ఓ మై గాడ్‌తో మంచి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్
‘అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన నాకు ‘ఓ మై గాడ్’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలోని పాటలకు విశేష ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా వుంది’ అని సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై తనీష్, మేఘశ్రీ, పావని ప్రధాన తారాగణంగా వి.శ్రీవాస్తవ్ దర్శకత్వంలో వేణు మొక్కపాటి రూపొందించిన చిత్రం ‘ఓ మై గాడ్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సినిమా పాటలకు వస్తున్న స్పందనను తెలియజేశారు. ఆడియో విడుదలైన రోజునుండి మంచి ఆదరణ పొంది, ఆడియో సీడీలు అమ్ముడయ్యాయని, తాను 15 సినిమాలకు సంగీతాన్ని అందించానని, ఆ చిత్రాల పాటలకు వచ్చిన ఆదరణకన్నా ఈ సినిమా పాటలకు ఆదరణ వచ్చిందని, సినిమాలో పాటలన్నీ సన్నివేశానికి తగిన విధంగా వస్తాయని ఈ సందర్భంగా ‘ఓ మైగాడ్’ చిత్రానికి పనిచేసిన పాటల రచయితలకు, గాయనీ గాయకులకు అభినందనలు తెలియజేస్తున్నానని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని, ఆడియో విడుదలైనట్లుగానే ఈ చిత్రం కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం వుంటుందని ఆయన వివరించారు. ఈ చిత్రానికి నిర్మాత: వేణు ముక్కపాటి, దర్శకత్వం: వి. శ్రీవాస్తవ్.