మిర్చిమసాలా

మల్లారెడ్డా.. మజాకా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ కూలిపనుల కార్యక్రమంలో భాగంగా మంత్రి కెటిఆర్ సుచిత్ర చౌరస్తాలో ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఐస్‌క్రీమ్‌లు అమ్మితే, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి ఏకంగా ఐదులక్షల రూపాయలకు ఓ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేశారు. మల్లారెడ్డి ఉత్సాహంగా ఐదులక్షలకు ఐస్‌క్రీమ్ కొన్నపుడు అక్కడున్న తెరాస నేతలు ఎంపిగా పోటీ చేసినప్పుడు లక్షలు పెట్టి ఆయన టిడిపి టిక్కెట్ కొన్నాడని గుసగుసలాడారు. ఆ సంగతిని గుర్తు చేస్తూ, ఎంపి తనకు నచ్చితే ఐస్‌క్రీమ్ అయినా పార్టీ టిక్కెట్ అయినా ఎన్ని లక్షలైనా ఇచ్చి కొంటారని కొందరు చమత్కరించారు. - మురళి

ఎవరి సొంతం?
పాట ఎవరి సొంతం ? అని ప్రశ్నిస్తే రాసిన వారిదే అనే సమాధానం వస్తుంది, కాని సినిమా పాట ఎవరి సొంతం? అంటే సమాధానం చాలా ఉంటుంది. దర్శకుడు ఊహించి సన్నివేశం ఇస్తే రచయిత పాట రాస్తారు. కెమరామెన్ చిత్రీకరిస్తారు, సంగీత దర్శకుడు మంచి స్వరాలు అందిస్తారు. ఎడిటింగ్‌లో సైతం ఆ పాటకు సమున్నతిని తీసుకువస్తారు. ఇంతకీ పాటకు ఓనరు ఎవరు? రచయిత తనకే సర్వ హక్కులూ చెందుతాయంటే సరిపోతుందా? ఇదే వివాదం మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య నడుస్తోంది. తాను సంగీతం సమకూర్చిన పాటలు పాడవద్దని ఇళయరాజా ఇచ్చిన నోటీసులకు బాలసుబ్రహ్మణ్యం సానుకూలంగానే స్పందించి ఇప్పటికీ ఇద్దరం స్నేహితులమే అని పేర్కొన్నా, ఆయన ఇచ్చిన సమాధానంలో సినిమా పాటకు ఓనరు ఎవరు? అనే ప్రశ్న కూడా ఉంది.. దీనికి జవాబు ఏమిటి? - బివి ప్రసాద్

అది కూడా ‘లీక్’ అయితే..
‘ఉచితంగా ఎరువుల పంపిణీ చేస్తామని’- వచ్చే ఎన్నికల్లో తాము ఇవ్వబోయే హామీ ముందుగానే లీక్ కావడం వల్లనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదరాబాదరగా రైతులకు ఆ వరాన్ని ప్రకటించారని కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి మీడియా ఎదుట వాపోయారు. తెరాస మేనిఫెస్టో లీకైనట్టుగానే, వచ్చే ఎన్నికల తర్వాత కూడా టిఆర్‌ఎస్ పార్టీయే తిరిగి అధికారంలోకి రాబోతుందన్న సంగతి ప్రజలకు ముందుగానే తెలిస్తే- అప్పుడూ కూడా ఇలాగే కాంగ్రెస్ నాయకులు వాపోతారన్నది తెరాస ఇచ్చిన కౌంటర్!
- వెల్జాల చంద్రశేఖర్

బాబుకు సొంత జిల్లాలో సెగ!
రోజులు బాగాలేకపోతే స్నేహితులే శత్రువులవుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఇప్పుడు టిడిపి ఎంపీ శివప్రసాద్ విషయంలో ఏపి సిఎం చంద్రబాబుకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. సొంత జిల్లాకు చెందిన శివప్రసాద్ ఏకంగా బాబు వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. తాను టిడిపిని వదలనంటూనే చంద్రబాబు తన పట్ల అమానవనీయంగా ప్రవర్తించారని, తనను కనీసం పలకరించలేదని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు అనేక పార్టీలు ఉన్నాయన్నారు. చంద్రబాబు మిత్రుడిగా పేరున్న శివప్రసాద్ పార్టీ అధినేతపై ధ్వజమెత్తడంతో టిడిపి వర్గాలు ఆత్మరక్షణలో పడ్డాయి.
- శైలేంద్ర

ఆ కిటుకేంటి..?
ఐస్‌క్రీం, తేనీరును అధికధరలకు విక్రయించే కిటుకు తెలుసుకునేందుకు ఇప్పుడు కిళ్లీకొట్ల మహిళలు, ఐస్‌క్రీం బండ్ల పోరగాళ్లు పడరాని పాట్లు పడుతున్నారట. ఒక ఐస్ క్రీంను 10 రూపాయలకు, టీని ఐదు రూపాయలకు అమ్మాలనుకున్నా జనం రావడం లేదని చిన్నారి వ్యాపారులు వాపోతున్నారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ఐస్‌క్రీంను ఐదు లక్షలకు, టీని లక్ష రూపాయలకు విక్రయించారు. ఐస్‌క్రీంను, టీని అతిపెద్ద మొత్తానికి కెటిఆర్ ఎలా విక్రయించారని ఆరాలు తీస్తున్నారట. గొప్పోళ్లు ఏం చేసినా హంగామాగానే ఉంటుంది! ఈ పరిస్థితిలో చిన్నోళ్ల బేరం పెరుగుతుందా? లాభాలు వస్తాయా? అన్నదే అసలు పాయింటు!
- పివి రమణారావు