత్, చైనాలు జనాభాను తగ్గించమని కోరితే జపాన్, కజికిస్థాన్, క్రొయేషియా, బెలారస్, మల్దోవా, ఇస్తోనియా, లాట్వియా, బల్గేరియా, జార్జియా, ఆర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లోవేనియా, హంగేరి, ఇటలీ, జర్మనీ, గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, సింగపూర్, బ్రిటన్ తదితర దేశాలు దంపతులు పిల్లలను కనేందుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. జపాన్‌లో నెలకు ఐదు వేలు చొప్పున 12 ఏళ్ల వరకూ చెల్లిస్తోంది. భిన్నమైన పథకాలు సింగపూర్ తదితర దేశాల్లో అమలులో ఉన్నాయి. అంతవరకూ ఎందుకు..? భారత్‌లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుండటంతో చాలా రాష్ట్రాల్లో అమ్మాయిలు పుడితే వారిపేరిట లక్ష రూపాయిలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసే పథకాలు ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం అంతా జనాభా నియంత్రణకు సంబంధించిందే. ఇప్పటికైనా జనాభాను నియంత్రించకపోతే ఆరోగ్య సమస్యలు, ఆకలి బాధలు, దొంగతనాలు, దొపిడీలు, నిరుద్యోగ సమస్య, పేదరికం, నివాస సమస్య, ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుందనేది ఐక్య రాజ్య సమితి నివేదిక స్పష్టం చేస్తోంది. పెరిగిన జనాభాకు భూమిపై స్థలం సరిపోకపోవచ్చు. ఈ అంశాలన్నింటిపై అందరిలో అవగాహన కల్పించడమే కాదు, చైతన్యం తీసుకురావాలి. దీనికి ప్రతి ఒక్కరూ పునుకోవాలి, అపుడే భూమాత భారాన్ని తగ్గించినవారవుతాము.

-బివి ప్రసాద్