ట్రైలర్‌లో మిత్రవింద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయికృప, రామకృష్ణ, వంశి ప్రధాన పాత్రల్లో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో అమృతసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ‘మిత్రవింద’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఈమధ్య ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులనుండి ఆదరణ లభిస్తోంది. టైటిల్ బాగుంది. తప్పకుండా సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారు. దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ, తా ను రూపొందించిన మొదటి చిత్రం ‘లాటరీ’కి జాతీయ అవార్డు వచ్చిందని, ఆ తరువాత ‘అమ్మ’ అనే ఆల్బమ్ చేశానని, ఇది మూడవ సినిమా అని అన్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఎస్.బి.రే అనే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ రూపొందిస్తున్న చిత్రమిదని, కథ ఒక్కరోజులో జరుగుతుందని, ప్రస్తుతం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేస్తామన్నారు. వంశి మాట్లాడుతూ- ఇది నా మొదటి చిత్రం. లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. ఓలేటి రామకృష్ణ మాట్లాడుతూ, చిన్న బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:దారా రవి, సహ నిర్మాత:ఓలేటి రామకృష్ణ, నిర్మాత, దర్శకత్వం:సాయిరామ్ దాసరి.