మెయన్ ఫీచర్

రెండు ఫలితాలు.. ఎన్నో పాఠాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టుదల ఒక్కటే సరిపోదు, దా నికి తెలివి కూడా జోడించిన వాడే పనిమంతుడు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల సంకేతమిదే! ఈ రెండు ఫలితాలు విజేతలకు, పరాజితులకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. ప్రజాభిమానాన్ని ఓటు రూపంలో మలచుకోవడంలో విఫలమైన జగనన్న, కొద్దినెలల తేడాతో మూడు అద్భుత పరాజయాలు మూటకట్టుకోవలసి వచ్చింది. ‘సీమ’లో తన కుటుంబాన్ని ఓడించడం ఎన్టీఆర్‌కు సైతం సాధ్యం కానిది, చంద్రబాబు చేసి చూపించినప్పుడే జగన్ తన పద్ధతి మార్చుకోవలసింది. చిన్నాన్న వివేకాను ఓడించిన తర్వాతైనా జగన్ సీనియర్ల సలహాలు తీసుకుని అడుగులు వేస్తే ఇన్ని పరాజయాలను భరించాల్సిన అవసరం ఉండేది కాదు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో 13రోజులు తిష్ఠ వేసిన జగనన్న సాధించిందేమిటంటే- నోరుపారేసుకుని, సానుకూలంగా ఉన్న ఓటర్లను వ్యతిరేకం చేసుకోవడం! ఆరేళ్లు దర్జాగా ఎమ్మెల్సీగా ఉండాల్సిన నేతను మొండివాదనతో ‘మాజీ’ని చేసి పారేయడం!! అభ్యర్థికి ప్రచారం చేసుకునే సమయం ఇవ్వకుండా, 13 రోజులు తన పక్కనే ఉంచుకున్న నాయకుడు బహుశా జగన్ ఒక్కరేనేమో? ఎన్నికల ప్రచారంలో ‘కాల్చేస్తా, ఉరి తీయించేస్తానం’టే పక్కనున్న కారు డ్రైవరు కూడా హర్షించడు కదా! మరి జనం ఎలా ఆమోదిస్తారన్న కనీస స్పృహ యువనేతకు లేకపోవడమే ఆశ్చర్యం. ఈసీ నోటీసు అందుకున్న తర్వాతైనా పశ్చాత్తాపం ప్రకటించారా అంటే లేదు. అప్పుడే విచారం వ్యక్తం చేసి ఉంటే జగన్ హుందాతనాన్ని జనం మెచ్చేవారు. ‘్ఫలితం’ వచ్చాక జగన్ హావభావాలను పరిశీలిస్తే, నంద్యాల ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు, ‘గెలుపుగుర్రం కాస్తా కుంటి గుర్రమయింద’న్న కసి, ఆగ్రహం, ఆవేదన, అసంతృప్తి అన్నీ కలగలసి ఆయన మాటల్లో కనిపించాయి. ఓడిపోయిన వారు ఎవరైనా విజేతను మొహమాటానికైనా అభినందిస్తారు. కానీ జగన్ ఆ హుందాతనాన్నీ ప్రదర్శించలేదు. మీడియా ఉన్నంతసేపు వేలిని గుండెపై కొట్టుకోవడం, చిటపటలాడటం చూస్తే.. జగన్ ఇంకా తాను సీఎం కాలేదన్న కసితో ఉన్నట్లు ఆయన హావభావాలు స్పష్టం చేశాయి. పోలింగ్ ముందు వరకూ ఇది ‘రిఫరెండమే’నని చెప్పి, ఫలితం తర్వాత కాదని మడమ తిప్పిన వైనం జగనన్న ఇమేజీకి డ్యామేజీనే. అది కూడా ‘అరువుమేధావి’ పీ.కె. సలహా కామోసు!
