AADIVAVRAM - Others

కల్తీ పాలతో ఎదుగుదల లోపం(విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలు బలవర్ధక ఆహారం అని అందరికీ తెలుసు. చక్కటి ఆరోగ్యానికి అవి ఎంతో దోహదం చేస్తాయని కూడా తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల వారి ఆరోగ్య రక్షణకు అవి ఎంతో అవసరం. అయితే పాలు, పాలపదార్థాల కల్తీ వల్ల ఇప్పుడు అలాంటి పాలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అబార్షన్లు, నవజాత శిశువుల ఎదుగుదలలో లోపాలు వాటివల్ల కలుగుతున్నాయి. పాలను ఇచ్చే పశువులకు అధికోత్పత్తి కోసం ఇస్తున్న హార్మోన్ ఇంజక్షన్ల వల్ల ఈ సమస్య ఏర్పడుతోంది. ‘ఆక్సిటోసిన్’ అనే ఒక రకమైన హార్మోన్ ఇంజక్షన్ వల్ల ఈ సమస్య ఎదురవుతోందని పరిశీలనల్లో తేలింది. ఆ హార్మోన్ ఇంజక్షన్లను వాడిన పశువుల పాలు తాగిన వారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మగవారిలో పాలిండ్లు పెరగడం, మహిళల్లో ఇతర సమస్యలకు కారణమవుతున్నాయి. నిజానికి ఇలాంటి పాలను గర్భిణులు పూర్తిగా మానేయాలి. లేదంటే వారు, పుట్టిన శిశువులు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ విషయాన్ని ఢిల్లీకి చెందిన చీఫ్ ఇన్‌ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అరవింద్ వైద్ చెబుతున్నారు. నిజానికి పాలలో పుష్కలంగా కాల్షియం ఉంటుందని అందరూ భావిస్తారు. ఉంటుంది కూడా. దానితోపాటు ప్రొక్లాక్టిన్, లూటెన్‌జింగ్, ఈస్ట్రోజన్, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల గురించి మనం పట్టించుకోం. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే అనేక సమస్యలు ఎదురవుతాయి. గర్భిణుల్లో అండాశయం చుట్టూ ఏర్పడవలసిన సెర్వికల్ మ్యూకస్‌ను ఈ కల్తీపాలు దెబ్బతీస్తాయి. ఇది గర్భధారణ ప్రక్రియను ఆటంకపరుస్తుంది. ఈస్ట్రోజన్ సమతుల్యత దెబ్బతింటే ఆడవారిలోను, మగవారిలోను ఊహించని మార్పులు సంభవిస్తాయి. భారత్‌లో 70 శాతం మంది పాకెట్ పాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో వాటిని ప్యాక్ చేస్తున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే బిపిఎ అనే పదార్థం గర్భధారణ ప్రక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. నిజానికి దీనివల్ల మహిళల్లో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎఎమ్‌హెచ్ పరిమాణాన్ని మార్చేస్తుంది. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది.

-ఎస్.కె.ఆర్.