రాష్ట్రీయం

103 మీటర్లకే మేడిగడ్డ పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎత్తు తగ్గింపుపై తెలంగాణ ప్రతిపాదన
సరేనన్న మహారాష్ట్ర సర్కార్
రెండు రాష్ట్రాల అధికారుల భేటీ

హైదరాబాద్, డిసెంబర్ 29: ప్రాణహిత- చేవెళ్ల అంతర్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం విజయవంతంగా జరిగింది. తెలంగాణ నుండి ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర తరఫున చీఫ్ ఇంజనీర్లు ఆర్‌ఎం చౌహాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డ వద్ద 103 మీటర్లవద్ద బ్యారేజీని తెలంగాణ ప్రతిపాదించినట్టు అంతర్ రాష్ట్ర బోర్డు సభ్యులు నరేందర్‌రెడ్డి సభ్యులకు తెలిపారు. గతంలో మహారాష్ట్ర అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ నూతన ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. అదేవిధంగా తుమ్మిడిహట్టి వద్ద మహారాష్ట్ర కోరినట్టు అతి తక్కువ ముంపు కలిగిన ఎఫ్‌ఆర్‌ఎల్ బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించాలని కోరారు. రెండు బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఈ సమావేశంలో చర్చించి స్టాండింగ్ కమిటీ అమోదం కోసం ప్రతిపాదించాలని ముఖ్య కార్యదర్శి జోషి సూచించారు. మహారాష్ట్ర చీఫ్ ఇంజనీర్ చౌహాన్ స్పందిస్తూ తుమ్మిడిహట్టికి సంబంధించిన సాంకేతిక అంశాలు, ముంపు వివరాలు ఇప్పటికే అన్ని స్థాయిలో చర్చ జరిగినందున తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవని తెలిపారు. అయితే మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సాంకేతిక వివరాలు, ముంపు వివరాలు అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ఆ అధ్యయనం తరువాత మేడిగడ్డ వద్ద కంట్రోల్ లెవల్స్‌పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు బుధవారం హెలికాప్టర్‌లో వెళ్లాలని నిర్ణయించారు. మహారాష్ట్ర అడిగిన వివరాలు రెండు రోజుల్లో అందజేయాలని వ్యాప్‌కోస్ సంస్థను తెలంగాణ ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి ఆదేశించారు. జనవరి 15 తరువాత స్టాండింగ్ కమిటీలో వీటిపై చర్చించి అంగీకారానికి రావాలని నిర్ణయించారు. చనాక కోరాటా ఒప్పందంపై ఈ సమావేశంలో చర్చించారు. నాగ్‌పూర్ సమావేశంలో నిర్ణయించినట్టు తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా ఒప్పందాన్ని తయారు చేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ముసాయిదాపై వారం రోజుల్లో తమ అభిప్రాయం చెబుతామని మహారాష్ట్ర తెలిపింది.