రెండు ఫలితాలు ఎలా ఉన్నా, జగన్ పోరాటపటిమను అభినందించాల్సిందే. టిడిపిని భయపెట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లను వార్డుల స్థాయికి ప్రచారం చేయించాల్సిన స్థాయికి తీసుకురావడం బట్టి, అధికారపార్టీ ఆయనంటే ఎంత భయపడుతోందో స్పష్టమవుతోంది. అయితే, జగన్ ఎక్కే వ్యూహ విమానం టేకాఫ్ అద్భుతంగా ఉండటం, ల్యాండింగ్‌లోనే తుస్సుమనడం ఆనవాయితీగా వస్తోంది. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ఒక కళ. అది ఇంకా ఆయనకు అబ్బినట్లు లేదు. మితిమీరిన విశ్వాసం, సీనియర్ల సలహాను పాటించకపోవడం, తాను అనుకున్నదే సరైనదన్న అడ్డగోలు భావన, అధికార పార్టీని తిట్టడమే తప్ప సద్విమర్శలు చేయకపోవడం, తన మీడియా ఉంటే చాలు ఇతరులతో పనిలేదన్న వైఖరి ఆయన పరాజయ పరంపరకు కారణాలు. జగన్‌కున్న పట్టుదల ఏ రాజకీయ నాయకుడిలోనూ కనిపించదు. అలాగే మొండితనానికీ ఆయన అన్నయ్య! పార్టీని నడిపేవారికి కావలసింది వ్యూహరచన, శ్రేణులకు దిశానిర్దేశం చేయడం. ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో చురుకుగా కదలి, మెదడును పాదరసంలా పనిచేయించడం. ఈ విషయంలో బాబు వ్యవహారశైలిని అధ్యయనం చేయాల్సింది పోయి- ఎంతసేపూ తిట్టిపోయడం, తానే అధికారంలోకి వస్తున్నానన్న కలల ప్రపంచంలో ఊరేగడం వల్ల కంఠశోష, జనం దృష్టిలో నోటిదురుసునేతగా ముద్ర పడటం తప్ప ఉపయోగమేమీ లేదు. ఇప్పుడు జరిగింది అదే! ఫలితాల తర్వాత చాలామంది జగన్ అభిమానులు- తమ నాయకుడి నోటిదురుసుతనం వల్లే ఓటమి చెందామని ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారంటే, అధినేతపై వారిలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
కోట్లు ఖర్చు పెట్టి పెట్టుకున్న కన్సల్టెంటు ‘పీకే’ చివరకు పార్టీని పీకేయించేస్తారేమోనన్న ఆందోళన పార్టీలో పెరగడం జగన్ భవిష్యత్తుకు మంచిది కాదు. డబ్బులిచ్చి పెట్టుకున్న ఈ ‘అరువు మేధావి’, సొంత మీడియాలోని భజన బృందం కలసి పార్టీని ముంచేస్తున్నారన్న విమర్శలతోపాటు, పీకేను ఎంత త్వరగా వదిలించుకుంటే అంతమంచిదన్న భావన ఇంకా జగన్‌కు తెలియకపోవడమే వింత! రాష్ట్రం, భాష, ప్రాంతాలు, కులాల గురించి తెలియని పీకే బృందాన్ని నమ్మేకంటే, సొంత మీడియాలో నిర్భయంగా, నిష్పాక్షికంగా నిజాలు చెప్పే జర్నలిస్టులను నమ్ముకోకుండా, ‘్భజనపరుల’ నివేదికలు చూసి భుజాలు చరచుకుంటున్న జగన్ అమాయకత్వానికి రెండు ఎన్నికలు సరైన ఫలితాలే ఇచ్చాయి. జగన్ ఏపిలో ఉండటం లేదు. ఆయన సొంత మీడియాలో సర్వేలు చేయించేవాళ్లు, సంస్థకు దిశానిర్దేశం చేసేవారంతా పొరుగురాష్ట్రంలో ఉంటూ ఏపి గురించి తెలియని మేధావులే. అందువల్ల వీరిచేతుల్లో పడి తమ రాజకీయ జీవితం ఏమవుతుందోనని సీనియర్లు బెంగపడటం సహజమే. సొంత గడ్డకు వచ్చి రాజకీయాలు చేయకుండా, అరువు ఆలోచనలపై ఆధారపడితే ఫలితాలు ఇంతకు మించి భిన్నంగా ఉండవు. రెండు ఎన్నికల్లో ఓడినంత మాత్రాన పోయేదేమీ లే దు. ప్రపంచం ఎప్పుడూ విజేతల గురించే చర్చించుకుంటుం ది. దాన్ని గుర్తించి ఫలితాలను గుణపాఠంగా తీసుకుంటేనే జగన్‌కు భవిష్యత్తు. లేకపోతే జగనన్న వస్తున్నాడని ఎంత ‘టముకు’ వేసినా ఫలితం ఉండదు!
