మెయన్ ఫీచర్

అవినీతి బాగోతం తెలిసినా వౌనమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో ఒక సాయంత్రం!
భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ అల్పాహారం సేవిస్తున్నారు. ఇంతలో పానకంలో పుడకలా ఒక ప్రముఖుడు వచ్చి రాజుగారి దర్శనం చేసుకున్నాడు.
ఆ వచ్చిన వ్యక్తి పేరు సిన్హా- ఈయనను ‘కాగ్’ అధిపతి అంటారు.
‘‘మహాప్రభూ! నా పేరు సిన్హా- నేను కాగ్- ఇడి పక్షాన తమకు కొన్ని రహస్య పత్రాలు సమర్పించుకోవాలని వచ్చాను’’అన్నాడు.
‘‘దానిదేముంది? టేబిల్‌మీద పెట్టి వెళ్లిపోండి’’.
‘‘అమ్మమ్మా.. అలా టేబిల్‌మీద కాఫీ కప్పులలోను పెట్టే వ్యవహారంకాదు. ఇవి పదకొండు రహస్య దస్త్రాలు. ఒక్కొక్క ఫైలులోను ఒక్కొక్క కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన అవినీతి భాగవతం ఉంది’’.
‘‘ఎవరా వ్యక్తులు? ఏమా కథ?’’
‘‘ఆ వ్యక్తులలో ఒకాయన పేరు ఎ.కె.ఆంటోని.’’
‘‘ఔనౌను. నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా వున్నప్పుడు ఆ పేరు విన్నాను. షేక్స్పియరు రచించిన ఒక నాటకంలో ఈ రోము దేశానికి చెందిన ఆంటోనిగారు వస్తారు’’
‘‘మహానుభావా? ఈ ఆంటోనీగారు కేరళ రాష్ట్రానికి చెందిన హీరో. ప్రస్తుతం వీరు భారతదేశ రక్షణ మంత్రి’’.
‘‘ఓహో ఆలా చెప్పండి. మరి ఇంకో పేరు ఏమిటి?’’
‘‘ఆయన పేరు పి.చిదంబరం. తెల్లబట్టలు వేసుకుంటాడే ఆ తమిళ హీరో’’.
‘‘ఇంకొక పేరు చెప్పండి’’
‘ఆయన పేరు సల్మాన్ ఖుర్షీద్- మరొక పేరు లల్లూప్రసాద్ యాదవ్. ఇంకొక పేరు ఎ.రాజా- ఇంకొక పేరు కార్తి చిదంబరం- ఇంకొక పేరు..’’
‘‘సహస్రనామాలు తరువాత చదువవచ్చు. ఇంతకూ వీరంతా ఏం చేశారు?’’
‘‘్ఫర్జరీలు జరిగాయి. మనీలాండరింగ్ జరిగింది. కంపెనీలలో అసలు పేర్లు తీసివేసి బినామీ పేర్లు పెట్టారు. డబ్బు వర్జిన్ ఐలాండ్, పనామా బ్యాంక్ మారిషస్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి సుదూర ప్రాంతాలకు తరలించారు’’.
‘‘అయ్యా! సిన్హాగారూ ఇదంతా అయోమయంగా ఉంది. వెళ్లి సోనియాగాంధీతో చెప్పుకోండి’’.
‘‘మహాప్రభూ! అందుకు భారత రాజ్యాంగం ఒప్పుకోదు- ఎందుకంటే భారతదేశానికి ప్రస్తుతం తమరే ప్రభువులు’’.
‘‘సరే! తమరు దయచేయండి- ఏం చేయాలో నేను ఆలోచిస్తాను’’-
సిన్హా నిష్క్రమించాడు.
మన్మోహన్‌సింగ్ సోనియా గాంధీకి ఫోన్ చేశాడు.
‘‘ఏమిటి బాబాయ్- మంచి నిద్ర చెడగొట్టారు?’’
‘‘ఇక్కడేదో గొడవ జరుగుతున్నది. అర్జెంటుగా ఒకసారి రావాలి’’’.
సోనియాగాంధీ తన రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సహా వచ్చింది.
‘‘బాబాయ్ ఏమిటా హడావుడి?’’
‘‘సింగుగారు కంగారు పడుతున్నారంటే ఏదో ప్రమాదం ముందుకొచ్చిందనే కదా అర్థం. కాగ్ రిపోర్టులు పదకొండు బహిర్గతం కాబోతున్నాయి’’.
అహ్మద్ పటేల్ ఆ ఫైళ్లను పరిశీలించాడు.
