మిర్చిమసాలా

అడకత్తెరలో పోకచెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్థితి ఎవరికీ రాకూడదు. వస్తే ఏ విషయం తేల్చుకోలేక ఇరకాటమే. ఇదే పరిస్థితి ఏపి సిఎం చంద్రబాబుకు ఎదురైంది. ఆయేషామీరా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు తేల్చిం ది. దీన్ని సవాలు చే స్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని పోలీసు సం ఘాలు చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నాయి. అ లా వెళ్లకపోతే పోలీసుల ఆగ్రహానికి టి డిపి ప్రభుత్వం గురవుతుంది. సిబిఐ విచారణకు కోరినా పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని న్యాయ నిపుణులంటున్నారు. సుప్రీంకు వెళితే దళిత సంఘాల ఆగ్రహానికి గురవుతామన్న ఆందోళన ఉండనే ఉంది. దీంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. - శైలేంద్ర

అలవాటులో పొరపాటు
తెరాసలో చేరిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి రూటే సపరేటు. ఈ మధ్య నిజామాబాద్ ఎంపి కవితతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగాన్ని ముగించేప్పుడు ‘జై తెలంగాణ’ అనడానికి బదులు- తానింకా టిడిపిలోనే ఉన్నట్లు అనుకొని ‘జై తెలుగు దేశం’ అంటూ గట్టిగా రెండు సార్లు అన్నారు. వేదికపై ఉన్న ఎంపి కవిత అవాక్కయినా, తన భావాలు బయటపడకుండా ముసిముసిగా నవ్వారు. ఈ మతిమరపు సంగతెలా ఉన్నా, తనలో హుషారు ఏ మాత్రం తగ్గలేదని మల్లారెడ్డి తన ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో విద్యార్థులతో కలిసి ‘స్టెప్పులేశారు’. ఆయన తన మనవడితో కలిసి స్టెప్పులేయడంతో విద్యార్థులు సైతం కేరింతలు కొట్టారు.
- వి.ఈశ్వర్ రెడ్డి

అనంతకోటి ఉపాయాలు
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. సంక్షోభ సమయంలో ఏం చేయాలో తోచనపుడు ఉపాయాల కోసం అనే్వషించడం మామూలే. వాక్చాతుర్యం ఉన్న మంత్రి కెటిఆర్ ఆర్మూరులోని జనహిత ప్రగతి సభలో మాట్లాడాల్సి వచ్చినపుడు ఏం చేయాలో అర్థం ని పరిస్థితి ఏర్పడి తన భార్య చెప్పిన జోకు గుర్తుచేశారు. మొదటే మాట్లాడాల్సి వస్తే- తన తర్వాత మాట్లాడబోయేవారు అద్భుతంగా మాట్లాడతారని తప్పించుకోవచ్చు, మధ్యలో అవకాశం వస్తే ముందు మాట్లాడిన వారు బాగా మాట్లాడారని చెప్పవచ్చు, చివరిగా అవకాశం వస్తే- అంతా మాట్లాడారు.. ఇంక నేనేం మాట్లాడాలి.. అని చెప్పి తప్పించుకోవచ్చు అని మంత్రి చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి.
- బివి ప్రసాద్

దానయ్యకు మంత్రి పదవా?
ఎపి మంత్రివర్గ విస్తరణలో ‘దానయ్య’కు పదవి వరించిందా? కొత్త మంత్రుల్లో దానయ్య అనే పేరుగల వ్యక్తి ఎవరూ లేరా? దీనికి సమాధానం టిడిపి ఎంపి జెసి దివాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు. విస్తరణపై జెసి స్పందిస్తూ ‘సిఎం తలుచుకుంటే దారిన పోయే దానయ్యను మంత్రి చేయవచ్చు’ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యానంపై జోరుగా చర్చ సాగుతోంది. దారిన పోయే దానయ్యకు సైతం మంత్రి పదవి ఇచ్చారని ఆయన దెప్పిపొడుపా? కొత్త మంత్రుల్లో- జెసి దృష్టిలో దారిన పోయే దానయ్య ఎవరై ఉంటారన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
- వెల్జాల చంద్రశేఖర్

‘సామాజిక’ సమస్య!
ప్రచారంలో హైటెక్ టెక్నాలజీని వాడుకోవడంలో టిడిపికి సాటి ఏ పార్టీ ఉండదు. కానీ, సామాజిక మాధ్యమాలు టిడిపికి సమస్యగా మారాయి. చంద్రబాబు, లోకేశ్‌ల మాటలకు మీడియా మంచి ప్రచారం కల్పిస్తుంటే వాటిని కొందరు సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతున్నారు. అవినీతిలో ఎపి మొదటి స్థానంలో నిలిచినట్టు అసెంబ్లీలో పొరపాటున బాబు అన్నారు. ఈ మాటను మీడియా పట్టించుకోకున్నా, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరిపారు. లోకేశ్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసినపుడు ‘సార్వభౌమాధికారం’ అనడంలో పడిన ఇబ్బందిపై సామాజిక మాధ్యమాల్లో ఆడుకున్నారు. ఒక టీవీ చానల్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారంపై లోకేష్ అనుచరులు మండిపడుతూ వాటిని నిషేధించాలని అంటున్నారు.
- మురళి