మిర్చిమసాలా

రోల్డ్ గోల్డ్ దొంగ..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ దొంగ పొద్దునే్న ఎవరి ముఖం చూశాడో కానీ రోల్డ్ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేసి ఇట్టే దొరికిపోయాడు. చైన్ స్నాచింగ్‌కు అలవాటుపడిన లక్ష్మణ్ సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో దొంగగా మారాడు. బంగారం కాజేయాలని సదరు దొంగ వరంగల్ హంటర్ రోడ్డులో మినీ రైల్వే బ్రిడ్జి వద్ద వెళుతున్న శారద అనే ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగలించి పరారయ్యాడు. కాగా ఆ మహిళ దొంగ, దొంగ అంటూ కొద్ది దూరం వెంట పరుగెత్తగా, స్థానికులు అతగాడి బైక్‌ను అడ్డగించి పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తీరా దొంగలించిన గొలుసు రోల్డ్ గోల్డ్ అని తెలుసుకున్న పోలీసులే కాదు సదరు దొంగ కూడా అవాక్కైయ్యాడు. రోల్డ్‌గోల్డ్ చైన్ పుణ్యమా అని దేహశుద్దే కాదు కటకటాల పాలయ్యాడు, పాపం దొంగ.
-వి.ఈశ్వర్ రెడ్డి
కృష్ణా ‘్ఫస్ట్’!
కలెక్టర్ బీ లక్ష్మీకాంతం చేస్తున్న నిర్విరామ కృషితో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో అన్నింటా కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తోంది. దీంతో ప్రతి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అర్జీల పరిష్కారం, బహిరంగ మలమూత్ర విసర్జన రహితం, పొగ రహితం, ఈ-పోస్‌తో రేషన్ పంపిణీ, ఆధార్‌తో ఎరువుల పంపిణీలో కోట్లాది రూపాయల ఆదా, మొక్కల పరిరక్షణ, ఎన్టీఆర్ వైద్య సేవలు, అంగన్‌వాడీ భవనాల్లో వౌలిక సదుపాయాల కల్పనలోనూ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ మిషన్ అంత్యోదయ కింద జాతీయ స్థాయిలో ప్రకటించిన ఆరు ఉత్తమ గ్రామాలూ కృష్ణాలోనే ఉన్నాయి. ఇక మద్యం అమ్మకాల్లోనూ జిల్లా ఫస్ట్‌గానే ఉంది.
కొసమెరుపు: తాజాగా ‘చెంబు చచ్చింది .. ఆత్మగౌరవం బతికింది’ అనే నినాదంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం కోసం జిల్లాలో సరికొత్త ప్రచారం సాగుతోంది.
-నిమ్మరాజు చలపతిరావు

డిఎన్‌డి వాట్సప్ గ్రూప్
డిఎన్‌డి అంటే డిఎన్‌ఏ అయి ఉండవచ్చని పొరబడేరు. కానీ ఇది అక్షరాల డిఎన్‌డినే. డిఎన్‌డి అండే డ్రంకన్ డ్రైవ్‌కు సంక్షిప్తనామం. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహించడం తెలిసిందే. డ్రంకన్ డ్రైవ్‌ల చెకింగ్‌ల నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్‌లో మందు ప్రియులు కొందరు ఏకంగా వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్న గుట్టును పోలీసులు రట్టు చేసారు. ఈ గ్రూప్‌లో మూడు వందల మంది సభ్యులుగా ఉన్నట్టు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే సభ్యులను సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ గ్రూప్‌లో ఆలర్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. ఉదాహరణకు జూబ్లీహిల్స్ నుంచి ఎల్‌బి నగర్ వెళ్లే మార్గాల్లో ఎక్కడెక్కడ డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌లు జరుగుతున్నాయో గ్రూప్‌లోని సభ్యులు పోస్టింగ్‌లు పెడుతారు. ఈ మార్గంలో వెళ్లే మందు రాయుళ్లు చెక్కింగ్‌లను తప్పించుకొని గమ్యానికి చేరుకోవడానికి ఈ గ్రూప్ ఉపయోగపడుతుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో ఒకతను పట్టుబడ్డారు. వాస్తవానికి తాను ఉప్పల్ మీదుగా ఎల్‌బి నగర్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఆ మార్గంలో డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ జరుగుతున్నట్టు ఆలర్ట్ చేయడంతో ఈ మార్గంలో వచ్చి ఎరక్కపోయి ఇరుక్కునట్టు అసలు విషయాన్ని బయట పెట్టడంతో డిఎన్‌డి గ్రూప్ గుట్టు రట్టు అయింది.
-వెల్జాల చంద్రశేఖర్

నిరసనలు లేని ఔషధం
సాధారణంగా ఏ వస్తువు రేట్లు పెంచినా జనం స్పందిస్తారు. రాజకీయ పార్టీలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ప్రజా సంఘాలు రోడ్డెక్కుతాయి. ధర్నాలు, ప్రదర్శనలు, హర్తాళ్‌లు, బంద్‌లకు పిలుపునిస్తారు. కరెంటు చార్జీలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉంటుంది. చార్జీలు పెంచిన పార్టీలు గతంలో ఓటమి చెందాయి. టమోటాలు, ఉల్లిపాయల రేట్లు పెరిగితే ప్రభుత్వాల జాతకం ఎన్నికల్లో తారుమారవుతుంది. కాని ఒక్క మద్యం రేట్లు పెంచితే ఎవరూ నిరసన తెలపరు. దాని గురించి మాట్లాడుకోవడానికి సందేహిస్తారు. ఒక వేళ మాట్లాడితే తమను తప్పుగా అర్ధం చేసుకుంటారనే న్యూనతాభావానికి గురవుతారు. అదే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు వరం. ఒక రకంగా చెప్పాలంటే, ప్రపంచం మొత్తం పైనా ధరలను ఎంత పెంచినా నిరసనకు నోచుకోని ఏకైక ఔషధం, వస్తువు మద్యం. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ 31వస్తుందనంగా మద్యం రేట్లను పది శాతం పెంచింది. ఆంధ్రప్రభుత్వం గతంలోనే మద్యం రేట్లను పెంచింది. మద్యం ద్వారా ఖజనాను నింపుకునేందుకు పోటీపడుతున్న ప్రభుత్వాలు సామాన్యుడి జాబితాలో అగ్రస్థానంలో ఉంటే మద్యం అనే నిత్యావసరవస్తువు రేటు పెంచితే వినియోగదారుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కిక్కురమనకుండా ఉండడం నిజంగా అద్భుతమే.
-శైలేంద్ర