మట్టిలో మాణిక్యాలు గీతావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్టర్ ధరణ్ ప్రధాన పాత్రలో డాడి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మట్టిలో మాణిక్యాలు’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూసల బుజ్జి తొలి సీడీని ఆవిష్కరించి ప్రతాని రామకృష్ణగౌడ్‌కు అందజేశారు. అనంతరం రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ డాడి శ్రీనివాస్ మంచి రచయితని, ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపుకోసం కృషిచేస్తానని అన్నారు. డాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, అల్లు అరవింద్ సహకారం మర్చిపోలేనిదని, మిత్రుల సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తిచేశామని అన్నారు. సాయి వెంకట్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని ట్రైలర్, పాటలు బాగున్నాయని, చిన్నపిల్లలతో సినిమా చేయడం చాలా కష్టమైన విషయమని, ఇలాంటి సాహసం చేసిన డాడి శ్రీనివాస్‌కు ఈ సినిమాతో మంచి గుర్తింపువస్తుందన్నారు.