మెయన్ ఫీచర్

హిందువులంతా హిందువులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ శ్రీపీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద ఇటీవల మాట్లాడుతూ ప్రముఖ చలనచిత్ర నటుడు కమలహాసన్ దేశద్రోహి అన్నారు. హిందువులు ఉగ్రవాదులు అంటూ కమలహాసన్ కొద్ది రోజుల క్రితం చెన్నైలో వ్యాఖ్యానించాడు. ఆ సందర్భంగా శ్రీపీఠం అధిపతి ఇలా అన్నారు. ఈ ప్రకటనలు చూశాక ఉగ్రవాదం అంటే ఏమిటి? నిజంగా హిందువులు ఉగ్రవాదులా? అని నిష్పాక్షికంగా ఆలోచించవలసిన అవసరం ఉంది.
‘హిం’ అంటే హింస. ‘దు’ అంటే దూషించడం. హింసామార్గాన్ని వదిలిపెట్టినవాడే హిందువు అని ఈ పదానికి అర్థం. అమెరికాలో రెండువేల సంవత్సరాలకు పూర్వం హిందువులు ఉండేవారు. వారి నాగరికతకు ‘‘అస్కీ సంస్కృతి’’ అని పేరు. దానినే ఇటీవల అజ్‌టెక్ కల్చర్ అని పిలుస్తున్నారు. ఈ నాగరికతా అవశేషాలు ప్రస్తుతం మెక్సికోలో మనం చూడవచ్చు. 1553లో స్పెయిన్ నుండి ఆర్మడా (పడవల దండు) వచ్చి ఈ నాగరికతను ధ్వంసం చేసింది. గ్రీసు దేశంలో ఆరువేల సంవత్సరాలకు పూర్వం హిందువులు ఉండేవారు. వారు దుర్గాదేవిని ఆలివ్ ఆకులతో పూజించేవారు. వీరి నాగరికతకు ‘హెలెనిక్ కల్చర్’ అని పేరు. తర్వాత ఆర్థడాక్స్ జూడాయిజం గ్రీసులో ప్రవేశించింది. ఓల్డ్ టెస్టిమెంటు గ్రీకు భాషలో వచ్చింది. బాగ్దాద్‌లో పూర్వం ఉపరతీశ నదీ తీరంలో యజ్ఞాలు చేస్తూ ఉండేవారు. ఇరాన్ అనే పేరు ఆర్యన్ అనే పదం నుండి పుట్టింది. టిమోజిన్ అనే మంగోలు జాతీయుడు చైనాను ఆక్రమించుకోవడానికి ముందు అక్కడ శైలేంద్ర రాజ వంశస్థులు ఉండేవారు. ఆ తర్వాత బౌద్ధమతం వ్యాపించింది. త్రివిష్టపం భారత్‌లో అంతర్భాగంగా ఉండేది. 1947 తర్వాత ఇండియానుండి బర్మా, టిబెట్, సిలోన్, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్థాన్ ఇలా చాలా ప్రాంతాలు దూరమైనాయి. ఇవన్నీ పూర్వం భారతవర్షంలో భారతఖండంలో అంతర్భాగాలు. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్నప్పుడు అక్కడ పది లక్షలమంది బౌద్ధులు చంపబడ్డారు. 3 లక్షల బౌద్ధ విగ్రహాలు నేలమట్టమయినాయి.
ఇప్పుడు చెప్పండి - హిందువులు ఉగ్రవాదులా? అదే నిజమైతే ఈ భూభాగాలన్నింటినీ ఎందుకు కోల్పోయాడు? రష్యాలోని అజార్‌బైజాన్‌లో నేటికీ నందీశ్వరుని దేవాలయం ఉంది. టర్కీలో పూర్వం వైజయంత సంస్కృతి ఉండేది. మక్కాలో విగ్రహారాధన ఉంటే దానిని మహమ్మద్ ప్రవక్త నిషేధించాడు. మహమ్మదుగారి పినతండ్రి శివునిపై శ్లోకాలు వ్రాశాడు. వాటిని ‘‘ఆయాత్’’ అంటారు. ‘నేను ఇతరులను నా మతంలోకి తెచ్చుకున్నాను. కాని నా పినతండ్రిని మాత్రం మార్చలేకపోయాను’ అని మహమ్మదుగారు బాధపడ్డారు. ప్రపంచంలోని మూడింట రెండువంతుల భూభాగాన్ని బలప్రయోగంతో క్రూసేడర్లు, జిహాదీలు, మార్క్సిస్టులు ఆక్రమించుకున్నారు. మరి హిందువులు ఎప్పుడైనా ఏ భూభాగమైనా ఆక్రమించుకున్నారా? ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఆక్రమించుకుంటున్నది. నాగాలాండ్ మేఘాలయ ప్రాంతాల్లో యూపీఏ హయాంలో ఆగస్టు 15న జాతీయ జెండా ఎగిరేది కాదు. ప్రస్తుత ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక ఈ మూడేండ్లుగా మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఆగస్టు 15నాడు త్రివర్ణపతాకం, రెపరెపలాడుతున్నది. ఇప్పటికీ హైదరాబాద్ పాతబస్తీ, కశ్మీర్ లోయలో పాకిస్తాన్ పతాకం ఎగురవేస్తున్నవారున్నారు. ఇప్పుడు చెప్పండి హిందువులు ఉగ్రవాదులా? అదే నిజమైతే తమిళనాడులో కేరళలో రోజూ హిందువులు ఎందుకు తన్నులు తింటున్నారు? సీపీఎం సీనియర్ నాయకుడు ఋతువ్రత ముఖర్జీ ‘‘జైహింద్’’ ‘‘వందేమాతరం’’ అన్నాడని ఆయనను పార్టీ నుంచి ఇటీవల బహిష్కరించారు. హిందూ మతోన్మాదం నశించాలి అనే సీపీఐ నాయకుడు సురవరం నోటివెంట కనీసం ఒక్కరోజైనా ‘‘జిహాదీ ఉగ్రవాదం’’ నశించాలన్న మాట రాలేదు. ముక్బుల్‌భట్ దావూడ్ ఇబ్రహీం, జకీర్‌నాయక్ ఒసామాబిన్ లాడెన్ నరుూం ఇలాంటి ఉగ్రవాదులు దేశాన్ని ముక్కలు చేయండి, హిందువులు, ఇజ్రాయిలీలకు భూమిపై జీవించే అధికారం లేదు- అని బహిరంగంగా పిలుపునిచ్చినపుడు ఈ కమల్‌హాసన్‌లు, ములాయంసింగ్ యాదవ్‌లు మణిశంకర్ అయ్యర్‌లు ఎక్కడ ఉన్నారు?
ఒకవ్యక్తి హిందువుగా హిందూ దేశంలో జన్మించినంత మాత్రాన అతడు హిందూ జీవనం గడుపుతున్నాడని భ్రమపడవద్దు. ఒకవ్యక్తి బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన అతడు బ్రాహ్మణ ధర్మాలు ఆచరిస్తున్నాడని భ్రమించకూడదు. హిందువులు నిజంగా ఉగ్రవాదులైతే కంచ ఐలయ్యలు, కమల్‌హాసన్‌లు ఇండియాలో తిరగగలిగేవారేనా? తమిళనాడులో కరుణానిధి, ఈవీ రామస్వామి నాయకర్ పెట్టే బాధలకు తట్టుకోలేక కంచి పరమాచార్య నడిచే దైవం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కాశీ పారిపోయిన సంగతి గుర్తు చేసుకోండి. ఇండియాలో హిందువుగా జన్మించడం కన్నా గాడిదగా జన్మించడం మంచిది అన్నాడు మోతీలాల్ నెహ్రూ. ఆయన పుత్రరత్నం జవహర్‌లాల్ నెహ్రూ. ‘నేను మతవిశ్వాసాల రీత్యా ముస్లిమును. విద్య దృష్ట్యా క్రైస్తవుడిని’ అన్నాడు. అంటే ఇండియాలో 125 కోట్ల మంది జనాభాలో 85 కోట్లు మాత్రమే హిందువులు. వీరుకూడా హిందూ జీవనం గడపడం లేదు. కేవలం హిందూ నామాలు ఉంటాయి. నా క్లాసులో శ్రీనివాసరావు అనే పిల్లవాడు ఉండేవాడు. ఎంఏ చదువుకుంటూ ఉండేవాడు. అతడు స్కాలర్‌షిప్ కోసం అలా పేరుపెట్టుకున్నాడు. అతని కుటుంబ సభ్యులంతా ఎప్పుడో మతం మార్చుకున్నారు. వాళ్ల ఇంట్లో శివుడు రాముడు హనుమంతుడు వంటి చిత్రపటాలుండవు. డేవిడ్ ఫ్రాలే అమెరికా నుంచి ఇండియాకు వచ్చి తన పేరును వామదేవ శాస్ర్తీగా మార్చుకున్నాడు. ‘‘శ్రీచక్రం’’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పట్టా పొందాడు. ప్రభుత్వం అతనికి ‘పద్మశ్రీ’ బిరుదునిచ్చి (2015) సత్కరించింది. కారణం ఇప్పుడు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి సిస్టర్ నివేదిత, కూలూరవిందులు, హెచ్.పి.