మిర్చిమసాలా

ఎవరు మిగిలేను..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఫలితంగా నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దానం నాగేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎఐసిసి నాయకుడు దిగ్విజయ్ సింగ్ వద్ద జరిగిన సమావేశంలో టి.పిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ఒక నాయకుడు ప్రశ్నించారు. ఉత్తమ్ రాజీనామా చేస్తే మరో నాయకుడు నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయలేదన్న ప్రశ్న ఉదయిస్తుందని, ఆయన కూడా రాజీనామా చేస్తే, ఫలానా నాయకుడు ఎందుకు రాజీనామా చేయలేదని ఇలా అనుకుంటూ పోతే చివరకు ఏ పదవిలో ఎవరూ మిగలరని దిగ్విజయ్ అనడంతో సమావేశంలో పాల్గొన్న వారంతా గొల్లుమని నవ్వారట!
-వి. ఈశ్వర్ రెడ్డి

తలసాని సంతోషం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరగానే బాబు తరువాత అంతగా సంతోషపడింది తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వాళ్లు చేరితే తెలంగాణ మంత్రికి సంతోషం ఎందుకు అంటే, తలసాని పార్టీ మారినప్పుడు చంద్రబాబు నీతులు చెబుతూ జంతువులకున్న విశ్వాసం కూడా లేదు అమ్ముడు పోతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బాబు కండువా కప్పగానే తలసాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు ఏమన్నావు ఈరోజు ఏం చేస్తున్నావు నీతుల బాబు అంటూ బాబును చెడామడా కడిగేశారు. బాబుది నీతు లు మాట్లాడుతూ ఒక్క మాటకు కట్టుబడి ఉండని నీచ రాజకీయం అని కసినంతా తీర్చుకున్నారు.
- మురళి

ఎవరి గోల వారిది!
రాజకీయ సమీకరణలు శరవేగంతో జరుగుతున్నప్పటికీ ఓటు బ్యాంక్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో నేటికి కూడా పరిఢవిల్లుతున్నాయి. ఇటీవలి కాలంలో దూరమైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలను తిరిగి దరిచేర్చుకోవాలనే ఆకాంక్షతో పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విజయవాడలో రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహించగా ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ వెంట సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కాపుల రిజర్వేషన్ల అంశాలపై పై నాలుగు వర్గాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి. సభలో పాల్గొన్న సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వీరి మనోభావాలేవీ పట్టించుకోకుండానే కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉంది...రాబోయే కాలంలో మాలలు, కాపులు కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తారు.. కాపు నేత కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కాగలరంటూ ఉద్వేగంతో చెబుతుంటే ప్రతినిధులంతా ఒక్కసారి లేచి నిలబడి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఇదే సమయంలో మాదిగలు లేచి కాంగ్రెస్ పార్టీ కోసం తాము పనిచేయటం లేదా? అంటూ నిలదీశారు. వీరిని సముదాయించ లేక పార్టీ నేతలు సతమతం కావాల్సి వచ్చింది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాపులు అధికంగా ఉండటం వల్లనే వారి ఓటు బ్యాంక్ కోసం చింతామోహన్ అలా మాట్లాడి ఉండవచ్చని కొందరు సీనియర్ నేతలు తమలో తాము మాట్లాడుకోవడం కన్పించింది.
- నిమ్మరాజు చలపతిరావు

టచ్‌లో ఉన్నాం
టచ్‌లో ఉంటా.. టచ్‌లో ఉన్నాం అనే మాటలు నమ్మకానికి, విశ్వసనీయతకు నిదర్శనం. కాని ఇటీవల కాలంలో టచ్‌లో ఉన్నారనే పదం తెగ పాపులరైంది. వైకాపా అధ్యక్షులు జగన్ రాజ్‌భవన్ బయట విలేఖర్లతో మాట్లాడుతూ 21 మంది టిడిపి ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తే ఈ ప్రభుత్వం ఏమవుతుందనే అర్ధంలో మాట్లాడారు. గందరగోళానికి గురైన టిడిపి వెంటనే రంగంలోకి దిగి నలుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి తమ పార్టీలోకి వైకాపా వారిని చేర్చుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బహిరంగంగా ప్రకటించారు. మరో కొంత మంది వైకాపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. ఎవరు ఎవరి టచ్‌లో ఉన్నారో తెలియదు కాని టచ్ అంటే భయమేసే పరిస్ధితులు ఏపిలో నెలకొన్నాయి.
- శైలేంద్ర

బూడిదకూడా లేదే
నా దగ్గరేం ఉంది..బూడిద తప్ప...అనే ఈ డైలాగ్‌కు పాతికేళ్ల ప్రాయం వచ్చినా ఆ డైలాగ్ అన్నదెవరో తెలుగు ప్రజలు మరిచిపోలేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వేసిన ఈ డైలాగ్ ఆరోజుల్లో పెనుసంచలనం. అంతకు మించిన సంచలన డైలాగ్ చంద్రబాబు వేయడంతో నోళ్లు వెళ్లబెట్టడం జనం వంతైంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏమంటారా....నా దగ్గర బూడిద కూడా లేదు...అనే ఈ డైలాగ్‌ను సెటైర్లతో పత్రికాసమావేశంలో చంద్రబాబు వేశారు. అక్కడితో ఊరుకోని చంద్రబాబు నా పాకెట్‌లో సెల్ ఫోన్ ఉండదు, నా పాకెట్‌లో పర్సు కూడా ఉండదు, పర్సు ఉండదు కనుక మనీ ఉండదు.. క్రెడిట్ కార్డులు ఉండవు, కరెన్సీ ఉండదు...ఒక హాండ్ కర్చ్ఫీ మినహా ... నాకేం అవసరాలు లేవు, రావు, వచ్చినా ప్రజలున్నారుగా...ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎవరికి అర్ధం కాదు...? చెప్పండి
- బి.వి.ప్రసాద్