మిర్చిమసాలా

గొంతు సవరించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తెలంగాణ అసెంబ్లీలో నోరువిప్పితే చాలు.. మైకు లేకున్నా ఆయన మాటలు గ్యాలరీ ఉన్న విలేఖరులకు సైతం వినిపిస్తాయి. సభలో ఆయన గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టగానే స్పీకర్ మధుసూధనాచారి- ‘ప్రతిదానికీ గట్టిగా మాట్లాడతారు. సహనానికీ హద్దు ఉం టుంది. ఇలా మాట్లాడితే సహించేది లేద’ని హెచ్చరించే సరిగా ఒక్కసారిగా సీన్ మారిపోయిం ది. బిగ్గరగా మాట్లాడి అంతా తనవైపు దృష్టిసారించేలా చేసే సంపత్‌కుమార్ స్పీకర్ గట్టిగా మాట్లాడే సరికి గొంతు సవరించుకుని మామూలుగా మాట్లాడడం మొ దలు పెట్టారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న ట్టు గట్టిగా మాట్లాడేవారిని గట్టిగా మాట్లాడి దారిలో పెట్టాలేమో!
- మురళి

రాజుగారి వరాలు!
ఎన్నికలకు రెండేళ్లకు ముందే సిఎం కెసిఆర్ వరాలు ప్రకటిస్తున్నారు. ఆయన ఔదార్యంపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పిన పిట్టకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన దర్బార్‌లో ఒక గాయకుడు అద్భుతంగా పాడడంతో మెచ్చిన ఓ రాజుగారు అతనికి ము త్యాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, కోరినంత భూమిని నజరానాగా ప్రకటించారు. ఆ వరాల గురించి గాయకుడు తన భార్యాబిడ్డలకు చెప్పి ఎంతో సం తోషించాడు. రాజుగారు ప్రకటించిన ఏ కానుక కూడా తన చేతికి అందకపోవడంతో ఆ గాయకుడు దర్బార్‌కు వెళ్లి తన సమస్య వివరించాడు. దీనికి ఆ రాజుగారు- ‘నా చెవులకు ఇంపుగా పాటలు పాడావు.. నేను కూడా నీ చెవులకు ఇంపైన వరాలు ప్రకటించాను.. అంతే తప్ప దీంట్లో ప్రత్యేకంగా ఇచ్చేది ఏముంటుంది?’ అని అన్నాడట! కెసిఆర్ వరాలు మాత్రం అలా కాకూడదని అక్బరుద్దీన్ సూచించారు.
- వెల్జాల చంద్రశేఖర్

మాటలతో తంటా
కొన్ని పదాలను మనం తేలిగ్గా వాడేస్తుంటాం, కానీ ఒక్కోసారి అవి వివాదానికి దారి తీస్తుంటాయి. ఓవర్ యాక్షన్ చేస్తున్నావని, టూ మచ్ చేస్తున్నావని, డోన్ట్ బి ఓవర్ స్మార్ట్.. అని వాడేస్తుంటాం. ఇంగ్లీషులో తేలిగ్గా చెప్పేసినా, లోతుగా పరిశీలిస్తే ద్వంద్వార్థాలు వస్తుంటాయి. గుజరాత్ అసెంబ్లీలో స్పీకర్ రమణ్‌బాయి పటేల్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేనుద్దేశించి- ‘డోన్ట్ బి ఓవర్ స్మార్ట్’ అనడంతో ఆమె కంగుతింది. స్పీకర్ చాంబర్‌కు వెళ్ళి ఆమె తన నిరసన వ్యక్తం చేసి, కంట తడి పెట్టుకుంది. దీంతో తన ఉద్దేశం అది కాదంటూ స్పీకర్ వివరణ ఇచ్చుకున్నారు. కాబట్టి పదాల వాడకంలో నేతలైనా, సాధారణ వ్యక్తులైనా జాగ్రత్త పడాల్సిందే. మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా!
- వి.ఈశ్వర్ రెడ్డి

అందుకే.. ఇలా మిగిలాం!
విపక్ష సభ్యులు విమర్శలకు దిగితే- ‘గతంలో మీరు చేసిందేమిటి?’ అంటూ అధికారపక్షం చిట్టా విప్పడం మామూలే. శాసనసభలో విపక్షాలు వేసే ఎత్తులు, పైఎత్తులను గమనించి అందుకు తగ్గట్టే అధికార పార్టీ సైతం వ్యంగ్యోక్తులు, అస్తశ్రస్త్రాలతో సిద్ధంగా ఉంటుంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీని ఇరుకున పెడుతూ కాంగ్రెస్ నేత జానారెడ్డి చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ‘మేం చెప్పింది చేయలేకపోయాం కనుకనే ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, మీరూ అదే పని చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా..’ అంటూ జానా చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు విరిశాయి. ‘ప్రశ్నించకుంటే మీతో కుమ్మక్కయ్యామని ప్రజలు మమ్మల్ని నిలదీస్తారు, అందుకే మేం మిమ్మల్ని నిలదీస్తున్నాం’అంటూ అసలు సంగతి ఆయన చెప్పకనే చెప్పారు.
- బివి ప్రసాద్

‘ముందస్తు’ ముచ్చట్లు
ముందస్తు ఎన్నికలంటే చేతులు కాల్చుకోవడమే. 2004 లో కేంద్రంలో బిజెపి, ఉమ్మడి ఏపిలో టిడిపి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఓటమి చెందాయి. తాజాగా టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ- ‘ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ ఎడాపెడా రాయితీలు, వరాలు ప్రకటిస్తున్నార’ని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే పనేముందని, సర్వేల్లో కూడా తమ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయని తేలిందని సిఎం కెసిఆర్ తిప్పికొట్టారు. ‘మంచి పనులు చేస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం’ అన్నారు. ‘ముందస్తు’పై మోజుపడి ఐదేళ్ల పూ ర్తికాలం అధికారాన్ని వదులుకునే తప్పిదాన్ని కెసిఆర్ చేస్తారంటే ఎవరూ నమ్మరు.
- శైలేంద్ర