రాష్ట్రీయం

నిధుల దుర్వినియోగంపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ శాఖలో రూ.3.13 కోట్ల నిధులను దుర్వినియోగం, స్వాహా చేయడం వంటి అభియోగాలనపై ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. మెదక్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఆర్థిక అవకతవకలపై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సస్పెండ్ అయిన వారిలో సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.రాము, మరో సీనియర్ అసిస్టెంట్ శ్యామ్‌సుందర్, సూపరింటెండెంట్లు బి.శ్రీనివాస్, కె.కృష్ణారావు, అగ్రికల్చర్ ఆఫీసర్ జి.రమేష్, అసిస్టెంట్ డైరక్టర్ (టెక్నికల్) కె.పద్మ, డిప్యూటీ డైరక్టర్ బి.హుక్యాలు ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ సస్పెండ్ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు సస్పెండ్ అయిన వారంతా హెడ్‌క్వార్టర్ వదిలివెళ్లకూడదని ఆదేశించింది. నిధుల దుర్వినియోగంపై సాధారణ విచారణతో పాటు పూర్తి స్థాయి ఆడిటింగ్ చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.