బ్లావట్‌స్కీ, డేవిడ్ ఫ్రాలే - వీరు హిందువులా? ఒక వ్యక్తి విదేశాలలో పుట్టినంత మాత్రాన హిందువు కాకుండా పోడు. హిందూ దేశంలో పుట్టిన వారంతా హిందువులు కారు. హిందూ కుటుంబంలో పుట్టి తిరుపతి, కాళహస్తి వెళ్లినవారంతా కూడా హిందువులు కారు. రాజామానసింగ్ ఉదయమే రుద్రాభిషేకం భక్తితో చేసుకునేవాడు. ఆ తర్వాత జలాలుద్దీన్ అక్బర్‌గారి సైన్యాన్ని వెంటబెట్టుకొని స్వాతంత్య్ర పోరాట వీరుడు రాణాప్రతాప్‌ను వేటాడటం కోసం బయలుదేరేవాడు. వేలాది వైష్ణవ అయ్యంగార్లను ఊచకోత కోసిన టిప్పు సుల్తానుకు మంత్రిగా పనిచేసిన వాడి పేరు పూర్ణయ్య అదే హిందూ బ్రాహ్మణుడు. మహామంత్రి మాదన్న నియోగి బ్రాహ్మణుడు. భద్రాద్రి రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న ఈయన మేనల్లుడు. అబుల్ హసన్ తానాషాకు మాదన్న ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతనిని తర్వాతి కాలంలో గోల్కొండ ప్రాంతంలో ముస్లిములు చంపివేశారు. జార్జి రాజేంద్రవైభవ నిర్జితేంద్ర - అంటూ పంచమ జార్జిపై పరమ నైష్ఠికులు తిరుపతి వేంకటకవులు పంచరత్నాలు వ్రాశారు. రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ జన్మసిద్ధంగా హిందువు. తరువాత కమ్యూనిస్టు మతం పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇస్లాంలో చేరాడు. నల్గొండలోని రాచకొండకు వచ్చినప్పుడు అక్కడే రామాలయ ప్రాంగణంలో పొర్లుడు దండాలు పెట్టి ‘‘ఇది నా పూర్వీకుల పాదస్పర్శతో పునీతమైన ప్రాంగణం’’ అన్నాడు. పూర్వీకులేమిటి? పునీతం కావటం ఏమిటి? ఇదంతా సామ్యవాద పరిభాషలో సెంటిమెంటల్ నానె్సన్స్. మరి హిపోక్రసీకి కారణం ఏమిటి?
కమలహాసన్‌ను సూపర్‌స్టార్ చేసింది హిందువులు. కాని ఇవ్వాళ అతడు హిందువులు ఉగ్రవాదులు అంటున్నాడు. కేరళలో హిందువుల హత్యలు పెరుగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి విజయన్‌తో స్నేహం చేస్తున్నాడు. శ్రీపీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి చెప్పినట్లు హిందువులను ఇంతగా ద్వేషించే హిందువులు చైనాలో పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్‌లో సుఖజీవనం సాగించవచ్చుకదా! వాటికన్‌లో తెల్లవాళ్లే పోపులవుతారు. కానీ నల్లని ద్రవిడ షెపర్డ్ ఐలయ్యను ఎన్ని జన్మలెత్తినా పోపును చేయరు. ఇండియాలో ఉన్నంతవరకే వీరికి బతుకుతెరువు. లేకుంటే ‘్ఫష్ ఔట్ ఆఫ్ వాటర్’. ముసలితనంలో కమలహాసన్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళ ప్రజలకు సేవ చేయడం అనుకుంటే తన అభిమానులతో కలసి వరదలలో చిక్కుకున్న చెన్నై ప్రజలకు సేవ చేయవచ్చు. అయార్ నదీ పరీవాహక ప్రాంతాలలో పూడికలు తీయించవచ్చు. అమ్మ కాంటీన్లు పెట్టినట్లు తానూ ఐదు రూపాయలకు భోజనం పెట్టించవచ్చు. కానీ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఎందుకు? ఇటీవల తెలుగులో చిరంజీవి, విజయశాంతి, పవన్‌కల్యాణ్, రోజా తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, మలయాళ నటి వాణీవిశ్వనాథ్ ఇలా ఎందరెందరో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అందుకోసం హిందూ సంస్కృతిని తిట్టడం అవసరమా? ఆలోచించండి. అలా అయితే భారీగా ఓట్లు పడతాయా?
అమెరికాలోని వైట్‌హవుస్‌లో హిందువుల మీద గౌరవంతో దీపావళినాడు దివ్వెలు వెలిగించారు. యోగాడేనాడు సూర్య నమస్కారాలు చేశారు. ఇండియాలో మాత్రం కొందరు మేము సూర్య నమస్కారాలు చేయము, వరాహ నమస్కారాలు, శునక నమస్కారాలు, జంబూక నమస్కారాలు చేస్తాము అంటున్నారు. అదీ పరిస్థితి.

ప్రొ. ముదిగొండ శివ ప్రసాద్