విషయం ఏమిటో ఆయనకు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినప్పుడు ఉండే అనుభూతి కలిగింది.
‘‘మేడమ్! విషయం తెలిసిపోయింది. ఇవన్నీ టైం బాంబులు - ఇందులో మన కేంద్ర మంత్రులంతా ఇరుక్కొన్నారు’’.
‘‘ఐతే ఏం చేయాలి?’’ సిగ్నోరా ప్రశ్నించింది.
‘‘మహాప్రభూ! మీకు మళ్లీ ప్రధానమంత్రి కావాలనే కోరిక వుందా లేదా?’’
‘‘ఎందుకు లేదు? ఆ పదవి కోసమే కదా బంగారం లాంటి యూనివర్శిటీ ప్రొఫెసర్ పోస్టు వదిలిపెట్టి రాజకీయాలలోకి వచ్చాను. 2014 తర్వాత కూడా నాకు ప్రధాని కావాలని ఉంది’’.
‘‘ఇంకేం మరి ఈ ఫైళ్లు వెలుగులోకి వస్తే అది సాధ్యపడదు’’.
‘‘ఐతే ఏం చేయాలి?’’
‘‘చించిపారేయండి’’ అన్నది సిగ్నోరా.
అహ్మద్ పటేల్ ఓ క్షణం ఆలోచించి, ‘‘మేడం! కాగ్ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ సంస్థ- అందుకని ఫైళ్లను చించివేస్తే గొడవలు అవుతాయి. అలాగని వాటిని లోక్‌సభకు సమర్పించడానికి కూడా వీలు లేదు. ప్రతిపక్షాలు వీటిని ఎన్నికలలో ఆయుధాలుగా వాడుకుంటారు.
‘‘ఐతే ఏం చేయాలి?
‘‘సిన్హాను పిలిచి నివేదికలను డీప్ ఫ్రీజర్‌లో పడేయాలి అని చెప్పండి’’.
‘‘అంతేకదా! ఇది చాలా చిన్నపని’’ అని మన్మోహన్ సింగ్ అలాగే చేశాడు.
‘‘మిత్రమా! ఈ పదకొండు నివేదికలను 2015 వరకు బయటకు తీసుకుని రావద్దు. ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నట్లే నటిస్తూ ఉండండి’’.
అలాగే కాగ్ రిపోర్టులు తొక్కిపెట్టబడ్డాయి. కాకుంటే డామిట్ కధ అడ్డం తిరిగింది. 2014లో యుపిఎ ప్రభుత్వం స్థానంలో ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చింది.
ఈ రామాయణంలో ఒక పిడకల వేట కూడా వుంది.
పాట్నానుండి జెడియుకు చెందిన ఒక మంత్రిగారు న్యూఢిల్లీ వచ్చి మన్మోహన్‌సింగ్‌గారిని కలిశాడు.
‘‘మిత్రమా! ఏమిటి విషయం?’’ అని సింగుగారు ప్రశ్నించారు.
‘‘లల్లూప్రసాద్ యాదవ్ పీకలలోతు అవినీతిలో మునిగిపోయాడు. కోట్లకు కోట్లు డబ్బు స్వాహా చేస్తున్నాడు. రైల్వేలకు సంబంధించిన కాంటీన్ల టెండర్లలో గోల్‌మాల్ జరిగింది’’.
మన్మోహన్‌జీ ఇలా అన్నారు- ‘‘మీరు చెపుతున్న గొడవ రైల్వే శాఖకు సంబంధించింది కదా! మరి మీ ఆరోపణలను రైల్వే మంత్రిగారికి లిఖితపూర్వకంగా సమర్పించుకోండి.’’
జెడియు మంత్రి బిక్కమొహం వేశాడు.
ఎందుకంటే కేంద్ర రైల్వే శాఖమంత్రి సాక్షాత్తు లల్లూప్రసాద్ యాదవ్‌గారే!
అంటే ‘‘మీరు దొంగలు కాబట్టి మీపై మీరు జరిపించుకోవాలి’’ అని తన ఆరోపణలను లల్లూ ప్రసాద్‌కు దర్యాప్తు లల్లూ ప్రసాద్‌కే అందజేయాలని అర్థం!!
ఈ ప్రహసనం ఆ మధ్య ఇంగ్లీషు టివి చానల్‌లో నాతో పాటు కోట్లాది భారతీయులు చూచారు.
ఇప్పుడు మనం పరిశీలింపవలసిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి.
2018 నవంబర్‌లో లోక్‌సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ‘ఏకకాలం’లో ఎన్నికలు నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని ఎన్నికల సంఘం ఈ మధ్య ప్రకటించింది. ఇలా ఏడాదిలో ఎన్నికలు రాబోతుండగా ఈ రహస్య దస్త్రాలకు సంబంధించిన సమాచారం ఎందుకు వెలుగులోకి వచ్చింది?
