మిర్చిమసాలా

బడ్జెట్ అంతా గుంతలకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ మహా నగరాన్ని ఇస్తాంబుల్‌లా రూపుదిద్దుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రభృతులు పలు సార్లు ప్రకటించారు. నగరంలో ఎక్కడైనా గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ గుర్తుచేశారు. నిజం చెప్పాలంటే గుంత లేని రోడ్డే లేదని ఆయన అన్నారు. గుంతలు చూపించుకుంటూ పోతే, ప్రభుత్వం వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తే చివరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కూడా సరిపోదని లక్ష్మణ్ అనడంతో, సభ్యులతో పాటు మంత్రి ఈటల, స్పీకర్ మధుసూదనాచారి కూడా నవ్వాపుకోలేకపోయారు.
- వి.ఈశ్వర్ రెడ్డి

పొగడ్తా.. తెగడ్తా..
‘అధ్యక్షా..! మన ప్ర భుత్వం ఏ పనీ చేయడం లేదు.. ఎస్సీలకు ఏమీ చేయలేదు.. ఎస్టీలకు ఏమీ చేయలేదు.. బీసీల సంగతి సరేసరి.. ఉద్యోగులకు జీతాలు పెంచలేదు.. ని యామకాలు జరగలేదు.. ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు అధ్యక్షా..!’- అంటూ అధికార పక్షం సభ్యుడు అనర్ఘళంగా ఉపన్యసిస్తుంటే విన్నవారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇలాంటి ఘటనే మొన్న తెలంగాణ శాసనసభలో జరిగింది. అధికార తెరాస సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ఈ మాటలు అన్నీ చెప్పి, చివరికి- ‘ఇది బీజేపీ సభ్యుల ఆరోపణలు అధ్యక్షా..’- అంటూ ముగించడంతో ‘హమ్మయ్య’ అని అధికారపక్షం సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ మనవాడు తిడుతున్నాడా? పొగుడుతున్నాడా? అని వారు ఒక్కసారి ఆశ్చర్యంలో మునిగారు.
- బీవీ ప్రసాద్

తెలుపంటే మోజు..
శాసనమండలి, శాసనసభల్లో సభ్యులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, వారి మధ్య ఒక విషయంలో మాత్రం ఒకే రకమైన ఆలోచన, ఒకే రకమైన ప్రవర్తన కనిపిస్తోంది. సాధారణంగా సభ ప్రారంభం రోజున సభ్యులు దాదాపు అందరూ తమ పార్టీకి చెందిన రంగుతో ఉండే షర్టులు ధరించి వస్తారు. మిగతా రోజుల్లో దాదాపు అందరూ తెలుపురంగు ప్యాంటు,షర్టు ధరించి వస్తున్నారు. మొదటి రోజు మినహా మిగతారోజుల్లో చట్టసభల్లో ‘తెల్లదనం’ కనువిందు చేస్తోంది. తెలుపు దుస్తుల విషయంలో మాత్రం అందరి వైఖరి ఒకే రకంగా ఉండటం గమనార్హం.
-పీవీ రమణారావు

‘ఫ్రంట్’కు సినీ గ్లామర్!
సినీనటుల పట్ల ఆకర్షితులు కానివారు అరుదు. అయితే- సినీనటులే రాజకీయాల వైపు ఆకర్షితులు కావడం ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ‘ఫెడరల్ ఫ్రంట్’లో చేరేందుకు కొందరు సినిమా నటులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే తమిళనటుడు కమల్ హసన్ ఒక రాజకీయ పార్టీని పెట్టారు. సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే రాజకీపార్టీని పెట్టబోతున్నారు. వీరిద్దరు కూడా కేసీఆర్ పెట్టబోయే ఫెడరల్ ఫ్రంట్ గురించి వాకబు చేయడమే కాకుండా, అవసరమైతే ఫ్రంట్‌లో చేరుతామని మద్దతు ఇచ్చినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్ కేసీఆర్‌ను కలిసి, ఫ్రంట్‌పై అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద నటులు ఫెడరల్ ఫ్రంట్ పట్ల మొగ్గు చూపడం ఆలోచించతగ్గదే. జయహో కేసీఆర్!
- వెల్జాల చంద్రశేఖర్

ఏ కమిటీలో ఏముందో?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్య నవ్యాంధ్రకు కేంద్రం ఇచ్చిన వరాలు ఏంటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయాన్న అం శంపై అధ్యయనానికి సం యుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమో? లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి, రిటైరైన ఉన్నతాధికారులతో ఇదే అంశంపై ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీకి కేంద్రం వల్ల చేకూరిన ప్రయోజనాలపై కమిటీలు వేసి అధ్యయనం చేయడం మంచిదే. ఒకే అంశంపై ఇన్ని కమిటీలు అధ్యయనం చేయడం వల్ల భిన్నమైన నివేదికలు వస్తాయి. కానీ, ‘హోదా’ సాధనకు రోడ్ మ్యాప్ ఖరారు చేసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు విపక్ష పార్టీలు ఒక వేదికపైకి వస్తాయా?
-కేవీఎస్