మెయన్ ఫీచర్

అతి చేరువలో కాంగ్రెస్ ముక్త భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి హిమాలయ పాదసానువుల్లో ఉంటే, మరొకటి కన్యాకుమారి తీరంలో ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత వెలువడిన అతిపెద్ద ప్రజాభిప్రాయం (జనాదేశ్)ఇది. ఈ ఎన్నికలు మోదీ పాలనపై తీర్పు అంటూ ప్రతిపక్షాల వారు ఈ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు. నిజానికి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీల్లో భాజపాకు లోగడ అస్తిత్వం నామమాత్రమే. కాబట్టి ఇది భాజపా పాలనపై తీర్పు అనడం సరికాదు. కేరళ, అస్సాంలలో కాంగ్రెస్ పాలన ఉంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పాలనపై ముఖ్యంగా సోనియా-రాహుల్ నాయకత్వంపైనే తీర్పు అనుకోవాలి. అదేం విచిత్రమో తెలియదు కాని, కాంగ్రెసు పార్టీ ఓడిపోతుంటే కమ్యూనిస్టులు కంటతడిపెడుతున్నారు.
ఎన్నికలకు ముందు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం జయలలిత ఓడిపోతున్నదని, కరుణానిధి ముఖ్యమంత్రి కాబోతున్నాడని ప్రచారం జరిగింది. జయపార్టీ కార్యాలయం ముందు నైరాశ్యం వ్యాపించింది. డిఎంకె కార్యకర్తలు బాణా సంచాలతో విజయోత్సవాలకు సిద్ధమయ్యారు. కాని అనూహ్యంగా జయలలిత గెలిచింది. ఇదెలా జరిగింది? అమ్మ క్యాంటీన్ల వల్ల సెల్‌ఫోన్ వితరణల వల్ల గెలిచిందంటే నమ్మలేం మరి. కరుణానిధి కూడా కలర్ టివిలు పంచిపెట్టించాడు కదా. కాంగ్రెస్‌తో కలిసి కూడా కరుణానిధి ఎందుకని విజయం సాధించలేకపోయాడు? బహుశా కాంగ్రెస్ ముక్త భారత్ వ్యూహం లో అంతర్భాగంగా తమిళనాడులో ‘దేశభక్తులు’మూకుమ్మడిగా కరుణానిధికి వ్యతిరేకంగా ఓటు వేశారా? విశే్లషణ చేపట్టవలసి ఉంది. కరుణానిధి వయస్సు 92 సంవత్సరాలు. ఆయన కొడుకులిద్దరికీ పడటం లేదు. అంటే ఒక రాజకీయ పార్టీగా ద్రవిడ మునే్నట్ర కళగం చరిత్ర ముగుస్తున్నది. హిందీ-హిందూ-సంస్కృతం-సంస్కృతి అనే మాటలు బొత్తిగా గిట్టని పార్టీగా పేరుపడింది. కెప్టెన్ విజయకాంత్ పార్టీ గాల్లో కలిసిపోయింది.
తమిళనాడులో వరదలు వచ్చాయి. దాని వల్ల చెన్నై నగరంతో పాటు మరొక యాభై నియోజకవర్గాలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ జయలలితకు పట్టున్న ప్రాంతాలు. జయలలిత అనారోగ్యం వల్ల స్టాలిన్ వలె ప్రచారంలో పాల్గొనలేకపోయింది. జయలలితను కర్ణాటక కోర్టు శిక్షించింది. అయినా జయ ఛరిష్మా ఎందుకు తగ్గలేదు? జయలలితను ఓడించచడం కోసం గులాంనబీ ఆజాద్‌ను పంపి సోనియాగాంధీ, డిఎంకెతో40 సీట్లకు బేరం పెట్టింది. ఇది తమిళనాడు ఓటర్లు సహించలేకపోయారా? లేక తెరవెనుక జయలలితతో స్థానిక దేశభక్తులు పరోక్షంగా ఎన్నికల పొత్తు పెట్టుకొని ఉండవచ్చు. మనకందిన సమాచారం ప్రకారం స్ర్తిలు పార్టీలకతీతంగా జయలలితకు ఓటు చేశారు. అమ్మ క్యాంటీన్లలో సాంబారు కూడా బాగానే ఓట్లు తెచ్చిపెట్టాయి. పాండిచ్చేరి అతిచిన్న ప్రాంతం కాబట్టి కాంగ్రెస్ గెలవడం పార్టీకి కాక స్థానిక నాయకత్వ గెలుపుగా భావించాలి.
