మెయిన్ ఫీచర్

అకాల మృత్యుహరుడు.. నివాసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భషణ వికాస శ్రీ్ధర్మ పుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప రాసిన నరసింహ శతక పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువాడుండడంటే అతిశయోక్తి లేదు. భారతీయ ప్రాచీన అర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టుకొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు నెలవుగా, అనాది కాలంగా హైందవ ధర్మ ప్రచార కేంద్ర బిందువుగా, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా విరాజిల్లుతున్నది... జగిత్యాల జిల్లాలోని గోదావరీ తీరస్థ సుప్రసిద్ధ తీర్థమైన ప్రాచీన ధర్మపురి పుణ్యక్షేత్రం. తెలుగు నేలపై సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, దక్షిణకాశీగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, హరిహర క్షేత్రంగా, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నదీ క్షేత్రరాజం. బ్రహ్మండ, స్కందాది పురాణాలలో ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం ప్రశంసించబడినది. ఈక్షేత్ర దేవస్థానాంతర్గతంగా ఉన్న యమధర్మరాజు మందిరం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతావనిలోనే అరుదుగా, అపురూపంగా ధర్మపురి క్షేత్రంలో వెలసిన ‘‘యమధర్మరాజును దర్శిస్తే యమపురి ఉండబోదని’’ ప్రతీతి. హిరణ్యకశిపుని సంహారానంతరం, ఉగ్ర నారసింహుని శాంతింప జేసేందుకై బ్రహ్మాది దేవతలు పుణ్యతీర్థమూ, పవిత్ర క్షేత్రమూ అయిన ధర్మపురిలో తపో, యజ్ఞ, ధ్యానాది సత్కర్మల నొనరించినట్లు స్థల పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకానొక సమయాన యమ ధర్మరాజు, తన లోకమునందు అనేక నరక బాధలను అనుభవించుచున్న పాపులను గాంచి, నిట్టూర్పులు విడిచి, తనలోతను ఇట్లు విచారించెనని, పుణ్యాత్ములను దర్శించినచో పుణ్యము, పాపాత్ములను చూసినచో పాపమే లభించునని, నిత్యము పాపులను దర్శించుటచే తనకు పాపసంచయమే కలుగుచున్నదని, తన యందు స్వయంకృత పాపమనునది ఏమాత్రము లేకున్ననూ, పాపుల నిత్య దర్శనముతో మనశ్శాంతి కలుగడం లేదని తలంచి, మనశ్శాంతిని పొందుటకు పుణ్యక్షేత్ర దర్శన ప్రయాణోన్ముఖుడై, సమస్త క్షేత్రముల తిరిగి చివరకు ధర్మపురికి ఏతెంచెనని, ఈ క్షేత్రమున గోదావరి నదీ స్నానమాచరించగనే యమునకు మనశ్శాంతి కలుగెనని, పాపాత్ముల దర్శన దోషములు తొలగెనని, బ్రహ్మాండ, స్కాంద పురాణాంతర్గత ధర్మపురి క్షేత్ర మహాత్మ్యం ఆధారంగా నైమిశారణ్యంలో సూత పౌరాణికుడు, శౌనకాది మహర్షులకు వివరించినట్లు, నారదుడు పృథు మహారాజుకు క్షేత్ర మహిమను తెలిపినట్లు వివరించబడింది.
యమ ధర్మరాజు నృసింహుని మందిరానికేగి చేసిన పూజలకు ప్రసన్నుడైన నారసింహుడు, యమ ధర్మరాజును తన సన్నిధిలో నివసించుమని తెలిపెనని, యముడు గోదావరిలో స్నానమాచరించిన స్థలముకు ‘యమకుండ’మని పేరు కలుగునట్లు, అచట స్నానమాచరించి నృసింహుని పూజించు వారికి యమలోక బాధలు కలుగకుండునట్లు, సర్వపాప విముక్తి కలుగునట్లు నరసింహుడు వరమిచ్చినట్లు, యమ ధర్మరాజు తన అంశ రూపమును శ్రీనృసింహ మందిర పురోభాగమున నిలిపెనని పురాణాలు విశదీకరిస్తున్నాయి. లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో యోగానంద నరసింహ ప్రధానాలయం ముందుభాగాన ఉంది యమ ధర్మరాజ మందిరం. కోరలతో, యమ దండాన్ని ధరించిన భీకరాకార ఆరు అడుగుల భారీ విగ్రహం ఇందుంది. ‘దక్షిణాభి ముఖీగంగా, యత్ర దేవో నృకేసరీ, తత్రశ్రీర్విజయోర్భూతి:, కాశ్యయశ్శత గుణం భవేత్’ అని దక్షిణాభిముఖియై ప్రవహిస్తున్న గోదావరి తీరస్థమైన ధర్మపురి క్షేత్రం విశిష్టతను కలిగియున్నది. వేరెచ్చటనూ కానరాని విధంగా, ధర్మపురి క్షేత్రంవద్ద గోదావరి దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నది. అష్ట దిక్పాలకులలో ఒకరైన యముడు దక్షిణ దిశాధిపతి. అంతేకాక గ్రహాల దృష్ట్యా కుజుడు దక్షిణ దిశాధిపతి, కుజ గ్రహానికి మూలాధిపతి నరసింహుడని పరాశరుడు ‘‘్భృహత్ పరాశర హోరాశాస్త్రం’’ నందు నుడివి ఉన్నాడు. కనుక ధర్మపురిలో దక్షిణ వాహినియైన గౌతమియందు దక్షిణాభిముఖులై స్నానాలు ఆచరించి, నరసింహుని దర్శిస్తే నరక బాధలుండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

-సంగనభట్ల రామకిష్టయ్య