మిర్చిమసాలా

ఇంకా అర్థం కాలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌లో జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర స్థాయ నాయకుల వరకూ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ వల్లనే ఏర్పడలేదని గత రెండున్నర ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది తామేనని చె బుతున్నప్పటికీ- మరి ప్ర జలు ఎందుకు తమకు అధి కారం కట్టబెట్టలేదో వారు చెప్పలేకపోతున్నారు. వారు చెప్పేది నిజమే అయితే- టి ఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కాం గ్రెస్ ఎందుకు తాపత్రయ పడినట్టు..? అంటే ప్రజలకే కాదు, కాంగ్రెస్ వారికి కూడా కెసిఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న భావన ఉండటం వల్లనే కదా? కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలనీ, అలా కుదరని పక్షంలో కనీసం పొత్తు అయినా పెట్టుకోవాలని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పడిన తపన ఎవరికి తెలియదు? కెసిఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగడానికి తామే కారణమన్న విషయం ఇప్పటికీ కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదు.
- వెల్జాల చంద్రశేఖర్

ఆన్‌లైన్‌లో ఓట్ల కొనుగోలు..
కొన్ని ఘటనలు కొందరికి గుణపాఠం, మరికొందరికి సరికొత్త అనుభవాలను నేర్పుతాయనడానికి తాజా ఉదాహరణ- పెద్దనోట్ల రద్దు వ్యవహారమే. ఎన్నికల్లో నల్లధనాన్ని పంచి అధికారాన్ని కైవసం చేసుకునే ఘరానా రాజకీయ నాయకులకు సరికొత్త ఆలోచనలను ప్రస్తుత పరిస్థితి రేకెత్తింపజేసింది. కార్యకర్తల సభ్యత్వ నమోదులో బీమా పేరిట తొలుత తెలుగుదేశం పార్టీ వారి చిరునామాలతో పాటు బ్యాంకు ఖాతాల నెంబర్లను కూడా సేకరించుకుంది. ఇదే విధానాన్ని ఇతర రాజకీయ పక్షాలు కూడా నోట్లరద్దుతో అనుసరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 2019లో జరిగే ఎన్నికల్లో దళారులతో ప్రమేయం లేకుండానే నేరుగా ఓటర్ల ఖాతాల్లో ‘ఓటుకు నోటును’ జమ చేసేందుకు అప్పుడే వ్యూహరచన కావిస్తున్నారు. ఎపిలో దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఉండగా, కోటి 20 లక్షల మందికి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. జన్‌ధన్ ఖాతాల్లో కోట్లాది రూపాయల నల్లధనాన్ని జమ చేసిన వారికి- ఓటుకు నోటు పేరుతో ఆన్‌లైన్‌లో నగదు పంపించడం అసాధ్యమా..?
- నిమ్మరాజు చలపతిరావు

అడ్డదారే రహదారి..
సమాచార, సాంకేతిక విప్లవం పల్లెలను సైతం తాకడంతో ప్రతి పనికీ ఇపుడు ఆన్‌లైన్ ఆధారమైంది. దరఖాస్తు చేసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం, బ్యాంకు వ్యవహారాలు, ఉద్యోగాలు, సీట్లు, కౌనె్సలింగ్‌లు, బిల్లుల చెల్లింపులు.. ఇలా అన్ని వ్యవహారాలూ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయ. ఇంత టెక్నాలజీని సైతం తేలికగా తప్పుదారి పట్టించడంలో సిద్ధహస్తులు తయారయ్యారు. యాజమాన్యం కోటా సీట్ల సమయంలో దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో ఉంచినట్టు ప్రకటించి లింక్‌ను తొలగించే కాలేజీలు, సీట్ల జాబితా ప్రకటించి అది ఎవరికీ ఓపెన్ కాకుండా చేసే కాలేజీలు ఎక్కువయ్యాయి. తాజాగా ఈ జాబితాలో ఉస్మానియా ఐఎఎస్‌ఇ కూడా చేరింది. ఎడ్యుకేషన్‌లో పిహెచ్‌డి ఇంటర్వ్యూల వ్యవహారాన్ని కొద్ది గంటల ముందు ప్రకటించి నోటిఫికేషన్‌తోనే సరిపెట్టారు, జాబితాలు లేకుండా జాగ్రత్త పడ్డారు, అభ్యర్ధులు ఎవరూ హాజరు కాకూడదనేదే వారి ఉద్దేశమని వేరే చెప్పనక్కర్లేదు.
-బి.వి. ప్రసాద్

చిల్లర దాతలు!
పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య వర్గాలు తీవ్రమైన ఇక్కట్లకు లోనవుతుండగా, యాచకుల పంట పండింది. యాచకులకు దాతలందరూ ఎక్కువగా చిల్లరనే వేస్తారు. ఇటీవల పది రూపాయల నోట్లను కూడా కొందరు దానం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లరకు గిరాకీ పెరిగింది. దేవాలయాల వద్ద ఇపుడు యాచకులతో ప్రేమతో మాట్లాడే వారి సంఖ్య పెరిగింది. వంద రూపాయలకు 10 రూపాయలు కమీషన్ తీసుకుని బిచ్చగాళ్లు చిల్లర ఇస్తున్నారు. చిల్లర నాణేలు కావాలంటే 15 రూపాయలు కమీషన్ తీసుకుంటున్నారు. ప్రముఖ ఆలయాల వద్ద యాచకుల వద్ద వేల రూపాయల్లో చిల్లర ఉంటోంది. రోజూ కమీషన్ కింద వంద నుంచి రెండు వందల రూపాయల వరకు వీరు సంపాదిస్తున్నారు.
- శైలేంద్ర

కాలక్షేపం కమిటీ!
పెద్దనోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణామాలను చర్చించి, నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేయమని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఐదుగురు ముఖ్యమంత్రుల కమిటీని మోదీ సర్కారు ఏర్పాటు చేసింది. చివరకు ఈ కమిటీ పంచపాండవులు మంచం కోళ్లలా మారింది. చంద్రబాబు మినహా మిగిలిన నలుగురు ముఖ్యమంత్రులు ఈ కమిటీ పట్ల ఆసక్తి చూపలేదు. సమావేశానికి హాజరు కాలేదు. నగదు రహిత కార్యకలాపాలకు ఎలాంటి రాయితీలు ఇస్తే బాగుంటుందో ముంబయలో కమిటీ తొలి సమావేశంలో బాబు అధికారులతో చర్చిస్తుంటే, అప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ రాయితీలను విలేఖరుల సమావేశంలో ప్రకటించేశారు. ఇంతోటి దానికి కమిటీ వేయడం... ముంబయలో భేటీ ఎందుకో? అని కొందరి బాధ.
- మురళి