* * *
రెండు అద్భుత విజయాలు సొంతం చేసుకున్న చంద్రబాబు అభినందనలకు అర్హుడే. బిజెపి తోడు, జనసేన నీడ లేకుండా సాధించిన ఈ విజయం అపూర్వమే. పరీక్షల్లో పాసయ్యావా? లేదా? అని అడుగుతారే తప్ప, ఎలా పాసయ్యావని అడగరు. ఎన్నికలూ అంతే. ధన ప్రభావంతోనే టిడిపి గట్టెక్కిందన్న వైసీపీ ఆరోపణ హాస్యాస్పదం. ఎందుకంటే ఓటుకునోటులో రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలే. కాకపోతే ఒకరు ఎక్కువ. మరొకరు తక్కువ అంతే! ప్రజలు కూడా ఆశతో చేయి చాచడానికి సిద్ధంగా ఉన్నందున ఈ ఆరోపణలకు విలువే ఉండదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను మోహరించి ఆ స్ధాయిలో వనరులు అందించిన టిడిపి కష్టానికి- మంచి ఫలితమే దక్కింది. ఈ విజయంతో టిడిపి పొంగిపోవలసిందేమీ లేదు. నంద్యాలలో శిల్పా కాకుండా రాజగోపాల్‌రెడ్డి, మరొకరో అయి అభ్యర్ధి అయి ఉంటే కథ మరోలా ఉండేది. కాకినాడది మాత్రం అసలు సిసలు విజయమే. దక్కిన విజయం తెదాపాకూ పాఠమే. మారుతున్న ఓటరు మనోగతం, వారి ఆశల స్థాయి, ఇప్పుడు ఏయే అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయన్న విషయాలు అవగాహనకు వచ్చేందుకు ఈ రెండు ఎన్నికలు ఒక పాఠంగా తీసుకోవాలి. జగన్ అండ్ కో చెప్పినట్లు, విజయం-అధికారం శాశ్వతం కాదు. గతంలో జరిగిన అనేకానేక ఉప ఎన్నికల్లో ఓడిన టిడిపి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నిక విజయంలో అనేక అంశాలు కలసివచ్చాయి. అవే అంశాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉంటాయనుకోవడం భ్రమ. రెండు ఎన్నికల్లోనూ వైసీపీ ఓడింది కాబట్టి సహజంగానే అధికార పార్టీపై రాబోయే ఎన్నికల్లో భారీ అంచనాలు సహజం.
చంద్రబాబు మంత్రాంగంపై ఎవరికీ అపనమ్మకం ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నికల సమయంలో ఆయన బుర్ర పదింతలు ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఇప్పుడూ అదే జరిగింది. ఈ రెండు ఫలితాలే భవిష్యత్తుకు ప్రాతిపదిక అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేలపై జనంలో అసంతృప్తి కొనసాగుతోంది. రెడ్డి, ఎస్సీ, మైనారిటీ సామాజికవర్గంలో జగన్ పట్ల ఆరాధనా భావం తగ్గలేదు. నంద్యాలలో శిల్పాపై వ్యతిరేకతతో మాత్రమే అక్కడి మైనారిటీలు భూమాను గెలిపించారని, సోమిరెడ్డి వ్యూహంతో రెడ్ల ఆధిక్యాన్ని తగ్గించారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఏదేమైనా ఈ ఫలితాలు టిడిపిలో విజయగర్వాన్ని పెంచకపోతేనే మరింత భవిష్యత్తు!
* * *
‘అక్క ఆర్భాటమే తప్ప బావ బతికుంది లేదన్నట్లు’.. కాపులను టిడిపికి ఎంత దూరం చేయాలన్నా ముద్రగడకు సాధ్యపడటం లేదు. కాకినాడ, నంద్యాల ఉప ఎన్నికలో ఆయన సామాజిక వర్గం టిడిపికి ‘కాపు’కాయడమే ఇందుకు నిదర్శనం. టిడిపిని ఓడించాలని పిలుపునిచ్చిన ముద్రగడ, పోనీ ఎవరిని గెలిపించాలనో చెప్పినా బాగుండేది. సొంత జిల్లాలోనే చెల్లని రూపాయి, రాష్ట్రంలో ఎలా చెల్లుతుందన్న ప్రశ్నాస్త్రాలు తన సామాజిక వర్గంలో పెరగడం సహజమే. తాజా ఫలితాల తర్వాత ఇక ముద్రగడకు- మీడియాలో ‘డైలీ సీరియల్ మాదిరి’ వస్తున్న ప్రచారానికి తెరపడక తప్పదేమో!
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144