2014 మేలో నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చారు కదా, మరి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోను ఈ కుంభకోణాల ఫైళ్లు ఎక్కడున్నాయి? వాటిని పార్లమెంటుకు ఎందుకు సమర్పించలేదు??
మోదీగారి మూడేళ్ల పుణ్యకాలం హారతి కర్పూరంలా హరించుకొనిపోయింది. ఇప్పటివరకూ ఒక్క దొంగ జైలుకు పోలేదు. ఒక్క రూపాయి వెనుకకు రాలేదు. లోగడ ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. వేల గంటల చర్చలు టివిలల్లో జరిగాయి. వేల టన్నుల న్యూస్‌ప్రింట్ వినియోగమయింది. ఐనా ఒక్క దొంగ కూడా జైలుకు పోలేదు, ఎందుకని?
‘కాగ్’ ఫైళ్లను ఎందుకు తొక్కిపెట్టారు? అని విలేఖరులు వీరప్ప మొయిలీని ప్రశ్నిస్తే ‘ఈ కథనాలన్నీ ఊహాగానాలు’ అని కొట్టిపారేశాడు. ఈయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కూడా! 2018 ఎన్నికలలో బిజెపి మళ్లీ అధికారంలోకి రావటం దాదాపు ఖాయం. అందుకు కారణం నరేంద్ర మోదీ బలం ఎంత కారణమో ప్రతిపక్షాల బలహీనత కూడా అంతే కారణం! ఐనా ప్రయోజనం ఉంటుందా?
సునంద పుష్కర్ హత్య కేసులో శశిధరూర్ దోషి- పాక్‌తో చేతులు కలిపి ‘్భరత్ ప్రధానిని ఓడించండి’ అని కరాచీలో దునియా టీవీలో ఐఎస్‌ఐ- ఏజెంట్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన మణిశంకర్ అయ్యర్ దోషి- ఐనా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది.
ఇప్పుడీ పదకొండు రహస్య నివేదికలు పార్లమెంట్‌కు ‘కాగ్’ సమర్పించినా ఏమీ జరగదు. నమో- డిమో చేసినపుడు దీనిని ‘ఆర్గనైజ్‌డ్ లూట్’ అన్నది ఎవరో తెలుసా? ఎకనమిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ మన్మోహన్‌సింగ్- ఈయనకు మిస్టర్ క్లీన్ అని రాజకీయాల్లో పేరు వుంది. ఇప్పుడు చెప్పండి - సూపర్‌స్కాం వంటి డజన్లకొద్ది రక్షణ శాఖ కొనుగోళ్ల అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఎ.కె.ఆంటోనీని ‘మిస్టర్ క్లీన్’ అనగలమా? లక్షల కంపెనీలు 2 లక్షల కోట్ల బినామీ వ్యాపారాలు డిమో తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మన్మోహన్‌ను మిస్టర్ క్లీన్ అనగలమా?
ప్రస్తుతం 5800 బోగస్ (షెల్) కంపెనీల జాబితా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరాబ్యాంక్ వంటి కొన్ని పేర్లు కూడా వెల్లడింపబడ్డాయి. రాదాకృష్ణ పాయల్ భండార్, స్వర్ణలాభ్, ఆప్టెవ్, మార్వెల్, అనుజయ్, అశ్విని వనస్పతి, శాంతి వంటి ఎన్నో పేర్లు బయటపడ్డాయి. వీరందరికీ ఐటి శాఖ నుండి నోటీసులు అందాయి. ఒక సామాన్యుడు వంద సెక్యూరిటీలు చూపించినా బ్యాంక్ లోన్ రావటం గగనం. అలాంటిది ఈ దొంగ కంపెనీలకు విజయ్ మాల్యాలకు వెంటబడి మా దగ్గరినుండి లోన్లు తీసుకోండి అంటూ బ్యాంకులు ఎందుకు ప్రాధేయపడ్డాయి??
మరో విషయం-ఈ షెల్ కంపెనీ అధిపతులలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎన్‌సిపి, ఎస్‌పి, బిఎస్‌పిలతో సహా బిజెపి సానుభూతిపరులు కూడా ఉన్నారు. ఐతే ఏమిటి? ఎవ్వడూ చట్టానికి అతీతుడు కాదు. పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులను ఈ పరిధి నుండి తప్పించాలి అని వీధి సత్యాగ్రహాలు చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగారే!!

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్