బిహారు ఎన్నికలో బిజెపి ముక్త భారత్ అనే పిలుపు నితీశ్ కుమార్ ఇచ్చాడు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు, ముస్లింలీగ్, జెడియు, ఆర్‌జెడి వంటి యాదవ వర్గాలు కలిసి భాజపాను ఓడించాయి. అలాగే ఢిల్లీలోనూ జరిగింది. 2016మే ఎన్నికల ఫలితాలు సోనియా-కారత్ లకు ఘోర పరాజయంగా భావించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ పాలనకు ఇది నైతిక విజయం. ‘ఇండో-బాంగ్లాదేశ్ సరిహద్దులు సీల్ చేస్తున్నాము అని అప్పుడే ప్రకటన వెలువడింది. అంటే ఈశాన్య రాష్ట్రాల పాలనలో వౌలికమైన మార్పులు రాబోతున్నాయని అర్థం. కేరళలో భాజపా ఖాతా తెరిచింది. బెంగాల్‌లో పదిసీట్లు సాధించింది. అస్సాంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నది. బెంగాల్‌లో మమతమ్మ ఘనవిజయం సాధించింది. ఇది కాంగ్రెస్-కమ్యూనిస్టు కూటమికి భారత రాజకీయాల్లో ఆశనిపాతం వంటిది. ‘రాహుల్ గాంధీని నెత్తినెక్కించుకోవడం మరో చారిత్రక తప్పిదం’ అనివాళ్లు తీరిగ్గా ప్రకటిస్తారు!
తరుణ్‌గొగోయ్ రాజకీయ లబ్దికోసం విదేశీయులకు బార్లా తలుపులు తెరిచారు. వారు తమ పొట్ట కొడుతున్నారని అస్సాం, తేయాకు తోటల్లో వర్కర్లు భావించారు. అవినీతిలో తరుణ్ గొగోయ్ అప్పటికే అప్రతిష్ఠపాలైనాడు. భాజపాకు ఇది కలిసి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారీగా అక్రమ చొరబాటుదారులు అస్సాంలోకి వస్తుంటే తరుణ్ గొగోయ్ దేశ ప్రయోజనాలను పార్టీకోసం పణంగా పెట్టాడు. కాశ్మీరు, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, ఆలా ఒక్కొక్క రాష్ట్రాన్ని భాజపా వ్యూహాత్మకంగా స్వాధీనం చేసుకుంటూ వస్తున్నది. ఉత్తరాఖండ్‌లో వారి వ్యూహం కొంచెం బెడిసికొట్టింది.
బెంగాల్‌లో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ద్వారా నైతిక పతనం గాను సైద్ధాంతికంగాను ఓడిపోయినట్లయింది. ఇప్పుడు వారు కాంగ్రెస్ వారి వాయుతరంగాల కుంభకోణాలు, బొగ్గు కుంభకోణాలు, అగస్టా కుంభకోణాలు ఎలా ఒప్పుకుంటారు? ఒకప్పుడు కాంగ్రెస్ భుజానె్నక్కి కమ్యూనిస్టులు పాలన చేస్తే ఇప్పుడు కమ్యూనిస్టు వృద్ధ నాయకుడు బుద్ధదేవ్ భుజం మీద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సవారీ చేశాడు. బెంగాల్ ఫలితాలు చూసి ‘లెఫ్ట్ ఈజ్ వేస్ట్’ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయింది? ప్రభుత్వ వ్యతిరేకత అని అస్సాంలో సర్ది చెప్పడానికి యత్నిస్తున్నారు. తురుణ్ గొగోయ్ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి ఉంటే ప్రజలకు ముఖం మెత్తిందని సమానమిచ్చారు. అదే నిజమైతే బెంగాల్‌లో మమతా బెనర్జీ మీద కూడా ముఖం మెత్తి ఉండాలి. కాని అలా జరగలేదు. శారదా స్కాం, కలకత్తా ఫ్లైఒవర్ కూలడం ఇవేవీ ఓటర్లను ప్రభావితం చేయలేదు. నిజానికి ఈ పాపాలన్నింటికీ మమత బాధ్యత వహించవలసిందే. ఒక్క శారదా స్కాంతోనే లక్షల మధ్యతరగతి కుటుంబాలు వీధినపడ్డాయి. ఐనా ప్రజలు కమ్యూనిస్టులకు అధికారాన్ని కట్టబెట్టడానికి ప్రజలు ఇష్టపడలేదు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు యాభైఏళ్లుగా బద్ధ శత్రువులుగా బెంగాల్‌లో పోరాడారు. ఐనా బుద్ధదేవ్ భట్టాచార్య పక్కన రాహుల్ గాంధీని ఏచూరి సీతారాం కూర్చోబెట్టారు. ఈ వ్యూహం బెడిసికొడుతుందని ప్రకాశ్ కారత్ హెచ్చరించినా ఏచూరి వినలేదు. సరిగ్గా కారత్ చెప్పినట్టే జరిగింది. బెంగాల్‌లో కమ్యూనిస్టులు వెనకటితో పోల్చినప్పుడు 30 సీట్లు కోల్పోగా అవన్నీ మమతమ్మ ఖాతాలో వెళ్లాయి. ఇందుకు కారణం కమ్యూనిస్టు కార్యకర్తలు తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక ఎదురు తిరిగారని సమాచారం.
