రాష్ట్రీయం

అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

హైదరాబాద్, మార్చి 14: శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరుగుతున్న బీచ్ శాండ్ తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గార మండలంలో బీచ్ శాండ్ తవ్వకాలు చేపట్టిన ట్రైమాక్స్ సంస్థ అనేక అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. అనుమతి లేని భూముల్లో కూడా తవ్వకాలు సాగిస్తోందని ఆరోపించారు. దేశంలో ఇప్పటివరకూ జరిగిన భారీ కుంభకోణాల్లో ఇదొకటన్నారు. రాజకీయ నాయకుల అండతో ఆ సంస్థ సుమారు 1200 కోట్ల విలువైన శాండ్‌ను 40 దేశాలకు ఎగుమతి చేసిందని ఆయన అన్నారు. అక్కడ జరుగుతున్న తవ్వకాలను పరిశీలించడానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వెళ్లినప్పుడు, తవ్వకాలు జరిగే ప్రదేశాన్ని చూపించడానికి సంస్థ యాజమాన్యం అంగీకరించలేదని అన్నారు. తాము గట్టిగా పట్టుపడితే, విధిలేని పరిస్థితుల్లో లోనికి తీసుకువెళ్లిందని విష్ణుకుమార్ రాజు వివరించారు. అనుమతి లేని భూముల్లో తవ్వకాలు జరుపుతున్నట్టు తాము కనుగొన్నామని అన్నారు. ఈ విషయమై అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్‌ను వివరణ కోరగా, 2006 నుంచి ఈ తవ్వకాలు జరుగుతున్నాయని, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండతో ఈ వ్యవహారం సాగుతోందని, తానేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని జెసి చెప్పడం ఆశ్ఛర్యం వేసిందని అన్నారు.
ఇళ్లు నిర్మించుకోడానికి ఇసుకను తరలించే లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకుని భారీగా అపరాధ రుసుము విధిస్తున్నారని, వేల కోట్ల రూపాయల ఖనిజం తరలిపోతున్నా విజిలెన్స్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని విష్ణుకుమార్ ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలను సంపాదిస్తున్న ట్రైమాక్స్ సంస్థ కేవలం రెండు శాతం రాయల్టీని ప్రభుత్వానికి చెల్లిస్తోందని ఆయన అన్నారు. వెంటనే తవ్వకాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని, అందులో పనిచేస్తున్న మూడు వేల మంది కార్మికుల ఉపాధి పోకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వివిధ చోట్ల జరుగుతున్న ఖనిజ తవ్వకాల్లో సంస్కరణలు తేవాలని కోరారు. ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ ట్రైమాక్స్ సంస్థ బీచ్ శాండ్ మైనింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దీనిపై గనుల శాఖ మంత్రి పీతల సుజాత సమాధానం ఇస్తూ అక్రమ తవ్వకాలను సహించబోమని అన్నారు. తాము ఎవ్వరికీ భయపడేది లేదని అన్నారు. గార మండలంలో 720 హెక్టార్లలో బీచ్ శాండ్ తవ్వకాలు జరుగుతున్నాయని, ఇందులో 562 హెక్టార్లకు మాత్రమే అనుమతి ఉందని, 158 హెక్టార్లలకు అనుమతి లేదని ఆమె వివరించారు. అక్రమ తవ్వకాలను రద్దు చేస్తామని మంత్రి ప్రకటిస్తున్న సమయంలోనే, ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.