మిర్చిమసాలా

ఉషాపతి.. ఉప రాష్టప్రతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నాయకుల మాటల వెనుక అర్థాలు వేరుగా ఉం టాయని ఎప్పటికప్పు డు నిరూపితవౌతూ నే ఉంటుంది. బి జెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడి తాజా వ్యాఖ్యలే ఇందుకు ని దర్శనం. చాలాకాలం క్రితమే ఉప రాష్టప్రతి పదవికి వెంకయ్య పేరు ప్రచారంలోకి రా గా ఆ విషయాన్ని ఆయనే తే లిగ్గా కొట్టిపారేశారు. తాను ఇప్పటికీ, ఎప్పటికీ ‘ఉషాపతి’ (ఆయన భార్య పేరు)ని మాత్రమే అని తేల్చి చెప్పారు. అలాంటి నేత కొద్దిరోజుల్లోనే దేశానికి ఉప రాష్టప్రతి కాబోతున్నారంటే సామాన్య విషయమా మరి!

- నిమ్మరాజు చలపతిరావు

విడాకులు ఇంత ఈజీనా..
వివాహమైన తర్వాత భర్త, అత్తమామలు క ట్నం కోసం వేధించడమో, మనస్పర్థలు రా వడమో, భర్త తనకు యోగ్యుడు కాదనో.. ర కరకాల కారణాలు చూ పిస్తూ విడాకులు కావాలని భార్య కోర్టులో పిటిషన్ వేయడం చూ స్తుంటాం. సంవత్సరాల తరబడి కోర్టులో వాదోపవాదాలు జరిగి చివరకు విడాకులు పొం దడం జరుగుతుంటుం ది. కానీ, తైవాన్‌లో ఓ లినో అనే మహిళ తాను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని ఇచ్చిన మెసేజ్‌కి భర్త స్పందించలేదు కాబట్టి విడాకులు కావాలని కోర్టుకెక్కింది. భర్త స్పందించక పోవడం నిర్లక్ష్యమేనంటూ న్యాయమూర్తి వెంటనే విడాకులు మంజూరు చేసేశారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు విడాకులడిగితే- మన దేశంలో కేసుల సంఖ్యను ఊహించలేం.
-వి.ఈశ్వర్ రెడ్డి

ఎక్సైజ్ శాఖనా.. మజాకా!
గతంలో ఎక్సైజ్ శాఖంటే నగరంలో, పట్టణంలో ఒక మూల ఉండేది. అందులో పనిచేసే సిబ్బంది సారా, మద్యం విక్రయాల్లో అక్రమాలను అరికడతారు. మద్యం విక్రయాలను భారీగా పెంచి సర్కారుకు ఆదాయాన్ని తేవడం ఈ శాఖ విధి. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో భాగంగా సినీ ప్రముఖులను పిలిపించి విచారించడంతో ఎక్సైజ్ శాఖ పేరు ఇపుడు మార్మోగుతోంది. ఈ శాఖలో పనిచేసే అధికారుల విధులపై నేడు అందరి దృష్టి పడింది. సారా, మద్యం, కల్లు దుకాణాల వేలం పాటలకు పరిమితమయ్యే ఈ శాఖలో డైరెక్టర్‌గా చేరిన ఐపిఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఇపుడు ‘డ్రగ్స్’ మాఫియాపై కొరడా ఝళిపించారు. తూనికలు, కొలతలు శాఖకు కూడా అకున్ లాంటి అధికారి వస్తే బాగుంటుందేమో!
- శైలేంద్ర

అందరి దృష్టి ఆయనపైనే..
‘ప్రతిపక్షంలో ఉన్నపుడు ఉద్యమించడం మా బాధ్యత’ అని పే ర్కొన్న వెంకయ్యనాయుడు బిజెపి అధికారంలోకి రాగానే- ఉద్యమాలు చేసే విపక్షానికి బాధ్యత లేదా? అని నిలదీస్తూ సత్తా ఉన్న నేతగా ఖ్యాతి పొం దారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో, సమస్యల్లో ప్రభుత్వానికి దారి చూపడంలో ముందుండే నేత ఆయనే. అలాంటి మేటి నాయకుడిని ఉప రాష్టప్రతి చేశారనగానే అంతా- ‘ఆయన నోటికి ముకుతాడు వేశారా?’ అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాని నరనరాన పార్టీని జీర్ణించుకున్న వెంకయ్య అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. ఉప రాష్టప్రతి అయ్యాక ఆయన చమత్కారం, చాకచక్యం ఏ రీతిన ఉండబోతున్నాయో చూడాల్సిందే.
- బివి ప్రసాద్