మిర్చిమసాలా

ఓయూ విద్యార్థుల విచిత్ర వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించి ఏ విధంగా ఆట్టహాసంగా నిర్వహించాలో మార్గనిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం విచిత్రంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరిదాకా అడ్డుకున్న టిడిపితో కలిసి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న పార్టీతో కలిసి రాష్ట్ర ఆవతరణ వేడుకలను నిర్వహించడం అంటే, టిడిపి వైఖరిని ఉస్మానియా విద్యార్థులు సమర్ధిస్తున్నట్టేనా!
- వెల్జాల

ఇక్కడ టికెట్లు ఇవ్వబడును!
ఎన్నికల్లో టిడిపి టికెట్ అంటే ఒకప్పుడు ఎంతో క్రేజీ ఉండేది. నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, అనుచరులను వెంట తీసుకువచ్చి ఎన్టీఆర్ భవన్ వద్ద బల ప్రదర్శన చేసి టికెట్ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చే వాళ్లు. తెలంగాణలో పార్టీ ఖాళీ అయిన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ టికెట్లకు పెద్దగా గిరాకీ ఉండడం లేదు. దాంతో మూడేళ్ల ముందుగానే టికెట్ల కౌంటర్ ఓపెన్ చేశారు. పెద్ద ఎత్తున టికెట్లకు అవకాశం ఉంది. ‘‘వంద అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థులు అవసరం. ఇప్పటి నుంచే ముందుకు రావాలి టికెట్లు ఇస్తాం’’ అని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అని ప్రకటించారు. అయితే గతంలో పని చేసిన లోక్‌సత్తా పరిస్థితి ఎలా ఉందో తెలంగాణలో టిడిపి పరిస్థితి అలానే ఉంది.
- మురళి

అధికారమే గొప్పది!
గతంలో ‘రాజు వెడలె రవితేజములలరగ’.. అన్నట్లు ప్రస్తుత కాలంలో ప్రతిచోటా అధికారం అనే మాట ఎక్కువగా వినవస్తోంది. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘అమరావతి ప్రభువు వాసిరెడ్డి వెంకటాద్రి’ పుస్తకాన్ని ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఇదే సమయంలో కావ్యకన్యకను వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా ముఖ్యమంత్రికి అంకితమిచ్చారు. ఇదే సమయంలో వాసిరెడ్డి వారసత్వ కుటుంబీకులు కొందరు అదే వేదికపై బాబును తలపాగాతో సత్కరించి చేతికి ‘ఖడ్గం’ అందించారు. ఇంకేముంది ఫొటో ఫ్లాష్‌లు జిగేల్ మన్నాయి. ఇదే సమయంలో ఆహ్వానితుల నుంచి మీడియాకు ఒక ప్రశ్న ఎదురైంది. ‘కత్తి గొప్పదా? కలం గొప్పదా? అని. మన చిన్నతనంలో తరచూ ఇలాంటి అంశాలపై డిబేట్ జరుగుతుండేది. దీనిపై పలువురు పలురకాల అభిప్రాయాలు చెప్పగా ఒక కొంటె విలేఖరి మాత్రం ‘ఆ రెండింటికీ మించి అధికారం గొప్పది. అది ఉంటే వంద తుపాకులు వెన్నంటి ఉంటాయి. ఎనె్నన్నో కావ్యకన్యకలందించే కలం వీరులకు కూడా కొదవ ఉండదు’ అని చెప్పగానే ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి.
- నిమ్మరాజు చలపతిరావు

ఆంధ్రులు ఆరంభ శూరులే
ఆంధ్రులు ఆరంభశూరులనే నానుడిలో నిజం ఉంది. విభజన సమయంలో పార్లమెంటులో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నేత వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి పదేళ్ల పాటు అమలు చేస్తామన్నారు. వారితో కలిసిన చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా తథ్యమన్నారు. జనం ఓట్లు వేశారు. సీను కట్‌చేస్తే 2016 వచ్చేసింది. హోదా ఉన్న రాష్ట్రాలు ఏమి బావుకున్నాయని హోదా కోసం ప్రయత్నిస్తూనే ప్యాకేజీ తెస్తామన్నారు. హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని వెంకయ్య అంటారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా హోదా కోసం దీక్షలు చేశారు. సాధన సమితి కూడా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేసింది. సిపిఐ పార్టీ భారీ ప్రచార యాత్ర నిర్వహించింది. కాని జనంలో మాత్రమే సందడి, స్పందన లేదు. ఆంధ్రుల సంగతి తెలిసి కేంద్రం కూడా ప్రత్యేక హోదాపై దాట వేస్తోంది.
- శైలేంద్ర

‘బెల్టు’తెగేనా..?
మద్యం వ్యాపారానికి బెల్టు షాపు అటాచ్ అయింది. పలు చోట్ల బెల్టుషాపులపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఒకప్పుడు బెల్టుషాపులను ప్రోత్సహించిన అధికారులే..ఇప్పుడు షాపులను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇవి నామమాత్రపు దాడులా..? లేదా సంపూర్ణంగా తొలగించేందుకు చేపట్టిన చర్యలా..? అన్న మీమాంస వ్యక్తమవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏ గ్రామంలో కూడా బెల్టుషాపులు ఉండే అవకాశమే లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతుండగా, కిరాణం దుకాణాల్లోనూ, టీ కొట్లలోనూ మద్యం విక్రయాలు అగడం లేదు. ఈ బెల్టు షాపులను నియంత్రించే చర్యలు సాధ్యసాధ్యాలు చర్చనీయాంశమయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో 90శాతం గుడుం బా విక్రయాలు నిర్మూలించబడినప్పటికీ బెల్టుషాపుల ద్వారా కొనసాగుతున్న మద్యం విక్రయాలు అరికట్టలేకపోతున్నారు. అయితే ప్రభుత్వం సాలీనా వచ్చే కోట్లాది రూపాయలు ఆదాయాన్ని ఆశిస్తుందా..? పేదల సంసారాన్ని గుల్ల చేసే మహమ్మారి మద్యం సంపూర్ణంగా నిషేధిస్తుందా అన్నది ప్రశ్నార్థకమే.
-సయ్యద్ గౌస్‌పాషా