మిర్చిమసాలా

అటా ఇటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల రణరంగంలో తెలంగాణలో టిడిపితో కలిపి పోటీ చేసేది లేదని బిజెపి నేతలు చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అంతవరకూ ఓకే, మరి ఎన్నికలు వస్తే ఎవరితో కలిసి పోటీ చేయాలనే మీమాంసలో బిజెపి నేతలు పడిపోయారు. ఒంటరి పోరు కలిసొచ్చేలా లేదని భావిస్తున్న నేతలు టిడిపికి ప్రత్యామ్నాయం టిడిపీయేనని భావిస్తున్నట్టుంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే కలిసి పనిచేయాల్సిందేనని బిజెపి, టిడిపి నిర్ణయించాయి. సమావేశాలకు సైతం ఇరు పార్టీల నేతలు కలిసి అసెంబ్లీకి వచ్చారు. ఇంకో పక్క టిడిపి పవన్‌కళ్యాణ్ ప్రారంభించిన జనసేన వైపు చూస్తోంది. తెలంగాణలో పరిస్థితి కుదుటపరుచుకోవాలంటే కాంగ్రెస్‌తో కూడా జతకట్టేందుకు సై అంటున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. టిఆర్‌ఎస్ తన దారి తాను చూసుకుంటుండగా, ఎటు తిరిగి బిజెపి నేతలే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి అటా ఇటా..
-బి.వి.ప్రసాద్

‘పెద్దలు’ జానారెడ్డి!

శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అంటే పాలకపక్షానికి విపరీతమైన గౌరవం. ఆయన ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఎంతో గౌరవంగా పెద్దలు జానారెడ్డి అంటూ సిఎం కెసిఆర్ నుంచి మంత్రి హరీశ్ దాకా అందరూ సంభోదిస్తారు. తనకిచ్చే గౌరవానికి జానారెడ్డి కూడా పొంగిపోయి పాలకపక్షానికి అదేస్థాయిలో సహకరిస్తూనే ఉంటారు. మరీ అలాంటి జానారెడ్డి ఈ మధ్యకాలంలో ఎందుకో పాలకపక్షంపై గుర్రుగా ఉండటం ఎవరికి అర్థం కావడం లేదు. గతంలో మాదిరిగా కాకుండా పాలకపక్షానికి ఆయన సహాయ నిరాకరణ చేయడానికి కారణం ఏమిటన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జానారెడ్డిలో ఇంతటి మార్పు రావడానికి కారణాన్ని ఆయన సన్నిహితుడొకరు అసెంబ్లీ లాబీల్లో బయటపెట్టారు. సింగరేణి ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసారు. మంత్రి పదవి రాలేదన్న కోపంతో గతంలో జానారెడ్డి తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్త దుకాణం తెరిస్తే ముఖం పట్టుకొని ఎందుకీ దొంగ నాటకాలని ప్రశ్నించినట్టు సిఎం కెసిఆర్ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచే ‘పెద్దలు జానారెడ్డి’ పదానికి ఆయన లొంగడం మానేసారని ఆయన సన్నిహితుడు గుట్టు విప్పారు.
-వెల్జాల చంద్రశేఖర్

పాదయాత్రల సీజన్
పాదయాత్రల సీజన్ వచ్చేసింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. పాదయాత్రలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలో సందడి ప్రారంభమనట్లే. ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. పాదయాత్రల వల్ల గతంలో ఇద్దరు నేతలు ముఖ్యమంత్రులయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేసి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో గట్టిపోటీ నుంచి అధికారానికి చేరువగా వచ్చినట్లే వచ్చి స్వీయ తప్పిదాలతో అధికారంలోకి రాకపోయిన జగన్‌కు పాదయాత్ర కలిసి వస్తుందా ? 2019 దాకా వేచి చూడాల్సిందే.
-శైలేంద్ర