రాష్ట్రీయం

కేబినెట్ మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12గంటలపాటు సాగిన భేటీ
హైదరాబాద్, జనవరి 2: రాష్ట్ర చరిత్రలో తొలిసారి కేబినెట్ మారథాన్ శనివారం నడిచింది. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం దాదాపుగా రోజంతా సాగింది. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ అంటే 12 గంటలపాటు వివిధ అంశాలపై కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చలు జరిపారు. మధ్యలో భోజన విరామం తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండానే మంత్రివర్గం తిరిగి సమావేశమైంది. రాత్రి 11 దాటేవరకూ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కేబినెట్ భేటీ జరుగుతుండగానే, ముఖ్యమంత్రి కెసిఆర్ 40 నిమిషాలపాటు కేబినేటేతర కార్యక్రమాలు చట్టబెట్టారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూతురు పెళ్లి వేడుకకు హాజరై, తిరిగి కేబినెట్ భేటీకి హారయ్యారు. ముఖ్యమంత్రి వచ్చే వరకు సుమారు 40 నిమిషాల పాటు సమావేశం వాయిదా పడి తిరిగి మళ్లీ మొదలైంది. ఉదయం నుంచి రాత్రి వరకు భోజన విరామం తర్వాత కూడా మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు.