క్రైమ్/లీగల్

ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మే 31: మండలంలో పనిచేస్తున్న ముగ్గురు ఫీల్డ్ అసిప్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీఆర్‌డీఏ పీడీ సుధాకర్ నుండి బుధవారం ఉత్తర్వులు అందినట్లు ఏపీఓ లక్ష్మయ్య తెలిపారు. ఐనోల్, సింగారం, హాజిపూర్ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాత్లవత్ పత్యనాయక్, కాట్రావత్ రవినాయక్, ఆకుతోట మురళీలు జాబ్‌కార్డు ఆప్‌గ్రేడ్ చేయడంలో నిర్లక్ష్యం, ఏడు రకాల రిజిస్టర్‌లను సక్రమంగా నిర్వర్తించకపోవడం, పని ప్రదేశంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో చేస్తున్న పనుల నుండి తాత్కలికంగా తొలగిస్తు సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా గ్రామాల ఉపాధి కూలీల నుండి పలు ఫిర్యాదులు జిల్లా కేంద్రానికి అందడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా, అధికార పార్టీకి అనుకులంగా పనిచేయకపోవడంతోనే ఆయా గ్రామాల నాయకులు అధికారులపై ఒత్తిడి చేసి సస్పెండ్ చేయించారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాత్లవత్ రఘునాయక్ ఆరోపించారు. పని చేస్తున్న సిబ్బందిపై రాజకీయ రంగు రుద్దడం సరికాదని ఆయన అన్నారు.

215 సబ్సిడీ గొర్రెల పట్టివేత
- ఆరుగురిపై కేసు నమోదు - రెండు లారీలు సీజ్
మానవపాడు, మే 31: అక్రమంగా అడ్డదారిలో సబ్సిడీ గొర్రెలను లారీలలో తరలిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందగా 215 గొర్రెలను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఏపీ 21 టీఎక్స్ 9189 నంబర్‌గల లారీ, ఏపీ 21 టీయూ 6777 నంబరు గల లారీలో గొర్రెలను పొరుగు రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారు. హుజూరాబాద్ నుంచి ఎర్రవల్లి చౌరస్తా నుంచి మారుమునగాల, ప్రాగటూరు, ఉండవెల్లి మీదుగా పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఉండవెల్లిలో స్థానికులకు అనుమానంతో లారీలను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు లారీలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. పశువైద్యాధికారితో పంచనామా చేయించారు. ఏపీ 21 టీఎక్స్ 9189 లారీలో 112 సబ్సిడీ గొర్రెలు, ఏపీ 21 టీయూ 6777 నంబరు గల లారీలో 83 సబ్సిడీ గొర్రెలున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఎస్‌ఐ గడ్డం కాశీ లారీలను సీజ్ చేసి అక్రమంగా గొర్రెలు తరలిస్తున్న సారయ్య, తిరుపతి, రాజు, రమేశ్, రవి,రమేశ్‌లపై కేసు నమోదు చేశారు.