మిర్చిమసాలా

అక్ర‘మార్కులు’ వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారాయి, సంస్కృతీ సంప్రదాయాలూ పడిపోతున్నాయి... కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో ఉన్నా, ఇది ఐ-పాడ్, వాట్సాప్ యుగం అయ్యిందని ‘సంస్కృతి ఫౌండేషన్’ సభ్యుడు కెవై వరప్రసాద రెడ్డి ఒక సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మం అనే పదానికి ఇంగ్లీషు పదం లేదని, ఆంగ్ల డిక్షనరీలో దానికి అర్థం లభించదన్నారు. సంప్రదాయాల గురించి బోధించాల్సిన తల్లి కూడా తన పిల్లలు మంచి మార్కులు సాధించకపోతే- ముఖం చూపించవద్దని అనడం బాధాకరమని అన్నారు. విద్యార్థులకు సూర్యనమస్కారాల గురించి చెప్పడం లేదు, మార్కులు సాధించడమే లక్ష్యంగా బోధన జరుగుతున్నదని, అక్ర‘మార్కులు’ కాదు.. అపర ‘వీర’మార్కులు కావాలని ఆయన అనడంతోనే సభికులు కరతాళ ధ్వనులు చేశారు.
-వి.ఈశ్వర్ రెడ్డి

కొత్త హామీలకు కసరత్తు
గత నాలుగేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారో ఆ దేవుడికెరుక! 2019 ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియక ఆయన సతమతమవుతున్నట్టుంది. అందుకేనేమో.. 25ఎంపీలను, 175 ఎంఎల్‌ఏలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం మళ్లీ చక్రం తిప్పుతానంటున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా రోజూ కనీసం ఐదు ప్రధాన హామీలు, ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక సమస్యలపై హామీలు విరివిగా గుప్పిస్తున్నారు. మరోవైపు ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ఊళ్లను చుట్టేస్తూ తనకు తోచిన వాగ్గానాలు చేస్తున్నారు. జగన్, పవన్‌లకు భిన్నంగా జనం మెచ్చేలా ఎలాంటి హామీలివ్వాలన్నదే ప్రస్తుతం తెదేపా అధినాయకుడి ఆలోచన.
-నిమ్మరాజు చలపతిరావు