మిర్చిమసాలా

రోజూ రివ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు అంటే ఉరుకులూ పరుగులూ, నెల రోజుల ముందు నుండే సన్నద్ధత, రికార్డులు సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకోవడం, మంత్రులతో భేటీలు, ఎమ్మెల్యేలతో చర్చలు, ఎంపిలతో మాట్లాడటం ఇలా కోలాహలంగా ఉండేది, కాని నేడు గుట్టుచప్పుడు కాకుండానే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు జరిగిపోతున్నాయి, అంతే కాదు, దాదాపు ప్రతి రోజూ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లే, ఒక రోజు ప్రత్యక్షంగానూ, మరో రోజు వీడియో కాన్ఫరెన్స్, ఇంకో రోజు టెలికాన్ఫరెన్స్ , ఎపుడు సిఎం నుండి ఫోన్ వస్తుందోనని ఎదురుచూడటంతోనే గడిచిపోతోంది. కలెక్టర్లు సిఎం ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం కలెక్టర్ ఫోన్ ఎపుడు వస్తోందో అనే ఆందోళనలో ఉంటున్నారు. ప్రజలు మాత్రం వీళ్లూ దొరకరు, వాళ్లూ దొరకరు, ఎపుడు అడిగినా సమావేశం...సమావేశం... మరి మా సమస్యలు పరిష్కరించేదెపుడు? అంటూ వాపోతున్నారు.
-బి.వి.ప్రసాద్

గోడలు మాత్రమే మాట్లాడతాయి!
ఇక్కడ మనుషులు మాట్లాడరు, గోడలు మాత్రమే మాట్లాడతాయన్న ప్రముఖ పెయంట్ కంపెనీ ప్రకటన ఇటీవల బాగా పాపులర్ అయింది. అచ్చంగా టిడిపి పట్ల టిఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానం కూడా ఇదే కాబోలు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా నిజాం కాలేజి మైదానంలో జరిగిన బహిరంగ సభలో టిఆర్‌ఎస్‌ను గురించి కానీ, సిఎం కెసిఆర్ గురించి కానీ పల్తెత్తు మాట మాట్లాడకుండా టిడిపి, బిజెపి కూటమిని గెలిపించమని మాత్రమే టిడిపి అధినేత చంద్రబాబు నాయు డు పిలుపునిచ్చారు. దీంతో చంద్రబాబు చేసిన ప్రసంగంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ నేతలకు సిఎం కెసిఆర్ హుకుం జారీ చేశారు. చంద్రబాబు ప్రసంగంపై సిఎం కెసిఆరే స్పందిస్తారేమోనని టిఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు భావించారు. ఒకవేళ ఆ సభలో తమ గురించి చంద్రబాబు ఘాటుగా విమర్శలు చేసి ఉంటే, ఆ మరుసటి రోజు ఉదయం ఎసిబి డైరెక్టర్ ఎకె ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి ముఖ్యమంత్రిని కలవడం, ఆ తర్వాత కొద్దిసేపటికి డిజిపి అనురాగశర్మ కూడా వచ్చి కలవడం, ఆ తర్వాత వారంతా కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవడం, సాయంత్రం కెసిఆర్ కూడా వెళ్లి గవర్నర్‌తో భేటీ కావడం జరిగేదని ఆ పార్టీ నేత ఒకరు చెప్పుకొచ్చారు. చంద్రబాబు విమర్శలకు గవర్నర్‌ను కలువడానికి ఏమిటీ సంబంధం అంటే? దీంట్లోనే ఉంది తమ మతలబు అంటూ సదరు నాయకుడు చెప్పుకొచ్చారు. ‘ఓటుకు నోటు కేసు’ అస్త్రాన్ని అవసరం అయినప్పడు ఆ విధంగా వాడుకుంటామని ఆ నాయకుడు సెలవు ఇచ్చారు. టిఆర్‌ఎస్ వ్యూహాన్ని గమనిస్తే ఏమనిపిస్తుంది? అచ్చంగా సదరు కంపెనీ యాడ్ గుర్తుకు రావడం లేదూ!
- వెల్జాల చంద్రశేఖర్

ఆ మేయర్‌ను వదిలేశారు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుంది. అలా జరగకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విపక్షాలకు సవాల్ చేశారు. దీనిపై కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రతిస్పందించారు. గ్రేటర్‌లో వంద సీట్లు గెలిస్తే తెలంగాణలో అడుగు పెట్టను అని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం వంద డివిజన్లపై సవాల్ చేశారు. టిడిపి కాంగ్రెస్ నాయకుల స్పందనను బట్టి ఎన్నికల ఫలితాలు రాకముందే మేయర్ పదవిని అధిష్టించేది టిఆర్‌ఎస్ అభ్యర్థే అని ప్రకటించినట్టు అయింది. వంద డివిజన్లు అని సవాల్ చేస్తున్నారు కానీ మేయర్ పీఠంపై మా త్రం మాట్లాడడం లేదు.
- మురళి

ఇదే గౌరవప్రదం
ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్న అపవాదు తెచ్చుకునే కన్నా పోటీ చేయకుండా మిన్నకుండా ఉంటే గౌరవం దక్కుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలు ఉబలాటపడుతుండగా, వైకాపా చల్లగా తమ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించింది. జిహెచ్‌ఎంసిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తమ పార్టీకి పెద్దగా ఓట్లు రావని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోంది. పోటీ చేయకుండా, ఓడిపోయారన్న అపవాదు తెచ్చుకోకుండా ఉంటే గౌరవప్రదం కదా!
- పి.వి. రమణారావు

గాంధీ తత్వం!!
ఒకరు హంతకుడు! మరొకరు గజదొంగ!! వారిరువురూ మహాత్ముని సూక్తులు చెబితే, జైలు అధికారులే నివ్వెరపోయారు. ఏమిటా కథ? ముంబాయికి చెందిన సర్వోదయ మండలి ఇటీవల తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గాంధీతత్వంపై పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో ఓ ఛీటింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న రమేష్ ఇస్త్రానీ వందకు 77 మార్కులతో ప్రథమ శ్రేణిలో నిలువగా, రెండవ స్థానంలో అండర్‌వరల్డ్ డాన్ సంతోష్ శెట్టి గ్యాంగ్‌లో సభ్యుడైన విజయ్ పలాండేకు లభించిందట. వరుస హత్యల కేసులో పలాండే శిక్ష అనుభవిస్తున్నాడు. గాంధీతత్వంపై ఇంత గొప్పగా రాసిన వారిరువురు నేరగాళ్ళు ఎలా అయ్యారు చెప్మా! అని సర్వోదయ మండలి సభ్యులు, జైలు అధికారులు విస్తుపోయారట.
- వి. ఈశ్వర్ రెడ్డి