మిర్చిమసాలా

తనైతే ఒకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనైతే ఒకటి , ఎదుటివారైతే మరొకటి అన్నచందంగా ఉన్న ఐటి మంత్రి నారా లోకేష్ బాబు తీరుపై పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో జయంతికి బదులు వర్ధంతి అంటూ లోకేష్‌బాబు చేసిన వ్యాఖ్యలో సామాజిక మాధ్యమాల్లో రయ్‌మన్నాయి. దాంతో సామాజిక మాధ్యమాలను కట్టడి చేయాల్సిందేనని హుకుం జారీ చేయడంపై పార్టీ నేతలే తనైతే ఒకటా , ఎదుటివారైతే మరొకటా అంటూ ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు, తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్‌బుక్, వెబ్‌సైట్లలోనే విపక్షాలను దుమ్మెత్తిపోయడమేగాక, నానా మాటలు అన్న పోస్టులు గురించి వారు గుర్తుచేస్తున్నారు. కొత్త గుర్రంపై సవారీ ఎటు దారితీస్తుందో చూడాలని వారంటున్నారు...
-బి.వి.ప్రసాద్

పెదవి విప్పరు
‘ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగాను, రాజకీయంగా ఎదిగాను, రాష్ట్ర విభజన వల్ల జరిగిన తీరని నష్టాన్ని ఏదో రూపంలో భర్తీ చేసేందుకు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఏదో కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్‌కు అనుమతులు లేదా అభివృద్ధి పథకాలకు నిధులు తీసుకువస్తున్నా’ నంటూ కేంద్ర సమాచారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు విజయవాడ నగరానికి ఎప్పుడు వచ్చినా పదేపదే చెబుతుంటారు. ఈ నేపధ్యంలోనే మంత్రి వెంకయ్యనాయుడు, సిఎం నాయుడు పరస్పరం పొగుడుకుంటుంటారు. అయితే గత రెండేళ్లుగా సంభవించిన వివిధ తుపానులు, అతివృష్టి, అనావృష్టిలకు సంబంధించి కేంద్రం ఇప్పటికి 2వేల 816 కోట్ల రూపాయలను కేవలం బాధిత రైతాంగం కోసం రాష్ట్రానికి అందచేసింది. అయితే ఆ నిధులను ఇతరత్రా పద్దులకు తరలించారు. రైతుకు నయాపైసా అందలేదు. అయినా ఈ విషయమై సిఎం నాయుడును వెంకయ్యనాయుడు ఎందుకు ప్రశ్నించటం లేదంటూ వివిధ రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
-నిమ్మరాజు చలపతిరావు

మరీ ఇంత నిస్సిగ్గా!
రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని వచ్చే ఎన్నికల్లో తాము ఇవ్వబోయే హామీ టిఆర్‌ఎస్ సర్కార్‌కు లీకై పోయిందని కాంగ్రెస్ పార్టీ వాపోవడంపై ప్లీనరీలో సిఎం కెసిఆర్ తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ నాయకులు మరీ ఇంత దిగజారి మాట్లాడుతారని అనుకోలేదన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇచ్చేది ఒక పంటకు మాత్రమే కాదని, రెండు పంటలకూ ఇవ్వబోతున్నట్టు కెసిఆర్ చెప్పారు. ఈ పథకం ఎంత మాత్రం కాంగ్రెస్‌ది కాదని, అది తన సొంత ఆలోచనేన్నారు. పోనీ ఒకవేళ కాంగ్రెస్‌దే అనుకుందాం, అయినా అంత నిస్సిగ్గుగా బయట పెట్టుకుంటారా? ఎవరైనా అని కెసిఆర్ విస్తుపోయారు.
- వెల్జాల చంద్రశేఖర్

గుణపాఠాలు నేర్చుకోం
పాత అలవాట్లు ఒక పట్టాన పోవు అనే సామెత అందిరకీ తెలిసిందే. ఘోర పరాజయాల నుంచి తెలంగాణ కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోకూడ దనుకుంటా. తెలంగాణ ఇచ్చిన పార్టీగా నిజంగా పేరున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ జిల్లా నేతలు గాంధీభవన్‌లో పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో గొడవలు పడ్డారు. ఒక వైపు పార్టీ వరుస ఓటములతో కృంగిపోయి ఉంది. మరో వైపు కాంగ్రెస్ బద్ధ శత్రువు టిఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లో ఘనంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. అధికార పార్టీ ప్లీనరీతో సంబరాలు జరుపుకున్న రోజు కూడా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో గొడవ పడడంచూసి సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాల ధోరణి మారదా, ఇలా అయితే ఎన్ని కసరత్తులు చేసినా పార్టీ పుంజుకుంటుందా అని పార్టీ వర్గాలు దిగాలుపడుతున్నాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో మామూలేనని మరి కొంత కొట్టిపారేశారు.
- శైలేంద్ర