‘విష్ణుమూర్తి దుర్మార్గుడు’ అని ఏచూరి సీతారాం రాజ్యసభలో ప్రసంగించారు. కలకత్తా కాళిక సెక్స్ వర్కర్ అంటూ కమ్యూనిస్టులు కరపత్రాలను విడుదల చేశారు. కలకత్తా కమ్యూనిస్టుల్లో చాలామంది కాళి భక్తులు ఉన్నారన్న సంగతిని ఏచూరి విస్మరించారు. బెంగాల్‌కు సహజమైన సం స్కృతి ఉంది. దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తే ప్రజలు ఎలా క్షమిస్తారు? భారతదేశంలో కమ్యూనిస్టులకు ఎప్పుడూ బలం లేదు. ఈ కారణం చేత వారు ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. నెహ్రూ సన్నిహితంగా మెలగడం కమ్యూనిస్టులకు కలిసివచ్చింది.
కేరళలో ఏం జరిగింది? విఎస్ అచ్యుతానందన్ వయస్సు 93 సంవత్సరాలు. పార్టీలో పిన్నారాయ్ వర్గం ఆయనకు ప్రతికూలంగా ఉంది. అయినా ఎలా విజయం సాధించాడు? అంటే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల పూర్తిగా విముఖులై ఉన్నారు. సౌరవిద్యుత్ కుంభకోణం వంటివి కొన్ని కారణాలు మాత్రమే. కేరళలోని సంప్రదాయ ఓట్లను భాజపా చీల్చింది. అయితే ఇప్పుడు దేశం మొత్తం మీద కేవలం కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు సజీవంగా ఉన్నారు. త్రిపుర ప్రాధాన్యం కలిగిన ప్రాంతమే కాదు. అంటే ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ చేజారిపోయిందని అర్థం.
సోనియాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరరేంద్ర మోదీ, అమిత్ షాలపై 2004లో హత్యాయత్నాలు జరిగాయి. దీనే్న ఇషత్ జహాన్ ఉదంతం అంటారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొడితే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోతుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీవెళ్లి హెచ్చరించినా సోనియా పట్టించుకోలేదు. ఆటు తెలంగాణలో అటు నవ్యాంధ్రలో పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది.
తెలంగాణలో కెసిఆర్ వ్యూహం ముందు ప్రతిపక్షాలు చిత్తు అయినాయి. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు 46 వేల ఓట్ల ఆధిక్యతతో రికార్డు విజయం సాధించారు. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ్భారత్, మేకిన్ ఇండియా వంటి నినాదాలతోపాటు కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని కూడా ప్రముఖంగా వినిపించారు. నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త భారత్ కల ఫలించాలంటే కర్ణాటక రాష్ట్రాన్ని సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గేలనుంచి విముక్తం చేయాలి.
ఇక నితీశ్, లాలూ, కేజ్రీవాల్ వంటి వాళ్ల నోళ్లు మూతలు పడతాయి. ఎవరు ఏం చెప్పినా భారత్‌లో సోనియా-రాహుల్ శకం ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాల వల్ల రాజ్యసభలో భాజపా స్థానాలు పెరిగి బిల్లులు పాస్ చేయించుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. అసోంలో బంగ్లా చొరబాట్లు తక్షణం నిలిచిపోతాయి. బోడోలాండ్ శాంతియుతంగా పరిష్కరించబడుతుంది. అస్సాం తేయాకు తోటల్లో బిహారీలపై అత్యాచారాలు ఆగిపోవచ్చు. తమిళనాడులో స్టాలిన్ కోరలు తీసిన పులి అవుతాడు. కేరళలో మాత్రం హత్యా రాజకీయాలు ఎక్కువ అవుతాయి. కేంద్రంతో తగాదా పెట్టుకునేందుకు ఈ దశలో జయలలిత సాహసించలేదు. 2017లో పంజాబ్- ఉత్తరప్రదేశ్‌ల్లో భాజపా గెలవడానిక కావలసిన ఆత్మవిశ్వాసం ఈ ఎన్నికలు కల్పించాయి. తెలంగాణలో పాలేరు ఉప ఎన్నిక తర్వాత టిఆర్‌ఎస్ విశ్వాసం పెరగడం, కాంగ్రెస్ ఇత్యాది ప్రధాన పక్షాలకు ఆత్మస్థైర్యం తగ్గడం జరుగుతుంది. కేరళలో అచ్యుతానందన్, పిన్నారాయ్ విజయన్ ముఠాల మధ్య ఘర్షణలు ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి. అయితే కేరళలో భాజపా కాలుమోపింది. ఒక్క స్థానంలో విజయం సాధించినా చాలా స్థానాల్లో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. గతంలో ఆరుశాతం ఓట్లు కలిగిన పార్టీ ఈ ఎన్నికల్లో 15 శాతానికి పెరగడం పార్టీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.

-ముదిగొండ శివ ప్రసాద్